389 పొలో కార్లను ఉపసంహరించిన వోక్స్వ్యాగన్ : డీజిల్ గేట్ వివాదం కారణం కాదు , అసమర్థమైన హ్యాండ్ బ్రేక్స్ మాత్రమే కారణం
వోక్స్వాగన్ పోలో 2015-2019 కోసం manish ద్వారా అక్టోబర్ 09, 2015 03:11 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
ఇటీవల 'డీజిల్ గేట్ ' వివాదం వెలుగులో, వోక్స్వ్యాగన్ గ్రూప్ నిన్న భారతదేశం అంతటా ఉన్న డీలర్షిప్లకు వెంటనే పోలో హ్యాచ్బ్యాక్ అమ్మకాలు ఆపమని ఆర్డర్ జారీ చేసింది. 'డీజిల్ గేట్ ' వివాదం వలన పోలో ని వాహనాన్ని ఆపేయమన్నారని పుకార్లు వస్తున్నాయి, కానీ డీజిల్ గేట్ వివాదానికి దీనికి ఎటువంటి సంబందం లేదు. వాహనాలు ఉపసంహరించడానికి కారణం అసమర్థమైన హ్యాండ్ బ్రేక్స్ ఉండడం, కానీ వారి సమయం అనుకూలంగా లేకపోవడం వలన ఆ 'డీజిల్ గేట్ ' వివాదానికి దీనికి సంబందం కలిపారు అని సంస్థ తెలిపింది. వోక్స్వ్యాగన్ 389 యూనిట్లను ఈ రోజు ఉపసంహరించడం జరిగింది.
ఒక నివేదిక ప్రకారం, ఒక బ్యాచ్ నుండి ఈ ప్రభావిత కార్లు సెప్టెంబర్ 2015 లో నిర్మించబడాయి. సంస్థ 389 కార్లలో కొన్ని హ్యాండ్బ్రేక్ యూనిట్లు అమ్ముడయ్యాయి మరియు ఇవి సెప్టెంబర్ లో తయారు చేయబడ్డాయి, కానీ అమ్ముడుపోని మిగిలిన ప్రభావిత కార్లకు సంస్థ మరమత్తు చేయించడం జరుగుతుంది. హ్యాండ్బ్రేక్ కేబుల్ తెగిపోయే అవకాశం ఉండడం అనేది ఈ వాహనం యొక్క సమస్య.
డీలర్షిప్లు ఈ కార్ల యజమానులను సంప్రదించడం ప్రారంభించారు మరియు మరమ్మతు ఒక గంటల సమయంలో చేస్తామని సంస్థ తెలిపింది. వోక్స్వ్యాగన్ ఇప్పటికీ చెక్కుచెదరక చాలా కార్లను అమ్మకాలు చేస్తుంది. లోపాలు కలిగిన మోడళ్ళకి ఉచితంగా మరమ్మతు చేస్తుంది మరియు ఒకసారి మరమ్మత్తు జరిగాక ప్రభావిత కార్ల అమ్మకాలు కూడా మొదలవుతాయి.
ఇటీవల 'డీజిల్ గేట్ ' అపజయం తో, బహుశా వోక్స్వాగన్ గ్రూప్ ప్రజా సంబంధాలు పొందలేకపోవచ్చు. సంస్థకి ఒక శాంతి సమర్పణ చర్యగా, గోల్ఫ్ జిటి ఐ నమూనా వాహనన్ని భారతదేశంలోనికి తీసుకురావలసినదిగా సూచిస్తున్నాము.