• English
  • Login / Register

బిఎండబ్ల్యూ 3జిటి స్పోర్ట్లైన్ ను రూ.39.9 లక్షల వద్ద ప్రారంభించింది.

జూన్ 11, 2015 11:03 am arun ద్వారా ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: బవేరియన్ ఆటో దిగ్గజం అయిన బిఎండబ్ల్యూ, 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్ మోడల్ ను బహిర్గతం చేసింది. ఈ 3జిటి స్పోర్ట్ లైన్, 2-లీటర్ డీజిల్ ఇంజెన్ తో అందుబాటులో ఉంది. మరియు ఈ ఇంజెన్ అత్యధికంగా 184bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది, అదే విధంగా అత్యధికంగా 380Nm గల టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ ఇంజెన్ ఇంతకు ముందే ప్రవేశపెట్టబడిన మరియు అత్యంత వేగంగా అమ్ముడయ్యే బిఎండబ్ల్యూ 320డి లో చూడవచ్చు. ఈ ఇంజిన్ ఒక 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తో జత చేయబడి ఉంటుంది.

భారతదేశ బిఎండబ్ల్యూ గ్రూప్ అధ్యక్షుడు అయిన మిస్టర్ ఫిలిఫ్ వోన్ సహర్, "ఈ కొత్త బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్లైన్ మోడల్ చాలా అద్భుతమైనది మాత్రమే కాదు, అంతర్గత భాగాలలో మనోహరమైన లుక్ ను ఇస్తుంది. ఇది అనేక లక్షణాలను కలిగి ఉంది. మరియు అనేక మార్గాల ద్వారా  అందమైన హంగులతో తెరపైకి వచ్చింది. ఈ కొత్త బిఎండబ్లూ 3 సిరీస్ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్, భాహ్య భాగాలు మరియు అంతర్గత భాగాలు డైనమిక్ లుక్ తో వచ్చాయి. హై గ్లాస్ బ్లాక్ ను కూడా కలిగి ఉంది  మరియు దాని అద్భుతమైన డిజైన్ లక్షణాలను మరింత స్పష్టమైన స్పోర్టీ లుక్ తో వచ్చింది అని వ్యాఖ్యానించారు.

ఈ 3జిటి స్పోర్ట్ లైన్ రూ.39.9 లక్షల రూపాయిల అతి తక్కువ ధర తో అందుబాటులో ఉంది. ఈ బిఎండబ్ల్యూ మూడు వేర్వేరు లోహపు పెయింట్ షేడ్స్ తో అందుబాటులో ఉంది. అవి వరుసగా, బ్లాక్ సేప్పైర్, ఇంపీరియల్ బ్లూ బ్రిలియంట్ ఎఫెక్ట్ మరియు మిడ్నైట్ బ్లూ వంటి రంగులతో అందుబాటులో ఉంది. అంతేకాకుండా నాన్ మెటాలిక్ పెయింట్ అయిన ఆల్పైన్ వైట్ తో కూడా అందుబాటులో ఉంది.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience