Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2015 టోక్యో మోటర్ షో లైవ్: హోండా వారు ఎన్ఎస్ఎక్స్ హైబ్రీడ్ మరియూ ఎఫ్సీవీ హైడ్రోజెన్ ఫ్యుయెల్ వాహనాన్ని ప్రదర్శించారు

హోండా ఎనెసెక్స్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 29, 2015 01:03 pm సవరించబడింది

Honda NSX

హోండా NSX

జైపూర్: హోండా వారు వారి 570 శక్తి గల సూపర్ కారుని టోక్యో మోటర్ షోలో ప్రదర్శించారు. 2012 మొదట్లో ఈ ఎన్ఎస్ఎక్స్ సూపర్ కారు ఆక్యురా పేరిట విడుదల అయ్యింది. అదే ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రదర్శితబడుతోంది. ఈ కారు 2016 చివరిలో యూకే లో విడుదల అవ్వాల్సి ఉంది. ఈ వాహనం ఈమధ్య కాలంలో భారతదేశానికి వచ్చే సూచనలు లేవు.డ్యువల్ జోన్ ఎయిర్ కండిషనింగ్, మ్యూజిక్ సిస్టం, టీఎఫ్టీ డిస్ప్లే మరియూ ఒక డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి విలాసవంతమైన లక్షణాలు ఈ కారులో ఉన్నాయి. దుడుకైన రూపం మరియూ మంచి ఏరోడైనమిక్ తత్వం దీని సొంతం. హెడ్‌లైట్ క్లస్టర్ నాజూకుగా ఉండి టర్న్ ఇండికేటర్స్ వెనుక వైపున ఉంటాయి. ముందువైపున పెద్ద ఎయిర్ డ్యాంస్ ఇంజిను కూలింగ్ కోసమై ఉంటాయి.

దీనికి ఒక 3.5-లీటర్, ఒక 3.5-లీటర్, 24-వాల్వ్ డీఓహెచ్సీ, ట్విన్ టర్బో చార్జడ్ ఇంజిను కలిగి ఉంది. ఇది 500bhp శక్తి తో పాటుగా 550Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకి 3 ఎలక్ట్రిక్ మోటర్స్ కలిగి ఉండి, ఇవి తక్షణ శక్తిని అందించేందుకు ఉపయోగపడతాయి. వెనుక వైపున ఉన్న ఇంజిను 148Nm టార్క్ ని విడుదల చేయగా వీల్స్ దగ్గర ఉన్న ఇంజిన్లు 73Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తాయి. పైగా,అన్ని మోటర్ల శక్తి కలగలుపుకుంటే, 73 అధికంగా విడుదల అవుతుంది. అంటే, 573 శక్తి ఇంకా 844 టార్క్ తో పాటుగా గరిష్ట వేగం గంటకి 300 కిలోమీటర్లు నడుస్తుంది. ఇది ఈ కారుని 552 శక్తిని మరియూ 755 టార్క్ ని అందించే ఫెర్రారి కాలిఫోర్నియా టీ కోవలోకి చేరుస్తుంది. పైగా, ఈ కారు గంటకి 100 కిలోమీటర్లు కేవలం 3 సెకనుల్లో చేరుకోగలదు. కానీ ఫెర్రారీకి ఈ దూరం చేరుకోవడానికి 3.6 సెకన్లు పడుతుంది.

Honda NSX

హోండా FCV

Honda FCV

ఎఫ్సీఎక్స్ కి వారసుడు అయిన హోండా ఎఫ్సీవీ గత ఏడాది విడుదల అయిన హైడ్రోజెన్ ఫ్యుఎల్ కారు. ఈ సెడాన్ కి అధునాతన డిజైన్ కలిగి ఉంటుంది. 1999-2006 లో ఉపయోగించినటువంటి డిజైన్ తో ఫెండర్ స్కర్ట్స్ ని కూడా కలిగి ఉండటం గమనించవచ్చు. ఈ కారు మునుపటి కంటే 60% మెరుగు అయింది అని, మరియూ కొత్త ఫ్యుఎల్ స్టాక్ 33% ఎక్కువ ఒబ్బిడిగా తయారైంది అని, తద్వారా స్థల సర్దుబాటు మెరుగ్గ ఉంటుంది అని కంపెనీ వారు తెలిపారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్ల మాదిరిగానే ఎఫ్సీవీ యొక్క రీఫ్యుఎలింగ్ తేలిక. పైగా, హోండా ఎఫ్సీవీ ఫ్యుఎల్ సెల్ సిస్టం ఇంతకు మునుపటి దాని కంటే 10 రెట్లు చవక మరియూ ఇంజిను తక్కువ స్థలం ఆక్రమిస్తుంది కూడా. ఎఫ్సీవీ యొక్క రేంజ్ 700 కిలోమీటర్లుగా ఉంటుంది.

హోండా ఎఫ్సీవీ వివరాలు:

ప్రయాణికుల సంఖ్య 5
క్రూయిజింగ్ రేంజ్ (సూచన) 700 కిలోమీటర్లు పైగా
రీఫ్యుఎలింగ్ సమయం దాదాపుగా 3 నిమిషాలు
ఎఫ్సీ గరిష్ట ఉత్పత్తి 100 కిలో వాట్ల పైనే
ఎఫ్సీ స్టాక్ ఉత్పత్తి సాంద్రత లీటరుకి 3.1 కిలో వాట్లు
మోటర్ గరిష్ట ఉత్పత్తి 130 కిలో వాట్లు
హైడ్రోజెన్ గరిష్ట ఫిల్లింగ్ ఒత్తిడి 70ఎంపీఏ
శక్తి నిల్వ లిథియం - ఇయాన్ బ్యాటరీ
వాహనం పరిమాణం (పొడవుx వెడల్పు xఎత్తు) 4,895mmx1,875mmx1,475mm
ధర 7.66 మిలియన్ యెన్ ( కన్సంపషన్ టాక్స్ తో కలగలుపుకుని)

Honda FCV

Share via

Write your Comment on Honda ఎనెసెక్స్

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది కూపే కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
Rs.3.22 సి ఆర్*
ఎలక్ట్రిక్
Rs.2.34 సి ఆర్*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.1.99 - 4.26 సి ఆర్*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర