2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ లు ప్రారంభించబడ్డాయి; బుకింగ్స్ ఓపెన్
ల్యాండ్ రోవర్ పరిధి rover 2014-2022 కోసం dinesh ద్వారా మార్చి 18, 2019 09:34 am ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ల్యాండ్ రోవర్, 2018 మోడల్స్ రేంజ్ రోవర్ అండ్ రేంజ్ రోవర్ స్పోర్ట్ లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సంస్థ దేశంలో ఉన్న తన 27 డీలర్షిప్లన్నింటికీ 2018 మోడల్ ఫ్లాగ్షిప్ ఎస్యూవిల కోసం కూడా బుకింగ్లను ప్రారంభించింది. 2018 రేంజ్ రోవర్ ధర రూ. 1.74 కోట్లు నుంచి రూ. 2.41 కోట్లు (లాంగ్ వీల్బేస్ వెర్షన్లతో సహా), 2018 రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రూ. 99.48 లక్షల నుంచి రూ. 1.72 కోట్లు (అన్ని ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) తో అందుబాటులో ఉన్నాయి. టయోటా ల్యాండ్ క్రూయిజర్, మెర్సిడెస్- బెంజ్ జిఎల్ఎస్ మరియు మసేరటి లెవాంటె వంటి కార్లు రూ. 1 కోటి రూపాయల నుండి రూ. 2.5 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి.
-
సంబంధిత: రేంజ్ రోవర్ ఎవోక్యూ కన్వర్టిబుల్స్ భారతదేశం లో ప్రారంభించబడింది
-
2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ వాహనాలు అందుకున్న నవీకరణల జాబితా ఇక్కడ ఇవ్వబడింది:
-
పిక్సెల్-లేజర్ ఎల్ఈడి హెడ్లైట్లు, రోడ్లపై 500 మీటర్ల వరకు లైటింగ్ ను అందించే సామర్ద్యాన్ని కలిగి ఉంటాయి
-
పాత నమూనాలో కనిపించే ట్రిపుల్- స్లాట్ గ్రిల్కు బదులుగా న్యూ అట్లాస్ మెష్ గ్రిల్
-
వేలార్ లో అందించబడిన టచ్ ప్రో డుయో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
-
పవర్ డీప్లైబుల్ రేర్ సెంటర్ కన్సోల్ - మధ్య ప్రయాణీకుడి సీటు స్వయంచాలకంగా ఒక బటన్ యొక్క టచ్ తో డౌన్ ఫోల్డ్ సౌకర్యం
-
'హాట్- స్టోన్' మసాజ్ ఫంక్షన్ తో హీటెడ్ సీట్లు
-
మానవీయంగా సర్దుబాటుచేసే గెస్చర్ కంట్రోల్ సన్ బ్లైండ్లు
-
క్యూ అసిస్ట్ తో అనుకూల క్రూజ్ నియంత్రణ
2018 రేంజ్ రోవర్ మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ వాహనాలు ఇంతకుముందు వలే రెండు డీజిల్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్ లతో కొనుగోలుదారులకు నాలుగు ఇంజిన్ ఎంపికలను అందిస్తున్నాయి. ఈ ఇంజిన్లు, అవుట్గోయింగ్ నమూనాల కంటే గరిష్ట పవర్ ను అలాగే అత్యధిక టార్క్ లను ఉత్పత్తి చేయడానికి మార్పు చేయబడ్డాయి.
ఇంజిన్ |
3.0 లీటర్ టిడివి6 డీజిల్ |
4.4 లీటర్ ఎస్డివి8 డీజిల్ |
3.0 లీటర్ వి6 సూపర్ఛార్జ్డ్ పెట్రోల్ |
5.0 లీటర్ వి8 సూపర్ఛార్జ్డ్ పెట్రోల్ |
పవర్ |
258 పిఎస్ |
340 పిఎస్ |
340 పిఎస్ |
524 పిఎస్ |
టార్క్ |
600 ఎన్ ఎం |
740 ఎన్ ఎం |
450 ఎన్ ఎం |
625 ఎన్ ఎం |
ట్రాన్స్మిషన్ |
8- స్పీడ్ ఆటోమేటిక్ |
8- స్పీడ్ ఆటోమేటిక్ |
8- స్పీడ్ ఆటోమేటిక్ |
8- స్పీడ్ ఆటోమేటిక్ |
ఇటీవలే, ల్యాండ్ రోవర్ 2018 ఏప్రిల్ 13, 2018 నాటికి 'అబౌవ్ అండ్ బియాండ్ టూర్' పర్యటన యొక్క 2018 ఎడిషన్ను ప్రారంభించింది. దీని కింద, ఎంపికచేయబడిన 12 నగరాల్లో బ్రిటీష్ మార్క్యూ యజమానులు మరియు కాబోయే కొనుగోలుదారులు అనుమతిస్తుంది. భారతదేశం అంతటా, ఎలాంటి భూభాగంపై అయినా మంచి పనితీరును అందించే ఎవాక్ మరియు డిస్కవరీ స్పోర్ట్ ఎస్యువి కార్ల అనుభూతిని ఆస్వాదించండి.
ఇవి కూడా చదవండి: జాగ్వార్ ల్యాండ్ రోవర్ 2020 నాటికి అన్ని కార్లకు ఎలక్ట్రిఫైడ్ ఆప్షన్లను అందించబోతుంది
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోమేటిక్ గురించి మరింత సమాచారం చదవండి