Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి సుజుకి డిజైర్: వేరియంట్ల వివరాలు

మారుతి డిజైర్ 2017-2020 కోసం raunak ద్వారా ఏప్రిల్ 30, 2019 11:49 am సవరించబడింది

కొత్త 2017 డిజైర్, సియాజ్ కంటే మరిన్ని అంశాలను ఎక్కువ మొత్తంలో అందిస్తుంది, ఎందుకంటే ఇది మధ్యస్థ నవీకరణకు దగ్గరగా ఉంది.

మూడవ తరం మారుతి డిజైర్ చివరకు విక్రయించబడటానికి కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. మొట్టమొదటిసారిగా, మారుతి సుజుకి దేశంలో తన హ్యాచ్బ్యాక్ కౌంటర్ అయిన స్విఫ్ట్ కు ముందుగా తదుపరి తరం డిజైర్ ను ప్రవేశపెట్టింది. స్విఫ్ట్ డిజైర్ 2017 ఇప్పుడు, 2017 డిజైర్ అంటారు; గత రెండు తరాల వలె కాకుండా 'స్విఫ్ట్' లేబుల్ పూర్తిగా తొలగించబడింది.

బాలెనో మరియు ఇగ్నిస్ వంటి మారుతి యొక్క తాజా వాహనాల నుండి తీసుకువచ్చే అంశాలు, కొత్త డిజైర్ లో సాపేక్షంగా ఖరీదైన సియాజ్లో ఇవ్వని అనేక లక్షణాలు అందించబడ్డాయి. 2017 డిజైర్, మా 'వేరియంట్ల వివరాలు' సీరీస్లో ఏ ఏ అంశాలతో రాబోతుందో చూద్దాం.

రంగు ఎంపికలు

2017 మారుతి డిజైర్ ఒకటి కాదు, మూడు కొత్త రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. మునుపటి డిజైర్ యొక్క ప్యాకేజీలో - దాని సౌందర్యం - ప్రధాన లోపాలను తొలగించడానికి ప్రయత్నించినందున మారుతి నిజంగా ఒక ప్రకటన చేయాలనుకుంటున్నట్లు అనిపిస్తోంది.

  • ఆక్స్ఫర్డ్ బ్లూ (క్రొత్తది)

  • షేర్వుడ్ బ్రౌన్ (క్రొత్తది)

  • గాల్లంట్ రెడ్ (క్రొత్తది)

  • ఆర్కిటిక్ వైట్

  • సిల్కీ సిల్వర్

  • మాగ్నా గ్రే

ప్రామాణిక ఫీచర్లు

  • ఏబిఎస్ (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్- ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) మరియు బ్రేక్ అసిస్ట్

  • ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్ (డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుడు)

  • చైల్డ్ సీటు యాంకర్లు (ఐసోఫిక్స్)

  • ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్ లతో ఉన్న ఫ్రంట్ సీటు బెల్ట్లు

  • ఎల్ఈడి గైడ్ లైట్ తో వెనుక లాంప్లు

  • టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్

  • ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్

Maruti Suzuki Dzire: LXi/LDi (base variant)

మారుతి సుజుకి డిజైర్: ఎల్ఎక్స్ఐ / ఎల్డిఐ (దిగువ శ్రేణి వేరియంట్)

ధరలు: రూ .5.45 లక్షలు (ఎల్ఎక్స్ఐ పెట్రోల్) || రూ 6.45 లక్షలు (ఎల్డిఐ డీజిల్) (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)

దిగువ శ్రేణి వేరియంట్ బేర్ బేసిస్ అయినప్పటికీ, ఎల్ వేరియంట్ యొక్క ముఖ్యమైన అంశాలు ఏబిఎస్ మరియు ఈబిడి లతో పాటు ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్ మరియు బ్రేక్ అసిస్ట్ వంటివి (లైనప్ అంతటా ప్రామాణికం). ఆఫర్లో ఆడియో వ్యవస్థ లేదు మరియు వెనుక ఏసి వెంట్స్ లేకుండా మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ను పొందుతుంది. ఇది పవర్ విండోస్ ను కూడా పొందటం లేదు, ఆఖరికి ముందు భాగంలో కూడా అందించబడటం లేదు.

బాహ్య బ్లింగ్ అందించబడటం లేదు. వెలుపలి రేర్ వ్యూ అద్దాలు (ఓఆర్విఎం లు) మరియు డోర్ హ్యాండిళ్లు వంటివి కారు రంగులో అందించబడలేదు. అగ్ర శ్రేణి వేరియంట్ లలో అందించబడినట్టుగా గ్రిల్ చుట్టూ క్రోమ్ స్ట్రిప్ అందించబడదు. లోపల భాగం విషయానికి వస్తే, ఎల్ వేరియంట్ లో- టాకోమీటర్ మరియు ఇతర వాహనాలలో అందించబడిన ఫాక్స్- వుడ్ ఇన్సర్ట్లను పొందలేదు. ఇది 14- అంగుళాల స్టీలు చక్రాల సమితి తో అందించబడుతుంది ఇది, (వీల్ క్యాప్ లు అందించబడలేదు) 165/80 క్రాస్-సెక్షన్ టైర్లతో నడుపబడుతుంది.

మారుతి సుజుకి డిజైర్: విఎక్స్ఐ / విడిఐ

ధరలు: రూ 6.29 లక్షలు (విఎక్స్ఐ పెట్రోల్), రూ 6.76 లక్షలు (విఎక్స్ఐ పెట్రోల్ ఏఎంటి) || రూ .7.29 లక్షలు (విడిఐ డీజిల్), రూ .7.76 (విడిఐ డీజిల్ ఏఎంటి) (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)


ఎల్ వేరియంట్ లో అందించబడిన అన్ని అంశాలతో పాటు, వి వేరియంట్ లో కారు రంగులో ఉండే ఓఆర్విఎం లు (టర్న్ సిగ్నల్స్తో), డోర్ హ్యాండిల్స్ తో పాటు గ్రిల్ కోసం క్రోమ్ తో చుట్టబడిన స్ట్రిప్ వంటివి అందించబడతాయి. ముందు ఎల్ వేరియంట్ లో అందించబడిన అదే చక్రాల సమితి అందించబడుతుంది. అయినప్పటికీ, ఈ చక్రాలకు పూర్తీ వీల్ కవర్లు అందించబడతాయి.

లోపల భాగం విషయానికి వస్తే, ఇది ఫాక్స్- వుడ్ మరియు బ్రెష్డ్ అల్యూమినియం వంటి ఇన్సర్ట్ లను పొందుతుంది. బ్లూటూత్ ఫోన్ ఇంటిగ్రేషన్ మరియు స్టీరింగ్ మౌంటెడ్ నియంత్రణలతో అందించబడిన ఒక నాన్ టచ్- డబుల్ దిన్ ఆడియో వ్యవస్థ అందించబడుతుంది మరియు ఇది నాలుగు- స్పీకర్ సిస్టమ్ కు జత చేయబడింది. ఎల్ఎక్స్ఐ / ఎల్డిఐ- లో వలె మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ తో కూడిన వెనుక ఏసి వెంట్స్ వస్తుంది. అలాగే రేర్ సెంటర్ ఆర్మ్స్ట్రెస్, పవర్ విండోస్, వెనుక పవర్ సాకెట్ మరియు ఎలక్ట్రానిక్ సర్దుబాటు ఓఆర్విఎం లు వంటివి ఉన్నాయి. అంతేకాకుండా ముందు సీట్లకు సర్దుబాటు హెడ్ రెస్ట్ల తో పాటు ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు వంటి అంశాలను కూడా కలిగి ఉంది.

భద్రతకు సంబంధించి, వి వేరియంట్ లో- యాంటీ థెఫ్ట్ భద్రతా వ్యవస్థ, ఆటో డోర్ లాక్ తో సెంట్రల్ లాకింగ్ మరియు డే అండ్ నైట్ సర్దుబాటు అంతర్గత వెనుక వ్యూ మిర్రర్ వంటి భద్రతా అంశాలతో అందించబడుతుంది.

• 2017 మారుతి డిజైర్ వర్సెస్ హ్యుందాయ్ ఎక్సెంట్ వర్సెస్ హోండా అమేజ్ వర్సెస్ టాటా టిగార్ వర్సెస్ ఫోర్డ్ అస్పైర్ వర్సెస్ వోక్స్వాగన్ అమియో: స్పెక్స్ పోలిక

మారుతి సుజుకి డిజైర్: జెడ్ఎక్స్ఐ / జెడ్డిఐ

ధరలు: 7.05 లక్షలు (జెడ్ఎక్స్ఐ పెట్రోల్), రూ 7.52 లక్షలు (జెడ్ఎక్స్ఐ పెట్రోల్ ఏఎంటి) || రూ 8.05 లక్షలు (జెడ్డిఐ డీజిల్), రూ 8.52 లక్షలు (జెడ్డిఐ డీజిల్ ఏఎంటి) (అన్ని ధరలు ఎక్స్- షోరూమ్, న్యూఢిల్లీ)

జెడ్ వేరియంట్ లో, వి వేరియంట్ లో అందించబడిన అన్ని అంశాలను కలిగి ఉంది. అంతేకాకుండా, అదనంగా ఇది కొన్ని కొత్త జెడ్ + నమూనాలను అందిస్తాయి. బాహ్య భాగం విషయానికి వస్తే, ఇది 185/65 క్రాస్ సెక్షన్ టైర్లతో క్రోమ్ విండో సిల్ మరియు 15- అంగుళాల అల్లాయ్ వీల్స్ ను పొందుతుంది.

లోపల భాగం విషయానికి వస్తే, వి వేరియంట్ లో అందించబడిన అదే డబుల్ దిన్ ఆడియో సిస్టమ్ తో అందించబడుతుంది, కానీ ఇది అదనంగా రెండు అదనపు ట్వీట్లతో వస్తుంది. డిజైర్ యొక్క కొత్త ఫ్లాట్ బాటమ్డ్ స్టీరింగ్ వీల్, లెదర్ తో చుట్టబడి ఈ వేరియంట్ తరువాత నుండి అందించబడుతుంది. సౌకర్యాల విషయానికి వస్తే, ఇది పుష్ ఇంజన్ స్టార్ట్-స్టాప్ బటన్ తో పాసివ్ కీ లెస్ ఎంట్రీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్విఎం లు మరియు ఆటో డ్రైవర్ విండో వంటి అంశాలను పొందుతుంది.

భద్రత విషయానికి వస్తే, జెడ్ వేరియంట్- వెనుక పార్కింగ్ సెన్సార్లను, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ మరియు వెనుక డిఫోగ్గర్లతో వస్తుంది.

మారుతి సుజుకి డిజైర్: జెడ్ఎక్స్ఐ + / జెడ్డిఐ +

ధరలు: రూ. 7.94 లక్షలు (జెడ్ఎక్స్ఐ పెట్రోల్), రూ 8.41 లక్షలు (జెడ్ఎక్స్ఐ + పెట్రోల్ ఎంటి) || రూ 8.94 లక్షలు (జెడ్డిఐ డీజిల్), రూ 9.41 లక్షలు (జెడ్డిఐ డీజిల్ ఎఎంటి)

దాని పెద్ద తోబుట్టువు వాహనం అయినటువంటి సియాజ్ వలె, మూడవ తరం డిజైర్ కూడా అగ్ర శ్రేణి జెడ్ + వేరియంట్ ను పొందింది. అనేక రకాలైన మొట్టమొదటి విశిష్ట లక్షణాలు ఈ వేరియంట్ల యొక్క గ్రిల్స్కు లోడ్ అవుతాయి. ఈ వేరియంట్లో, జెడ్ వేరియంట్ లో అందించబడిన చాలా మంచి అంశాలను పంచుకుంటూ ఉన్నప్పటికీ, మిగిలిన వాటితో పోలిస్తే ఈ వాహనం అద్భుతమైన అంశాలతో దృడంగా నిలబడి ఉంది.

ముందుగా, ఈ వేరియంట్లు- డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లను మరియు 15- అంగుళాల డైమండ్- కట్ అల్లాయ్ చక్రాలు తో పాటు ఆటోమేటిక్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ వంటి అంశాలతో వస్తాయి.

ఇది, ఇగ్నిస్ లో వలె ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లకు మద్దతు ఇచ్చే సుజుకి యొక్క 7.0- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను పొండుతుంది. అంతేకాకుండా ఈ వ్యవస్థ రివర్స్ పార్కింగ్ కెమెరా స్క్రీన్ తో అందించబడుతుంది. మిగిలిన లక్షణాలు, జెడ్ వేరియంట్ లో అందించబడిన అన్ని అంశాలను పొందుతుంది.

న్యూ డిజైర్ రివ్యూ చూడండి

సిఫార్సు చేయబడినవి: ఆల్- న్యూ మారుతి సుజుకి స్విఫ్ట్: ఆశించే అంశాలు

మరింత చదవండి: సుజుకి స్విఫ్ట్ ఆన్ రోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

raunak

  • 93 సమీక్షలు
  • 1 Comments

Write your Comment పైన మారుతి Dzire 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర