• English
  • Login / Register

రూ.29.90 లక్షల ధర వద్ద 1 సిరీస్ ని నవీకరించిన బిఎండబ్లు

బిఎండబ్ల్యూ 1 సిరీస్ కోసం manish ద్వారా సెప్టెంబర్ 29, 2015 10:00 am ప్రచురించబడింది

  • 13 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: బిఎండబ్లు 1 సిరీస్ యొక్క నవీకరణ నిశ్శబ్దంగా నేడు పరిచయం చేయబడింది. ఈ కొత్త కారు రూ.29.90 లక్షల ధర వద్ద  (ఎక్స్-షోరూమ్, థానే)లో అందుబాటులో ఉంది.   మేము గతంలో కారు  2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షో వద్ద ప్రదర్శింపబడడం చూశాము. ఈ నవీకరించబడిన హాచ్బాక్ కొత్త ఎస్యువి-ఎస్క్ లా కనిపిస్తుంది మరియు ఆ ఇబ్బందికరమైన స్టేషన్ వాగన్-ఎస్క్ స్టైలింగ్ వలన ముందు చాలా విమర్శలను చవిచూసింది. 2015 బిఎండబ్లు 118డి ఒకే డీజిల్ ఇంజన్ ఎంపికలో మాత్రమే అందుబాటులో ఉంది.   

ఈ కారు పొడవు 4,329mm, వెడల్పు 1,765mm మరియు ఎత్తు 1,440mm తో మునుపటి దాని కంటే పెద్దది. ఎస్యువి కి స్టైలింగ్ జోడించడం కోసం కారు పగటి పూట  ఎల్ఇడి లతో  పెద్ద హెడ్ల్యాంప్స్ కలిగి ఉంది. కొత్త బిఎండబ్లు 1 సిరీస్ ముందరి భాగం పెద్ద కిడ్నీ గ్రిల్ తో మరియు వెనుక భాగం పునఃరూపకల్పన చేయబడిన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ తో అమర్చబడి ఉంది. కారు ప్రక్క భాగంలో సిల్వర్ డోర్ హ్యాండిల్స్ కలిగి ఉంది.  

కొత్త 118డి స్పోర్ట్ లైన్ ట్రిం మునుపటి  1-సిరీస్ లో కనిపించే అదే టర్బోచార్జ్డ్, డీజిల్ యూనిట్ తో అమర్చబడి 1995cc స్థానభ్రంశాన్ని కలిగి ఉంది. ఈ ఇంజిన్ మరింత శబ్ధంతో 148bhp శక్తిని మరియు 360Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పవర్ప్లాంట్  ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది.  

అంతర్భాగాల విషయానికి వస్తే, కారు ఒక పియానో-నలుపు సెంటర్ కన్సోల్ వస్తుంది మరియు ఒక నవీకరించబడిన సమాచార వ్యవస్థను కలిగి ఉంటుంది. దీనిలో ఏ.సి వెంట్లు క్రోం చేరికలతో ఉంటాయి. 11డి లో ఏకైక జోన్ వాతావరణ నియంత్రణ ప్రామాణికంగా అందించబడుతుంది మరియు డ్యుయల్ జోన్  న్ వ్యవస్థ ఆప్ష్నల్ గా అందించబడుతుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on BMW 1 సిరీస్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience