ఐ8 యొక్క హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రోటోటైప్ ను బహిర్గతం చేసిన బిఎండబ్ల్యూ
జూలై 06, 2015 05:29 pm sourabh ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన బిఎమ్ డబ్ల్యూ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రోటోటైప్ యొక్క ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సూపర్ కారు ఐ8 ను బహిర్గతం చేసింది. రెండు-తలుపులు కలిగిన ఈ కారు, బ్లాక్ మాట్టే ఫినిష్ తో పాటు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ప్లాంట్ ను సలూన్ వెనుక బాగంలో ఉంటుంది దీని ద్వారా శక్తి ని విడుదల చేయబోతుంది. అదే స్థానంలో. ప్రస్తుతం హైబ్రిడ్ యొక్క టర్బోచార్జ్డ్ 1.5 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది.
దీని బరువు ను కొనసాగించుట కొరకు, కారు మ్యూనిచ్ లో బిఎండబ్ల్యూ యొక్క విండ్ టన్నెల్ లో రూపొందించిన ఏరోడైనమిక్స్ ప్యాకేజీ తో కార్బన్ ఫైబర్ నిర్మాణం తో రాబోతుంది. ఈ కారు ముందు భాగంలో నవీకరించబడిన కిడ్నీ ఆకృతి కలిగిన గ్రిల్, పెద్ద ఎయిర్ డక్ట్స్ మరియు స్లిమ్ లైన్ హెడ్ల్యాంప్స్ తో రాబోతుంది.
బిఎండబ్ల్యూ ఐ8 హుడ్ కింద, హైడ్రోజన్ వాయువు చల్లని గాలి అందించే ఆక్సిజన్ తో కలిసి క్రయోజెనిక్ సిలిండర్ అమరికలో నిల్వ చేయబడి ఉంటాయి. వెనుక అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్ 242బి హెచ్ పిగరిష్ట శక్తి ని ఉత్పత్తి చేస్తుంది. హైడ్రోజన్ ప్రాధమిక ఇంధనం మరియు వాటర్ బై ప్రొడక్ట్ కావడం వలన ఎటువంటి హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ లేదా సి ఒ2 ఉద్గారాలు విడుదల కావు. ఈ మొత్తం అమరిక కారు సెంటర్ లైన్ పై అమర్చబడి ఉంటుంది.
ఈ సంస్థ ఫ్యూయల్ సెల్ రీసర్చ్ ను వేగవంతం చేసేందుకుగానూ టయోటా తో ఒప్పందం కుదుర్చుకుంది. టయోటా ఇటీవల జపనీస్ ప్రధాన మంత్రి షింజో అబే కు, హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనం మొదటి యూనిట్ మిరాయ్ ను పంపిణీ చేసింది. హైడ్రోజన్ యొక్క సింగిల్ ట్యాంక్ పై మిరాయ్ 483 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. కారు రీ ఫ్యూయల్ అయ్యేందుకుగానూ 5 నిముషాల కంటే తక్కువ సమయం పడుతుంది మరియు నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. సంపీడన హైడ్రోజన్ వాయువు ఫ్యూయల్ సెల్ స్టాక్ లోనికి పంపించిన తరువాత అది ఆక్సిజన్ తో కలిసి సెల్ స్టాక్ లోనికి ప్రయాణించడం వలన రసాయన ప్రతిచర్య జరగి 152 బి హెచ్ పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
0 out of 0 found this helpful