త్వరలో ఆస్ట్రేలియాలో విడుదల కానున్న 5-డోర్‌ల సుజుకి జిమ్నీ
మారుతి జిమ్ని కోసం shreyash ద్వారా జూన్ 27, 2023 03:30 pm ప్రచురించబడింది
- 135 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
3-డోర్‌ల సుజుకి జిమ్నీ వెర్షన్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో విక్రయించబడుతోంది
-
ఆస్ట్రేలియన్-స్పెక్ 5-డోర్‌ల సుజుకి జిమ్నీ విడుదల తేదీ మరియు స్పెసిఫికేషన్‌లు ప్రస్తుతానికి వెల్లడించలేదు.
-
దిని 3-డోర్‌ల వెర్షన్ ఇప్పటికే ఆస్ట్రేలియాలో విక్రయించబడుతోంది, ఇందులో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) ప్రామాణికంగా ఉంది.
-
ఆస్ట్రేలియా 5-డోర్‌ల జిమ్నీ కూడా ఇండియా-స్పెక్ ఆఫ్-రోడర్ؚలో ఉండే అవే ఫీచర్‌లతో వస్తుంది.
-
ఆస్ట్రేలియన్-స్పెక్ 3-డోర్‌ల జిమ్నీ అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌లతో వస్తుంది.
3-డోర్‌ల సుజుకి జిమ్నీ భారతదేశంలో విడుదల కాలేదు అయితే ప్రస్తుతం 5-డోర్‌ల మారుతి జిమ్నీ విడుదల కానుంది. అదనంగా జోడించిన డోర్‌లు, భారీ బూట్ మరియు అప్ؚడేటెడ్ ఫీచర్‌ల జాబితాతో, ఈ పొడవైన జిమ్నీ ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది ఇప్పుడు ఇది ఆస్ట్రేలియాలో కూడా విడుదల కానుంది (కుడి-చేతి-డ్రైవింగ్ మార్కెట్ؚ). దీని స్పెసిఫికేషన్‌లను మరియు ఫీచర్‌లను సుజుకి ప్రస్తుతానికి వెల్లడించలేదు, కానీ ఆశించదగినవి క్రింద చూడవచ్చు.
దీన్ని ఏది నడిపిస్తుంది?
ఇండియా-స్పెక్ 5-డోర్ జిమ్నీలో ఉన్న పవర్‌ట్రెయిన్ ఆస్ట్రేలియాలోని సాధారణ 3-డోర్ జిమ్నీలో కూడా ఉంది కాబట్టి, ఇంజన్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ఆస్ట్రేలియన్-స్పెక్ 5-డోర్‌ల జిమ్నీ 5-స్పీడ్ మాన్యువల్ؚ లేదా 4-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚకు జోడించిన అదే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను, 4-వీల్ డ్రైవ్‌తో(4WD) ప్రామాణికంగా అందిస్తున్నారు. పనితీరులో కొంత మెరుగుదల ఉంటుంది ఎందుకంటే ఇండియా-స్పెక్ జిమ్నీ 105PS మరియు 134NMగా రేట్ చేయబడింది ఇది ఆస్ట్రేలియాలోని 3-డోర్‌ల జిమ్నీ కంటే 3PS మరియు 4Nm ఎక్కువ.
ఆశించదగిన ఫీచర్‌లు
మారుతి జిమ్నీ వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేలతో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో వస్తుంది. భద్రత పరంగా ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP) మరియు రేర్ వ్యూ కెమెరాలను కలిగి ఉంది. ఆస్ట్రేలియన్ మార్కెట్‌లో అందించే 5-డోర్‌ల సుజుకి జిమ్నీలో కూడా దీనికి సమానమైన ఫీచర్‌ల సెట్ కొనసాగిస్తారని అంచనా.
అయితే, ఆస్ట్రేలియన్ –స్పెక్ 3-డోర్ జిమ్నీ భద్రత కిట్‌లో మెరుగ్గా లేన్ డిపార్చర్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్‌లను అందిస్తున్నారు, ఇవి భారతదేశంలో అందించే మారుతి సుజుకి మోడల్‌లలో లేవు.
ఇది కూడా చదవండి: మారుతి జిమ్నీ ధరలు వాటి మార్కును మిస్ అవుతున్నాయా?
అంతేకాకుండా, ఆస్ట్రేలియాలో అందించే బేస్-స్పెక్ 3-డోర్‌ల జిమ్నీలో టచ్ؚస్క్రీన్ యూనిట్ లేదు, దీని టాప్-స్పెక్ వెర్షన్ؚలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. ఇండియ లోని బేస్-స్పెక్ జిమ్నీలో ఇదే యూనిట్ వస్తుంది.
జిమ్నీ పోటీదారులు
భారతదేశంలో, మారుతి జిమ్నీ ఫోర్స్ గూర్ఖా మరియు మహీంద్రా థార్ؚలతో పోటీ పడుతుంది. ఆస్ట్రేలియాలో 3-డోర్‌ల మరియు 5-డోర్‌ల జిమ్నీకి ప్రత్యక్ష పోటీగా, అదే పరిమాణం మరియు అదే ధరలో వచ్చే SUVలు లేవు. ఇక్కడ జిమ్నీ ధర రూ.12.74 లక్షల నుండి రూ.15.05 లక్షలగా (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ఉంది, ఆస్ట్రేలియాలో 3-డోర్‌ల జిమ్నీ ధర AUD 33,500 అంటే రూ.18.28 లక్షలుగా ఉంది.
ఇక్కడమరింత చదవండి: మారుతి జిమ్నీ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful