Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మారుతి విటారా బ్రెజ్జా vs మహీంద్రా నువోస్పోర్ట్ | పోలిక సమీక్ష

  • 1 View

కాంపాక్ట్ SUV లు అనేవి అందరికీ కావలసినవే, అందుకనే ప్రతీ కారు తయరీదారులు అలాంటి కార్లు తయారుచేద్దామని అనుకుంటున్నారు. సగటు B-సెగ్మెంట్ హ్యాచ్బ్యాక్ ని కొంచెం క్లాడింగ్ ఇచ్చేసి SUV లా అమ్మేద్దాము అంటే అమ్ముడుపోతుందా? లేదు. ప్రస్తుతం పొడవాటి భారీ SUV ని ఒక మంచి గ్రౌండ్ క్లియరెన్స్ తో కావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే మారుతి సంస్థ ఈ విభాగంలో ఆలస్యంగా వచ్చింది, మహీంద్రా సంస్థ మొట్టమొదటిగా వచ్చింది. మారుతి ఏమనుకుంటుందంటే దాని యొక్క బ్రెజ్జా తో అది మంచి గెలుపొందే కారు కలిగి ఉందని భావిస్తుంది. మరోవైపు మహీంద్రాకి నువో స్పోర్ట్ తో ఎక్కువ షేర్ కావాలని భావిస్తుంది. మేము ఆ రెండిటినీ ఒకదాని తరువాత ఒకటి పక్కన పెట్టి చూసాము, ఏది పైచెయ్యి సాధించిందో చూద్దాము.

డిజైన్ :

మనం లుక్స్ నుండి గనుక మొదలు పెడితే రెండు కార్లు అంత అద్భుతంగా ఏమీ లేవు, కానీ కొంత ఆసక్తిని కలిగించేటటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మేము బ్రెజ్జా యొక్క డిజైన్ అనేది చాలా సంప్రదాయంగా ఉంటుందని భావిస్తున్నాము. దీనిలో తప్పు అయితే ఏమీ లేదు, కానీ దీనిని చూసి ఎవరూ అబ్బా అద్భుతం అని అయితే అనుకోరు. ఈ డిజైన్ లో డే టైం రన్నింగ్ ల్యాంప్స్ తో ఉండే ప్రొజెక్టర్ హెడ్‌ ల్యాంప్స్, కస్టమరీ స్కిడ్ ప్లేట్ తో పెద్ద బంపర్ మరియు 16-ఇంచ్ అలాయ్ వీల్స్ తో ఉండే స్క్వేరెడ్ వీల్ ఆర్చులు వంటి అంశాలు ఉన్నాయి. దీనిలో అతి ముఖ్యమైన ఆకర్షణీయమైన అంశాలు ఏమిటంటే ఆప్ష్నల్ గా వచ్చే డ్యూయల్ టోన్ పెయింట్ మరియు డీలర్ స్థాయి వద్ద అనుకూలీకరణకు ఎంపికలు. మొత్తంగా చూసుకుంటే మారుతి డిజైన్ పరంగా సేఫ్ గేం ఆడిందని చెప్పవచ్చు మరియు అది డిజైన్ లో కూడా కనిపిస్తుంది. అయితే చెప్పలాంటే మారుతి ఎటువంటి వినియోగదారులను అయితే దృష్టిలో పెట్టుకొని చేసిందో వారికి ఇది బాగా నచ్చుతుంది. అయితే, డిజైన్ అనేది నచ్చకపోవడానికి ఏమీ కారణాలు ఉండవు.

మరోవైపు చూస్తే మహీంద్రా నువోస్పోర్ట్ లాంటి కారు ఉంటుంది. ఎప్పటిలాగానే, మహీంద్రా అందరి కోసం 'లవు ఇట్ ఆర్ హేట్ ఇట్' అనే డిజైన్ భాషను అమలు చేసింది. ఒకటి చెప్పుకోవలసినది ఏమిటంటే చాలా మహీంద్రా కార్ల లానే ఇది వ్యక్తిగతంగా చూసినట్లయితే చిత్రాలలో చూసినదాని కంటే చాలా బాగుంటుంది. చిన్న హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ ల పక్కన దీనిని చూస్తే గనుక చాలా పెద్దగా కనిపిస్తుంది. చెప్పాలంటే దీని పరిమాణం ముందు బ్రెజ్జా మరియు ఎకోస్పోర్ట్ కార్లు కూడా చిన్నగా కనిపిస్తాయి. ఆ విభాగంలో ఈ కారు అన్నిటికంటే వెడల్పు అని చెప్పుకోవచ్చు. నువో స్పోర్ట్ కారు అన్ని లక్షణాలను టిక్ చేసుకుంటూ వెళుతుంది. అయితే దీనిలో ప్రక్క భాగం మరియు వెనుక భాగంలో కొన్ని చిన్న చిన్న మార్పులు 16-ఇంచ్ వీల్స్ మరియు స్మోకెడ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి మరియు ముందర భాగం మొత్తం పూర్తిగా మార్చబడింది. LED డే టైం రన్నింగ్ ల్యాంప్స్, బోనెట్ మరియు సిగ్నేచర్ మహీంద్రా గ్రిల్ నువోస్పోర్ట్ ను క్వాంటో కారు కంటే చాలా విభిన్నంగా కనిపించేలా చేశాయి. మహీంద్రా టైలెగేట్ కూడా మీద స్పేర్ వీల్ ని పెట్టి ఉంచింది.

ఈ రెండిటిలో దేనికి కూడా డిజైన్ అవార్డులు అనేవి రావు. మాహీంద్రాకి ఒక కఠినమైన లుక్ ఉంది. కానీ బ్రెజ్జ ని గానీ చూసినట్లయితే కంటికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మారుతి అర్బన్ వాతావరణంలో మన కారులాగా ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి యొక్క కొలతలు అనేవి సిటీ లో తిరిగేందుకు సరిగ్గా సరిపోయే విధంగా ఉంటాయి.

లోపల భాగాలు

బ్రెజ్జాలో ఉండే నల్లని రంగు థీం క్యాబిన్ ని సాధారణంగా ఉండే దాని కంటే చిన్నగా కనిపించేలా చేస్తుంది. ఈ డాష్బోర్డ్ చాలా అందంగా అమర్చడం జరిగింది మరియు దానికి మృధువైన టెక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. డాష్ చుట్టూ ఉండే డల్ సిల్వర్ ఆక్సెంట్స్, డోర్ పాడ్స్ మరియు S- క్రాస్ నుండి తెచ్చిన స్టీరింగ్ వీల్ లో చిన్న చిన్న టచ్ లు మాకు బాగా నచ్చాయి. చీపర్ మారుతి నుండి చాలా భాగాలు దీనిలో పెట్టినప్పటికీ బ్రెజ్జా యొక్క క్యాబిన్ చాలా ప్రీమియం గా కనిపిస్తుంది.

నువోస్పోర్ట్ లో జైలో ఏదైతే పాత క్యాబిన్ ఉందో అటువంటి డాష్బోర్డ్ నే అమర్చడం జరిగింది, ఇది అంత మంచి పరిణామం కాదని చెప్పవచ్చు. నియర్ స్లాబ్ సైడెడ్ ఫేసియా మరియు రౌండ్ గా A.C వెంట్స్ కొంచెం చూడడానికి ఎబెట్టుగా కనిపిస్తాయి. అంతేకాకుండా, క్యాబిన్ ఫినిషింగ్ అనేది డల్ గ్రే షేడ్ తో ముగించబడి అంత ఉత్తేజభరితంగా అయితే కనబడదు. మహీంద్రా సంస్థ దీనిలో మరింత స్పైస్ ని జోడించడానికి కార్బన్ ఫైబర్ ఫినిష్ ని డాష్ మరియు డోర్ పాడ్స్ చుట్టూ అందించడం జరిగింది, కానీ అది అంత బాగా అయితే ఏమీ కనిపించడం లేదు.

ఈ రెండు కార్ల యొక్క తెడా మనం గమనించినట్లయితే నువోస్పోర్ట్ లో అయితే కష్టబడి కారు ఎక్కాలి, అదే బ్రెజ్జాలో అయితే సునాయాసంగా ఎక్కి కూర్చోవచ్చు. మారుతికి SUV లతో అనుబంధించబడిన ఒక టిపికల్ సీటింగ్ స్థానం అయితే కలిగి లేదు. ఈ పొజిషన్ అనేది తటస్థంగా ఉంటుంది మరియు B- సెగ్మెంట్ హాచ్ తో దీనిని పోల్చవచ్చు. మరోవైపు, నువోస్పోర్ట్ లో కూర్చునేటపుడు ఎత్తుగా ఉంటూ రోడ్ వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. స్పేస్ విషయానికి వస్తే మహీంద్రా సంస్థ మారుతిని చిత్తు చేస్తుంది.

ఇది అప్పుడప్పుడు 7-సీటర్ గా కూడా పనికి వస్తూ,అయిదుగురు కూర్చుని ఉండడానికి మరింత స్థలాన్ని కలిగి ఉంది. ఇందులో మాకు బాగా నచ్చే అంశం ఏమిటంటే రిక్లైనింగ్ రేర్ బెంచ్. ఈ మూడవ వరుస సీట్లుని మనం వంచి తీసేస్తే విశాలంగా కూర్చోవచ్చు. ఈ రెండు కార్లలో కూడా వెనకాతల ముగ్గురు సులభంగా కూర్చోవచ్చు, కానీ నువో స్పోర్ట్ కి ఖచ్చితంగా పెద్ద షోల్డర్ రూం మరియు హెడ్‌రూం ఉంటాయి. ఇదిలా ఉండగా లెగ్రూం రెండిటిలోనీ ఇంచుమించు ఒకేలా ఉంటాయని చెప్పుకోవచ్చు.

మీరు ఎక్కువగా డ్రైవర్ సీటులో కూర్చోవాలనుకుంటే బ్రెజ్జా మీకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ సీట్లు బాగా బలంగా ఉంటాయి మరియు దూరపు ప్రయాణాలు అప్పుడు బాగా మద్దతుని కూడా అందిస్తాయి. మాకు దీనిలో ముఖ్యంగా సైడ్ బోల్స్టరింగ్ నచ్చింది, ఎందుకంటే బాగా పెద్దగా ఉండే శరీరం కలిగి ఉండే వారు కూడా సౌకర్యంగా కూర్చోవచ్చు. బ్రెజ్జా లో సౌకర్యవంతమైన డ్రైవింగ్ స్థానానికి చేరుకోవడం చాలా సులభం. ఇదిలా చెప్తున్నప్పటికీ స్టీరింగ్ కి రీచ్ అడ్జస్ట్మెంట్ ఉండి ఉంటే ఇంకా సులభంగా ఉండేది. మారుతి అనేది ఎర్గొనామికల్లీ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది కాబట్టి. కూర్చోగానే వెంటనే ఇంట్లో ఉన్న భావన కలుగుతుంది. నువోస్పోర్ట్ లో వెళుతున్నప్పుడు అలవాటు పడడానికి కొంచెం సమయం పడుతుంది మరియు ఎర్గొనోమిక్స్ అంత బాగుండవు. అలాగే, మారుతిలోని ఉండే పరికరాల స్థాయిలు చాలా బాగుంటాయి. బ్రెజ్జా కారు నావిగేషన్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్, కూలెడ్ గ్లోవ్‌బాక్స్ మరియు నూవోస్పోర్ట్ లో లేనటువంటి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ని కలిగి ఉంటుంది. రెండు కార్లు కూడా ఒక టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి, కానీ బ్రజ్జాలోని 7 అంగుళాల యూనిట్ మెరుగైన ఇంటర్ఫేస్ ని కలిగి ఉంది, ఉపయోగించడానికి సులభం, మరియు మొత్తం ఉత్పత్తిని మెరుగైనదిగా చేస్తుంది. అలాగే ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు మద్దతు ఇస్తుంది. మహీంద్రాలోని 6.2-అంగుళాల యూనిట్ పాతబడిపోయి ఉంది మరియు ఇది ఉపయోగించడానికి మృదువుగా లేదు.

ఇంటీరియర్స్ కి సంబందించినంత వరకూ ఈ రెండిటిలోనూ చూసుకుంటే మారుతి బాగుంటుంది. ఇది బాగా నిర్మించబడింది మరియు మంచిది. చౌకైన మారుతీతో భాగస్వామ్యం అయినఫ్ఫటికీ కూడా క్వాలిటీ స్థాయిలు దాని తరగతిలో ఉత్తమమైనవిగా ఉన్నాయి. నువోస్పోర్ట్ యొక్క ప్రధాన లక్ష్యం స్పేస్. మహీంద్రా తన ప్రత్యర్ధులతో పోటీ పడేందుకు, ఇంటీరియర్ డిజైన్ ను ఇంకా అప్డేట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. నువోస్పోర్ట్ లో లక్షణాల జాబితా మాములుగా చూసుకుంటే బాగున్నాయి అనిపిస్తుంది, కానీ దాని పోటీదారులతో పోలిస్తే బలహీనంగా అనిపిస్తుంది.

పనితీరు

ఇలా ఆ రెండూ పోటీ పడుతున్నాయి:

నిర్దేశాలు

మహీంద్రా నువోస్పోర్ట్

మారుతి విటారా బ్రజ్జా

ఇంజిన్ పేరు

1.5 లీటర్ 12V mHawk డీజిల్

1.3-లీటర్ 16V DDiS 200 డీజిల్

పవర్

100bhp@3750rpm

88.5bhp@4000rpm

టార్క్

240Nm @ 1600-2800rpm

200Nm@1750rpm

ట్రాన్స్మిషన్

5 స్పీడ్ - మాన్యువల్ / AMT -వెనుక వీల్ డ్రైవ్

5 స్పీడ్ - మాన్యువల్ -ఫ్రంట్ వీల్ డ్రైవ్

మైలేజ్

17.45 kmpl

24.3 kmpl

బరువు

2220 kg

1680 kg

రెండు ఇంజన్లు కూడా పనితీరు కంటే సిటీ డ్రైవింగ్ కి బాగా పనికి వస్తాయి అని చెప్పవచ్చు. మహీంద్రా సంస్థ నువోస్పోర్ట్ తో టర్బో-లాగ్ ను నియంత్రించగలిగింది. ఈ టార్క్ కిక్స్ బాగా రావడం వలన తరచుగా గేర్ మార్పులు అవసరం లేకుండా సిటీ లో మీరు సులభంగా తిరగవచ్చు. ఒకవేళ మీరు గేర్లను మార్చకూడదనుకుంటే, మీకు AMT ఆఫర్ కూడా ఉంది. బ్రజ్జా మోటారు 2000Rpm లో ఖచ్చితంగా టర్బో లాగ్ తో బాధపడుతూనే ఉంది. అది గాని దాటితే మోటారు 200Nm టార్క్ ని ఉత్తమంగా అందిస్తుంది.

రెండు కార్లను వెనువెంటనే డ్రైవ్ చేస్తే మీరు ఇంజిన్లు వేర్వేరు లక్షణాలను కలిగి ఉంటాయని గ్రహించవచ్చు. మహీంద్రా నెమ్మదిగా టార్క్ ని అందుకుంటుంది, అయితే మారుతి వేగం పెరుగుతున్న కొలదీ మంచి టార్క్ ని అందుకుంటుంది. మీకు మీరే డ్రైవ్ చేద్దాము అనుకుంటే మాత్రం బ్రెజ్జా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ మరియు అందంగా అమర్చబడిన స్టీరింగ్ మీకు చిరునవ్వుని అందిస్తాయి. టర్న్స్ దగ్గర మనం చూసుకున్నట్లయితే సమంగా ఉంటుంది, బాడీ మొత్తం తిరిగిపోకుండా చక్కగా టైరు సులభంగా తిరుగుతుంది. మారుతి సంస్థ డ్రైవర్ ని భయపెట్టకుండా కార్నర్స్ ని చక్కగా హ్యాండిల్ చేసేందుకు బ్రెజ్జాలో స్టిఫ్ సస్పెన్షన్ సెటప్ ఎంపిక చేసుకుంది.

ఈ స్టిఫ్ సెటప్ అనేది ఎక్కువ టర్న్స్ చేయాల్సి వచ్చినప్పుడు బాగా పనిచేస్తుంది. ఏదేమైనా, ప్రతీరోజు వెళ్ళేందుకు అంత అనుకూలంగా ఉండదు. తక్కువ వేగంలో ఉన్నప్పుడు ఇది గుంతలు, గొయ్యలను క్యాబిన్ లోనికి తెలిసే విధంగా ఉంటాయి. రైడ్ క్వాలిటీ నువోస్పోర్ట్ లో ఇచ్చే అంత కుషనీగా ఉండదు, ఎందుకంటే నువోస్పోర్ట్ రోడ్ మీద ఉండే అసమానతలను చక్కగా నిర్వహిస్తుంది. మహీంద్రాలో ఎవ్వరూ కూడా గతకలు లేదా గుంతలు అంత పెద్దగా అనుభూతి చెందరు. ఈ కారణంగా, బాడీ రోల్ గణనీయమైన మొత్తంగా ఉండడం వలన అధిక వేగంలో రైడ్ కొద్దిగా ఎగిరి పడే విధంగా ఉంటుంది.

కాగితంపై చూస్తే మహీంద్రా మారుతిని మించిపోయినట్టుగా కనిపిస్తుంది. మహింద్రా సంస్థ ఆప్ష్నల్ AMT తో అదనంగా 10bhp పవర్ మరియు 40Nm టార్క్ ని అందిస్తుంది, బాదాకరంగా దీనిని బ్రెజ్జా ఓడించలేకపోయింది. ఈ విషయంలో మాన్యువల్ బాగుంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము. మొత్తంగా చూసుకుంటే సామర్ధ్యం పరంగా మాన్యువల్ మంచి ఫలితాన్ని అందిస్తుందని చెప్పవచ్చు, హైవే మానర్స్, స్టీరింగ్ అనుభూతి మరియు ఫీడ్‌బ్యాక్ మరియు సాధారణంగా డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బాగుంటాయి. నువోస్పోర్ట్ నగరం లోపల మంచి రైడ్ నాణ్యత అందిస్తుంది మరియు ఒక ఆప్ష్నల్ AMT తో కూడా ఉంది.

తీర్పు

ధరలు సుమారుగా ఒకేలా ఉంటూ మరియు బేస్ వెర్షన్స్ రెండూ కూడా రూ.7.4 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్, ముంబై) ధరతో ప్రారంభమవుతాయి. అయితే దీనిలో ఏది మంచిది, మీకు అధనపు సీట్లు గనుక అవసరం లేదు అనుకుంటే మీరు విటారా బ్రెజ్జ ను ఎంచుకోవచ్చు. ఇది బాగా నిర్మించబడింది, ఉత్తమంగా అమర్చబడుతుంది మరియు ఆధునిక భావనను అందిస్తుంది. క్వాంటోతో పోల్చితే నువోస్పోర్ట్ మంచి ప్యాకేజీగా ఉన్నప్పటికీ, మహీంద్రా ఏకకాలంలో నాణ్యతను కూడా పెంచాలి.

మారుతి విటారా బ్రెజా 2016-2020

మారుతి విటారా బ్రెజా 2016-2020 ఐఎస్ discontinued మరియు కాదు longer produced.
డీజిల్24.3 kmpl
a
Published by

arun

తాజా ఎస్యూవి కార్లు

ఫేస్లిఫ్ట్
Rs.67.65 - 71.65 లక్షలు*
Rs.11.70 - 20 లక్షలు*
Rs.20.69 - 32.27 లక్షలు*
Rs.13.99 - 21.95 లక్షలు*

Write your Comment on మారుతి విటారా బ్రెజా 2016-2020

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర