• English
  • Login / Register

రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు, ఇటీవల షారూఖ్ ఖాన్ రైడ్

రోల్స్ రాయిస్ 2018-2024 కోసం shreyash ద్వారా మార్చి 29, 2023 03:12 pm ప్రచురించబడింది

  • 36 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రపంచంలోని అత్యంత సౌకర్యవంతమైన SUVలలో ఒకటైన దానిపై అధికంగా డబ్బు వెచ్చించిన బాలీవుడ్ యాక్టర్.

Shahrukh Khan Buys Rolls Royce Cullinan Black Badge Edition

షారూఖ్ ఖాన్, బాలీవుడ్ కింగ్ ఖాన్, ఇటీవల తెలుపు రంగు రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ను డ్రైవ్ చేస్తూ కనిపించారు, ఇది రూ.10 కోట్ల ధరను కలిగి ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన SUV. షారూఖ్ ఖాన్ సిగ్నేచర్ 555 నెంబర్ ప్లేట్ؚ కలిగిన ఈ SUV అతని బంగ్లా ‘మన్నత్’ వద్ద అభిమానులు ఫోటోలు తీశారు, ఈ కారు అతని గ్యారేజ్‌కు తాజా జోడింపు అని చెప్పవచ్చు. 

షారూఖ్ ఖాన్ కొత్త రైడ్ గురించి మీరు తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇవి:

అద్భుతమైన డిజైన్

Rolls Royce Cullinan Black Badge Front

కల్లినన్ డిజైన్ ఎప్పుడూ శక్తివంతంగా, ఆశ్చర్యపరచే విధంగా ఉంటుంది, బ్లాక్ బ్యాడ్జ్ విషయానికి వస్తే, ఇది రోల్స్-రాయిస్ ప్రొడక్షన్ సీరీస్ ఇంజనీరింగ్ ప్రతిభను సూచిస్తుంది. ఈ విలాసవంతమైన SUV గ్రిల్ కోసం నలుపు రంగు ఫినిష్ మరియు క్రోమ్ బ్లాక్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ ఉన్నాయి. ఇందులో ఫోర్జెడ్ 22-అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి, ఇది కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ కోసం ప్రత్యేకమైనవి.  

ఇది కూడా చదవండి: CD మటాలలో: కొత్త ఫీచర్ అప్ؚడేట్ؚలతో పోటీకి వేగంగా స్పందిస్తున్న నేటి కారు తయారీదారులు, కానీ భారం ఎవరి పైన?

టెక్నికల్ కార్బన్ ఫైబర్ డ్యాష్ؚబోర్డ్ 

Rolls Royce Cullinan Black Badge

కల్లినల్ బ్లాక్ బ్యాడ్జ్ లోపల, డ్యాష్‌బోర్డ్‌పై మూడు-కోణాల కార్బన్ టెక్ ఫైబర్ ఫినిష్ ఉంటుంది, అంటే అత్యంత ఖచ్చితమైన, పునరావృతమయ్యే జ్యామెట్రిక్ ఆకారాలు ఉంటాయి ఇవి 3-D ప్రభావాలను చూపుతాయి. ఇది కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్ؚకు ప్రత్యేకమైనవి. 

విశాలమైన లాంజ్ సీట్లు

Rolls Royce Cullinan Black Badge Rear Seats

వెనుక సీట్‌లలో లాంజ్ సీటింగ్ అనుభవం గరిష్ట సౌకర్యాన్ని అందిస్తుంది, ఇద్దరు ప్రయాణీకులకు రెండు హై-డెఫినిషన్ 12-అంగుళాల స్క్రీన్‌లు, షాంపేన్ గ్లాసులను ఉంచేందుకు ఒక ఫోల్డ్ అవుట్ ఆర్మ్ రెస్ట్ ఉంటాయి. ప్రయాణీకులు వ్యక్తిగత సీట్ కాన్ఫిగరేషన్‌ను మరియు మస్సాజ్ మోడ్‌ను ఎంచుకోవచ్చు. రోల్స్-రాయిస్ SUVలో నలుపు రంగు లెదర్‌లో దాని సిగ్నేచర్ స్టార్ లైట్ హెడ్ؚలైనర్ ఉంటుంది, 1,344 ఫైబర్ ఆప్టిక్ లైట్ؚలతో ఇది నక్షత్రాలలాగా కనిపిస్తుంది.  

ఇది కూడా చదవండి: 25 సంవత్సరాల టాటా సఫారి: మరింత ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఇమేజ్ కోసం ఈ ఐకానిక్ SUV తన ధృఢమైన, మాచో ట్యాగ్ؚను ఎలా వదులుకుంది

స్పోర్టీ ఇంజనీరింగ్ 

Rolls Royce Cullinan Black Badge Side

బ్లాక్ బ్యాడ్జ్, రోల్స్-రాయిస్ లగ్జరీ కార్‌ల దూకుడుతనాన్ని ప్రతిబింబిస్తుంది. కల్లినన్ కోసం ఫ్రేమ్ ధృఢత్వాన్ని, ఫోర్ వీల్ స్టీరింగ్ మరియు “సాధారణ” SUV అనుభవం నుంచి భిన్నంగా ఉండటానికి ఆల్-వీల్ డ్రైవ్ ట్రైన్ సిస్టమ్ؚలను రీ-ఇంజనీరింగ్ చేశామని ఈ కారు తయారీదారు తెలియజేశారు. సస్పెన్షన్ కాంపొనెంట్ؚలు మరియు సెట్టింగ్ؚలలో కూడా మార్పులు ఉన్నాయి. రైజెడ్ బ్రేకింగ్ బైట్ పాయింట్ మరియు రీడిజైన్డ్ బ్రేక్ డిస్క్ వెంటిలేషన్ؚలతో రోల్స్-రాయిస్ బ్రేక్ؚలను కూడా మెరుగుపరచింది. 

మరింత శక్తివంతమైన V12 ఇంజన్

కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్, కొత్త ఎగ్జాస్ట్ సిస్టమ్ؚతో అప్ؚరేటెడ్ 6.75-లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజన్ؚను పొందింది. ఇప్పుడు ఇది 600PS పవర్ మరియు 900Nm టార్క్‌ను అందిస్తుంది, ఇది ప్రామాణిక కల్లినన్‌తో పోలిస్తే 29PS పవర్ మరియు 50Nm టార్క్ ఎక్కువ. వేగానికి తక్షణం స్పందించేలా బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్ కోసం మాత్రమే ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన ఎనిమిది-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో ఇది జోడించబడింది. 

ఇక్కడ మరింత చదవండి: రోల్స్-రాయిస్ కల్లినన్ ఆటోమ్యాటిక్ 

was this article helpful ?

Write your Comment on Rolls-Royce రాయిస్ 2018-2024

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience