యాక్సిసరైజెడ్ రెనాల్ట్ క్విడ్ ఆటో ఎక్స్పో 2016 వద్ద ప్రదర్శింపబడింది
ఫిబ్రవరి 05, 2016 12:34 pm saad ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెనాల్ట్ క్విడ్ హ్యచ్చ్బ్యాక్ ఇప్పటికే భారతీయ వినియోగదారులు మధ్య చాలా ప్రోత్సాహం అందుకుంటుంది మరియు వాహన తయారీసంస్థ ఈ మోడల్ కొనసాగుతున్న ఎక్స్పో వద్ద అందరి దృష్టి ఆకర్షించేందుకు మరిన్ని ప్రత్యేకతలు చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దాని కోసం వాహనతయారీసంస్థ ప్రత్యేకమైన ఉపకరణాలతో ఉన్న రెనాల్ట్ క్విడ్ ని ప్రదర్శించింది.
క్విడ్ వాహనం గురించి చెప్పడం మొదలుపెడితే ముందరి భాగంలో గ్రిల్ ఒక ప్రత్యేక క్రోమ్ తో అందించబడింది, అదే విధంగా బోనెట్ షోల్డర్ లైన్ తో పాటుగా కారు యొక్క సి -పిల్లర్ పైన బ్లాక్ & వైట్ స్టికర్ తో ఉంటుంది. ఈ అనుకూలీకరించిన క్విడ్ యొక్క బాహ్య రూపంలో చూసిన మరో సౌందర్య మార్పు నల్లని రూఫ్ ఇది పరిపూర్ణంగా నల్లబడిన వెనుక వీక్షణ అద్దాలు తో సరిపోతుంది. ప్రక్క భాగంలో హ్యాచ్బ్యాక్స్ యొక్క వీల్స్ మరియు అలాయ్ వీల్స్ ట్రిపుల్ స్లాట్ చక్రాలతో భర్తీ చేయబడ్డాయి.
అంతర్భాగలకు వస్తే, అసాధారణమైన ఎరుపు రంగు అతికింపుతో పాటు కొన్ని గుర్తించదగిన మార్పులు ఉన్నాయి మరియు గేర్ లివర్ స్లాట్ అడుగున ఎరుపు రంగు ప్యానెల్ తో సరిపోలే లైనింగ్ మరియు యాక్సిలిరేటర్ పెడల్ కింద నలుపు మరియు ఎరుపు కార్పెట్ అందించబడుతుంది.
ఎక్స్పో లో పెవిలియన్ రెనాల్ట్ క్విడ్ ఆటోమెటిక్ తో పాటూ క్విడ్ యొక్క యాక్సిసరైజెడ్ వెర్షన్ ని ప్రదర్శించింది,అనతేకాకుండా క్విడ్ రేసర్ మరియు క్విడ్ క్లైంబర్ కాన్సెప్ట్ లను ప్రదర్శించింది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ కోసం, క్విడ్ వాహనం 2015 ద్వితీయార్ధంలో దీని ప్రారంభం తరువాత 100,000 పైగా యూనిట్లు ఇప్పటికే బుక్ చేసుకొని అద్భుతమైన విజయం సాధించింది.