Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2017 మారుతి సుజుకి డిజైర్ పాత వర్సెస్ కొత్త: ఏ అంశాలు మార్చబడ్డాయి?

మారుతి డిజైర్ 2017-2020 కోసం khan mohd. ద్వారా ఏప్రిల్ 30, 2019 11:51 am సవరించబడింది

రిఫ్రెష్ లుక్స్, విశాలమైన ఇంటీరియర్స్ మరియు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అదనపు ఫీచర్లు అందించబడ్డాయి.

మే 16న భారతదేశంలో మారుతి సుజుకి తన తదుపరి తరం 2017 డిజైర్ను అధికారికంగా ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. కొత్త మోడల్లో మార్పులు కేవలం కాస్మెటిక్ అంశాలకు మాత్రమే పరిమితం కాలేదు, మరిన్ని లోతైన నవీకరణ అంశాలను అందించింది. పాత స్విఫ్ట్ డిజైర్ యొక్క దాదాపు ప్రతి అంశాన్ని ఒక కొత్త గుర్తింపుతో మరియు మారుతి యొక్క ఎక్కువగా అమ్ముడైన కారుకి ఒక సరికొత్త రూపాన్ని ఇవ్వడం జరిగింది. డిజైర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వాస్తవాలు - సెడాన్ దాని హ్యాచ్బ్యాక్ తోబుట్టువు అయిన స్విఫ్ట్ ను(ఈ సంవత్సరం తర్వాత ప్రారంభించటానికి ఉద్దేశించినది) ముందుగానే ప్రవేశపెట్టింది. 2008 నుండి 2017 వరకు, మారుతి సుజుకి 17 లక్షల యూనిట్ల కాంపాక్ట్ సెడాన్కు విక్రయించింది. దేశంలో మొత్తం సెడాన్ విక్రయాలలో 50 శాతం వరకు ఈ కాంపాక్ట్ సెడాన్ ఖాతాలే ఉన్నాయి. అసహనము! ఈ జాబితా ఇక్కడతో ముగియలేదు, ఈ కారు అనేక రికార్డులను దాటుకొని అనేక మైలురాళ్లను సృష్టించింది. కొత్త డైజర్లో ఏ ఏ అంశాలు మార్చబడ్డాయో తెలుసుకుందాం.

డిజైన్

మేము డిజైర్ యొక్క 'ఎస్' బ్యాడ్జ్ ను కనిపించకుండా చేయడం వలన అది కొత్త వాహనమా లేదా అదే మారుతి సుజుకి సెడానా అని ఊహించడం కష్టంగా ఉంటుంది. ముందు వెర్షన్ లో ఉన్న ఒక మందపాటి క్రోమ్ స్లాట్ ను తొలగించడం జరిగింది మరియు దీని స్థానంలో క్షితిజ సమాంతర స్లాట్లతో విస్తృత క్రోమ్ గ్రిల్ అందించబడింది. కొత్త ఫాగ్ లాంప్లతో బంపర్ పునః రూపకల్పన చేయబడింది.

చుట్టబడిన పెద్ద హెడ్ల్యాంప్ల యూనిట్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్ లతో మరింత అందంగా కనిపించడం కోసం మార్చింది. వీటితో పాటు అన్ని కొత్త ఆటో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్ లను పొందుతుంది.

కొలతలు కూడా ముందు వెర్షన్ కంటే మార్పును అందుకున్నాయి. వీల్బేస్ ఇప్పుడు 20 మి.మీ. తో క్యాబిన్ లోపల మరింత విశాలంగా ఉంది. ఇది ఇప్పటికే ఉన్న డిజైర్ కంటే 40 మీమీ వెడల్పయినది మరియు 40 మీమీ చిన్నది. ఆశ్చర్యకరంగా, గ్రౌండ్ క్లియరెన్స్ 163 మీమీ కు తగ్గించబడింది - అవుట్గోయింగ్ వెర్షన్ తో పోలిస్తే 7 మీమీ తక్కువ, అంటే క్రిందికి ఉందని చెప్పవచ్చు.

కొత్త డిజైర్, పాత టోన్ డిజైన్ కంటే మెరుగైనది ఇది రెండు టోన్ 15- అంగుళాల మల్టీ స్పోక్ అల్లాయ్ చక్రాలను పొందుతుంది.

వెనుక ప్రొఫైల్ కూడా, ఎల్ఈడి గైడ్ లైట్స్ తో పునఃరూపకల్పన చేయబడింది మరియు పునఃరూపకల్పన చేసిన టెయిల్ లాంప్ లతో ముందు వలె చుట్టబడిన లాంప్లతో కాకుండా అందించబడ్డాయి. ఒక మందపాటి క్రోమ్ స్ట్రిప్ బూట్ మూత ఓపెనింగ్ లో అందించబడింది మరియు వేరియంట్ బ్యాడ్జింగ్ ఇప్పుడు బూట్ మూత యొక్క క్రింది దిగువ వైపున అందించబడింది. పునరుద్ధరించబడిన వెనుక బంపర్ ఇప్పుడు ఒక జత రిఫ్లెక్టార్లను కలిగి ఉంది. అధిక మౌంట్ స్టాప్ లాంప్ ఇప్పుడు ఫ్లాట్ మరియు అలాగే ఎల్ఈడి ఫీచర్ ను పొందుతుంది.

ఈ వాహనం ఇప్పుడు- ఆక్స్ఫర్డ్ బ్లూ, షేర్వుడ్ బ్రౌన్, గాలంట్ రెడ్, మాగ్మా గ్రే, సిల్కీ సిల్వర్ మరియు ఆర్కిటిక్ వైట్ వంటి ఆరు బాహ్య రంగుల ఎంపికలతో కొనుగోలుదారుల ముందుకు వస్తుంది.

ఇంటీరియర్

లక్షణాలకు సంబంధించినంత వరకు, అవుట్గోయింగ్ స్విఫ్ట్ డిజైర్ గురించి ఎటువంటి ఫిర్యాదులు లేదు. అయితే కాలక్రమేణా, కాంపాక్ట్ సెడాన్ ప్రదేశంలో పోటీ విషయానికి వస్తే కొత్త ఎక్సెంట్ మరియు టిగార్ వాహనాలకు తీవ్ర పోటీని ఎదుర్కోవడానికి మారింది. గట్టి పోటీతో మారుతి కొత్త డిజైర్, దాని లక్షణాల ఖాళీని పూరించడానికి మరిన్ని అంశాలతో మన ముందుకు వచ్చింది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. అవి వరుసగా, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, మిర్రర్లింక్ మరియు నావిగేషన్కు మద్దతిచ్చే టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తుంది.

అదనపు సౌలభ్యం కోసం, ఇది వెనుక ఏసి వెంట్లు, వాతావరణ నియంత్రణ మరియు సెన్సార్లతో కూడిన రేర్ పార్కింగ్ కెమెరాను పొందుతుంది. వెనుక ఛార్జ్ సాకెట్ మరియు వెనుక ఎయిర్ కాం వెంట్ పక్కన ఒక ఫోన్ హోల్డర్ ను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా స్టీరింగ్ వీల్, బుర్ల్ చెక్క టచ్ తో ఒక కొత్త ఫ్లాట్ బోటండ్ స్టీరింగ్ వీల్ మరింత స్పోర్టి లుక్ ను అలాగే లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

అయితే, కొత్త డిజైర్ యొక్క అత్యంత ముఖ్యమైన నవీకరణ ఏమిటంటే, మరింత విశాలవంతమైన బూట్ స్థలం, ఇది ఇప్పుడు 376 లీటర్ల వద్ద అద్భుతంగా, విశాలంగా ఉంది - ఇది ముందు వెర్షన్ తో పోలిస్తే 60 లీటర్ల ఎక్కువ స్పేస్ ను కలిగి ఉంది అని చెప్పవచ్చు. అంతేకాక, ఈ కొత్త డిజైర్ ఏబిఎస్, ఈబిడి, ఎయిర్బాగ్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు వంటివి ఈ కారు యొక్క అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా అందించబడ్డాయి.

పెరిగిన వీల్ బేస్ మరియు వెడల్పు క్యాబిన్ కారణంగా లోపల మరింత విశాలంగా ఉంటుంది. ఈ కారులో వెనుక షోల్డర్ రూమ్ 30 మీమీ కు పెంచబడింది మరియు ముందు 20 మీమీ వరకు పెంచబడింది. వెనుకవైపు ఉన్న మోకాలి రూమ్ దాదాపుగా 40 మీమీ కు దారితీసింది. స్విఫ్ట్ డిజైర్ యొక్క ముందు వెర్షన్ లో వెనుక క్యాబిన్ స్థలం గురించి ఫిర్యాదు చేయబడింది, ఇప్పుడు మారుతి సుజుకి ఈ సమయంలో దానిని మార్పు చేసింది. కారు యొక్క మొత్తం ఎత్తు తగ్గింది, అంటే దీని అర్ధం సీటు ఎత్తు కూడా 21 మీమీ కు పడిపోయింది.

ఇంజిన్

మారుతి సుజుకి బాలెనో యొక్క అదే తేలికపాటి ప్లాట్ఫారమ్ ను పంచుకుంటూ, కొత్త డిజైర్ యొక్క డీజిల్ వెర్షన్ 85 కిలోలకు మరియు పెట్రోల్ వెర్షన్ 105 కిలోలకు తగ్గించబడింది. ఇది అదే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.3 లీటర్ డీజిల్ ఇంజన్ లతో కొనసాగుతుంది. ముందుగా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, గరిష్టంగా 84.3 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే డీజిల్ మోటర్ విషయానికి వస్తే 75 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ద్యాన్ని కలిగి ఉంటుంది. రెండు ఇంజిన్లు 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉన్నాయి. మారుతి సంస్థ, తన పెట్రోల్ వేరియంట్ ల కోసం ఈసారి 4- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్బాక్స్ ను విడుదల చేసింది. మారుతి సంస్థ పాత గేర్బాక్స్ ల స్థానంలో, మారుతి సుజుకి పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ లకు ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్) వ్యవస్థతో సంధానం చేయాలని నిర్ణయించింది. ఈ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేస్ ఎల్ఎక్స్ఐ మరియు ఎల్డిఐ లలో తప్ప అన్ని వేరియంట్ లలో అందుబాటులో ఉంది.

ధర

అందించబడిన మరిన్ని ఫీచర్ల తో పాటు, అవుట్గోయింగ్ కాంపాక్ట్ సెడాన్ తో పోలిస్తే అన్ని- కొత్త డిజైర్ ఎక్కువ ప్రీమియం ధరను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఉన్న డిజైర్ యొక్క ప్రతీ వేరియంట్ ధర - రూ 30,000- 40,000 పెరగవచ్చునని భావిస్తున్నారు.

మరింత చదవండి: స్విఫ్ట్ డిజైర్

k
ద్వారా ప్రచురించబడినది

khan mohd.

  • 101 సమీక్షలు
  • 7 Comments

Write your Comment పైన మారుతి Dzire 2017-2020

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఫేస్లిఫ్ట్
Rs.73.50 - 78.90 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.2.03 - 2.50 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.41 - 53 లక్షలు*
Rs.11.53 - 19.13 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర