మారుతి ఎస్ క్రాస్ గురించి తెలుసుకోవలసిన 6 అంశాలు

మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం manish ద్వారా జూలై 31, 2015 05:07 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మారుతి సుజుకి, భారతదేశంలో ఎసెక్స్4 ను ప్రవేశపెట్టిన మాదిరిగానే, భారతీయ వినియోగదారులకు అంతర్జాతీయ ఉత్పత్తిని తీసుకు రావడానికి సిద్ధంగా ఉంది.  ప్రపంచవ్యాప్తంగా అపారమైన విజయం అందుకున్న తరువాత భారతదేశంలో ఈ ఎస్-క్రాస్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఎస్-క్రాస్, డిస్కంటిన్యూ అయిన ఎసెక్స్4 మాదిరిగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ కొత్త క్రాస్ ఓవర్ ఎసెక్స్4 వేదికను ఆధారంగా చేసుకొని విడుదలవ్వబోతుంది. అంతేకాకుండా, ఈ మోడల్ అంతర్జాతీయ మార్కెట్లలో "ఎసెక్స్4 ఎస్ క్రాస్" గా అందుబాటులో ఉంది. ఎసెక్స్4 వాహనం, భారత మార్కెట్లో విజయం సాధించలేకపోయింది. అందువలన, దీనికి ఎస్-క్రాస్ అను నామకరణం చేసి చిన్న చిన్న మార్పులతో తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఎస్-క్రాస్ వాహనం, ఎసెక్స్4 ను ఆధారంగా రాబోతుంది కాబట్టి దీనిలో ఉన్న ఆకట్టుకునే గ్రౌండ్ క్లియరెన్స్ ను ఈ కొత్త వాహనం లో కూడా మనం చూడవచ్చు.

1. గురగుర ధ్వని

క్రింద ఉన్న మారుతి ఎస్ క్రాస్ చిత్రాలను గనుక చూసినట్లైతే, ఈ వాహనం 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది అన్న విషయం తెలుస్తుంది. ఈ ప్రత్యేక డీజిల్ ఇంజన్ ఫియాట్ నుండి తీసుకోబడింది. అంతేకాకుండా, ఇది  ఫియట్ యొక్క మల్టిజెట్ డీజిల్ ఇంజన్ లో ఒక భాగంగా ఉంటుంది. యూరోపియన్ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఎస్- క్రాస్ లో ఇంజన్, అత్యధికంగా 3750 ఆర్ పి ఎం వద్ద 118 బి హెచ్ పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, 1750 ఆర్ పి ఎం వద్ద 320 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేస్తుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న కంపాక్ట్ ఎస్యువి ల కంటే ఆకట్టుకునే పవర్ ను అందించే ఇంజన్ ను, ఈ ఎస్- క్రాస్ లో విలీనం చేయబడింది. అందువలన, రానున్న రోజుల్లో భారత మార్కెట్ లో ఉండే పోటీ ను ఇది తట్టుకోగలుగుతుంది.

2.వేరియంట్స్

ఈ వాహనం, ఇతర ఇంజన్ ఎంపికలతో కూడా రాబోతుంది. సియాజ్ లాగా ఈ ఎస్- క్రాస్ లో ఉండే ఇంజన్ లు వరుసగా, 1.4 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ అత్యధికంగా, 92 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరో ఇంజన్ విషయానికి వస్తే, రెండవది 1.3 లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ అత్యధికంగా, 90 బి హెచ్ పి పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ లు, ఇతర సుజుకి నమూనాలు తో చాల విజయవంతమైనాయి. ఇది ఇప్పటికీ పాత మరియు భారీ వేదిక ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా, ఈ ఎస్- క్రాస్, సియాజ్ కంటే 200 కిలోలు ఎక్కువ బరువును కలిగి ఉండబోతుంది. ముఖ్యంగా 1.6 లీటర్ డీజిల్ వేరియంట్ యొక్క బరువు, 1305 కిలోలు. బరువు పెరగడం వలన మరియు శక్తి-బరువు నిష్పత్తి చివరికి కారు యొక్క పనితీరుని ప్రభావితం చేస్తుంది. 

3. ఆకృతీకరణ

రెనాల్ట్ యొక్క వాహనాలకు పోటీగా, ఈ మారుతి సుజుకి ఏడబ్ల్యూడి సిస్టం తో రాబోతుంది అని పుకార్లు ఉన్నాయి. ఈ ఎస్- క్రాస్, అంతర్జాతీయ మార్కెట్ లో ఏడబ్ల్యూడి ఎంపిక తో అందుబాటులో ఉంది. అందుచేత, భారత మార్కెట్ లో కూడా ఈ ఆప్షన్ తో నే వచ్చే అవకాశాలున్నాయి. భారతదేశంలో సుజుకి అత్యంత కీలక మార్కెట్లలో ఒకటి అందువలన కారు దాని పోటీ నిర్ణయించబడిన ప్రమాణాలను తట్టుకొని విజయాన్ని సాధించగలదు. ఈ ఎస్-క్రాస్ లో ఒక వేరియంట్ మాత్రమే ఏడబ్ల్యూడి వెర్షన్ లో వస్తుందోఅ లేదా ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లు ఏడబ్ల్యూడి ఎంపికతో వస్తున్నాయా అనేది ఈ సంస్థ వారు ఈ ఎస్- క్రాస్ ను విడుదల చేసిన తరువాత మాత్రమే తెలుస్తుంది.

4. బెల్స్ మరియు ఈలలు

సియాజ్ లో ఉన్న మాదిరిగా, ఇప్పుడు రాబోయే ఎస్-క్రాస్ లో కూడా ఈ గాడ్జెట్ లు పొందుపరచబోతున్నారు. అయితే, పోటీ ను అధిగమించలేకపోయినా సరిపోలుతుంది. ఈ ఎస్- క్రాస్, టచ్స్క్రీన్ మల్టీమీడియా మరియు నావిగేషన్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లెదర్ సీట్లు మరియు ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ బటన్ వంటి లక్షణాలతో రాబోతుంది.

5. పారామీటర్లు

ఈ ఎస్- క్రాస్, ఏడబ్ల్యూడి వెర్షన్ లో వచ్చినప్పటికి అన్ని టెర్రైన్స్ ను తట్టుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండదు. దాని పోటీదారుడు అయిన, రెనాల్ట్ డస్టర్ వంటి కారు, అన్ని రహదారి పరిస్థితులు అధిగమించేందుకు దాని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ మరియు ధృఢనిర్మాణంగల సస్పెన్షన్ ను ఉపయోగించుకుంటుంది. ఈ వాహనం ఒక మృదువైన వాహనం.

6. ధర

దాని పోటీ పరంగా, ఎస్-క్రాస్ వాహనం, ఈకోస్పోర్ట్ కంటే కాస్ట్లీ వాహనం. కానీ, ధర పరంగా తక్కువ. అంతేకాకుండా, మారుతి వాహనాల యొక్క ధరలు, రెనాల్ట్ డస్టర్ మరియు నిస్సాన్ టెర్రినో వాహనాలతో పోలిస్తే తక్కువ. గతం లో ఉన్న కారణంగా డస్టర్ ప్రజాదరణ కలిగిన వాహనం, అందువలన రెనాల్ట్ కారు ఎక్కువ ధరను కలిగి ఉంది. పోటీను గనుక పరిగణనలోకి తీసుకున్నట్లైతే, వినియోగదారుల నుండి అప్పీల్ ను మరియు ప్రజాదరణ ను పొందినట్లైతే, మారుతి పోటీ ధరను ఇవ్వవచ్చు. మారుతి దీపావళి సమయం లో ఒక ప్రెమియం హాచ్బాక్ ను విడుదల చేయడానికి నిర్ణయించుకుంది. మరియు దాని భాగాలు ఎస్ క్రాస్ ద్వారా భాగస్వామ్యం ఉండవచ్చు. ఈ ఉత్పత్తి ఖర్చులు తగ్గించడం అనేది మారుతి ద్వారా జరిగింది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి S-Cross 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience