2016 ఫోర్డ్ ఎండీవర్ యొక్క ప్రారంభం జనవరి 16 న జరగనుంది.
ఫోర్డ్ ఎండీవర్ 2015-2020 కోసం konark ద్వారా డిసెంబర్ 23, 2015 01:30 pm ప్రచురించబడింది
- 11 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిల్లీ;
కొన్ని నివేదికల ప్రకారం, ఫోర్డ్ భారతదేశంలో దాని కొత్త ఎండీవర్ షిప్పింగ్ డీలర్ నెట్వర్క్ ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఫోర్డ్ దాని సాంకేతిక నిపుణులకు శిక్షణ కూడా ఇవ్వడం ప్రారంభించింది.
తదుపరి తరం ఎండీవర్ ప్రారంభం జరగబోతోందని థాయిలాండ్ మీడియా డ్రైవ్ ఎంతగానో ఊహించినది. ఈ brawny SUV టయోటా ఫార్చ్యూనర్ మరియు ఇటీవలే ప్రారంభించబడిన చేవ్రొలెట్ ట్రయల్బ్లేజర్ కి లీడర్ గా పోటీని ఇవ్వబోతోంది అని అంచనా వేస్తున్నారు.
మీరు SUV గురించి ఆలోచించినప్పుడు ముందుగా దాని పరిమాణం మీ మనసులోకి గుర్తుకు వస్తుంది. నిజంగా ఇది చూసే వాళ్ళ కళ్ళకి ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. దీని ఇంజిన్ మరియు అన్ని ఫీచర్స్ అందర్నీ మెప్పించేవిగా ఉంటాయి.
సౌందర్యపరంగా చూస్తే , ముందు మరియు వెనుక భాగంలో ఒక అద్భుతమయిన గ్రిల్ కలిగి
ఉంటుంది. ముందు భాగంలోని బంపర్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ మరియు DRL’s ని కలిగి ఉండి చూడటానికి పెద్దగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రక్క భాగాలు చూసినట్లయితే 20 అంగుళాల డైమండ్ కట్ చక్రాలు కలిగి ఉండి అద్భుతమయిన ఆర్చ్ లు fender flares తో కూర్చబడి ఉంటాయి. దీని ఇంజిన్ క్రోం బెజిల్ ని కలిగి ఉంటుంది.
2016 ఎండీవర్ ని రెండు ఇంజిన్ ల తో కూడిన ఎంపికలు కలిగిఉండేలా ప్రారంభించబోతున్నారు. దీని 2.2 లీటర్ యూనిట్ 150 PS శక్తిని, 3.2 లీటర్ యూనిట్ 200 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు కుడా 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 4x4 సెట్ అప్ ఫీచర్స్ ని ఆప్షనల్ గా కలిగి ఉండవచ్చు.
ఫోర్డ్ ఈ మద్య కాలంలోనే వాటి ఉత్పత్తిల ధరలని నిర్ణయించింది. రాబోయే ఎండీవర్ కుడా దాదాపు ఇవే ధరలని కలిగి ఉండే అవకాశం ఉంది.
ఇప్పుడు వీళ్ళు పరిచయం చేస్తున్న ఫోర్డ్ ధర 25 లక్షల రూపాయల కన్నా తక్కువగా ఉండి ఫోర్డ్ డీలర్షిప్ వాళ్ళని ఆకర్షించే విధంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇటీవల థాయిలాండ్ లో 2016 ఎండీవర్ యొక్క డ్రైవ్ ని నిర్వహించారు. చూద్దాం పదండి.
ఇది కుడా చదవండి ఫోర్డ్ డిసెంబర్ డిస్కౌంట్;