విడుదలకు ముందే 2024 Hyundai Creta యొక్క అధికారిక చిత్రాలు విడుదల
హ్యుందాయ్ క్రెటా కోసం shreyash ద్వారా జనవరి 11, 2024 03:08 pm ప్రచురించబడింది
- 3K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ జనవరి 16 న భారతదేశంలో విడుదల కానుంది.
-
రూ.25,000 టోకెన్ అమౌంట్ తో హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
-
ఈ SUV కారు యొక్క ఫ్రంట్ మరియు రేర్ ప్రొఫైల్ కొత్త లైటింగ్ సెటప్ మరియు కొత్త బంపర్ లతో సరికొత్తగా మారింది.
-
క్యాబిన్ లో ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెటప్ మరియు కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి.
-
కొత్త హ్యుందాయ్ క్రెటా SUVలో లెవల్ 2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) అందించబడింది.
-
పవర్ట్రెయిన్ ఎంపికలలో కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT) తో జతచేయబడింది.
2024 హ్యుందాయ్ క్రెటా జనవరి 16 న భారతదేశంలో విడుదల కానుంది. అంతకన్నా ముందే, హ్యుందాయ్ ఈ SUV కారు యొక్క కొత్త చిత్రాలను విడుదల చేశారు, ఈ చిత్రాల ద్వారా దాని పూర్తి డిజైన్ బహిర్గతం చేయబడింది. ఈ వాహనం యొక్క ఫ్రంట్ లుక్ పూర్తిగా కొత్తది. ఇది కొత్త ఫీచర్లు మరియు మరింత శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజన్తో అందించబడుతుంది. కొత్త హ్యుందాయ్ క్రెటా కోసం బుకింగ్స్ ప్రస్తుతం రూ.25,000 టోకెన్ అమౌంట్ తో జరుగుతున్నాయి. 2024 హ్యుందాయ్ క్రెటా SUV కి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ ఉంది:
మునుపటి కంటే మరింత పవర్ ఫుల్ లుక్స్
ఈ వాహనం యొక్క కొత్త ఎక్స్టీరియర్ డిజైన్ యొక్క చిత్రాలు ఇప్పటికే విడుదలయినప్పటికీ, దాని డిజైన్ ని మరింత వివరణాత్మకంగా చూపించే కొన్ని అధికారిక చిత్రాలు విడుదలయ్యాయి. 2024 హ్యుందాయ్ క్రెటా చూడడానికి ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ కంటే మరింత పవర్ ఫుల్ గా మరియు బోల్డ్ గా కనిపిస్తుంది. ఈ SUV కారు యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ సరికొత్తది, ముందు భాగంలో కొత్త దీర్ఘచతురస్రాకార గ్రిల్, ఇన్వర్టెడ్ L-ఆకారంలో మరియు చతురస్రాకారంలో హెడ్ లైట్ హౌసింగ్, బానెట్ వెడల్పు వరకు విస్తరించిన LED DRL స్ట్రిప్ ఉన్నాయి. ముందు భాగంలో, బంపర్ పై బలమైన స్కిడ్ ప్లేట్ అందించబడింది, ఇది సిల్వర్ ఫినిషింగ్ చేయబడింది.
సైడ్ ప్రొఫైల్ లో, కొత్త అల్లాయ్ వీల్స్ తప్ప మరే ఇతర మార్పులు లేవు. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ తో పాటు ముందు భాగంలో ఉన్న అదే ఇన్వర్టెడ్ L-ఆకారంలో ఉండే ఎలిమెంట్స్ ఉన్నాయి. వెనుక భాగంలో, పెద్ద సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో సవరించిన రేర్ బంపర్ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: ఫేస్ లిఫ్ట్ కియా సోనెట్ త్వరలోనే భారతదేశంలో విడుదలకానుంది
కొత్త క్యాబిన్
2024 హ్యుందాయ్ క్రెటా లో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం డ్యూయల్-ఇంటిగ్రేటెడ్ 10.25-అంగుళాల స్క్రీన్ మరియు కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో రీడిజైన్ చేసిన డ్యాష్బోర్డ్ లేఅవుట్ ఉంటాయి. ప్యాసింజర్ సైడ్ డ్యాష్ బోర్డ్ పై భాగంలో పియానో బ్లాక్ ప్యానెల్, దాని కింద కొత్త ఓపెన్ స్టోరేజ్ స్పేస్ తో యాంబియంట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనం టచ్ కంట్రోల్స్ తో కూడిన కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ను కూడా అందించబడుతుంది.
2024 క్రెటాలో 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. అంటే కాకుండా ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: త్వరలోనే విడుదలకానున్న స్కోడా ఎన్యాక్ EV 2024 మళ్లీ కనిపించింది
పవర్ ట్రైన్ ఎంపికలు
కొత్త క్రెటా 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ (160 PS / 253 Nm) 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇది ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడల్ నుండి రెండు ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది: 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (115 PS / 144 Nm) తో 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT మరియు 1.5-లీటర్ డీజిల్ యూనిట్ (116 PS / 250 Nm) తో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్.
ఆశించిన ధర & ప్రత్యర్థులు
భారతదేశంలో 2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవచ్చు. ఇది కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్, వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, హోండా ఎలివేట్ హోండా ఎలివేట్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.
మరింత చదవండి: హ్యుందాయ్ క్రెటా ఆటోమేటిక్