• English
  • Login / Register

2018 మారుతి విటారా బ్రజ్జా AMT: మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం khan mohd. ద్వారా ఏప్రిల్ 18, 2019 02:09 pm ప్రచురించబడింది

  • 23 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Maruti Vitara Brezza

మారుతి సుజుకి విటారా బ్రెజ్జా దాని అన్ని వేరియంట్స్ లో చిన్న చిన్న సౌందర్య మార్పులతో మరియు అధనపు భద్రతా లక్షణాలను కలిగి ఉంది(ఇక్కడ మరిన్ని వివరాలు). అయితే, కాంపాక్ట్ SUV  నవీకరణ యొక్క అతిపెద్ద హైలైట్ ఆటోమెటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ని డీజిల్ ఇంజన్ తో (AMT) చేర్చడం.

1. AMT అన్నివేరియంట్స్ లో కానీ L లో లేదు:

ఆల్టో K10, వాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ మరియు ఇగ్నిస్ వంటి కార్లకి మారుతి సుజుకి సంస్థ ఒక AMT ని చురుకుగా జతచేసింది.అయితే, కార్ల తయారీదారు ఈ కార్ల బేస్ వేరియంట్స్ ఎప్పుడూ ఎన్నడూ దీనిని అందించలేదు మరియు అదే 2018 బ్రెజ్జా లో కూడా జరిగింది. AMT బ్రెజ్జా లో L వేరియంట్ కి తప్ప మిగతా అన్ని వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.

Maruti Vitara Brezza AMT Gearbox

2. DDiS200 తో మొదటి AMT:

మారుతి సుజుకి తన 1.3-లీటర్ డీజిల్ ఇంజిన్ ను ఇగ్నిస్ నుండి S-క్రాస్ వరకు దాని మొత్తం పోర్ట్పోలియో అందిస్తుంది,ఈ రెండిటి పవర్ అవుట్పుట్స్ వరుసగా: 75Ps మరియు 90Ps. తక్కువ పవర్ అవుట్పుట్ ఉన్నది DDiS190 గా సూచిస్తారు, అయితే అధిక అవుట్పుట్ వెర్షన్ ని DDiS200 గా సూచిస్తారు.

ఇప్పటి వరకు, మారుతి సుజుకి  DDiS190 లో మాత్రమే AMT తో  జత చేయబడింది. కానీ DDiS200 తో AMT ను పొందుతున్న మొదటి మారుతి కారు బ్రెజ్జా. మరోవైపు మాకు సియాజ్,ఎర్టిగా, S-క్రాస్ లో కూడా AMT కావాలనిపిస్తుంది. మరోవైపు మారుతి సుజుకి సంస్థ ఒక కొత్త 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను అభివృద్ధి చేస్తుందని మేము తెలుసుకుంటున్నాం. ఇది కేవలం 2018 లో దాని కార్లలో  ఏదో ఒక దాని హుడ్ కిందకు తీసుకువెళుతుంది(రెండో-తరం ఎర్టిగా లేదా సియాజ్ ఫేస్లిఫ్ట్).

బ్రీజా కోసం మాత్రమే మారుతి DDiS200-AMT కలయికను కలిగి ఉందా లేదా ఇతర కార్లలో కూడా దాన్ని తయారు చేసేందుకు యోచిస్తోందా అనేది చూడాలి.

3. అరెంజ్ రంగు బాహ్య రూపం:

Maruti Vitara Brezza

కాంపాక్ట్ SUV ఇప్పుడు కొత్త ఆరెంజ్ రంగు షేడ్ ను పొందుతుంది.'ఆటం ఆరెంజ్' గా పిలువబడుతుంది మరియు నిర్మాణంలో డ్యూయల్ టోన్ కలయిక అలాగే తెల్లటి రూఫ్ తో లభిస్తుంది. అంతేకాక, బ్రెజ్జా యొక్క శ్రేణి నుండి మారుతి సుజుకి నీలిరంగు రంగును తొలగించింది. టాటా తన AMT వెర్షన్ ను ప్రారంభించినప్పుడు నెక్సా లో ఒక నారింజ వెలుపలి రంగును ప్రవేశపెట్టింది ఇది ఇక్కడ గమనించదగ్గ విషయం.

4. బ్లాక్ అలాయ్స్ & నలుపు ఇంటీరియర్:

విటారా బ్రజ్జా యొక్క టాప్-ఎండ్ Z / Z + వైవిధ్యాలలో గ్రే రంగు మిశ్రమాలు, నలుపు రంగులతో మార్చబడ్డాయి. అంతేకాకుండా, బ్రెజ్జా ఇప్పుడు అన్ని వేరియంట్స్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ ను ప్రామాణికంగా పొందుతుంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కూడా నల్లని అలాయ్ వీల్స్ కలిగిన ఒక కొత్త S-వేరియంట్ ని త్వరలో పొందనున్నది అనేది గమనించదగ్గ విషయం.

5. అన్ని ప్రాథమిక భద్రతా లక్షణాలు:

కొత్త విటారా బ్రజ్జాలో అతిపెద్ద మార్పు ప్రాథమిక భద్రతా లక్షణాలు ప్రామాణీకరణంగా కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, ISOFIX చైల్డ్ సీటు మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు,హై స్పీడ్ వార్నింగ్ అలర్ట్ మరియు ఫ్రంట్ సీటు ప్రీ టెన్షనర్స్ మరియు ఫోర్స్ లిమిటర్స్ ఇప్పుడు బేస్ వేరియంట్ నుండి అందించబడుతున్నాయి.

 

was this article helpful ?

Write your Comment on Maruti Vitara బ్రెజ్జా 2016-2020

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience