రూ.2.53 కోట్లు వద్ద ప్రారంభించబడిన 2015మెర్సిడెస్ ఎస్ 63ఎ ఎంజి సెడాన్

మెర్సిడెస్ ఎస్-క్లాస్ 2012-2021 కోసం manish ద్వారా ఆగష్టు 11, 2015 01:54 pm సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మెర్సిడెస్ బెంజ్ ఇండియా నేడు ఫ్లాగ్ షిప్ 2015 మెర్సిడెస్ ఎ ఎం జి ఎస్ 63 సెడాన్ ని రూ.2.53 కోట్లు వద్ద  ప్రారంభించింది.  ఇది 2015 సంవత్సరంలో దాని 15వ మోడల్ లో ఒకటిగా జోడించబడనున్నది. ఎస్ 500 కూప్, ఎస్ 63 ఎ ఎంజి కూప్ మరియు జి 63 క్రేజీ రంగు ఎడిషన్ ఇవన్నీ కూడా క్రిందటి నెల విడుదల అయ్యాయి. వీటితో పాటుగా మెర్సిడెస్ పోర్ట్ఫోలియోలో ఎ ఎం జి ఎస్ 63 సెడాన్ అధనంగా చేరింది.  ఇది 2015వ సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభించబడిన  9వ ఎ ఎంజి మోడల్ మరియు మెర్సెడెజ్-బెంజ్ యొక్క 10వ మోడల్. మెర్సిడెస్ ఎ ఎం జి ఎస్ 63 సెడాన్ అదే 5.5-లీటరు వి8 బై-టర్బో ఎ ఎంజి ఇంజిన్ తో అమర్చబడి ఉంది. ఈ ఇంజిన్ ని ఇదివరుకే ఎస్63 కూప్ లో చూసాం. ఈ ట్విన్ టర్బో వి8 బెల్ట్స్ 585hpశక్తిని మరియు 90Nm టార్క్ ని అందిస్తాయి. ఈ కారు భారతదేశానికి సిబియు పద్దతి ద్వారా వచ్చింది  మరియు హ్యాండ్ క్రాఫ్టెడ్ పవర్ ప్లాంట్ లక్షణంతో వచ్చింది . ఇది 4.4 సెకన్లలో 0-100km/h వేగాన్ని చేరుకునేందుకు మరియు గరిష్టంగా 250km/h వేగాన్ని చేరుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఎస్63 సెడాన్ దాని 2-డోర్ వేరియంట్ వంటి మేజిక్ శరీర కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ తో వచ్చింది . ఇది ముందు భాగంలో రెండు స్టీరియోస్కోపిక్ కెమెరాలు ఎత్తు మరియు గుంతలు కనిపెట్టడానికి ఉపయోగించుకుంటుంది. ఇది చురుకుగా ఎయిర్ సస్పెన్షన్ దృఢత్వం రేటు సర్దుబాటు చేసుకొని మెరుగైన సౌకర్యం అందిస్తుంది.

5.5-లీటరు వి8 బై-టర్బో ఇంజిన్ ఒక ఎ ఎంజి 7 -స్పీడ్ స్పీడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. లుక్స్ దృష్టిలోనికి తీసుకుంటే, ఎస్ 63 ఎ ఎంజి మరియు స్టాక్ సెడాన్ మధ్య తేడాలు తులనాత్మకంగా సూక్ష్మమైనవి. ఈ ఎ ఎంజి వెర్షన్, పెద్ద ఎయిర్ ఇన్టేక్లు తో స్పోర్టియర్ బంపర్స్ తో అందుబాటులో ఉంది. వెనుక ఎస్ 63ఎ ఎంజి క్వాడ్ ఎగ్జాస్ట్ మరియు డిఫ్యూజర్స్ తో బంపర్ ని కలిగి ఉంది. ఈ ఎస్63ఎ ఎంజి పక్క ప్రొఫైల్ సైడ్ స్కర్ట్స్ , తక్కువ బరువు 20 అంగుళాల ఎ ఎంజి అల్లాయ్ వీల్స్ మరియు ఎ ఎంజి మిశ్రమ బ్రేక్లు తో అమర్చబడి ఉంది. ఈ కారు స్టాక్ ఎస్- క్లాస్ కంటే దాదాపు 100 కిలోలు తక్కువ బరువు ని కలిగి ఉంది.

లెథర్ అపోలిస్ట్రీ పనితీరు మరియు అంతర్గత ట్రిమ్ మినహా, అంతర్గత ప్రామాణిక మెర్సిడెస్ ఎస్ క్లాస్ సారూప్యతను కలిగి ఉన్నాయి. ఈ కారు అన్ని నల్లని నప్పా లెథర్ తో అంతర్గత అపోలిస్ట్రీతో మరియు వుడెన్ ట్రిం బదులుగా కార్బన్ ఫైబర్ ట్రిమ్ ఇన్సర్ట్స్ తో  అందుబాటులో ఉంది.

నిర్దేశాలు:

  • ఇంజిన్: 5.5-లీటరు వి8 బై-టర్బో
  • హార్స్పవర్: 585hp
  • టార్క్: 900ఎన్ఎమ్
  • గేర్బాక్స్: ఎ ఎం జి 7-స్పీడ్ స్పీడ్ షిఫ్ట్
  • ధర : రూపాయలు 2.0 కోట్లు (ఎక్స్-షోరూమ్ బెంగుళూర్ అంచనా)

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మెర్సిడెస్ ఎస్-క్లాస్ 2012-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience