• English
  • Login / Register

యూరో ఎన్ సి ఎ పి టెస్ట్ లో 5- స్టార్ రేటింగ్ పొందిన స్కోడా సూపర్బ్ 2016

స్కోడా సూపర్బ్ 2016-2020 కోసం arun ద్వారా జూన్ 25, 2015 11:10 am ప్రచురించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ముంబై: కొత్త స్కోడా సూపర్బ్ యూరోఎన్ సి ఎ పి క్రాష్ పరీక్షలో గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న అన్ని స్కోడా మోడల్ లైన్స్ కూడా యూరోఎన్ సి ఎ పి క్రాష్ పరీక్షలో గరిష్టంగా 5 స్టార్ రేటింగ్ ని సొంతం చేసుకున్నాయి. యూరోఎన్ సి ఎ పి అనేది యూరోపియన్ రవాణా మంత్రిత్వ శాఖ, మోటారింగ్ సంఘం , భీమా మరియు వినియోగదారుల సంఘాల స్వతంత్ర సహాయతా సంఘం. ఈ సంస్థ కొత్త కారుమోడల్స్ క్రాష్ పరీక్షలను నిర్వహిస్తుంది మరియు వాటి భద్రతను అంచనా వేస్తుంది. 

ఈ కొత్త స్కోడా సూపర్బ్ అన్ని నాలుగు వర్గాలలో 5-స్టార్ రేటింగ్ తో ఉంది ఉదాహరణగా, పెద్దలు మరియు పిల్లలకు రక్షణ, పాదచారుల రక్షణ, మరియు భద్రత సహాయక సిస్టమ్స్ వంటి అంశాలతో కూడి ఉంది. కొత్త స్కోడా ఫాబియా (2014), ఆక్టావియా (2013), రాపిడ్ (2012),సిటిగో (2011), మరియు ఏతి (2008) వర్గాలు కూడా 5 స్టార్ రేటింగ్ తో ఉన్నాయి. 

ఈ స్కోడా, ఆక్టావియా లాగా వోక్స్వ్యాగన్ గ్రూప్ యొక్కఎం క్యూ బి మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూపర్బ్ తొమ్మిది ఎయిర్బ్యాగ్స్ తో పాటుగా ఇతర భద్రత ఎంపికలను కలిగి ఉంది అవి, సిటీ ఎమర్జెన్సీ బ్రేక్ తో ముందరి సహాయత, ఎలక్ట్రానిక్ టైర్ ప్రెజర్ మానిటర్, మరియుఎక్స్ డి ఎస్ + , ఎలక్ట్రానిక్ డిఫెరెన్షియల్ లాక్ యొక్క విస్తరిత ఫంక్షన్. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మల్టీ క్లాష్ బ్రేక్ తో సహా యుకె నిర్దేశాల ప్రామాణికతను కలిగి వస్తుంది. 

దీనిలో భద్రకు సంబంధించి కొన్ని అంశాలను చేర్చారు అవి బ్లైండ్ స్పాట్ డిటెక్ట్ , రేర్ ట్రాఫిక్ అలర్ట్, ట్రాఫిక్ జామ్ సహాయత, మరియు అత్యవసర సహాయత, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ప్రోయాక్టివ్ యజమానుల ప్రొటెక్షన్ (క్రూ రక్షణ సహాయత) , లేన్ సహాయత, స్పీడ్ లిమిటర్, ఫెటీగ్ డిటెక్షన్ (డ్రైవర్ హెచ్చరిక), మరియు ట్రాఫిక్ సైన్ గుర్తింపు (ప్రయాణంలో సహాయత) వంటి భద్రతా లక్షణాలను కలిగిఉంది. 

కొత్త స్కోడాసూపర్బ్ , వచ్చే ఏడాది ప్రస్తుత తరం కారు స్థానంలో వస్తుందని భావిస్తున్నారు.

was this article helpful ?

Write your Comment on Skoda సూపర్బ్ 2016-2020

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience