కొత్త రెనాల్ట్ క్విడ్ యొక్క వివరాలు చూడండి
రెనాల్ట్ క్విడ్ 2015-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 09, 2015 03:19 pm సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెనాల్ట్ క్విడ్ ప్రస్తుతం అందరి నోటా నానుతోంది. ఈమధ్య బహిర్గతం అయిన వివరాలు జనాలలో ఆసక్తి పెంచవచ్చును. ఒక నివేదిక ప్రకారం, రెనాల్ట్ క్విడ్ యొక్క వివరాలు బహిర్గతం అయ్యాయి. ఈ కారు త్వరలోనే కొన్ని వారాల సమయంలో విడుదల కానుంది. ఇందులో 3 సిలిండర్ల 0.8-లీటర్ పెట్రోల్ ఇంజిను అమర్చబడి ఉంటుంది. నివేదికల ప్రకారం, ఈ మోటరు 57బీహెచ్పీ ని మరియూ 74ఎనెం టార్క్ ని విడుదల చేయడం తో పాటుగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతుంది. తరువాత, ఈ హ్యాచ్బ్యాక్ కి ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని కూడా అందించి ఒక 1.0-లీటర్ ఇంజినుతో పాటుగా రావొచ్చును.
నివేదికలలో క్విడ్ లీటరుకి 25 కీ.మీ ల మైలేజీ ని అందిస్తుంది అని, తద్వారా పోటీదారులు అయిన డాట్సన్ గో, హ్యుండై ఈయాన్ మరియూ మారుతీ ఆల్టో 800 లని మరిపిస్తుంది అని అంచనా. అంతే కాకుండా, ఈ కారు తన సెగ్మెంట్ అయిన హ్యాచ్బ్యాక్ ని దాటి మారుతీ స్విఫ్ట్ డిజైర్ మరియూ ఫోర్డ్ ఫీగో ఆస్పైర్ డీజిల్ వేరియంట్స్ ని కూడా మించిపోతుంది అని అంచనా. ఇదంతా చెన్నై లోని ఆవిష్కృతం సమయం లో రెనాల్ట్ వారు మే నెలలో చెప్పిన వివరాల ఆధారంగా పేర్కొన్నవి.
కారులో ఫర్స్ట్-ఇన్-క్లాస్ టచ్స్క్రీన్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టం మరియూ ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. రెనాల్ట్ వారు ఈ కారు యొక్క క్లాడింగ్ ని బహు సమర్ధంగా మరియూ ఆకర్షణీయంగా చేయగలిగారు. ఈ ఎస్యూవీ స్టైలింగ్ మరియూ ధృఢమైన డిజైన్ వల్ల కారు తన విభాగంలో ప్రత్యేకంగా కనపడటం ఖాయం.