• English
  • Login / Register

బీఎండబ్ల్యూ వారు 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటర్ షో లో ప్రదర్శితమయ్యేవి ప్రకటించారు

సెప్టెంబర్ 05, 2015 03:51 pm nabeel ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2015 ఫ్రాంక్ఫర్డ్ ఇంటర్నేషనల్ మోటార్ షో కోసం విషయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. హ్యుందాయ్ ఆపై బుగట్టి వారి విజన్ గ్రాన్ టురిస్మో ప్రాజెక్ట్స్ ని ప్రారంభానికి ముందు బహిర్గతం చేశాయి. ఇప్పుడు బిఎండబ్లు దాని లైనప్ ప్రదర్శన హాల్ 11 లో 2015 సెప్టెంబర్ 19 నుండి 27 తారీఖులలో జరగవచ్చని ప్రకటించింది. హాల్ 11 బిఎండబ్లు,మినీ మరియు రోల్స్ రాయిస్ కు నియమించబడవచ్చు. బిఎండబ్లు లైనప్ లో రాబోయే కార్లు, వారి తాజా సాంకేతిక మరియు రాబోయే ప్లగ్ఇన్ హైబ్రిడ్ ని కూడా కలిగి ఉంది.

1. 2016 బిఎం డబ్లు 7 సిరీస్

రాబోయే బిఎండబ్లు ఫ్లాగ్షిప్ సెడాన్ కార్బన్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్(సి ఎఫ్ ఆర్ పి) ని, బిఎండబ్లు గ్రూప్ కొత్త తరం పవర్ప్లాంట్స్ నుండి ఇంజిన్లను , బిఎం డబ్లు 740ఇ లో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ సిస్టం, ఎక్జిక్యూటివ్ డ్రైవ్ ప్రో యాక్టివ్ చాసిస్ సిస్టం, అడాప్టివ్ మోడ్ తో డ్రైవింగ్ అనుభవం కంట్రోల్ స్విచ్ మరియు డైనమిక్స్, సామర్థ్యం, సౌకర్యం మరియు భద్రత విస్తరించేందుకు బిఎండబ్లు లేజర్ లైట్ ఉపయోగించుకుంటుంది. లోపల, కారు మసాజ్ ఫంక్షన్ తో, ప్రకాశించే స్కై లాంజ్ పనోరమా గ్లాస్ రూఫ్ మరియు ప్రేరక ఛార్జింగ్ స్టేషన్ తో స్మార్ట్ఫోన్ హోల్డర్ తో వస్తుంది. వీటితో పాటూ 7 సిరీస్ బిఎండబ్లు సంజ్ఞ నియంత్రణ కి ఒక టచ్ ప్రదర్శన చేర్చి ఐ డ్రైవ్ వ్యవస్థను పొడిగించి, వెనుక కంపార్ట్మెంట్ లో సౌకర్యం మరియు సమాచార వ్యవస్థను నియంత్రించడానికి టచ్ కమాండ్, రిమోట్ కంట్రోల్ పార్కింగ్ వ్యవస్థ వంటి లక్షణాలను కలిగి ఉంది. వీటితో పాటూ అధనంగా బిఎండబ్లు తాజాతరం బిఎండబ్లు హెడ్-అప్ డిస్ప్లే ని, ట్రాఫిక్ హెచ్చరిక, స్టీరింగ్ మరియు లేన్ నియంత్రణ అసిస్టెంట్, ఆక్టివ్ సైడ్ కొలిజన్ ప్రొటక్షన్ మరియు 3డి మరియు పనోరమా దృష్టితో సరౌండ్ వీక్షణ వ్యవస్థ ని కూడా అందిస్తుంది.

2. 2016 బిఎం డబ్లు ఎక్స్1

బిఎండబ్లు కొత్త ఎక్స్1 ప్రయాణికులు కూర్చునేందుకు మరియు సామాను పెట్టుకునేందుకు కూడా చాలా స్థలాన్ని కలిగి ఉంది. ఈ వాహనం ప్రీమియం వాతావరణం మరియు అధునాతన కార్యాచరణను కలిగి ఉందని బిఎండబ్లు సంస్థ తెలిపింది. ఈ కారు బిఎండబ్లు గ్రూప్ సరికొత్త పవర్ప్లాంట్ నుండి డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ని కలిగి ఉంది. ఈ వాహనం బిఎండబ్లు ఎక్స్ డ్రైవ్ యొక్క ఎఫిషియన్సీ ఆప్టిమైజ్ వెర్షన్, ఇది 4 వీల్ డ్రైవ్ సిస్టం మరియు కొత్తగా అభివృద్ధి చేసిన చాసిస్ టెక్నాలజీ ని కలిగి ఉంది.

3. 2016 బిఎండబ్లు 3 సిరీస్

3 సిరీస్ యొక్క 2016 మోడల్ ఒక సవరించిన ఇంజిన్ లైనప్ మరియు మరింత ఆధునిక చాసిస్ లక్షణాన్ని కలిగి ఉంది. బిఎం డబ్లు ఇంజిన్ ఎంపికలు నాలుగు పెట్రోల్ మరియు ఏడు డీజిల్ యూనిట్లు ఉండొచ్చు. శక్తి బదిలీ వెనుక చక్రాల ద్వారా లేదా బిఎండబ్లు ఎక్స్ డ్రైవ్ ఆల్ - వీల్ - డ్రైవ్ వ్యవస్థ ద్వారా అనేది వేరియంట్ పైన ఆధారపడి ఉంటుంది. బిఎం డబ్లు 330ఇ సెడాన్ 2016కి లైనప్ కు చేర్చబడవచ్చు. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ , నాలుగు సిలిండర్ పెట్రోల్ యూనిట్ తో బిఎం డబ్లు ఇ డ్రైవ్ టెక్నాలజీ ని కలుపుతుంది.

4.బిఎండబ్లు 225 ఎక్స్ ఇ

బిఎండబ్లు 225 ఎక్స్ ఇ 1.5 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు అల్ వీల్ డ్రైవ్ లేఅవుట్ తో బిఎండబ్లు ఇ డ్రైవ్ టెక్నాలజీ లక్షణాన్ని కలిగి ఉంది. దీనిలో లిథియం బ్యాటరీ వెనుక బెంచ్ కింద కదులుతుంది. కాబట్టి బూట్ దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించవచ్చు. వాహనం యొక్క విద్యుత్ పరిధి 41 కిలోమీటర్ల దూరంలో ఉంది కనుక కారు నగరంలో ఉద్గారాలు లేకుడా నడపబడుతుంది. దీనిలో విద్యుత్ మోటారు తో వెనుక వీల్స్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం ఉత్పత్తి చేసే దహన ఇంజన్ యొక్క శక్తితో ముందరి వీల్స్ నడుపబడతాయి.

5. బిఎండబ్లు ఎం6 జిటి3

బిఎండబ్లు మోటార్ స్పోర్ట్, వినియోగదారుల ధర పరిధిలో బిఎం డబ్లు ఎం6 జిటి3 ని 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రారంభిస్తుంది. ఈ కారు రేసింగ్ కోసం నిర్మించబడినది మరియు 2016 సీజన్ ప్రారంభంలో రంగప్రవేశం చేస్తుంది. ఈ కారు ఎం ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ తో వి8 ఇంజిన్ చే అమర్చబడి ఉంటుంది. కారు గతంలో కంటే ఇప్పుడు మరింత శక్తివంతమైనదిగా ఉంది. కారు యొక్క క్రాష్ నిర్మాణాలు మరియు బాహ్య చర్మం కార్బన్-ఫైబర్-రెయిన్ ఫోర్సెడ్ ప్లాస్టిక్(సిఎఫ్ఆర్ పి) తో తయారుచేయబడి వాహనం యొక్క మొత్తం బరువు 1,300 కిలోగ్రాముల కంటే తక్కువ ఉంచేందుకు సహాయపడుతుంది.

6.కొత్త బిఎండబ్లు ఎం6 పోటీ ఎడిషన్

ఇది అధిక పనితీరు ప్రదర్శన కలిగిన కూప్ యొక్క మరొక వెర్షన్. ఇది ప్రత్యేక బాహ్య పెయింట్ ముగింపుల ఎంపికలతో వస్తుంది. దీనిలో భాగాలు సీఅర్ ఎఫ్ పి నుండి మరియు ప్రత్యేక లెథర్ తో తయారుచేయబడినవి. కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్ ప్రత్యేకంగా పోటీ ప్యాకేజీ తో బిఎం డబ్లు6 కూప్ యొక్క తీరులో అందించబడుతున్నది. ఇది ఎం ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ తో 4.4-లీటరు వి8 పెట్రోల్ ఇంజిన్ తో అమర్చబడి 600hp శక్తిని మరియు 700Nm
 టార్క్ ని అందిస్తుంది. ఇది ఆప్షనల్ డ్రైవర్ ప్యాకేజ్ తో అమర్చబడి 305 km / h గరిష్ట వేగన్ని చేరుకుంటుంది.

7.బిఎం డబ్లు లేజర్ లైట్

బిఎం డబ్లు లైటింగ్ టెక్నాలజీ ని ఉపయోగించుకొని చీకటిలో డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ భద్రత మరియు బ్రాండ్ యొక్క గొప్పతనన్ని పెంచుకుంటుంది. ఈ రంగంలో తాజా ఆవిష్కరణలు 2015 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో ప్రదర్శించబోతున్నారు. ఈ శక్తివంతమైన బిఎం డబ్లు లేజర్ లైట్ హెడ్లైట్స్ బిఎం డబ్లు 7 సిరీస్ లో కూడా అందించబోతున్నారు.

8.బిఎం డబ్లు కనెక్టెడ్ డ్రైవ్

బిఎం డబ్లు కనెక్టెడ్ డ్రైవ్ టెక్నాలజీలో సరికొత్తగా బిఎం డబ్లు కనెక్టెడ్ డ్రైవ్ యాప్, బిఎం డబ్లు రిమోట్ కాక్పిట్, సూపర్ ఫాస్ట్ వైఫై హాట్స్పాట్, ఆటోమేటిక్ నావిగేషన్ మ్యాప్ అప్డేట్స్, స్మార్ట్ హోం ఇంటిగ్రేషన్, అలాగే రిమోట్ కంట్రోల్ పార్కింగ్ మరియు ఇతర డ్రైవర్ సహాయాలు ఇవన్నీ కూడా బిఎం డబ్లు 7 సిరీస్ లో చోటు చేసుకుంటాయి.

9. బిఎం డబ్లు ఐ

బీఎండబ్ల్యూ ఐ ప్రస్తుతం ఉన్న బీఎండబ్ల్యూ బ్రాండ్ మోడల్స్ కి సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో మరింత బలాన్ని చేకూర్చింది. బీఎండబ్ల్యూ ఐ కార్లను తయారు చేసేటప్పుడు అభివృద్ది చెంది పారిశ్రామికంగా తయారీ అయిన సీఎఫార్పీ ఇప్పుడు బీఎండబ్ల్యూ 7 సీరీస్ లగ్జరీ సెడాన్ యొక్క బరువుని తగ్గించేందుకు ఉపయోగపడింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience