Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2019 ఫోర్డ్ ఎండీవర్ ఓల్డ్ వర్సెస్ న్యూ: ప్రధానంగా కనబడే తేడాలు

ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం dinesh ద్వారా మార్చి 25, 2019 11:49 am ప్రచురించబడింది
  • పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు పవర్డ్ సహ డ్రైవర్ సీటు వంటి కొన్ని కొత్త ఫీచర్లను పొందుతుంది
  • అవుట్గోయింగ్ మోడల్ కంటే తక్కువ ధర.
  • దిగువ శ్రేణి ట్రెండ్ వేరియంట్ నిలిపివేయబడింది; టైటానియం మరియు టైటానియంలలో మాత్రమే అందుబాటులో ఉంది.

ఫోర్డ్ సంస్థ, భారతదేశంలో 2019 ఎండీవర్ను ప్రారంభించింది మరియు పాత వెర్షన్ నుండి కొత్త ఎండీవర్ ఎలా భిన్నంగా ఉండబోతుందో తెలుసుకుందాం.

ఎక్స్టీరియర్

ఎక్స్టిరియర్స్ కు చిన్న నవీకరణ మాత్రమే అందించబడింది, కొత్త వెర్షన్ లో సౌందర్య మార్పులను సులభంగా కోల్పోయే రకం. ముందు భాగం విషయానికి వస్తే, కొత్త ఎండీవర్ ఒక మార్పు చేయబడిన గ్రిల్ తో వస్తుంది. ఇది పాత మోడల్ లో కనిపించే రెండు మందపాటికి బదులుగా మూడు సన్నగా హారిజాంటల్ స్లాట్లను కలిగి ఉంటుంది. హెడ్ లాంప్స్ మొత్తం ఆకారం ముందు దాని వలే అలాగే కొనసాగుతుంది కాకపోతే అధనంగా ఇప్పుడు స్మోక్డ్ ప్రభావం అందించబడుతుంది. మొత్తం బంపర్ కూడా కొద్దిగా మార్పు చేయబడింది, కాకపోతే మొత్తం లేఅవుట్ ఒకేలా ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ మరియు వెనుక ప్రొఫైల్ విషయానికి వస్తే, ఈ ఎస్యువి కి ఎటువంటి మార్పులు లేవు కాకపోతే కొత్తదానిలో ఒక కొత్త 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఎల్ ఈడి ఇన్సర్ట్ లతో కూడిన టైల్ ల్యాంప్లు అందించబడతాయి.

నవీకరణతో, ఫోర్డ్ ఎండీవర్లో ఒక కొత్త వెలుపలి రంగు ప్రవేశపెట్టింది. దానిని డీఫ్యూస్డ్ సిల్వర్ అని పిలుస్తారు, ఇది అవుట్గోయింగ్ మోడల్లో స్మోక్ గ్రే రంగుని భర్తీ చేస్తుంది. ఇతర రంగు ఎంపికల విషయానికి వస్తే, అబ్సల్యూట్ బ్లాక్, డైమండ్ వైట్, మూండస్ట్ సిల్వర్ మరియు సన్సెట్ రెడ్ వంటివి అలాగే కొనసాగుతున్నాయి.

ఇంటీరియర్ ఫీచర్స్

అవుట్గోయింగ్ మోడల్లో కాబిన్ లేఅవుట్ అదే విధంగా కొనసాగుతుంది, లోపలి క్యాబిన్- అవుట్గోయింగ్ మోడల్లో ఉన్న గోధుమ, నలుపు మరియు లేత గోధుమ రంగు - త్రివర్ణ సమ్మేళనం బదులుగా ఇది ద్వంద్వ- టోన్ (బ్లాక్-బీజ్) ఫినిషింగ్ ను పొందుతుంది.

కొత్త ఎండీవర్, నవీకరించబడిన లక్షణాల జాబితాను కూడా పొందుతుంది. అవి వరుసగా, ఆపిల్ కార్పెలే మరియు ఆండ్రాయిడ్ ఆటో లకు మద్దతిచ్చే 8- అంగుళాల సింక్రనైజ్ 3 టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, హ్యాండ్స్ ఫ్రీ పార్కింగ్, పవర్డ్ డ్రైవర్ సీటు, పనరోమిక్ సన్రూఫ్, సెమీ- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 7 ఎయిర్బాగ్స్ వంటి అంశాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఎండీవర్, అదనంగా పుష్ బటన్ స్టార్ట్ మరియు పవర్డ్ సహ డ్రైవర్ సీటు వంటి ఫీచర్లను పొందుతుంది.

వేరియంట్లు

నవీకరణతో, ఫోర్డ్ సంస్థ- ఫ్లాగ్ షిప్ ఎస్యువి యొక్క వేరియంట్ శ్రేణిని కూడా నవీకరించింది. ముందు వేరియంట్- ట్రైండ్, టైటానియం మరియు టైటానియం + వంటి మూడు వేరియంట్ లతో కొనసాగుతుంటుండగా - కొత్త ఎండీవర్ రెండు రకాలైన వేరియంట్ లను మాత్రమే కలిగి ఉంది: అవి వరుసగా టైటానియం మరియు టైటానియం +.

ఇంజిన్

నవీకరించబడిన ఎండీవర్, ముందు వెర్షన్ వలే అదే 2.2 లీటర్ మరియు 3.2 లీటర్ డీజిల్ ఇంజిన్ లతో కొనసాగుతుంది. చిన్న ఇంజన్ అయిన 2.2 లీటర్ విషయానికి వస్తే గరిష్టంగా 160 పిఎస్ శక్తిని మరియు 385 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు పెద్ద యూనిట్ అయిన 3.2 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, గరిష్టంగా 200 పిఎస్ పవర్ ను మరియు 470 ఎన్ ఎం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తాయి. అయితే, నవీకరణతో కూడిన ఫోర్డ్, 6- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ను మళ్లీ ప్రవేశపెట్టింది, అయితే ముందు ఇది - 2.2- లీటరు డీజిల్ ఇంజిన్కు మాత్రమే ఇది పరిమితం చేయబడింది.

ఫోర్డ్ ఎండీవర్ 2019: చిత్రాలలో

ధర

ఓల్డ్ ఫోర్డ్ ఎండీవర్ (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ)

న్యూ ఫోర్డ్ ఎండీవర్

2.2 ఎల్ 4X2 ట్రెండ్ - రూ 26.83 లక్షలు (చివరిగా అందుబాటులో ఉన్నప్పుడు, తరువాత నిలిపివేయబడింది)

2.2 ఎల్ టైటానియం ఎంటి - రూ 28.19 లక్షలు

2.2 ఎల్ 4X2 టైటానియం - రూ 31.07 లక్షలు

2.2 ఎల్ టైటానియం ఏటి - రూ 30.60 లక్షలు

3.2 ఎల్ 4X4 టైటానియం- రూ 33.31 లక్షలు

3.2 ఎల్ టైటానియం + ఏటి - రూ 32.97 లక్షలు

ఇవి కూడా చదవండి: ఫోర్డ్- వోక్స్వాగన్ అలియన్స్: తదుపరి- తరం ఎండీవర్ పికప్- ఒక వోక్స్వాగన్ కజిన్ పొందుతుంది

ఫోర్డ్ ఎండీవర్ ఆటోమేటిక్ గురించి మరింత చదవండి

d
ద్వారా ప్రచురించబడినది

dinesh

  • 16 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన ఫోర్డ్ ఎండీవర్ 2015-2020

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర