భారతదేశం లఒని ప్రత్యేక డీలర ్షిప్ లలో బీఎండబ్ల్యూ వారి 360 డిగ్రీ ప్రోగ్రాం అందిస్తున్నారు
సెప్టెంబర్ 01, 2015 12:15 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
బీఎండబ్ల్యూ నుండి భారతీయులకు ఒక శుభవార్త. కస్టమర్లకు సేవ అందించే ఒక 360-డిగ్రీ ప్రోగ్రాం ని అవసరానికి అనుగుణంగా ఎంచుకునేందుకు గానూ విడుదల చేసారు. ఈ ప్రోగ్రాం ద్వారా మీరు బీఎండబ్ల్యూ మోడలు ఎంచుకునే సహాయం, ఆర్ధిక ఒప్పందం యొక్క సమయ కాలం మరియూ మీకు ఏడాది కాలం పాటు కావాల్సిన మైలేజీ వగైరా విషయాలపై అవగాహన కల్పిస్తుంది. ఒప్పంద కాలం తరువాత కస్టమర్లు వాహనాన్ని తిరిగి డీలర్షిప్ కి ఇచ్చేయవచ్చు లేదా మరొక ఫుల్ డౌన్ పేమెంట్ చేసి వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. పైగా, మరొక ఒప్పందం చేసుకొవచ్చు లేదా ప్రస్తుత మోడల్ ని మరొక ఉన్నత మోడల్ కొసం మార్పిడి చేసుకోవచ్చు. ఈ ఎక్స్చేంజ్ విలువ బై-బ్యాక్ విలువ కంటే ఎక్కువ ఉంటుంది. ప్రతి సంవత్సరపు మైలేజీ యొక్క పరిమితి లోనే వాహనాన్ని నడిపినట్టు అయితే, కస్టమర్లకు కేవలం వారు నడిపిన దానికి మాత్రమే విలువ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికైతే, ఈ ప్రోగ్రాం కేవలం బీఎండబ్ల్యూ 3-సీరీస్, 5-సీరీస్ మరియూ ఎక్స్3 కి మరియూ పరిమితి డీలర్షిప్ లలో మాత్రమే లభ్యంగా ఉంది.
పైన తెలిపిన ప్రయోజనాలు తో పాటుగా, బీఎండబ్ల్యూ తక్కువ డౌన్ పేమెంట్ మరియూ ఎక్స్చేంజ్ బోనస్, 3 సంవత్సరాల కాంప్లిమెంటరీ సర్వీసు మరియూ మెయింటెనన్స్, ఫైనాన్స్ కాంట్రాక్ట్ పూర్తయిన వెంటనే అస్సూర్డ్ బై-బ్యాక్ తో పాటుగా మళ్ళీ రీ-ఫైనాన్స్ చేసుకునే ఎంపిక కూడా లభ్యంగా ఉంది.
బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా కి ప్రెసిడేంట్ అయిన ఫిలీప్ వోన్ సహ్ర్ గారు విడుదల సందర్భంగా ఏమన్నారంటే," బీఎండబ్ల్యూ 360 డిగ్రీ ప్రోగ్రాం తో, మా కార్లు కస్టమర్లకు భవిష్యత్తు సురక్షితంగా ఉండే బై-బ్యాక్ విలువని ఇస్తుంది. ఈ ప్రోగ్రాం ప్రత్యేక వెసులుబాటు అందుబాటు మరుయూ పూర్తి మనశ్శాంతి అందించేందుకు గాను అందించడం జరిగింది."
బీఎండబ్ల్యూ 360 ప్రోగ్రాం అందించే డీలర్షిప్ ల జాబితా
Location Dealership
Delhi Deutsche Motoren
Mumbai Infinity Cars and Navnit Motors
Chennai KUN Exclusive
Hyderabad KUN Exclusive
Bangalore Navnit Motors
Gurgaon Bird Automotive
Ahmedabad Parsoli Motors
Jaipur Sanghi Classic
Raipur Munich Motors
Nagpur Munich Motors