2020 లో రానున్నమహీంద్రా స్కార్పియో ఇంటీరియర్ మా కంటపడింది
నవంబర్ 27, 2019 03:28 pm sonny ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రసిద్ధ మహీంద్రా సమర్పణలో కొత్త BS6 డీజిల్ ఇంజన్ లభిస్తుందని భావిస్తున్నాము
- నవీకరించబడిన స్కార్పియో 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడే అవకాశం ఉంది.
- ప్రస్తుత 2.5-లీటర్ మరియు 2.2-లీటర్ డీజిల్ యూనిట్ల స్థానంలో కొత్త BS6 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ లభిస్తుందని భావిస్తున్నా ము.
- రాబోయే థార్ మాదిరిగా, కొత్త స్కార్పియో కు పెట్రోల్ ఇంజన్ ఎంపిక కూడా లభిస్తుంది.
- డాష్ కన్సోల్ లేఅవుట్ అలాంటి డయిల్స్ నే ఉపయోగిస్తుంది, అయితే స్క్రీన్ కొద్దిగా పైకి తరలించబడి, సెంట్రల్ ACవెంట్స్ తో ఉంటుంది.
- కొత్త స్కార్పియో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎక్కువ ప్రీమియం క్యాబిన్ ఫినిషింగ్ ని పొందవచ్చు.
మహీంద్రా స్కార్పియో 2020 లో అప్‌డేట్ కానుంది మరియు ఫిబ్రవరిలో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ప్రవేశిస్తుంది. కొత్త స్కార్పియో టెస్టింగ్ కి గురవుతూ చుట్టూరా కవరింగ్ తో మా కంటపడింది మరియు మేము దాని ఇంటీరియర్‌లను కూడా పరిశీలించాము.
కొత్త స్కార్పియో క్యాబిన్ కూడా కవర్ చేయబడింది, కాని సెంట్రల్ కన్సోల్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి కొన్ని అంశాలు మాకు బాగా స్పష్టంగా కనిపించాయి. డయల్స్ ప్రస్తుత మోడల్ మాదిరిగానే కనిపిస్తాయి, కాని స్క్రీన్ ఇప్పుడు డాష్ లో మరింత అనువైన స్థానానికి తరలించబడింది మరియు సెంట్రల్ AC వెంట్స్ ఇప్పుడు ఇరువైపులా ఉంచబడ్డాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే ని 8 అంగుళాల యూనిట్ కు అప్‌గ్రేడ్ చేయవచ్చు. మహీంద్రా కొత్త స్కార్పియో యొక్క డాష్‌బోర్డ్ కోసం డ్యూయల్-టోన్ ఎంపికతో సహా మరింత ఖరీదైన ఫినిషింగ్ ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇది పరిమాణంలో కూడా పెరుగుతుందని భావిస్తున్నారు మరియు తాజా భద్రతా నిబంధనలకు అనుగుణంగా మూడవ వరుస సీట్లు నిలిపివేయబడతాయి.
దీనిలో ఉన్నప్రస్తుత శ్రేణి 2.2-లీటర్ మరియు 2.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లను కూడా మహీంద్రా భర్తీ చేయనుంది. కొత్త స్కార్పియో సెకండ్-జెన్ XUV 500 కి పవర్ ని అందిస్తున్న కొత్త 2.0-లీటర్ BS6 డీజిల్ ఇంజిన్ ను పొందుతుంది. SUV తన కొత్త అవతారంలో పెట్రోల్ ఇంజిన్ ను కూడా పొందుతుంది. వాస్తవానికి, ఇది కొత్త థార్ కు పవర్ ని అందించే 2.0 లీటర్ యూనిట్ కావచ్చు.
ఇవి కూడా చదవండి: కొత్త 2020 మహీంద్రా XUV 500 2.0L పెట్రోల్, డీజిల్ ఇంజిన్ పొందవచ్చు
2020 మహీంద్రా స్కార్పియో ప్రస్తుత రూ .10 లక్షల నుంచి ప్రారంభమయ్యే అదే ధరలో ఉండే అవకాశం ఉంది. మారుతి S-క్రాస్, రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ కిక్స్, హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ లకు ఇది ప్రత్యర్థిగా కొనసాగుతుంది. మహీంద్రా 2020 మొదటి అర్ధభాగంలో కొత్త స్కార్పియోను విడుదల చేసే అవకాశం ఉంది.
మరింత చదవండి: మహీంద్రా స్కార్పియో డీజిల్