షెవ్రొలే ట్రెయిల్‌బ్లేజర్ రేపు విడుదల : మీరు తెలుసుకోవలసినవి అన్నీ

చేవ్రొలెట్ ట్రైల్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 20, 2015 04:28 pm ప్రచురించబడింది

జైపూర్:

 Chevrolet Trailblazer

షెవ్రొలే వారు ట్రెయిల్‌బ్లేజర్ ని భారతదేశం లో విడుదల చేయనున్నారు. ఈ ప్రీమియం ఎస్‌యూవీ రేపు విడుదల కానుంది మరియూ క్యాప్టివా తరువాత జీఎం వారి రెండవ కారు. ఇది సీబీయూ ఉత్పత్తి మరియూ భారతదేశానికి దిగుమతి చేయబడుతుంది. పైగా, ఈ ఎస్‌యూవీ ఒకే ఒక వేరియంట్ (ఆటోమాటిక్, 4x2) గా రూ. 29 లక్షల (ఎక్స్-షోరూం) ధరకి అందుబాటులో ఉంటుంది. డ్యూరామ్యాక్స్ మోటర్ 500Nm టార్క్ ని 2000ఆర్పీఎం వద్ద విడుదల చేస్తుంది మరియూ గ్రౌండ్ క్లియరెన్స్ 231mm గా ఉంది.
 
ఇంజిను

ఇందులో 2.8-లీటర్, 4-సిలిండర్ల డ్యూరామ్యాక్స్ ఇంజిను 200bhp శక్తి ని 3600ఆర్పీఎం వద్ద ఇంకా 500Nm టార్క్ ని 2000ఆర్పీఎం వద్ద విడుదల చేస్తుంది. దీనికి 6-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ నిజత చేయడం జరిగింది. ఒకే ఒక లోపం అల్లా 4x4 వేరియంట్ లేకపోవడమే ఎందుకంటే దేశంలో ప్రస్తుతం కేవలం 4x2 వేరియంట్ ని మాత్రమే అందిస్తున్నారు. 

సైజు

ఇది 4,878mm పొడవు, 1,902mm వెడల్పు మరియూ 1,847mm ఎత్తు కలిగి వీల్‌బేస్ 3,096mm గా ఉంది. ట్రెయిల్‌బ్లేజర్ ఈ విభాగంలోనే అత్యంత పెద్ద వాహనం. ఇది 2,068 కేజీల బరువుని మోయగలదు మరియూ 231mm యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.
 
రక్షణ

ట్రెయిల్‌బ్లేజర్ కి డ్యువల్-ముందు వైపు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టబిలిటి కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియూ ఏబీఎస్ తో ఈబీడీ కలదు. 

బాహ్యాలు

షెవ్రొలే కి ఉన్నటువంటి డ్యువల్-పోర్ట్ గ్రిల్లు తో వనక్కి దువ్వినటువంటి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియూ ఫాగ్ ల్యాంప్స్ హౌసింగ్స్ కి క్రోము పూతలు ఉన్నాయి. సైడ్ లో పెద్ద అద్దాలు, వెనుక విండ్‌స్క్రీన్ చుట్టుతలు, దిగువైన వీల్ ఆర్చెస్ కలవు. వెనుక వైపున ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్ క్లస్టర్ చుట్టూతాలు ఇంకా కొద్దిగా క్రోము పూతలు కనపడతాయి. 

అంతర్ఘతాలు

ట్రెయిల్‌బ్లేజర్ కి షెవ్రొలే యొక్క మైలింక్ 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము కలదు. ఈ సిస్టము కి శాటిలైట్ నావిగేషన్, రివర్స్ పార్కింగ్ క్యామెరా తో సెన్సర్లు ఉన్నాయి.
 
పోటీ 

ట్రెయిల్‌బ్లేజర్ కి టొయోటా ఫార్చునర్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్, హ్యుండై శాంటా ఫే, ఇసుజూ ఎంయూ 7, హోండా సీఆర్-వీ మరియూ రాబోయే ఫోర్డ్ ఎండెవర్ వంటివి పోటీగా నిలువనున్నాయి. ఈ కారు సీఆర్-వీ కేవలం 5-సీటింగ్ తో పెట్రోల్ వేరియంట్ గా లభిస్తున్నందున ఇది ట్రెయిల్‌బ్లేజర్ కి కొద్దిగా తక్కువ పోటీని అందిస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన చేవ్రొలెట్ ట్రైల్

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience