3 శాతం ధర పెంపును ప్రకటించిన బిఎండబ్ల్యూ ఇండియా
నవంబర్ 27, 2015 02:10 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
చెన్నై:
కొత్త సంవత్సరంలో ఒక విషాదకరమైన వార్త వెల్లడైయ్యింది. అది ఏమిటంటే, బిఎండబ్ల్యూ ఇండియా తన బిఎండబ్ల్యూ మరియు మిని వాహనాలన్నింటిపై 3 శాతం ధర పెంపును జనవరి 1, 2016 నుండి అమలులోకి వచ్చేటట్టు ప్రకటించింది. ప్రస్తుతం బిఎండబ్లూ ఉత్పత్తి చేస్తున్న వాహనాలు వరుసగా, బిఎండబ్ల్యూ 1 సిరీస్, బిఎండబ్ల్యూ 3 సిరీస్, బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టూరిస్మో, బిఎండబ్ల్యూ 5 సిరీస్, బిఎండబ్ల్యూ 7 సిరీస్, బిఎండబ్ల్యూ ఎక్స్ 1, బిఎండబ్ల్యూ ఎక్స్ 3, బిఎండబ్ల్యూ ఎక్స్ 5 వంటి వాహనాలు చెన్నై ప్లాంట్ వద్ద ఉత్పత్తి అవుతున్నాయి.
బిఎండబ్ల్యూ సమూహ అధ్యక్షుడు అయిన మిస్టర్ ఫిలిప్ వోన్ సహర్ ధరల పెరుగుదల గురించి మాట్లాడుతూ, "మా వినియోగదారులకు అత్యంత అవసరమైన మరియు అసాధారణమైన ఉత్పత్తులు అందించే మా ప్రయత్న కొనసాగింపు లో, వారి మొత్తం యాజమాన్యపు అనుభవానికి మరింత విలువను జోడించడమే అని పేర్కొన్నారు. అంతేకాకుండా, మేము 'పరిపూర్ణ డ్రైవింగ్ ప్లెజర్' సర్కిల్ లో వినూత్న ఉత్పత్తులను పరిచయం చేయడం మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి డీలర్షిప్ల నిర్మాణం, నాణ్యత గల వాహనాలను ఉత్పత్తి చేయడానికి మరియు ప్రీమియం సేవలను బట్వాడా చేయడానికి మా ఖాతాదారులకు ఉద్రేకంతో ఆనందపరిచే సేవలు అందించడమే మా ముఖ్య ఉద్దేశ్యం అని వ్యాఖ్యానించారు".
బిఎండబ్లూ డీలర్షిప్ లలో ప్రదర్శింపబడే వాహనాలు వరుసగా, బిఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ కూపే, బిఎండబ్ల్యూ ఎక్స్ 6, బిఎండబ్ల్యూ జెడ్ 4, బిఎండబ్ల్యూ ఎం 3 సెడాన్, బిఎండబ్ల్యూ ఎం 4 కూపే, బిఎండబ్ల్యూ ఎం 5 సెడాన్, బిఎండబ్ల్యూ ఎం 6 గ్రాన్ కూపే, బిఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎం, బిఎండబ్ల్యూ ఎక్స్ 6 ఎం మరియు బిఎండబ్ల్యూ ఐ 8 వంటి వాహనాలు కంప్లీట్లీ బిల్ట్-అప్ యూనిట్ (సి బి యూ) మార్గం ద్వారా దేశంలో అందుబాటులో ఉన్నాయి. బిఎండబ్ల్యూ 6 సిరీస్ ఇండివిజువల్ మరియు బిఎండబ్ల్యూ 7 సిరీస్ ఇండివిడ్యూయల్ వాహనాలను కూడా పూర్తిగా సిబియూ మార్గం ద్వారా ఉత్తర్వు చేసుకోవచ్చు.