వోక్స్వాగెన్ యజమానులకు ఉచిత రోడ్ సైడ్ అస్సిస్టెన్స్ తో పాటు $1000
నవంబర్ 16, 2015 12:57 pm bala subramaniam ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మీ వద్ద ప్రభావితం అయిన 2.0-టీడీఐ వోక్స్వాగెన్ కారు ఉందా? అయితే మీరు $1000 ని గెలుచుకున్నారు. ఒక $500 ని వోక్స్వాగెన్ ప్రీ-పెయిడ్ వీసా లాయల్టీ కార్డ్ రూపంలో మరియూ $500 వోక్స్వాగెన్ డీలర్‌షిప్ కార్డ్ రూపంలో అందిస్తాము అని కంపెనీ వారు ప్రకటించారు. పైగా ఉచిత 24-గంటల రోడ్ సైడ్ అస్సిస్టెన్స్ ని 3 ఏళ్ళ వరకు అందిస్తాము అని తెలిపారు.
వోక్స్వాగెన్ అంతర్ఘత పరిశోధన ప్రకారం, CO2 లెవల్స్ ని నిర్ధారించడంలో తప్పులు జరిగాయి అని కనుగొన్నట్టు తెలిపారు. దాదాపుగా 800,000 వాహనాలు దీని వలన ప్రభావితం అవుతాయి అనీ, దీని ఖరీదు దాదాపుగా రెండు బిలియన్ డాలర్లుగా ఉంటుంది అని అంచనా. డీజిల్ ఇంజిను విషయమై CO2 విడుదల గురించి మాత్రమే కాకుండా, ఇంధన వాడుక స్థాయులు కూడా తక్కువగా ఉన్నట్టు నమోదు చెయ్యడం జరిగింది.