2023 Mercedes-Benz GLC: విడ ుదలైన 2023 మెర్సిడెస్-బెంజ్ GLC – మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
మెర్సిడెస్ జిఎల్సి కోసం tarun ద్వారా ఆగష్టు 10, 2023 07:03 pm ప్రచురించబడింది
- 51 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఎక్స్ؚటీరియర్ؚలో లుక్ పరంగా తేలికపాటి మార్పులను పొందింది, ఇంటీరియర్ؚలో అనేక మార్పులను చూడవచ్చు
భారతదేశంలో కొత్త మెర్సిడెస్-బెంజ్ GLC విక్రయాలు ప్రారంభమయ్యాయి, దీని ధరలు రూ.73.5 లక్షల నుండి రూ.74.5 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉన్నాయి. ఈ లగ్జరీ SUV లుక్ పరంగా తేలికపాటి మార్పులను, కొత్త ఫీచర్‌లను, అప్ؚడేటెడ్ పవర్ؚట్రెయిన్ؚలను పొందింది. రూ.1.5 లక్షల ముందస్తు ధరను చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు.
కొత్త GLC గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు:
వేరియంట్-వారీ ధరలు
వేరియెంట్ؚలు |
ధర |
GLC 300 |
రూ. 73.5 లక్షలు |
GLC 220D |
రూ. 74.5 లక్షలు |
కొత్త GLC ధర మునుపటి వర్షన్‌తో పోలిస్తే రూ.11 లక్షలు ఎక్కువగా ఉంది. ఇది రెండు వేరియెంట్ؚలలో లభిస్తుంది, అయితే, GLC 200 స్థానంలో కొత్త 300 వేరియెంట్‌ను అందిస్తున్నారు.
ఇప్పటికీ సుపరిచితమైన స్టైలింగ్
కొత్త మెర్సిడెస్-బెంజ్ GLC లుక్ పరంగా మునుపటి మోడల్ విధంగానే కనిపిస్తుంది. వంపు తిరిగిన గ్రిల్, తీక్షణమైన హెడ్ؚలైట్లు మరియు రీడిజైన్ చేసిన బంపర్ؚతో మరింత ఆకర్షణీయమైన లుక్‌తో వస్తుంది.
19-అంగుళాల అలాయ్ؚలు మినహా, సైడ్ ప్రొఫైల్ మునపటి మోడల్‌లో ఉన్నట్లుగానే ధృఢమైన తీరు మరియు స్లోపింగ్ రూఫ్ؚలైన్ؚతో వస్తుంది. వెనుక వైపు, కొత్త LED టెయిల్ؚలైట్లు మరియు వంపు తిరిగిన బంపర్ؚ వంటి తేలికపాటి మార్పులను మాత్రమే పొందింది.
ఖరీదైన ఇంటీరియర్ؚలు
కొత్త GLC క్యాబిన్ డిజైన్ కొత్త C-క్లాస్ నుండి ప్రేరణ పొందింది, ఇది ఆకర్షణీయమైన మరియు ఖరీదైన లుక్ కనపరుస్తుంది. ఇది డ్యూయల్-టోన్ రంగును కలిగి ఉంటుంది, మెరిసే బూడిద రంగులు దీనికి మరింత సొగసును జోడిస్తాయి. టర్బైన్-శైలిలో ఉండే AC వెంట్ؚలు కూడా కొత్తవే, ఇవి కూడా అసాధారణంగా కనిపిస్తాయి.
అధిక ఫీచర్‌లు
అప్ؚగ్రేడ్ చేసిన ముఖ్యమైన ఫీచర్‌లలో సరికొత్త పోర్ట్రైట్-శైలిలో ఉన్న 11.9-అంగుళాల MBUX-ఆధారిత టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉన్నాయి. ఈ లగ్జరీ SUV ఫీచర్‌లలో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్ؚరూఫ్, బర్మెస్టర్ 3D సౌండ్ సిస్టమ్, హీటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు మరియు 64-రంగుల ఆంబియెంట్ లైటింగ్ ఉన్నాయి.
భద్రత ఫీచర్‌లలో ఏడు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా మరియు TPMS ఉన్నాయి, ADAS ఐచ్ఛికంగా పొందవచ్చు.
స్వల్పంగా-ఎలక్ట్రిఫై చేసిన పవర్ؚట్రెయిన్ؚలు
కొత్త GLC మునపటి పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల సెట్ؚను కొనసాగిస్తుంది, ఇది ప్రస్తుతం మైల్డ్-హైబ్రిడ్ సాంకేతికతను పొందింది.
|
GLC 300 పెట్రోల్ |
GLC 220d డీజిల్ |
ఇంజన్ |
2-లీటర్ నాలుగు-సిలిండర్ |
2-లీటర్ నాలుగు-సిలిండర్ |
పవర్ (PS) |
258PS |
197PS |
టార్క్ (Nm) |
400Nm |
440Nm |
ట్రాన్స్ؚమిషన్ |
9-స్పీడ్ల AT |
9-స్పీడ్ల AT |
ఇది వివిధ డ్రైవ్ మోడ్ؚలతో మెర్సిడెస్ 4MATIC ఆల్-వీల్ డ్రైవ్ؚట్రెయిన్ؚను పొందుతుంది, ఆఫ్-రోడర్ కోసం ఒక డ్రైవ్ మోడ్ؚను కలిగి ఉంది. పెట్రోల్ వేరియెంట్ 14.7kmpl ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తుండగా, డీజిల్ 19.4kmpl వరకు అందిస్తుంది.
అప్ؚడేట్ చేసిన మెర్సిడెస్-బెంజ్ GLC శక్తివంతమైన ఆడి Q5, BMW X3 మరియు వోల్వో XC60లతో పోటీని కొనసాగిస్తుంది.
0 out of 0 found this helpful