మహీంద్రా KUV100 ని మరింత ప్రత్యేకంగా చేసే 7 అంశాలు!
మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్టి కోసం అభిజీత్ ద్వారా జనవరి 18, 2016 06:38 pm సవరించబడింది
- 11 Views
- ఒక వ్ యాఖ్యను వ్రాయండి
SUV ఇష్ హాచ్బాక్, KUV100 చివరకు రూ. 4.42 లక్షల నుండి రూ. 6.67 లక్షల(ఎక్స్-షోరూమ్, పూనే) ధర వద్ద చివరకి ప్రారంభించబడింది. మహీంద్రా కొత్త సమర్పణలతో ధర పరిగణలోనికి తీసుకుంటే హ్యుందాయ్ ఐ 10, మారుతి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగో వంటి వాటితో వ్యతిరేకంగా పోటీ చేస్తుంది. స్వదేశీ తయారీదారి మహీంద్రా సాధ్యమైనంత లక్షణాలతో వారి కారు అంశాలు ఖచ్చితంగా చేసింది. కాబట్టి ఇక్కడ kuv100 ని ప్రత్యేకంగా చేసే ఏడు విషయాలు ఉన్నాయి చూడండి.
ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
ఇప్పుడు, మహీంద్రా మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందించడంలో విఫలమయ్యింది. దానికి ఉదాహరణగా వెరీటో ని తీసుకోవచ్చు. దీనిలో ప్రాధమిక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండి అంతగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, KUV100 సందర్భంలో ఇలా జరగలేదు దీనిలో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా అద్భుతంగా మరియు స్పోర్టి ఆవరణం వద్ద అమర్చబడి ఉంది. నీడిల్ యొక్క లే అవుట్, డిజిటల్ MIDమరియు స్టీరింగ్ దీనిలో చాలా అద్భుతంగా ఉంటాయి.
గేర్ లివర్ ప్లేస్ మెంట్
గతసారి హోండా CR-V లో గేర్ లివర్ డాష్‌బోర్డ్ పైన అమర్చడం చూశాము. అదే విధంగా ఇప్పుడు KUV100 లో కూడా సులభంగా మరియు వేగంగా బదిలీ చేసేందుకు గేర్ లివర్ ని డాష్‌బోర్డ్ పైన అమర్చడం జరిగింది. దీని వలన మీరు గేర్ వేసేందుకు మీ చేతిని మొత్తం క్రిందకి తీసుకోవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ నిటారుగా ఉండే డాష్‌బోర్డ్ సంగీతం మరియు A / C నియంత్రణలు సులభంగా యాక్సెస్ చేయగలిగేలా చేస్తుంది.
భద్రత
ఇప్పుడు ప్రతి తయారీదారి ఇప్పుడు ABS, EBD మరియు ఎయిర్‌బ్యాగ్స్ వంటి ప్రాథమిక భద్రతా లక్షణాలను అందిస్తుంది. మహీంద్రా కూడా ఈ పద్దతిని అనుసరిస్తుంది. KUV100 అన్ని వేరియంట్స్ లో ప్రామాణిక ABS తో ప్రారంభించింది. అయితే, ఒకటి అంతటా ఆప్షనల్ ఎయిర్ బాగ్స్ ని పొందవచ్చు.
ఆనందపరిచే విషయం
మహీంద్రా KUV100 తో అపరిమిత కిలోమీటర్ల 2 సంవత్సరాల వారంటీ అందిస్తోంది మరియు ఎవరైతే ఈ వాహనాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారో వారిని ఇది ఖచ్చితంగా ఆనందపరుస్తుంది. సాధారణంగా, తయారీదారులు కిలోమీటర్ల ఒక నిర్దిష్ట పరిమితి అనగా 30,000 లేదా 50,000 అందిస్తారు.
మోటర్స్!
మహీంద్రా KUV100 ప్రత్యేకంగా ఈ వాహనానికై అభివృద్ధి చేయబడిన రెండు కొత్త బ్రాండ్ ఇంజిన్ల సమితితో అందించబడింది. 1.2 లీటర్ mFalcon పెట్రోల్ ఇంజిన్ 82PS శక్తిని మరియు 114NM టార్క్ ని అందిస్తుంది. మరోవైపు, డీజిల్ 1.2-లీటర్ టర్బో ఇంజిన్ 77PS శక్తిని మరియు 190NM టార్క్ ని
అందిస్తుంది.
పడుల్ ల్యాంప్స్
పడుల్ ల్యాంప్స్ నాలుగు తలుపులు కింద విలక్షణముగా ఉంచబడింది మరియు ఇది చాలా ఉపయోగకరమైన లక్షణం చీకటి ప్రాంతంలో KUV100 కారుతో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు ఈ వర్గం లో ఎవ్వరూ పడుల్ లాంప్స్ ని అందించడం లేదు.
సౌకర్యవంతమైన 6 సీట్లు
మహీంద్రా సంస్థ తెలివిగా రెండు ముందరి సీటు మధ్యలో ఒక సీటుని అందించింది. దీనివలన డ్రైవర్ కి మరియు ముందరి పాసింజర్ కి ఆర్మ్ రెస్ట్ మరింత డబుల్ అయ్యింది. అయితే ఈ సీటు ఎంతవరకూ భద్రతను కలిగి ఉన్నదో తెలీయదు. అయితే ఈ సీటుకి కూడా ఒక ల్యాప్ బెల్ట్ అందించడం జరిగింది. ఈ అధనపు సీటు చేరికతో వినియోగదారులను ఈ వాహనం చాలా ఆకర్షిస్తుంది.
మరింత చదవండి