• English
  • Login / Register

యూరో NCAP క్రాష్ టెస్ట్ؚలలో 5 స్టార్ؚల స్కోర్ సాధించిన BYD Seal Electric Sedan

బివైడి సీల్ కోసం rohit ద్వారా అక్టోబర్ 26, 2023 10:04 pm ప్రచురించబడింది

  • 280 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

BYD సీల్ ప్రీమియం మరియు స్పోర్టీ ఆఫరింగ్ؚగా భారతదేశంలో అందించనున్నారు

BYD Seal at Euro NCAP

  • అడల్ట్ ఆక్యుపెంట్ భద్రతలో సీల్ 35.8/40 పాయింట్లను పొందింది. 

  • చైల్డ్ ఆక్యుపెంట్ భద్రతలో 43/49 పాయింట్ల స్కోర్ؚను సాధించింది. 

  • యూరో NCAP మరొక EV అయిన BYD డాల్ఫిన్‌ను కూడా టెస్ట్ చేసింది, ఇది కూడా 5-స్టార్ రేటింగ్ؚను పొందింది. 

  • 2023 చివరిలో భారతదేశంలో BYD సీల్ EV విడుదల అవుతుంది అని అంచనా; దీని ధర రూ. 60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్, భారతదేశంలో ఆటో ఎక్స్ؚపో 2023లో ప్రదర్శించబడింది, యూరో NCAP క్రాష్ టెస్ట్‌లో ఇది మంచి పనితీరుని ప్రదర్శించింది, అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ రెండిటి భద్రతలో 5-స్టార్ؚ రేటింగ్ؚను పొందింది. 

అడల్ట్ ఆక్యుపెంట్ భద్రత – 35.8/40 పాయింట్లు (89 శాతం)

BYD Seal EV adult occupant protection in Euro NCAP

యూరో NCAP ప్రోటోకాల్స్ ప్రకారం, సీల్ EV 3 ఇంపాక్ట్ టెస్టులతో సహా (ఫ్రంట్, లేటరల్ మరియు రేర్), మరియు రక్షణ మరియు వెలికితీత అనే 4 పారమితులలో రేట్ చేయబడింది. అనేక టెస్ట్ؚలలో, ఈ ఎలక్ట్రిక్ సెడాన్ ముందు కూర్చున్న ప్రయాణీకుల తలకు ‘మంచి’ భద్రతను, ఛాతీ మరియు సహ-డ్రైవర్ తొడలకు ‘తగినంత’ భద్రతను అందించింది. ప్రయాణీకుల కంపార్ట్మెంట్ ‘స్థిరమైనది’గా రేట్ చేయబడింది.

సైడ్ మరియు సైడ్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ؚలు రెండిటిలో, కీలకమైన శరీర భాగాలు అన్నిటికీ ‘చక్కని’ భద్రతను అందించింది. రేర్ ఇంపాక్ట్ విషయంలో కూడా, సీల్ విప్లాష్ గాయాల నుండి ప్రయాణీకులు అందరికి ‘మంచి’ భద్రతను అందించింది. 

రక్షణ మరియు వెలికితీత పారామితిలో, భద్రత ఆధారిటీ రెస్క్యూ షీట్, ఎమర్జెన్సీ-కాలింగ్ సిస్టమ్, మల్టీ-కొలిజన్ బ్రేక్ మరియు సబ్ؚమెర్జెన్స్ చెక్ లభ్యత ఆధారంగా కారును తనిఖీ చేసి రేటింగ్ؚను ఇస్తుంది. BYD సీల్ ఈ-కాలింగ్ సిస్టమ్ؚను కలిగి ఉంది, ఇది క్రాష్ జరిగితే అత్యవసర సేవలను అలర్ట్ చేస్తుంది. ఈ కారు దేనినైనా ఢీ కొట్టిన తరువాత రెండవసారి ప్రమాదాన్ని నివారించడానికి బ్రేక్ؚలను వేసే సిస్టమ్ కూడా ఉంటుంది. లాక్ చేసిన సీల్ డోర్‌లను, నీటిలోకి ప్రవేశించిన తరువాత పవర్ పోతే రెండు నిమిషాలలో తెరవవచ్చు, అయితే కిటికీలు ఎంత సేపు ఫంక్షనల్ؚగా ఉంటాయి అనే దాని పై స్పష్టత లేదు. 

FYI – ప్రతి మోడల్ కోసం కారు తయారీదారు ఒక రెస్క్యూ షీట్ؚను తయారుచేసి, మార్కెట్ؚలో పంపిణీ చేస్తున్నారు, ఇది ఎయిర్ బ్యాగ్ؚలు, ప్రీ-టెన్షనర్ؚలు, బ్యాటరీలు మరియు హై-వోల్టేజ్ కేబుల్ؚలు ఉన్న ప్రాంతాలు వంటి సంభావ్య ప్రమాదాలను గుర్తించడం, అలాగే నిర్మాణాన్ని కత్తిరించడానికి సురక్షితమైన ప్రదేశాలు వంటిని గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. 

ఇది కూడా చదవండి: సుజుకి eVX ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ, మీరు తెలుసుకోవలసిన విషయాలు 

చైల్డ్ ఆక్యుపెంట్ భద్రత – 43/49 పాయింట్లు (87 శాతం)

BYD Seal EV child occupant protection in Euro NCAP

6 మరియు 10 సంవత్సరాల చైల్డ్ డమ్మీలకు ఫ్రంటల్ ఆఫ్ؚసెట్ మరియు సైడ్ బ్యారియర్ ఇంపాక్ట్ టెస్ట్‌లు రెండిటిలో కీలకమైన శరీర భాగాల ప్రాంతాలు అన్నిటికీ ‘చక్కని’ భద్రతను అందించడంలో సీల్ EV పూర్తి మార్కులను సంపాదించింది. ఇక్కడ సాంకేతికంగా మిస్ అయినది కేవలం రేర్-మిడిల్ సీట్ ఫీచర్ؚలో ISOFIX యాంకరేజ్ؚలు. అలాగే సమగ్రమైన చైల్డ్-సీట్ రిస్ట్రైంట్ సిస్టమ్ కూడా లేదు.

ప్రమాదానికి గురి కాగల రోడ్డు వినియోగదారులు (VRU) – 51.7/63 పాయింట్లు (82 శాతం)

టెస్ట్ యొక్క VRU భాగం, అనుకోకుండా దీనికి ఢీ కొట్టుకున్న లేదా దీనిపై పడిన వారికి ఈ కారు ఎలా భద్రతను అందిస్తుందో అంచనా వేస్తుంది. సీల్ EV బోనెట్ పాదచారులకు ‘తగినంత’ భద్రతను ఇస్తుంది, ముందు బంపర్ వారి కాళ్ళకు ఎలాంటి గాయం కలిగించకపోవచ్చు, పెల్విస్, తొడలు, తుంటి ఎముక మరియు టిబియా ప్రాంతాలకు ఇది ‘మంచి’ భద్రతను అందిస్తుందని రేట్ చేయబడింది. అదృష్టవశాత్తు, అనేక సందర్భాలలో దీని అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) ఢీ కొట్టడాన్ని నివారించడానికి, పాదచారులు మరియు సైకిల్ నడిపేవారిని మెరుగ్గా గుర్తిస్తుంది. 

ఇది కూడా చదవండి: భారతదేశంలో BYD $1 బిలియన్ పెట్టుబడి ప్రతిపాదన తిరస్కరించబడింది: జరిగింది ఇదే

భద్రత సహాయాలు – 13.8/18 పాయింట్లు (76 శాతం)

BYD ఎలక్ట్రిక్ సెడాన్ అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌తో (ADAS) వస్తుంది, వీటిలో అనేక ఇండియా-స్పెక్ మోడల్‌లో కూడా అందించబడవచ్చు. యూరో NCAP టెస్ట్‌ల ప్రకారం, దీని అటానమస్ ఎమెర్జెన్సీ బ్రేకింగ్ (AEB) సిస్టమ్ కూడా లేన్ సపోర్ట్ మరియు స్పీడ్ డిటెక్షన్ సిస్టమ్ؚల విధంగా చక్కని పనితీరును ప్రదర్శిచింది. అయితే, దీని డ్రైవర్ స్టేటస్ మానిటరింగ్ సిస్టమ్ కేవలం డ్రైవర్ మత్తును మాత్రమే గుర్తించింది, ఈ విభాగంలో మొత్తం మీద స్కోర్ తగ్గింది. 

BYD సీల్ ఒక్కటే టెస్ట్ చేయలేదు

BYD Dolphin

ఈ చైనీస్ EV తయారీదారు నుండి మరొక ఎలక్ట్రిక్ కార్, BYD డాల్ఫిన్ కూడా ఇదే భద్రత రేటింగ్‌ను పొందింది, అడల్ట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ భద్రతలో కూడా సీల్ EVతో సమానమైన పాయింట్లను కూడా స్కోర్ చేసింది. అనేక ప్రపంచ మార్కెట్‌లలో ఇది కూడా ఒక కొత్త ఆఫరింగ్, కానీ ఇది త్వరలోనే భారతదేశానికి రావచ్చు.

సీల్ EV గురించి మరిన్ని వివరాలు

BYD Seal EV

గ్లోబల్-స్పెక్ BYD సీల్ EV 82.5kWh మరియు 61.4kWh బ్యాటరీ ప్యాక్ؚలతో వస్తుంది, వీటి క్లెయిమ్ చేసిన పరిధి వరుసగా 700కిమీ మరియు 550కిమీ ఉంది. మన మార్కెట్ؚలో ఎక్కువ-పరిధి గల వర్షన్, 530PS పవర్ మరియు 670 Nm టార్క్‌ను అందిచే, డ్యూయల్-మోటార్ AWD (ఆల్-వీల్ డ్రైవ్) సెట్అప్ؚతో విక్రయించబడుతుంది అని ఆశిస్తున్నాము. ఇది కేవలం 3.8 సెకన్‌లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. 

భారతదేశంలో విడుదల మరియు ధర

BYD Seal EV rear

భారతదేశానికి BYD సీల్, 2023 సంవత్సరం చివరిలో CBUగా రావచ్చు, దీని ధర రూ.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. BMW i4 దీనితో ప్రత్యక్షంగా పోటీ పడుతుంది, కియా EV6, హ్యుందాయ్ అయానిక్ 5 మరియు వోల్వో XC40 రీఛార్జ్ వంటి వాటికి ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.  

దీనిని కూడా చూడండి: టాటా నెక్సాన్ EV కంటే టాటా పంచ్ EV ఎక్కువ పరిధిని అందించగలదా?

was this article helpful ?

Write your Comment on BYD సీల్

explore మరిన్ని on బివైడి సీల్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience