2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడబోతున్న బిఎండబ్ల్యూ 3- సిరీస్

బిఎండబ్ల్యూ 3 సిరీస్ 2014-2019 కోసం manish ద్వారా జనవరి 21, 2016 01:54 pm సవరించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

BMW 3-Series facelift

"వారాంతంలో రేసర్ యొక్క" ఇష్టమైన కారు ఫేస్లిఫ్ట్ 2016 భారత ఆటో ఎక్స్పో లోకి వస్తోంది. జర్మన్ లగ్జరీ వాహన తయారీదారుడు అయిన బిఎండబ్ల్యూ, ఫిబ్రవరి 5 నుండి 9 వరకు గ్రేటర్ నోయిడా లో జరుగనున్న రాబోయే ఆటో ఎక్స్పోలో ప్రపంచవ్యాప్తంగా 3-సిరీస్ మోడల్ ఫేస్లిఫ్ట్ వాహనాన్ని ప్రదర్శించనుంది. బిఎండబ్ల్యూ సంస్థ వారి లైనప్ లో మరో మూడు కార్లను 3- సిరీస్ తొర్ కలిపి ఐ ఏ ఈ కొరకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా ఈ జర్మన్ ఆటో తయారీదారుడు, 7- సిరీస్ ను, సాఫ్ట్ ఆఫ్ రోడర్ మరియు ఎక్స్ 1 వాహనాలను తీసుకురానున్నాడు.

ఈ ఫేస్లిఫ్ట్ వాహనం గురించి చెప్పాలంటే, ఈ వాహనం యొక్క బాహ్య భాగంలో కొన్ని నవీకరణలు జరిగాయి. అవి ఏమిటంటే, హెడ్ ల్యాంప్, టైల్ ల్యాంప్ క్లస్టర్లు మరియు ఇతర చిన్న చిన్న నవీకరణలు చేయబడ్డాయి. ముందు బంపర్, ఎయిర్ ఇన్ టేక్ సెక్షన్ అందించడంతో మార్పు చేయబడింది.

BMW 3-Series facelift (Interiors)

ఈ వాహనం యొక్క అంతర్భాగం విషయానికి వస్తే, క్యాబిన్ లో ఉండే ఏసి వెంట్లు, సెంట్రల్ కన్సోల్ మరియు ఏసి నియంత్రణలపై క్రోం చేరికలను గమనించవచ్చు. ఫ్లోర్ కన్సోల్ లో ఉండే కప్ హోల్డర్లు, స్లైడింగ్ లిడ్ లతో కప్పబడి ఉంటాయి. భారతదేశంలో రాబోయే ఈ ఫేస్లిఫ్ట్ సాంప్రదాయాలతో వస్తుంది మరియు ఈ నవీకరించబడిన 3- సిరీస్, నాలుగు సిలండర్ల, 2.0 లీటర్ ట్విన్ పవర్ టర్బోచార్జెడ్ ఇంజన్ తో వస్తుంది మరియు ఈ ఇంజన్, ప్రస్తుతం ఉన్న మోడల్ లో చూడవచ్చు. ఈ ఇంజన్ అత్యధికంగా 184 బి హెచ్ పి పవర్ ను అదే విధంగా 380 ఎన్ ఎం గల అధిక టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు ఈ వాహనం, మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ మరియు ఆడి ఏ4 వంటి వాహనాలకు గట్టి పోటీ ను ఇస్తుంది. ఈ నవీకరించబడిన సెడాన్, 8- స్పీడ్ జెడ్ ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబది ఉంటుంది. దీనిని కూడా మనం, ప్రస్తుత మోడల్ లో గమనించవచ్చు. రాబోయే బిఎండబ్ల్యూ 1- సిరీస్ సెడాన్ వలే, 3- సిరీస్ ఫేస్లిఫ్ట్ కూడా సంస్థ యొక్క చెన్నై ప్లాంట్ లో తయారు చేయబడుతుంది మరియు 50% భాగాలు స్థానికంగా అందించబడతాయి.

ఇది కూడా చదవండి:

BMW కాంపాక్ట్ సెడాన్ భారత ఆటో ఎక్స్పో 2016 వద్ద ప్రదర్శించబడవచ్చు

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన బిఎండబ్ల్యూ 3 Series 2014-2019

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience