'ది రోగ్ న ేషన్' చిత్రంలో భాగమైన బిఎండబ్ల్యూ
ఆగష్టు 10, 2015 02:23 pm manish ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ యొక్క తాజా సంస్థాపన, 'మిషన్: ఇంపాజిబుల్-రోగ్ నేషన్' ఇటీవలే భారతదేశం లో విడుదల చెయ్యబడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి ఈ ఆటోమోటివ్ సంస్థ బిఎండబ్ల్యూ ఐకానిక్ సిరీస్, పారామౌంట్ పిక్చర్స్ మరియు స్కైడ్యాన్స్ ద్వారా మనకి తమ యొక్క కొత్త చిత్రంతో పరిచయం కానుంది. ఏతాన్ హంట్ (టామ్ క్రూజ్) అను కథానాయకుడు గతంలో 'ఘోస్ట్ ప్రోటోకాల్' చిత్రంలో బిఎండబ్ల్యూ ని ఉపయోగించాడు. ఈ చిత్రంలో, బిఎండబ్ల్యూ కారు భూగోళం అంతటా ఉత్కంఠభరితమైన సాహసకృత్యాలను చేస్తూ ఉండేట్లుగా చూపించారు మరియు బిఎండబ్ల్యూ సంస్థ ఇలాంటి అద్భుత వాహనాలను తయారు చేయడం వలన మరియు ఉన్నతపరమైన సాంకేతిక మద్దతును ఈ సినిమా నిర్మాణ సిబ్బంది అందించడం వలన ఇది సాధ్యమైంది.
"మేము మళ్ళీ సినిమా చరిత్రలో అత్యంత అద్భుతమైన యాక్షన్ చిత్రాల శాఖలలో మా బిఎండబ్ల్యూ వాహనం ఒక భాగంగా కావడం మమ్మల్ని చాలా ఆనందపరిచింది " అని బిఎండబ్ల్యూ ఎజి నిర్వహణ బోర్డు సభ్యుడు, సేల్స్ అండ్ మార్కెటింగ్ బాధ్యతా అధికారి 'ఇయాన్ రాబర్ట్ సన్' అన్నారు. "బిఎండబ్ల్యూ మోడళ్ల యొక్క డైనమిక్ ప్రదర్శన మరియు బిఎండబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ అన్ని కూడా ఏతాన్ హంట్ మరియు అతని టీమ్ కొరకే తయారు చేసారా అన్న రీతిలో దీని ప్రదర్శన ఉంది మరియు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ తో దీని ప్రదర్శన ఇంకా అద్భుతమని చెప్పవచ్చు. బిఎండబ్ల్యూ ఎమ్3 కారు, మోటార్ స్పోర్ట్ డిఎన్ఎ తో జతచేయబడి ఉంటుంది. ఇది ప్రతిరోజు వాడుకునే కారు మాదిరిగానే ఒక భావోద్వేగపరమైన, శక్తివంతమైన అంశంతో రూపొందించబడింది" అని బిఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, మిస్టర్ ఫిలిఫ్ వోన్ సహర్ తెలిపారు. బిఎండబ్ల్యూ కార్ల యొక్క ఉనికి అత్యుత్తమమైన ప్రదర్శనని 'మిషన్ ఇంపాజిబుల్ - రోగ్ నేషన్' తో తెరపై చూపడం జరిగింది. భారతదేశం లో బిఎండబ్ల్యూ అభిమానులు పెద్ద తెరపై తమ ఇష్టమైన కారుని చూడడానికి ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్, డ్రామా, వినోదభరిత సన్నివేశాలతో పాటూ బిఎండబ్ల్యూ వాహనం యొక్క ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఉన్నాయని మిస్టర్ ఫిలిఫ్ వోన్ సహర్ అన్నారు.
బిఎండబ్ల్యూ కార్లను మరియు మోటార్ సైకిళ్ళను ఎతాన్ మరియు అతని టీం చాలా సన్నివేశాలలో ఉపయోగించడం జరిగింది. బిఎండబ్ల్యూ 7 సిరీస్ అత్యుత్తమమైన శైలి మరియు చక్కదనంతో వియన్నా వీధుల్లో ప్రదర్శించడం జరిగింది. అలానే బిఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ ఆర్ మోటార్ సైకిల్ తో మొరాక్కో వీధిలో ఉత్కంఠభరితమైన వాహన విన్యాసాలు చేయడం జరిగింది.
ఈ చిత్రం కోర్ బిఎండబ్ల్యూ బ్రాండ్ యొక్క మొదటి హైబ్రిడ్ ప్లగ్-ఇన్ సిరీస్ ఆటోమొబైల్ ఉత్పత్తి అయిన బిఎండబ్ల్యూ ఎక్స్5 ఎక్స్ డ్రైవ్ 40ఇ ని మరియు బిఎండబ్ల్యూ 6 సిరీస్ కన్వర్టిబుల్స్ ని కూడా కలిగి ఉంది. ఐఎం ఎఫ్ టీమ్ కూడా బిఎండబ్ల్యూ కనెక్టెడ్ డ్రైవ్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఈ లక్షణం అనేది డ్రైవర్, కారు మరియు పర్యావరణం మధ్య తెలివైన కనెక్టివిటీని అందిస్తుంది.
అత్యంత వినూత్నమైన వ్యవస్థ ఎల్లప్పుడూ, మెరుగైన డ్రైవింగ్ సౌకర్యం మరియు భద్రతను, ఒక కీలక పాత్రను పోషించేటువంటి లక్షణాలైన కెమెరా మరియు డ్రైవింగ్ సహాయత వ్యవస్థలను అందిస్తుంది.