2019 మారుతి సుజుకి ఆల్టో వేరియంట్స్ వివరణ: Std, LXi & VXi
మారుతి ఆల్టో 800 కోసం sonny ద్వారా మే 15, 2019 12:24 pm ప్రచురించబడింది
- 59 Views
- ఒక వ్య ాఖ్యను వ్రాయండి
ఆల్టో ఎక్కువ భద్రతా లక్షణాలు మరియు సౌకర్యాలతో నవీకరించబడింది. వీటిలో ఏ వేరియంట్ మీకు సరిగ్గా సరిపోతుంది?
మారుతి సుజుకి తన ఉత్తమ-అమ్ముడైన హాచ్బాక్ ఆల్టో కి నవీకరించిన 2019 వెర్షన్ ని విడుదల చేసింది. దీనికి సరికొత్త భద్రతా లక్షణాలు ఒక సాధారణ లక్షణంగా మునుపటి కంటే కూడా అందించడం జరిగింది మరియు ఆ పైన ఉన్న బాడీ కి కూడా కొత్త భద్రత మరియు క్రాష్ పరీక్ష నిబంధనలకు అనుగుణంగా అధనపు వర్క్ చేసి అందించడం జరిగింది. ఏప్రిల్ 2020 లో వచ్చే BS6 నిబంధనలకు మీట్ అయ్యే విధంగా 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని ఇప్పటికే అప్గ్రేడ్ చేశారు. అయితే, 2019 ఆల్టో కోసం ప్రస్తుతం CNG వేరియంట్ లేదు.
ఈ నవీకరణలు అన్ని వేరియంట్లలో ఆల్టో యొక్క ధరను కొంచెం పెంచాయి. కానీ ఏ వేరియంట్ డబ్బు కోసం మంచి విలువను అందిస్తుంది? మేము కనుగొంటాము:
రంగు ఎంపికలు
- అప్టౌన్ ఎరుపు (కొత్త)
- మోజిటో గ్రీన్
- సెరొలీన్ బ్లూ
- సుపీరియర్ వైట్
- సిల్కీ సిల్వర్
- .గ్రానైట్ గ్రే
గమనిక: తెలుపు మరియు సిల్వర్ రంగు ఎంపికలు ప్రవేశ-స్థాయి Std మరియు Std (O) వేరియంట్లలో మాత్రమే లభిస్తాయి. అంతేకాక,తెలుపు రంగు నాన్-మెటాలిక్ ఫినిష్ అని చెప్పవచ్చు.
ప్రామాణిక భద్రతా లక్షణాలు
- డ్రైవర్ ఎయిర్బాగ్
- రివర్స్ పార్కింగ్ సెన్సార్
- EBD తో ABS
- డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల సీట్‌బెల్ట్ రిమైండర్
- స్పీడ్ హెచ్చరిక
గమనిక: ప్రస్తావించబడిన అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ.
2019 మారుతి సుజుకి ఆల్టో Std: బేర్‌బోన్స్ వేరియంట్ అని మాత్రమే చెప్పవచ్చు; ఎందుకంటే విభాగంలో ఈ ఒక్క కారు మాత్రమే బేస్ వేరియంట్ లో ఆప్ష్నల్ ప్యాసింజర్ ఎయిర్బాగ్ ని కలిగి ఉంది
ధర |
|
Std |
రూ. 2.94 లక్షలు |
STD (O) (ప్రయాణీకుల ఎయిర్బాగ్ ని జతచేస్తుంది) |
రూ. 2.97 లక్షలు (+రూ. 3000) |
లక్షణాల
బాహ్య భాగాలు: వీల్స్ కోసం సెంటర్ క్యాప్స్.
లోపల భాగాలు: డ్యుయల్ టోన్ ఇంటీరియర్ (నలుపు మరియు లేత గోధుమరంగు), వినైల్ సీటు అప్హోల్స్టరీ
సౌకర్యాలు: డ్రైవర్ వైపు సన్ విజర్, ముందు మరియు వెనుక బాటిల్ హోల్డర్స్ వంటి సౌకర్యపు లక్షణాలు ఉన్నాయి.
ఆడియో: అందుబాటులో లేదు.
మీరు ఇంకొకటి కొనుగోలు చేయాలా?
ఇది ఆల్టో రూపంలో ఉన్న కారు మాత్రమే, మీరు అధనపు డబ్బు ఏమీ కూడా పెట్టాలి అని అనుకోకపొతేనే ఇది తీసుకోండి. లేకపోతే మేము అయితే అస్సలు ఈ వేరియంట్ ని సిఫార్సు చేయము, ఎందుకంటే A.C లేదా పవర్ స్టీరింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం వలన మేము దీనిని ఎంచుకోమని అయితే అనము. ఇది పిల్లలకు కూడా అంత స్నేహపూర్వకంగా ఉండదు, ఎందుకంటే దీనిలో వెనుక డోర్స్ కోసం చైల్డ్ లాక్ ఫీచర్ అనేది లేదు. అంతేకాకుండా, వెనుక సీట్లు ELR (అత్యవసర లాకింగ్ రెట్రాక్టర్) సీటుబెల్ట్స్ ని పొందడం లేదు.
కొత్త ఆల్టో యొక్క బేస్-స్పెక్స్ వేరియంట్ యొక్క ధర రెనాల్ట్ క్విడ్ మరియు డాట్సన్ రెడ్డి-GO వంటి ప్రత్యర్థుల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ ఇది మాత్రమే ముందు ప్రయాణీకులకు ఎయిర్బ్యాగ్ ఎంపికను అందిస్తుంది మరియు Std (O) వేరియంట్ ని మాత్రమే కార్దేఖో సిఫార్సు చేస్తుంది.
2019 మారుతి సుజుకి ఆల్టో LXi: అత్యంత ప్రాథమిక అవసరాలను తీరుస్తుంది; పెరిగిన డబ్బు కోసం విలువైనదిగా ఉంటుంది
ధర |
|
LXi |
రూ. 3.50 లక్షలు |
LXi (O) (ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్) |
రూ. 3.55 లక్షలు (+ రూ .5000) |
Std పై ధర/ Std (O) |
రూ. 56,000 / రూ. 53,000 |
ఫీచర్స్ (Std పై అధనంగా ఉండే లక్షణాలు)
శరీర రంగు బంపర్స్ మరియు డోర్ హ్యాండిల్స్, మరియు ఫుల్ వీల్ కవర్లు.
లోపల భాగాలు: ఫ్యాబ్రిక్ మరియు వినైల్ కాంబో అప్హోల్స్టరీ, స్టీరింగ్ వీల్ మీద సిల్వర్ చేరికలు, వెంట్స్ మరియు డోర్ హ్యాండిల్స్.
సౌకర్యాలు: A.C, పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఇంటిగ్రేటెడ్ వెనుక సీట్ హెడ్ రెస్ట్, ఫ్రంట్ ప్యాసింజర్ సన్ విజర్, రిమోట్ బూట్ లిడ్ ఓపెనర్ మరియు ఇంటర్మిటెంట్ ఫంక్షనాలిటీ తో ముందు వైపర్ వంటి సౌకర్య లక్షణాలు అందించడం జరిగింది.
ఆడియో: అందుబాటులో లేదు
భద్రత: వెనుక డోర్స్ కోసం చైల్డ్ లాక్, వెనుక ELR సీట్‌బెల్ట్స్ వంటి భద్రత లక్షణాలు దీనిలో ఉన్నాయి.
మీరు దీనిని కొనవచ్చా?
ఈ మిడ్-స్పెక్ వేరియంట్ అనేది చాలా ఎక్కువ లక్షణాలను కలిగి ఉంది మరియు దీని ధర ముందు దాని కంటే రూ .50,000 ఎక్కువగా ఉంటుంది. అయితే, అదనపు సౌకర్యాలు ఖచ్చితంగా విలువైనవిగా ఉంటాయి మరియు సౌందర్య లక్షణాలు అనేవి బోనస్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఈ బేస్-స్పెక్ వేరియంట్ కంటే ఈ ప్రీమియం అనేది మనం అర్ధం చేసుకోవచ్చు, దీనిలో ఎందుకంటే అంతర్గతంగా సర్దుబాటు చేయగల ORVMs మరియు బ్లూటూత్-ఎనేబుల్ ఆడియో సిస్టమ్ ఇంకా వచ్చి ఉండి ఉంటే అధనంగా ప్రశంసలు అందుకొనే వారు.
మీరు తర్వాత మూడవ పార్టీ ఆడియో సిస్టమ్ ని తరువాత కొనుగోలు చేయడానికి ప్రణాళికలు వేసి ఉంటే గనుక ఈ వేరియంట్ అనేది చాలా ప్రాథమిక అవసరాలు తీర్చడానికి సరిపోతుందని చెప్పవచ్చు. ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ కూడా మీరు ఎంచుకున్నట్లయితే LXI (O) వేరియంట్ అనేది కార్దేఖో సిఫార్సు వేరియంట్ గా ఉంటుంది.
2019 మారుతి సుజుకి ఆల్టో VXi: పూర్తిగా లక్షణాలతో లోడ్ చేయబడి ఉంది, ప్రీమియం వైపు కొద్దిగా ధరని కలిగి ఉంది.
ధర |
|
VXi |
రూ. 3.72 లక్షలు |
LXi / LXi (O) పై ధర |
రూ. 22,000 / రూ. 17,00 |
ఫీచర్స్ (LXi మీద అధనంగా ఉండే లక్షణాలు)
బాహ్య భాగాలు: బాడీ సైడ్ మౌల్డింగ్
లోపల భాగాలు: సెంటర్ కన్సోల్ మీద సిల్వర్ యాక్సెంట్
సౌకర్యాలు: సెంట్రల్ డోర్ లాక్, కీలేస్ ఎంట్రీ, యాక్సేసరి సాకెట్, వెనుక పార్సెల్ ట్రే మరియు అంతర్గతంగా సర్దుబాటు చేయగల ORVM లు వంటి సౌకర్య లక్షణాలు ఉన్నాయి.
ఆడియో: USB తో ఆడియో వ్యవస్థ, ఆక్స్-ఇన్, రేడియో మరియు బ్లూటూత్ కనెక్టివిటీ తో రెండు ఫ్రంట్ స్పీకర్స్.
భద్రత: ఫ్రంట్ ప్యాసెంజర్ ఎయిర్బాగ్
మీరు దీనిని కొనవచ్చా?
ఇది 2019 ఆల్టో యొక్క టాప్ స్పెక్ వేరియంట్ మరియు ఇది కొద్దిగా ఎక్కువ ధర కలిగి ఉంటుందనే చెప్పాలి. ఈ జోడించిన లక్షణాలు మరియు ఆడియో వ్యవస్థ ఇప్పటికీ పోటీలో తక్కువగా వస్తాయి. ఉదాహరణకు, రెనాల్ట్ క్విడ్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మద్దతుతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని అందిస్తుంది.