Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

జూన్ రెండవ వారంలో విడుదల కి సిద్దమవుతున్న అప్ డేటెడ్ "ఆడి క్యూ3 ఎస్ యువి"

ఆడి క్యూ3 2015-2020 కోసం sourabh ద్వారా జూన్ 05, 2015 05:13 pm ప్రచురించబడింది

జైపూర్: భారతదేశంలో, ఆడి చే నవీకరింపబడిన క్యూ3 ను ప్రవేశపెట్టడానికి సిద్దమౌతున్నారు. మరియు ఈ ఆడి క్యూ3 ను జూన్ మధ్యభాగంలో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ఈ రాబోయే ఫేస్లిఫ్ట్ వెర్షన్ కాస్మటిక్ రూపంలో చాలా నవీకరించబడినవి. ఈ ప్రీమియం ఎస్యువి పునఃరూపకల్పన గ్రిల్ తో పాటు దీని చుట్టూ క్రోమ్, భారీ ఎయిర్ ఇన్టేక్లు, ఒక జత అల్లాయ్ వీల్స్, మరియు కొత్త తైల్ ల్యాంప్ క్లస్టర్ వంటి లక్షణాలతో రాబోతుంది. 2015 ఆడి క్యూ3 లో ఒక ఆప్షనల్ ఫీచర్ గా ఎలీడి హెడ్ల్యాంప్స్ ఫీచర్ ఉండవచ్చు.

ఈ రాబోయే ఆడి క్యూ3 లో అంతర్భాగాలలో అనేక నవీకరణలు చేయబడ్డాయి. ఈ జాబితాలో కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్, కొత్త స్టీరింగ్ వీల్ మరియు నవీకరించబడిన ఎం ఎం ఐ వ్యవస్థ. హుడ్ క్రింది బాగానికి వస్తే, ఈ ఆడి క్యూ3 ఎస్యువి లో ట్రస్టెడ్ 2.0 లీటర్ టిడి ఐ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. మరియు ఇది 2.0 లీటర్ టిఎఫ్ ఎస్ ఐ పెట్రోల్ ఇంజన్ తో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ విషయానికి వస్తే, ఈ ఆడి క్యూ 3 వాహనం ఆడి క్వాట్రో ఏడబ్ల్యూడి సిస్టమ్ తో పాటుగా 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ తో రాబోతుంది.

అధిక ఇంధన సామర్ధ్యాన్ని అందించటానికి మరింత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన ఇంజెన్లను ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఈ సంస్థ వారు ఆడి క్యూ3 ఎస్ ను తిరిగి ప్రారంభించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ఆడి క్యూ3 ఎస్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో పాటు ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో తిరిగి ప్రవేశపెట్టనున్నారు.

ఇటీవల, ఆడి ఇండియా రెండు కార్లను ప్రవేశపెట్టింది. అవి వరుసగా 'ఆర్ ఎస్6 అవాంట్' రూ 1.35 కోట్ల వద్ద మరియు 'ఆర్ ఎస్ 7' ను రూ 1.40 కోట్ల వద్ద ప్రవేశపెట్టింది. ఈ రెండు కార్లు కూడా సిబియు విధానం ద్వారా నే అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ 2015 ఆడి ఆర్ ఎస్7 వాహనం తిరిగి డిజైన్ చేయబడిన బంపర్, కొత్త హనీకోంబ్డ్ సింగిల్ ఫ్రేమ్ గ్రిల్ తో పాటు క్వాట్రో బేడ్జింగ్ మరియు నవీకరించబడిన ఎల్ ఈ డి హెడ్ల్యాంప్స్ తో అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా లగ్జరీ ఏ8 సెలూన్ లో ఉపయోగించే, మేట్రిక్స్ ఎల్ ఈ డి ను కూడా ఆప్షనల్ గా ఎంపిక చేసుకోవచ్చు. ఈ నవీకరించబడిన సెలూన్, అవుట్గోయింగ్ మోడల్ కంటే 12 లక్షలు ఎక్కువ.

s
ద్వారా ప్రచురించబడినది

sourabh

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఆడి క్యూ3 2015-2020

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర