Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2023 Toyota Vellfire: భారతదేశంలో విడుదలైన 2023 టయోటా వెల్ఫైర్, ధర రూ.1.20 కోట్ల నుండి ప్రారంభం

టయోటా వెళ్ళఫైర్ కోసం rohit ద్వారా ఆగష్టు 04, 2023 03:06 pm ప్రచురించబడింది

కొత్త వెల్ఫైర్ రెండు విస్తృత వేరియెంట్ؚలలో విక్రయించబడుతుంది, హై మరియు VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్, ఇవి వరుసగా 7-సీటర్ మరియు 4-సీటర్ లేఅవుట్ؚలలో వస్తాయి

  • కొత్త వెల్ఫైర్ ధరను టయోటా రూ.1.20 కోట్ల నుండి రూ.1.30 కోట్ల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) వరకు నిర్ణయించింది.

  • నాలుగవ-జెన్ MPV బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యయి, డెలివరీలు నవంబర్ؚలో ప్రారంభం అవుతాయి.

  • ఎక్స్ؚటీరియర్ ముఖ్యాంశాలలో నాజూకైన LED హెడ్ؚలైట్‌లు మరియు DRLలు, 19-అంగుళాల నలుపు రంగు అలాయ్ వీల్స్ మరియు కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు ఉన్నాయి.

  • కొద్దిపాటి మరియు మెరుగైన క్యాబిన్ లేఅవుట్ؚను కలిగి ఉంది, ఇందులో 14-అంగుళాల టచ్ؚస్క్రీన్ ప్రముఖంగా కనబడుతుంది.

  • 4-సీటర్ వర్షన్ؚలో మసాజ్ ఫంక్షన్ మరియు బహుళ అడ్జస్ట్మెంట్ؚలతో ఒట్టోమాన్ సీట్లు ఉన్నాయి.

  • ఇతర ఫీచర్‌లలో 14-రంగుల ఆంబియెంట్ లైటింగ్, డ్యూయల్-ప్యానెల్ సన్ؚరూఫ్ మరియు ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ఉంటాయి.

  • 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ నుండి శక్తిని పొందుతుంది ఇది e-CVTతో జోడించబడింది మరియు 19.28kmplను క్లెయిమ్ చేస్తుంది.

నాలుగవ-జనరేషన్ టయోటా వెల్ఫైర్ భారతదేశంలో విడుదలైంది. ఈ కొత్త లగ్జరీ MPV బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యయి. దీన్ని హై మరియు VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్ అనే రెండు విస్తృత వేరియెంట్ؚలలో అందించనున్నారు. కొత్త వెల్ఫైర్ శ్రేణి ధరలు రూ.1.20 కోట్ల నుండి రూ.1.30 కోట్ల (రౌండెడ్-ఆఫ్, ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) మధ్య ఉంటాయి, ఈ సరికొత్త మరియు మెరుగైన MPV ధర మునుపటి వర్షన్ కంటే సుమారుగా రూ.23 లక్షలు అధికంగా ఉంది.

మునుపటి కంటే ధృఢంగా

డార్క్ క్రోమ్ స్లాట్ؚలతో దీని భారీ గ్రిల్, సరికొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ SUVని తలపిస్తుంది. కొత్త వెల్ఫైర్ నాజూకైన 3-పీస్ LED హెడ్‌లైట్‌లు మరియు DRLలను పొందుతుంది, బంపర్ؚలో క్రోమ్ లిప్ మరియు ఫాగ్ ల్యాంపులను కలిగి ఉండే పెద్ద ఎయిర్ డ్యామ్ؚలతో వస్తుంది.

వెల్ఫైర్ ప్రొఫైల్ MPV-లాంటి లుక్ؚను నిలుపుకుంటూ, ప్రస్తుతం బి-పిల్లర్‌పై Z-అకారపు ఎలిమెంట్ؚను కలిగి ఉంటుంది, ఇది విండో లైన్‌పై వంపులా పని చేస్తుంది. ఈ కోణం నుండి దాని భారీ, నలుపు రంగు 19-అంగుళాల అలాయ్ వీల్స్ؚను మరియు MPV విస్తారమైన పొడవు మరియు వీల్ బేస్ؚను గమనించవచ్చు, వీటి కొలతలు వరుసగా 5.01మీ మరియు 3మీ ఉంటాయి. వెనుక వైపు, కొత్త వెల్ఫైర్ రెక్కల ఆకారంతో మరియు కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు, భారీ, నిటారైన టెయిల్‌గెట్ మరియు “వెల్ఫైర్” చిహ్నంతో వస్తుంది.

దీన్ని మూడు ఎక్స్ؚటీరియర్ రంగుల ఎంపికలో అందించనున్నారు: నలుపు, ప్రెషియస్ మెటల్ మరియు ప్లాటినం వైట్ పెర్ల్.

ఇది కూడా చదవండి: సరికొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

మెరుగైన ప్రీమియం క్యాబిన్ అనుభవం

టయోటా వెల్ఫైర్ؚ క్యాబిన్ؚకు కొద్దిపాటి మరియు మెరుగైన లేఅవుట్‌తో అందించనుంది, ఇది క్యాబిన్‌ను మరింత ప్రీమియంؚలా కనిపించేలా చేస్తుంది. ఈ MPV కొత్త వర్షన్ కాపర్ యాక్సెంట్ؚలతో 3-స్పోక్ స్టీరింగ్ వీల్ؚను కలిగి ఉంటుంది. దీని క్యాబిన్ؚను మూడు థీమ్ؚలలో పొందవచ్చు: సన్ సెట్ బ్రౌన్, బీజ్ మరియు బ్లాక్.

కొత్త వెల్ఫైర్ؚలోؚ చెప్పుకోదగిన విషయం, VIP ఎగ్జిక్యూటివ్ లాంజ్ టాప్-స్పెక్ ఫోర్-సీట్ వేరియంట్‌లోని రెండవ వరుస సీట్లు. దిని మధ్య వరుస ఒట్టోమాన్ సీట్‌లతో వస్తుంది, వీటిని బహుళ విధాలుగా సర్దుబాటు చేసుకోవచ్చు మరియు మసాజ్ ఫంక్షన్ కూడా ఉంటుంది, వెల్ఫైర్ؚ రెండవ వరుస సీట్లు మీ హైవే ప్రయాణాని సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాయి. మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి టయోటా రెండు 14-అంగుళాల రేర్ స్క్రీన్ؚలను (ప్రతి ప్రయాణీకునికి ఒకటి) కూడా అందిస్తుంది.

ఇది కూడా చదవండి: ఇప్పుడు అంబులెన్స్ؚలా కూడా అనుకూలీకరించడానికి వీలున్న టయోటా ఇన్నోవా క్రిస్టా

మరిన్ని ఫీచర్‌లు

కొత్త-జెనరేషన్ క్యాబిన్ؚలో ఆకర్షణీయంగా ఉండేది 14 అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, ఇది భారతదేశంలో టయోటా కార్ؚలో ఉన్న అతి పెద్ద సెంట్రల్ డిస్ప్లే. అందిస్తున్న ఇతర ఫీచర్‌లలో పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్-ప్యానెల్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, 60+ కనెక్టెడ్ కార్‌టెక్ ఫీచర్‌లు ఉన్నాయి. మెమరీ ఫంక్షన్ؚతో 8-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 14-రంగుల ఆంబియెంట్ లైటింగ్ మరియు 15-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ؚను కూడా పొందుతుంది.

దీని భద్రత సెట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీప్ అసిస్ట్, వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీల కెమెరా మరియు మొత్తం నాలుగు డిస్క్ బ్రేక్ؚలు ఉన్నాయి.

విజయం కోసం పెట్రోల్-హైబ్రిడ్ పవర్

భారతదేశం కోసం, టయోటా నాలుగవ-జెన్ వెల్ఫైర్ؚ‌ను e-CVTతో జోడించబడిన, 193PS పవర్ మరియు 240Nm టార్క్‌ను అందించే 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో వస్తుంది. బలమైన-హైబ్రిడ్ సెట్అప్ కారణంగా, ఇది 19.28kmpl సగటు ఇంధన సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది.

ఇది దేనితో పోటీ పడుతుంది?

కొత్త వెల్ఫైర్ؚకు ఎటువంటి ప్రత్యక్ష పోటీదారులు లేకపోయినా, ఇది భారతదేశంలో రాబోయే 2024 మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ؚతో పోటీ పడుతుంది. కొత్త టయోటా వెల్ఫైర్ؚ డెలివరీలు నవంబర్ 2023 నుండి ప్రారంభం అవుతాయి.

ఇక్కడ మరింత చదవండి: వెల్ఫైర్ ఆటోమ్యాటిక్

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 477 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టయోటా వెళ్ళఫైర్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎమ్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.10.44 - 13.73 లక్షలు*
Rs.10.52 - 19.67 లక్షలు*
Rs.2 - 2.50 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర