• English
  • Login / Register

భారతదేశంలో చిన్న EV సహా, 4 కొత్త కార్లను విక్రయించనున్న Nissan

జూలై 19, 2024 06:02 pm shreyash ద్వారా ప్రచురించబడింది

  • 444 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ నాలుగు కార్లలో, ఫేస్‌లిఫ్టెడ్ నిస్సాన్ మాగ్నైట్ ఈ ఏడాది విడుదల కానుంది.

నిస్సాన్ ఇటీవల తమ నాల్గవ తరం X-ట్రయల్‌ను భారతదేశంలో ఆవిష్కరించారు, ఇది పూర్తి స్థాయి SUV కంప్లీట్ బిల్ట్ యూనిట్ (CBU) గా విడుదల కానుంది. 2024 నిస్సాన్ X-ట్రయల్ ఆవిష్కరణ సందర్భంగా, జపనీస్ వాహన తయారీదారు భారతదేశంలో మరో నాలుగు మోడళ్లను ప్రవేశపెట్టే ప్రణాళికలను కూడా ధృవీకరించారు, వీటిలో ఈ సంవత్సరం దాని ఒక మోడల్ యొక్క రిఫ్రెష్డ్ వెర్షన్ మరియు రాబోయే సంవత్సరాలలో ఒక చిన్న EV విడుదలకానున్నాయి. భారతదేశంలో రాబోయే నిస్సాన్ కార్ల గురించి నిశితంగా పరిశీలిద్దాం.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్

ఆశించిన విడుదల

అక్టోబర్ 2024

ఆశించిన ధర

రూ. 6 లక్షలు

నిస్సాన్ మాగ్నైట్ భారతదేశంలో డిసెంబర్ 2020లో సబ్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్ మరియు మారుతి బ్రెజ్జాకు పోటీగా పరిచయం చేయబడింది. ఇది దాని ప్రత్యర్థి కార్లకు వచ్చినంత ప్రజాదరణ పొందనప్పటికీ, ఇది ఖచ్చితంగా జపనీస్ వాహన తయారీదారు భారత మార్కెట్లో తమ వాహనాలను విక్రయించడానికి సహాయపడింది. ఇప్పుడు ఈ SUV కారుకు ప్రధాన నవీకరణ అవసరం మరియు 2024 చివరి నాటికి మాగ్నైట్ యొక్క కొత్త వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు నిస్సాన్ ధృవీకరించింది.

మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్, నవీకరించబడిన హెడ్‌లైట్ మరియు L- ఆకారపు LED DRL వంటి కొన్ని డిజైన్‌ మార్పులు చేయబడతాయి. ఇటీవలే భారత్ NCAP క్రాష్ టెస్ట్ ఫెసిలిటీలో కనిపించిన ఈ SUV రివైజ్డ్ ఫ్యాసియా గురించి కూడా మాకు అధికారిక ఫోటోలు కొన్ని లభించాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ మరియు సింగిల్ పేన్ సన్‌రూఫ్ వంటి కొన్ని కొత్త ఫీచర్లను ఇందులో ఇవ్వవచ్చు. ఇది కాకుండా, ఇందులో 8-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు లభించే అవకాశం ఉంది.

ప్రస్తుత మోడల్ యొక్క పవర్ ట్రైన్ ఎంపికలను 2024 మాగ్నైట్‌లో కనుగొనవచ్చు, దీని స్పెసిఫికేషన్లు క్రింది విధంగా ఉన్నాయి:

ఇంజన్

1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్

1-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్

72 PS

100 PS

టార్క్

96 Nm

160 Nm వరకు

ట్రాన్స్మిషన్

5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT

 

నిస్సాన్ కాంపాక్ట్ SUV / మిడిసైజ్ 3-రో SUV

నిస్సాన్ కాంపాక్ట్ SUV

నిస్సాన్ మిడ్ సైజ్ 3-రో SUV

ఆశించిన విడుదల - మార్చి 2025

ఆశించిన విడుదల - సెప్టెంబర్ 2025

అంచనా ధర - రూ.10 లక్షలు

అంచనా ధర: రూ.12 లక్షలు

New Renault and Nissan C-segment SUVs teased

రాబోయే సంవత్సరాల్లో క్రెటాతో పోల్చదగిన కాంపాక్ట్ SUVని విడుదల చేయనున్నట్లు నిస్సాన్ ధృవీకరించింది, దీని యొక్క 7-సీటర్ వెర్షన్ కూడా విడుదల చేయబడుతుంది. కాంపాక్ట్ SUVని రెనాల్ట్ డస్టర్ యొక్క CMF-B ప్లాట్‌ఫారమ్‌లో నిర్మించవచ్చు. నిస్సాన్ దాని రాబోయే SUVకి సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని పంచుకోనప్పటికీ, రాబోయే కొత్త డస్టర్‌లో ఉన్న అదే ఇంజన్ ఎంపికలను ఇందులో ఇవ్వవచ్చని భావిస్తున్నారు. రాబోయే నిస్సాన్ SUV గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ కాంపాక్ట్ SUV హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి గ్రాండ్ విటారాకు పోటీగా ఉంటుంది. 7 సీట్ల వెర్షన్ మహీంద్రా XUV700, 2024 హ్యుందాయ్ అల్కాజార్ మరియు MG హెక్టర్ ప్లస్ యొక్క 7-సీటర్ వేరియంట్‌లతో పోటీపడుతుంది.

ఒక చిన్న EV

ఆశించిన విడుదల

మార్చి 2026

టాటా టియాగో EV మరియు MG కామెట్ EVలకు పోటీగా నిస్సాన్ భారతదేశంలో ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేయాలని యోచిస్తోంది. నిస్సాన్ దాని రాబోయే EVకి సంబంధించిన ఎక్కువ సమాచారాన్ని ఇంకా పంచుకోలేదు, అయినప్పటికీ ఇది 2026లో పరీక్షించబడుతుందని మేము ఆశిస్తున్నాము. నిస్సాన్ యొక్క చిన్న ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జ్‌తో దాదాపు 300 కిలోమీటర్ల పరిధిని అందించగలదు.

మరిన్ని ఆటోమోటివ్ అప్‌డేట్‌ల కోసం కార్ దేఖో యొక్క వాట్సాప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience