2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 వెర్సస్ మారుతి బాలెనో : సివిటి ఆటోమాటిక్ వేరియంట్ల పోలికలు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం khan mohd. ద్వారా ఏప్రిల్ 22, 2019 10:27 am ప్రచురించబడింది

  • 22 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2018 Hyundai Elite i20 vs Maruti Baleno: CVT Automatic Variants Comparison

హ్యుందాయ్ ఇటీవలే ఎలైట్ ఐ 20 ఫేస్లిఫ్ట్ కోసం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను ప్రవేశపెట్టింది. 2018 ఆటో ఎక్స్పోలో ఎలైట్ ఐ 20 ఫేస్లిఫ్ట్ను ప్రారంభించినప్పటికీ, ఇప్పటి వరకూ పెట్రోలు మరియు డీజిల్ ఇంజిన్లు మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో మాత్రమే లభ్యమయ్యాయి.

ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్పేస్ లో ఎలైట్ ఐ 20 ప్రత్యర్థి గా నిలబడింది, మారుతి బాలెనో కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో ఒక సివిటి ఎంపికను అందిస్తుంది. ఈ రెండు కార్లు, వాటి సివిటి వెర్షన్ లలో, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఎలా పోటీ పడతాయో చూద్దాం.

కొలతలు

 

మారుతి బాలెనో

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20

పొడవు

3995 మీమీ

3985 మీమీ

వెడల్పు

1745 మీమీ

1734 మీమీ

ఎత్తు

1510 మీమీ

1505 మీమీ

వీల్బేస్

2520 మీమీ

2570 మీమీ

గ్రౌండ్ క్లియరెన్స్

170 మీమీ

170 మీమీ

బూట్ స్పేస్

339 లీటర్లు

285 లీటర్లు

మారుతి బాలెనో, 2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 తో పోలిస్తే ఎక్కువ పొడవుగా, వెడల్పుగా మరియు ఎత్తుగా ఉంది. మరియు భారీ వీల్బేస్ (50 మీమీ ఎక్కువ) ఉన్నప్పటికీ, ఎలైట్ ఐ 20- బాలెనో కంటే ముందు లేదా వెనుక మోకాలి రూమ్ లో, మా కొలతలు ప్రకారం అగ్రస్థానంలో లేదు. ఎలైట్ ఐ20 తో పోల్చినప్పుడు బాలెనో కూడా పెద్ద బూట్ను కలిగి ఉంది, అయితే రెండు కార్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఒకేలా ఉన్నాయి.

ఖచ్చితంగా చదవాలి: హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 సివిటి ప్రారంభం; ఇది- బాలెనో, జాజ్ ఆటోమేటిక్ లకు వ్యతిరేకంగా పోటీ పడుతుంది

ఇంజిన్

ఈ రెండు కార్ల యొక్క పెట్రోల్ ఇంజన్ లతో మాత్రమే సివిటి ఎంపిక అందించబడుతుంది. ఇంజన్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం

Maruti Baleno

 

ఇంజిన్

మారుతి బాలెనో

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20

డిస్ప్లేస్మెంట్

1197 సిసి

1197 సిసి

పవర్

84 పిఎస్

83 పిఎస్

టార్క్

115 ఎన్ఎం

115 ఎన్ఎం

ట్రాన్స్మిషన్

5 ఎంటి / సివిటి

5 ఎంటి / సివిటి

ఇంధన సామర్ధ్యం

21.4 కెఎంపిఎల్ (సివిటి / ఎంటి)

18.6 కెఎంపిఎల్ (ఎంటి)/ తెలియదు (సివిటి)

ఇంధన ట్యాంక్ సామర్థ్యం

37 లీటర్లు

40 లీటర్లు

 

- రెండు కార్లు ఒకే సామర్ధ్యం గల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో జత చేయబడి ఉన్నాయి, ఇవి దాదాపు ఒకే విధమైన శక్తిని మరియు టార్క్ లను ఉత్పత్తి చేస్తాయి

- బాలెనో పెట్రోల్ మాన్యువల్, 2.8 కెఎంపిఎల్ తో, ఎలైట్ ఐ 20 మాన్యువల్ కంటే ఇంధన సామర్థ్యం పరంగా మరింత సమర్థవంతంగా ఉంది. ఎలైట్ ఐ 20 సివిటి కు చెందిన మైలేజ్ సంఖ్యలు హ్యుందాయ్ వెల్లడించనప్పటికీ, వాటి మాన్యువల్ వెర్షన్ (18.6 కెఎంపిఎల్) కంటే మెరుగైనవిగా ఉండవు.

- రెండు కార్లు సివిటి ఎంపికను పొందుతాయి, మేము ఇదే తరహా శుద్ధీకరణ స్థాయిని ఆశించాము

 లక్షణాలు

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 మాగ్న ఎగ్జిక్యూటివ్ వర్సెస్ బాలెనో డెల్టా

 

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 సివిటి మాగ్న ఎగ్జిక్యూటివ్ (రూ. 7.05 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

మారుతి సుజుకి బాలెనో డెల్టా (రూ 7.10 లక్షలు, ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

డ్యూయల్ ముందు ఎయిర్ బాగ్స్

డ్యూయల్ ముందు ఎయిర్ బాగ్స్

ఏబిఎస్ తో ఈబిడి

ఏబిఎస్ తో ఈబిడి

సెంట్రల్ లాకింగ్

సెంట్రల్ లాకింగ్ & కీలెస్ ఎంట్రీ

ఇంపాక్ట్ / స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ / అన్లాక్

-

ఆక్స్, యుఎస్బి పోర్ట్లతో ఆడియో సిస్టమ్

ఆక్స్, యుఎస్బి పోర్టులు, బ్లూటూత్ లతో ఆడియో సిస్టమ్ మరియు స్టీరింగ్ వీల్ పై ఆడియో నియంత్రణలు

నాలుగు పవర్ విండోస్

నాలుగు పవర్ విండోస్

విద్యుత్పరంగా సర్దుబాటు అయ్యే సైడ్ మిర్రర్లు

విద్యుత్పరంగా సర్దుబాటు & మడత సర్దుబాటు కలిగిన సైడ్ మిర్రర్లు

వెనుక ఏసి వెంట్లతో మాన్యువల్ ఏసి

ఆటో ఏసి

అందుబాటులో లేదు

60:40 స్ప్లిట్ వెనుక సీట్లు

అందుబాటులో లేదు

టిల్ట్ స్టీరింగ్

అందుబాటులో లేదు

వెనుక డిఫోగ్గర్, వైపర్ మరియు వాషర్

 

రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

 

తీర్పు: ఎలైట్ ఐ 20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ మరియు బాలెనో డెల్టా రెండు వాహనాల యొక్క దిగువ శ్రేణి వేరియంట్లు పైనే ఉంటాయి, అవి దాదాపు అన్ని ప్రాథమిక అంశాలను పొందుతాయి. కానీ బాలెనో డెల్టా, ఆటో ఎసి, 60:40 స్ప్లిట్ రేర్ సీట్లు, రిమోట్ కీలేస్ ఎంట్రీ మరియు స్టీరింగ్ మౌంటు ఆడియో నియంత్రణలు వంటి అనేక సౌకర్య మరియు సౌలభ్య లక్షణాలను పొందుతుంది, ఎలైట్ ఐ 20 మాగ్న ఎగ్జిక్యూటివ్ లో స్టీరింగ్ మౌంటు ఆడియో నియంత్రణలు అందించబడవు. ఇది కేవలం రూ. 5,000 మాత్రమే ఖరీదైనది కనుక, బాలెనో డెల్టా సివిటి ధరకు తగిన కారు అని చెప్పవచ్చు.

2018 Hyundai Elite i20 vs Maruti Baleno: CVT Automatic Variants Comparison

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ఆస్టా వర్సెస్ బాలెనో ఆల్ఫా

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 అస్టా సివిటి - రూ 8.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ఎలైట్ ఐ 20 యొక్క ఆస్టా వేరియంట్- రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ఏవిఎన్ పై ప్రదర్శన కలిగిన రేర్ వ్యూ కెమెరా, టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్, వెనుక డిఫోగ్గర్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, ఆటో ఎసి, వెనుక వైపర్ మరియు వాషర్, ఎలక్ట్రానిక్ సర్దుబాటు / మడత సర్దుబాటు కలిగిన సైడ్ మిర్రర్లు వంటి అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా ఇది, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లకు మద్దతిచ్చే 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ను పొందుతుంది దీనితో పాటు స్టీరింగ్ వీల్ పై ఆడియో మరియు బ్లూటూత్ నియంత్రణలతో పాటు, స్వర ఆదేశాలను కలిగి ఉంటుంది.

మారుతి బాలెనో ఆల్ఫా సివిటి - రూ 8.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

బాలెనో ఆల్ఫా, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఆపిల్ కార్ప్లే కు మద్దతిచ్చే 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఆటో ఎసి, నావిగేషన్ సిస్టమ్, వాయిస్ కమాండ్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ అంశాలను కలిగి ఉంది.

Hyundai Elite i20

ఎలైట్ ఐ 20 ఆస్టా సివిటి మరియు బాలెనో ఆల్ఫా సివిటి ధరలు వరుసగా రూ 8.16 లక్షలు మరియు రూ 8.40 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) లుగా ఉన్నాయి. ఐ 20, ఆండ్రాయిడ్ ఆటో ను పొందుతుంది, బాలెనో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ లను కలిగి ఉంటుంది. ఎలైట్ ఐ 20 లో ఈ అంశాలు అందించబడవు.

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 లో, సివిటి ఎంపిక- దాని అగ్ర శ్రేణి వేరియంట్ అస్టా (ఓ) లో అందించబడుతుంది. ఈ వాహనం అధిక భద్రత పరంగా, సైడ్ & కర్టెన్ ఎయిర్బాగ్స్, ఆటో హెడ్ల్యాంప్స్, ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, 16- అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు పుష్- బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి అంశాలు అందించబడతాయి. ఇది దాదాపు రూ 8.90 లక్షల తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.

తీర్పు: బాలెనో ఆల్ఫా మరియు ఎలైట్ ఐ 20 అస్టా సివిటి మధ్య ధర వ్యత్యాసం కేవలం 24,000 రూపాయలుతో ఎలైట్ ఐ 20 ఖరీదైనదిగా ఉంది. బాలెనో యొక్క అగ్ర శ్రేణి వేరియంట్, ఎలైట్ ఐ 20 కన్నా కొన్ని అదనపు లక్షణాలు పొందుతుంది. ఈ రెండు వాహనాలు, దగ్గర దగ్గరగా ఒకే రకమైన అంశాలను పొందుతుంది.

సిఫార్సు చేయబడినవి: 2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 వర్సెస్ హోండా జాజ్ వర్సెస్ వాక్స్వాగన్ పోలో - లక్షణాలు & ఫీచర్లు పోలిక

మరింత చదవండి: హ్యుందాయ్ ఐ 20 ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ Elite ఐ20 2017-2020

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience