టాటా టియాగో vs రెనాల్ట్ క్విడ్ | పెట్రోల్ పోలిక సమీక్ష

Published On మే 14, 2019 By arun for టాటా టియాగో 2015-2019

చాలామంది భారతీయులకు ఈ చిన్న హాచ్బ్యాక్, "మొదటి కారు" గా ఉంటూ వస్తుంది, ఉత్తేజకరంగా ఉండే యువకుడు దగ్గర నుండి భయం భయంగా ఉండే మధ్య వయస్కుడు వరకూ మరియు ప్రతిష్టాత్మకమైన పెద్ద ముసలాయన వరకూ ఇది ఒక మొదటి కారుగా ఉంటుంది. ఒక దేశంలో ఎవరైతే తమ మొదటి కారుని వారు కొనగలిగే ధరలో, తక్కువ నిర్వహణ కలిగి ఉంటూ ఇలా అన్నీ కావాలి అనుకొనే వారికి తగిన ఉత్పత్తి అందించడం కూడా చాలా కష్టం అని చెప్పవచ్చు. గత సంవత్సరాలుగా, వినయపూర్వకమైన హాచ్ అనేది జనాలతో ఒక అనుబంధాన్ని అభివృద్ధి చేసుకుంది, దీని వలన ఇది కీలకమైన మరియు కష్టతరమైన ప్రతిపాదనగా మారింది. ఈ 800CC క్విడ్ రెనాల్ట్ యొక్క మొట్టమొదట చిన్న హ్యాచ్‌బ్యాక్ జనాల కోసం అని చెప్పవచ్చు. ఆల్టో జ్యూకులర్ కోసం నేరుగా వెళ్లడం అనేది ఒక ధైర్యవంతమైన కదలిక అని చెప్పవచ్చు. గత యేళ్ళుగా ఈ కారు అనేది మిగిలిన వాటితో పోలిస్తే తనకంటూ ఒక ప్రత్యేకతను చోటుచేసుకుంది. ఈ పోలిక జరిగే సమయంలో, 1 లీటర్ ఇంజిన్ సన్నద్ధమైన క్విడ్ ఇంకా ప్రారంభించబడలేదు.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

ఇక్కడ ఇంకో కారు, టాటా టియాగో, ఇది ఇంజన్ పరిమాణం విషయానికి వస్తే ఒక మెట్టు పైనే ఉంటుంది, కానీ దీని యొక్క ధర అనేది ఒక ప్రవేశ స్థాయి కస్టమర్ కి కొనుగోలు చేసుకోగల స్థాయిలో అయితే ఉండదు. ఇక్కడ మనకి బాగా కలిసి వచ్చే అంశం ఏదైనా ఉంది అంటే దీనిలో ఉండే లక్షణాలతో చాలా మంది కొనుగోలుదారులని దీని వైపుకి తిప్పుకొనేలా చేస్తుంది. నా పుస్తకాలలో, టియాగో గురించి గేమ్-మారుతున్న అంశం ఏదైనా ఉంది అంటే దాని యొక్క ధర. ఈ టాటా బాగా పోటీతత్వపు ధరతో ఉంది, దీని వలన దాని ప్రత్యర్థులను మాత్రమే కాకుండా, దాని యొక్క కొన్ని వేరియంట్స్ రెనాల్ట్ వర్గంలో ఉన్న కొన్ని వేరియంట్స్ తో సరిగ్గా ధరని కలిగి ఉన్నాయి. ఇది కొన్ని మార్గాల్లో అసమానమైన యుద్ధంగా అనిపిస్తుంది. మీ డబ్బుకి ఏ కారు మంచి విలువని అందిస్తుంది?

బాహ్య భాగాలు

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

క్విడ్ ఎందుకు అంత ప్రజాదరణ పొందినదో బయటి నుండి చూస్తే తెలుస్తుంది. మన మార్కెట్ లో SUV పై మమకారం ఎక్కువ, ఒక చిన్న హ్యాచ్ అనేది అలాంటి లుక్ ని కలిగి ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. దీనిలో డిజైన్ విషయానికి వస్తే అటువంటి అంశాలన్నీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే ఇది అంశాలన్నీ కలిగి ఉంది, పెద్ద వీల్ ఆర్చులు మరియు మ్యాట్ బ్లాక్ క్లాడింగ్ మరియు బోనెట్ మీద మంచి గీతలు ఇవన్నీ కూడా ఒక SUV ఎలా రూపొందించాలి? అనే హ్యాండ్ బుక్ నుండి  పేజ్ 1 లో ఉన్నాయి. ఈ అన్నిటిలో మనకి కొంచెం ఎబెట్టుగా కనిపించేవి ఏమిటంటే సన్నగా టైర్లు, స్క్వేర్డ్-ఆఫ్ వీల్ ఆర్చ్లు ఒక పెద్ద వీల్స్ ని మనకి అందిస్తాయి అంటే 13-అంగుళాల వీల్స్ ని మనకి అందించి ఆ గ్యాప్ ఫిల్ కానట్టు ఉంటుంది.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

టియాగో ఒక సంప్రదాయ హాచ్బ్యాక్, ఆ విషయం దాచిపెట్టేందుకు అది ప్రయత్నించదు. దీని యొక్క 'ఇంపాక్ట్' డిజైన్ అనేది  ఒక భారతీయ తయారీదారులలో మొత్తంలో ఎక్కడా చూసినట్టు అనిపించదు. ఈ యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మెచ్చుకొనదగినవి. గ్లాస్ నలుపు గ్రిల్ పై హెక్సగొనల్ వివరాలు, బంపర్లలో హెడ్ లాంప్స్ ద్వారా క్రోమ్ ప్రవహించే మార్గం, అందమైన స్పాయిలర్ స్పాట్స్, బాల్క్ అవుట్ అయిన క్రింద సగ భాగం ఇవన్నీ కలిపి ఒక మంచి అందమైన డిజైన్ గా మనకి అందిస్తుంది. ఈ షీట్ మెటల్ కూడా బాగా దళసరిగా ఉండడం వలన పెయింట్ నునుపుగా మరియు ప్యానెల్ ఖాళీలు కూడా సమంగా ఉన్నాయి. టియాగో ఇక్కడ రియాల్ట్ పై నిర్మాణ నాణ్యత లో మొదటి స్థానం సంపాదిస్తుంది.

లోపల భాగాలు

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

ఇంటీరియర్లకు కూడా ఇక్కడ ఇదే కథ ఉంది. ఒకసారి టియాగో లోపలకి వెళితే మనస్సులో వచ్చే మొదటి ప్రశ్న "ఇది నిజంగా టాటా నా?" ఇండికాతో పోల్చినప్పుడు, టియాగో రూపకల్పన, మరియు, మరింత ముఖ్యంగా, నాణ్యతను కలిగి ఉంది. మేము పరీక్షించడానికి ఎంచుకున్న కారులో కలర్ సమన్వయం గల సైడ్ A.C వెంట్స్ ఉన్నాయి, అవి నిజంగా చూడడానికి చాలా బాగుంటాయి. బాహ్య బాగాలను సరిపోల్చడానికి టాటా మరింత ప్యానెల్ లను అనుకూలీకరించడానికి మీకు అవకాశం కల్పిస్తుంది, కాని డార్క్ నలుపు రంగు సెంటర్ కన్సోల్ మరియు లేత గోధుమ-రంగు డాష్ మీద చాలా హుందాగా అందంగా ఉంటుందని చెప్పవచ్చు.  

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

మరోవైపు, రెనాల్ట్ మొత్తం నలుపు క్యాబిన్ ని కలిగి ఉంది. డిజైన్ చాలా అల్లరిగా మరియు కుర్రకారుకు నచ్చే లుక్ ని కలిగి ఉంది. అంతేకాకుండా ఇది చాలా ఆచర్ణాత్మకంగా ఉంది, దీనిలో మీరు ట్విన్ గ్లోవ్ బాక్స్,ఒక పార్శెల్ షెల్ఫ్, సెంటర్ లో చాలా నిల్వా స్థలం మరియు డోర్ పాడ్స్ ఉంటాయి. ఇది నావిగేషన్ తో ఫాన్సీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని కూడా పొందుతుంది (అయితే టాప్ ట్రిమ్ లో మాత్రమే). అయినప్పటికీ, ఇది డాష్ బోర్డ్ చివరిలో ఉండే, రెండు స్పీకర్లతో మాత్రమే జత చేయబడింది. ఆడియో నాణ్యత మరియు టచ్‌స్క్రీన్ ప్రతిస్పందన రెండూ కూడా సగటుగా ఉంటాయి.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

దాని పరిమాణంలో ఆశ్చర్యకరంగా విశాలమైనది. కాంపాక్ట్ అనే ముద్ర దీనికి ఉన్నప్పటికీ, క్యాబిన్ నలుగురు పెద్దవాళ్ళకి సులభంగా సరిపోతుంది. అంతేకాక, దీనిలో బూట్ స్పేస్ 300 లీటర్ల వద్ద ఉంటుంది. ఇది ఆల్టో 800 కన్నా 123 లీటర్ల ఎక్కువ, మరియు స్విఫ్ట్ కంటే 96 లీటర్లు అదనంగా ఉంటుంది. మరోవైపు, టాటా 242 లీటర్లకు దాని బూట్ స్పేస్ ని తగ్గించింది కానీ వెనకాతల కూర్చునే ప్యాసింజర్లకు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. క్విడ్ తో పోల్చినపుడు, టియాగో కు మంచి లెగ్ రూమ్ మరియు మోకాలి రూం దీనిలో ఉంది. హెడ్ రూం అనేది రెండు కార్లలో ఒకేలా ఉంటుంది మరియు ముగ్గురుని వెనకాతల కూర్చోపెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ రెండూ కూడా 4-సీటర్ గా బాగుంటాయి, కానీ టాటా మాత్రం కూర్చొనే వారిని బాగా సౌకర్యంగా ఉంచుతుందని చెప్పవచ్చు. కుషనింగ్ మరియు బోల్స్టరింగ్ కొంచెం మెరుగ్గా ఉంటాయి మరియు వెనుక బెంచ్ యొక్క బ్యాక్ రెస్ట్ రిలాక్సెడ్ యాంగిల్ లో ఉంచబడుతుంది. డ్రైవర్ కి హైట్ అడ్జస్టబుల్ సీటు, ఒక టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ మరియు ఒక సర్దుబాటు హెడ్ రెస్ట్ ని కలిగి ఉంది - ఇవన్నీ క్విడ్ మిస్ అవుతుంది.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

ముందు ఉండే పరికరాల పరంగా,  టియాగో కారు క్విడ్ ని మీరు చెల్లించే అదనపు డబ్బుకి మీరు ఒక మల్టీ ఇంఫర్మేషన్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్,  నాలుగు పవర్ విండోస్, ఒక చల్లని గ్లోవ్ బాక్స్ మరియు హర్మాన్ చే స్టెల్లార్ 8-స్పీకర్ ఆడియో వ్యవస్థ వంటివి అందించబడుతున్నాయి. నేను దీని మీద తగినంత ఒత్తిడి చేయలేను, ఈ ప్రత్యేకమైన వ్యవస్థ మీరు 10 లక్షల రూపాయల కంటే తక్కువ ఖరీదు ఉన్న కారులో ఇంకా బాగుంటుందని చెప్పవచ్చు. ఆడియో అప్గ్రేడ్ కోసం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు.

ఈ కార్లు ఎలా వెళతాయి, డ్రైవ్ ఎలా ఉంటుందో తెలుసుకొనే ముందు ఆరడుగులు ఉండే నేను ఒక ముఖ్యమైన అంశాన్ని చూపించాలి, అది ఏమిటంటే రెండు కార్లలోని కాళ్ళు పెట్టుకోడానికి చాలా ఇరుకుగా ఉంటుందని చెప్పవచ్చు. తత్ఫలితంగా, ఎడమ మోకాలు సాధారణంగా సెంటర్ కన్సోల్ కి దగ్గరగా ఉంటుంది, అయితే కుడి మోకాలి అనేది డోర్ పాడ్ కి దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా, పెడల్స్ టియాగోలో చాలా దగ్గరగా ఉంటాయి, దీనికి అలవాటు పడడానికి కొంత సమయం తీసుకుంటుంది.

ఇంజిన్ మరియు ప్రదర్శన

పెట్రోల్ ఇంజిన్ల స్పెక్స్ వద్ద త్వరిత వీక్షణను తీసుకుందాం:

రెనాల్ట్ క్విడ్: 799cc | 54PS@5678rpm | 72Nm@4386rpm | ARAI సర్టిఫైడ్ మైలేజ్: 25.17kmpl

టాటా టియాగో:  1199cc | 85PS@6000rpm | 114Nm@3500rpm | ARAI సర్టిఫైడ్ మైలేజ్: 23.84kmpl

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

చిన్న పెట్రోల్ హ్యాచ్బ్యాక్లు లా ఉండటంతో, ఈ రెండింటిలోనూ నగరంలో తిరగడానికి చాలా తక్కువ ప్రయత్నం సరిపోతుంది. రెండు కార్లు కూడా ఒక సమస్య ఉంది, అది ఏమిటంటే అవి ఇంజన్ శబ్ధాన్ని తగ్గించలేవు. ఒకవేళ మా స్కూల్ టీచర్ గనుక విన్నాది అంటే ఆ శబ్ధం దెబ్బలు బాగా పడేవి. రెనాల్ట్ ఒక డీజిల్ ఇంజిన్ తో ఎందుకు పనిచేయదు అని ప్రజలు నన్ను చాలా సార్లు అడిగారు, ఎన్ని సార్లు అడిగారో కూడా గుర్తు లేదు. టాటా విషయానికి వస్తే ఈ శబ్ధం బయట బాగానే ఉంటుంది, కానీ ఇంకా కొంచెం నిశ్శబ్దంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

ఇప్పుడు, టియాగో పెద్ద ఇంజిన్ ని కలిగి ఉంది మరియు క్విడ్ తో పోల్చితే ఇంకా మంచి పనితీరుని అందిస్తుందని చెప్పవచ్చు.  ఈ రెండిటికీ తేడా ఏమిటంటే టియాగో అధనంగా 31Ps పవర్ ని అందిస్తుంది మరియు అది మీరు త్రోటిల్ ని ఎక్కువగా గనుక నొక్కినట్లయితే అది మీకు ఖచితంగా కనిపిస్తుంది, అది మీరు చేస్తున్నపుడు అంత ఆహ్లాదకరంగా అయితే ఉండవు. ఈ రెండు కార్లు మీరు డ్రైవ్ చేస్తున్నపుడు మీకు గట్టిగా శబ్ధం చేస్తూ ఇబ్బంది పెడతాయి. ఆక్సిలరేటర్ ని నెమ్మదిగా తొక్కితే స్మూత్ గా వెళిపోతుంది.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

ఒక ఫ్లాట్ ఉపరితలంపై, చూసినట్లయితే తక్కువ ఆక్సిలరేషన్ లో కూడా ఎక్కువ శ్రమ లేకుండా మనకి కావలసినంత టార్క్ అనేది ఉంటుంది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, కానీ క్విడ్ మాత్రం ఎత్తు ప్రదేశాలలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది మరియు కారు మొత్తం నిండి పోయి ఉన్నప్పుడు ఇంకా బాగా ఇబ్బంది పడుతుంది. పోల్చి చూస్తే, ఈ విషయంలో టియాగో మెరుగైనదిగా అనిపిస్తుంది. చెప్పాలంటే త్రోటిల్ పై కొద్దిగా పనిచేయాలి కానీ క్విడ్ లో ఉండే అంత ఎక్కువ అయితే కాదు.  

రైడ్, హ్యాండ్లింగ్ మరియు బ్రేకింగ్

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

మీరు రెండిటిలో  స్టీరింగ్ ఇన్పుట్లలో డయల్ చేయడానికి ఒక వేలు ఉపయోగించవచ్చు - స్టీరింగ్ అనేది చాలా తేలికగా ఉంటుంది! కాంపాక్ట్ నిష్పత్తులకి బాగా పనికి వస్తాయి రెండూ కూడా సిటీ లోపల తిరగడానికి బాగుంటుంది, ట్రాఫిక్ లో వెళ్ళడానికి, U-టర్న్ తీసుకోడానికి మరియు టైట్ ప్రదేశాలలో పార్క్ చేయడానికి సులభంగా ఉంటుంది. బాగా ట్రాఫిక్ ఉన్న ప్రదేశాలలో వెళ్ళాల్సి వచ్చినపుడు రెనాల్ట్ దాని యొక్క పవర్ స్టీరింగ్ తో నన్ను దానికి ముగ్దుడిని చేసిందని చెప్పాలి. ఇది చాలా లైట్ గా ఉంది మరియు మీరు చాలా సులభంగా ట్రాఫిక్ జామ్ లో వెళ్ళేలా చేస్తుంది. మీరు స్పీడ్ గా వెళ్ళేటపుడు ముందర వీల్స్ ఎలా వెళుతున్నాయో మీకు తెలియని కూడా తెలియని విధంగా చక్కగా తీసుకెళిపోతాయి. మీరు కార్నర్స్ లో వెళుతున్నప్పుడు విడ్డురంగా అనిపిస్తుంది, మీరు దీని మీద కంటే మీ ధైర్యాన్నే నమ్ముకోవాలి. టియాగో యొక్క స్టీరింగ్ తక్కువ వేగంతో సమానంగా ఉంటుంది, కానీ వేగవంతమైనఅపుడు మాత్రం దాని బరువు పెరుగుతూ ఉంటుంది. దీని ఫీడ్‌బ్యాక్ అంత గొప్పగా ఏమీ ఉండదు కానీ క్విడ్ తో పోలిస్తే బాగుంటుంది అని చెప్పవచ్చు.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

రెనాల్ట్ యొక్క రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. రెనాల్ట్ డస్టర్ ఎలా అయితే తన యొక్క విభాగంలో రైడ్ పరంగా బెంచ్మార్క్ గా ఉందో మరియు క్విడ్ కూడా అలానే దాని యొక్క క్లాస్ లో ఒక ఉదాహరణగా ఉంటుంది. సన్నగా ఉండే టైర్లతో చిన్న హ్యాచ్‌బ్యాక్ రైడ్ పరంగా మృదువైనదిగా ఉంటుంది. సెటప్ మృదువైనదిగా ఉంటుంది, ఇది చాలా తక్కువ వేగంతో ఉన్నప్పుడు చిన్న చిన్న గతకలని తనలోపలికి తీసుకోకుండా ఉంటుంది. అధిక వేగంతో ఉన్నప్పుడు రైడ్ అనేది కొంచెం తేలుతున్నట్టు ఉంటుంది మరియు రోడ్డు తో సంబందం లేనట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అయితే ఎక్కువ వేగం వెళ్ళగలదు కానీ కొంచెం కుదుపులు అయితే ఉంటాయి, క్విడ్ ని డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డబుల్ డిజిట్ స్పీడ్ ని దాటకూడదు అని చెప్తాను. టియాగోలో అదేవిధమైన రైడ్ విలక్షణతలు ఉన్నాయి అని చెప్పవచ్చు. నెమ్మదిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది మరియు వేగవంతం అయినప్పుడు ఎగురుతూ ఉంటుంది. అయినప్పటికీ, రెనాల్ట్ కంటే కూడా ఎక్కువ వేగంతో వెళ్ళినప్పుడు బాగుంటుందని చెప్పవచ్చు. హైవే లో గనుక వెళుతున్నట్లయితే మేము ఖచ్చితంగా టాటా నే ఎంచుకుంటాము, ఎందుకంటే హైవేలో వెళుతున్నప్పుడు చాలా సులభంగా ఉంటుంది. ఈ రెండు వాహనాలు కూడా మీరు ఓవర్టేక్ చేయాలని ప్లాన్ చేసినపుడు డౌన్ షిఫ్ట్ తీసుకొని గేర్ ఇస్తే అప్పుడు మీకు కావలసిన స్పీడ్ అందుకుంటుంది మీ ఓవర్‌టేక్ ని సులభంగా చేసేలా చేస్తుంది.

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

టియాగో లో స్టాపింగ్ పవర్ అనేది చాలా బాగుంటుందని చెప్పవచ్చు మరియు అనేక సందర్భాల్లో ఎక్కువగా మిమ్మల్ని అంత ఆశ్చర్యానికి గురి చేయడం అనేది ఏమీ ఉండదు. బ్రేక్ పెడల్ నుండి కొంచెం అభిప్రాయాలు ఉన్నాయని భావిస్తాము, అది పక్కన పెడితే మిగతా అన్నీ బాగానే ఉంటాయి. అయితే, క్విడ్ తో, టైర్లు చాలా సులభంగా లాక్ చేయబడతాయి. టైర్లు అనేవి ఇంకా కొంచెం వెడల్పుగా ఉంటే బాగుండేవి, ఒక మంచి గ్రిప్ కోసమే కాకుండా  ఆపే సామర్థ్యానికి కూడా పెంచుతాయి. ముఖ్యంగా, టియాగో యాంటీ లాక్ బ్రేక్స్ ని పొందుతుంది, ఇవి క్విడ్ లో మిస్ అయ్యాయి. రెనాల్ట్ కూడా ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్ ని మిస్ అవుతుంది, దీనిలో డ్రైవర్ ది కూడా ఆప్ష్నల్ గా ఉంటుంది. టాటా డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ ని ప్రతి వేరియంట్ భాగానికి ఒక ఎంపికగా అందిస్తుంది.

తీర్పు

Tata Tiago vs Renault Kwid | Petrol Comparison Review

మీరు ఒక సంపూర్ణ బడ్జెట్ లో ఉంటే, క్విడ్ అనేది ఒక తెలివైన కొనుగోలుగా ఉంటుంది. ఇది చాలా విశాలవంతమైనది,  సహేతుకంగా సౌకర్యవంతమైనదిగా ఉంటుంది మరియు డ్రైవ్ అనేది సులభం.' ఇది చెబుతున్నప్పటికీ మేము మనస్పూర్తిగా ఎయిర్బ్యాగ్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని టాప్-స్పెక్ RXT (O) వేరియంట్ ని ఎంచుకోమని సిఫార్సు చేస్తున్నాము. ఇప్పుడు, క్విడ్ యొక్క 1.0 లీటరు వేరియంట్ కూడా విక్రయించబడుతుంది మరియు ఇది కూడా దాని పనితీరు వలన మంచి ఎంపిక అవుతుంది. కొత్త యానివర్సరీ ఎడిషన్ కూడా క్విడ్ యొక్క చల్లని భాగాన్ని పెంచుతాయి. కానీ గుర్తు పెట్టుకోండి ఈ ధరల ట్యాగ్ అనేది  టియాగోకు దగ్గరగా ఉంటుంది.

ఇప్పుడు, మనల్ని ఏదైతే ఒక ప్రశ్న వేధిస్తుందో దానికి వచ్చేద్దాము: అదనపు డబ్బుకి  టియాగో విలువైనదిగా ఉందా?  EMI ప్రతిపాదనలో గనుక చూసినట్లయితే, టియాగో యొక్క టాప్ స్పెక్  క్విడ్ తో పోలిస్తే రూ.3,000 అధనంగా ఉంటుంది. ఈ డబ్బు మాత్రమే పెట్టగలిగితే మంచి ప్రొడక్ట్ ని దక్కించుకొనే వారు అవుతారు. ప్రతి కోణంలో కూడా టియాగో ఒక మెరుగైన ప్యాకేజీగా ఉంటుంది.  ఇది మెరుగైన ఇంజన్ కలిగి, మరింత స్థలం, మరింత సౌకర్యాలను కలిగి ఉంది మరియు ముఖ్యంగా మంచి భద్రతను అందిస్తుంది. నేను మొదట్లో చెప్పినదాన్ని పునరావృతం చేస్తాను: టియాగో యొక్క కరపత్రంలో ఉత్తమ విషయం ఏమిటంటే అడగే ధర.  టాటా టియాగో చాలా ఖరీదైనది, కానీ ఇది చాలా ఉపయోగకరమైనది మరియు ఆకట్టుకునే ప్యాకేజీ, డబ్బు కోసం మరింత విలువైనదిగా ఉంటుంది.

రెనాల్ట్ క్విడ్

మాకు నచ్చే అంశాలు

 • స్థలం.  ఒక విశాలవంతమైన క్యాబిన్ మరియు ఈ విభాగంలో ఎప్పుడూ విననటువంటి 300 లీటర్ బూట్ స్పేస్ ఉంది
 • అనుభూతి చేందే-మంచి లక్షణాలు: నావిగేషన్ తో టచ్స్క్రీన్ ఇంఫోటైన్మెంట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్   
 •  రైడ్ నాణ్యత. అత్యంత సౌకర్యవంతమైన ప్రవేశ స్థాయి కార్లు మధ్య  దీని రైడ్ నాణ్యత బాగుంటుందని చెప్పవచ్చు, మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు.

మాకు నచ్చని అంశాలు    

 • నిర్మాణ నాణ్యత . షీట్ మెటల్ నాణ్యత మరియు పెయింట్ పనితీరు నాణ్యత సగటుగా ఉంటుంది.
 •   బ్రేక్స్ కి అవసరమైనంత పవర్ అనేది లేదు. చాలా సులభంగా లాక్ అయిపోతాయి.
 •  సన్నగా ఉండే టైర్లు ఉండడం వలన అంత మంచి పట్టు ని అందించవు.
 •  ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్ మరియు ABS లేకపోవడం, చివరకి టాప్ స్పెక్స్ వెర్షన్ లో కూడా అనేది కొంచెం నిరుత్సాహం అని చెప్పవచ్చు.

టాటా టియాగ

మాకు నచ్చే అంశాలు

 • డిజైన్. మచ్చ లేనిది, స్పష్టమైన వివరణ లేని మరియు సమకాలీనదిగా ఉంటుంది.
 • లక్షణాల జాబితా చాలా విస్తృతమైనది: హైట్ సర్దుబాటు సీట్లు, టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్, కూలెడ్ గ్లేవ్ బాక్స్, మొదలైనవి.
 • దీనిలో ఉండే 8-స్పీకర్ హర్మాన్ ఆడియో సిస్టమ్, మేము 10 లక్షల రూపాయల కంటే క్రింద కారులో విన్న  ఉత్తమమైనది అని చెప్పవచ్చు.
 •  బేస్ ని వేరియంట్ ని మినహాయిస్తే డ్యుయల్ ఎయిర్ బాగ్స్ మరియు ABS అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.

మాకు నచ్చని అంశాలు

 • దీనిలో పాదాలు బాగా నొక్కేసినట్టు ఉంటాయి. బాగా దగ్గరగా ఉండే పెడల్స్ అలవాటు అవ్వడానికి సమయం పడుతుంది.
 •  శబ్దం, కదలిక మరియు కఠినత్వ స్థాయిలు మెరుగైనవిగా ఉండి ఉంటే బాగుండేది.


 

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience