భారతదేశంలో 2020 మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ మొదటిసారిగా మా కంటపడింది
జనవరి 23, 2020 11:49 am rohit ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫేస్ లిఫ్టెడ్ ఇగ్నిస్ కొన్ని కాస్మెటిక్ మార్పులను అనుకున్న విధంగానే కలిగి ఉంటుంది, ఇది మునుపటి మాదిరిగానే అదే ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుందని భావిస్తున్నాము
- ఆటో ఎక్స్‌పో 2020 లో మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రదర్శిస్తుందని భావిస్తున్నాము.
- ఇది ఎస్-ప్రెస్సో లాంటి ఫ్రంట్ ఎండ్ ను పొందుతుంది.
- ఇది BS6-కంప్లైంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో అందించబడుతుంది.
- ఫేస్‌లిఫ్టెడ్ ఇగ్నిస్ రాబోయే XL 5 తో పాటు నెక్సా షోరూమ్ ల ద్వారా అమ్మకాలు చేయబడుతుందని భావిస్తున్నాము.
కొంతకాలం క్రితం, ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్ యొక్క కొన్ని చిత్రాలు ఆన్‌లైన్ లో కనిపించాయి, ఇది ఎస్-ప్రెస్సో లాంటి ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇప్పుడు భారతదేశంలో రహస్యంగా మా కంటపడింది మరియు రాబోయే 2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడి ప్రారంభించబడుతుందని భావిస్తున్నాము.
ఈ అప్‌డేట్ మారుతి యొక్క కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ యొక్క వెలుపలి భాగంలో చిన్న డిజైన్ మార్పులను తెస్తుంది. దీనిలో భాగంగా ఎస్-ప్రెస్సోలో కనిపించే విధంగా U- ఆకారపు క్రోమ్ ఇన్సర్ట్‌లతో తిరిగి డిజైన్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ ని పొందుతుంది.
ఫేస్‌లిఫ్టెడ్ ఇగ్నిస్ అదే BS6-కంప్లైంట్ 1.2-లీటర్ పెట్రోల్ యూనిట్ చేత పవర్ ని అందుకుంటుంది, ఇది 83 Ps గరిష్ట పవర్ మరియు 113Nm పీక్ టార్క్ ని అందిస్తుంది. ట్రాన్స్మిషన్ ఎంపికలు కూడా అలాగే ఉంటాయి: 5-స్పీడ్ మాన్యువల్ మరియు స్విఫ్ట్ లాగా 5-స్పీడ్ AMT.
మారుతి ఇగ్నిస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఇతర సౌకర్య లక్షణాలతో పాటు కొత్త అప్‌హోల్‌స్టరీని కూడా అందిస్తుందని భావిస్తున్నాము. ఇది EBD తో ABS, రియర్ పార్కింగ్ సెన్సార్లు, కో-డ్రైవర్ సీట్‌బెల్ట్ రిమైండర్ మరియు అన్ని వేరియంట్లలో హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్ తో సహా ప్రామాణిక భద్రతా లక్షణాలతో ఫేస్‌లిఫ్టెడ్ ఇగ్నిస్ ను అందిస్తూనే ఉంటుంది.
ఇదిలా ఉండగా, మారుతి సంస్థ వాగన్ ఆర్ యొక్క ప్రీమియం వెర్షన్ XL 5 కోసం పనిచేస్తోంది. అదే ధర పరిధిలో ఇగ్నిస్ మాదిరిగానే ఇది నెక్సా షోరూమ్‌ల ద్వారా విక్రయించబడే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్టెడ్ ఇగ్నిస్ ఆటో ఎక్స్‌పో 2020 లో ప్రస్తుత ఇగ్నిస్ తో పోలిస్తే కొంచెం ప్రీమియంతో (రూ. 4.74 లక్షల నుంచి రూ .7.09 లక్షలు(ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ) విడుదల కానుంది. దీని ముఖ్య ప్రత్యర్థులు మారుతి వాగన్ ఆర్ మరియు సెలెరియో, టాటా టియాగో, హ్యుందాయ్ సాంట్రో మరియు డాట్సన్ GO
మరింత చదవండి: మారుతి ఇగ్నిస్ AMT
0 out of 0 found this helpful