హ్యుందాయ్ వెర్నా vs హోండా సిటీ: పోలిక సమీక్ష

Published On మే 24, 2019 By tushar for హ్యుందాయ్ వెర్నా 2017-2020

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియమ్ సెడాన్లు రెండు యుద్ధాలు చేస్తున్నాయి. స్పష్టమైన విజేత ఇక్కడ ఉందా?  

పరీక్షించబడిన కార్లు: హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ MT SX (O) & హోండా సిటీ పెట్రోల్ MT VX

ఇంజన్: 1.6-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ | 123Ps శక్తిని / 151Nmటార్క్  vs 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ | 119PS శక్తిని/ 145NM టార్క్

ARAI సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎకానమీ: 17.70kmpl (వెర్నా) / 17.40kmpl (సిటీ)

వెర్నా రోడ్డు టెస్ట్ ఇంధన సామర్ధ్యం: 14.82kmpl (సిటీ) / 19.13kmpl (హైవే)

సిటీ రోడ్ టెస్ట్ ఇంధన సామర్ధ్యం: 13.87kmpl (సిటీ) / 19.21kmpl (హైవే)

టెస్ట్ చేసిన ధరలు: హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ SX (O) MT – రూ. 11.34 లక్షలు | హోండా సిటీ పెట్రోల్ VX MT- రూ 11.70 లక్షలు (రెండు ఎక్స్ షోరూం, ఢిల్లీ ధరలు)

Hyundai Verna vs Honda City: Comparison Review

అనుకూలతలు :

వెర్నా

  •  ప్రామాణిక భద్రతా కిట్ డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ABS మరియు ISOFIX లను కలిగి ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ 6 ఎయిర్బాగ్స్ తో వస్తుంది.
  •  ఇంజిన్ మరియు గేర్బాక్స్ కలయిక చాలా చక్కగా ఉంది, రోజువారీ డ్రైవింగ్ కోసం చాలా సులభంగా బాగుంటుంది.
  •  సౌకర్యవంతమైన రైడ్ నాణ్యత అందిస్తుంది, సస్పెన్షన్ చెడు రహదారులతో బాగా వ్యవహరిస్తుంది మరియు అధిక వేగంలో కూడా స్థిరత్వం అందిస్తుంది.   
  •  మంచి లక్షణాలతో లోడ్ చేయబడింది- ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్పిల్ తో టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, స్మార్ట్-ట్రంక్, ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్, LED టైల్ లైట్ లైట్లు మరియు మరిన్ని.
  •  6-స్పీడ్ AT రెండు ఇంజన్లు తో లభ్యమవుతుంది.

సిటీ:

  •  డ్యుయల్-ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS మరియు ISOFIX వంటి ప్రామాణిక భద్రతా లక్షణాలను ఇచ్చింది.
  •  పాల్టియల్ క్యాబిన్-  ఆరడుగుల పొడవైన నలుగురు పెద్దలకు తగినంత విశాలమైనది.
  •  లక్షణాలతో లోడ్ చేయబడింది- మిర్రర్లింక్ తో టచ్‌స్క్రీన్, Wi-Fi మరియు HDMI, టెలిస్కోపిక్ స్టీరింగ్, ఫుల్ LED హెడ్లైట్లు మరియు మరిన్ని.
  • పెట్రోల్ ఇంజిన్ డ్రైవ్ చేయడానికి సులభంగా ఉంటుంది మరియు మంచి పనితీరును అందిస్తుంది.  

ప్రతికూలతలు

వెర్నా

  •  వెనుక సీట్ స్పేస్ ఈ విభాగంలో సగటుగా ఉంది. సిటీ లేదా సియాజ్ లా అంత అయితే ఖచ్చితంగా బాగుండదు.  
  •  డిజైన్ అనేది బాగుంటుంది కానీ మరీ అంత అద్భుతమని చెప్పలేము. కొంచెం ఎబెట్టుగా ఉంటుంది

సిటీ :

  •  రైడ్ నాణ్యత కొంచెం గట్టిగా ఉండడం వలన రోడ్డుపై గతకలు, గంతలు అవీ ఉన్నా కూడా వెర్నా వలే బాగా నిర్వహించదు.
  •  పెట్రోల్ మాన్యువల్ టాప్-ఎండ్ ZX వేరియంట్ లో అందుబాటులో లేదు. సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్, LED టైల్ లైట్లు మరియు అడ్జస్టబుల్ వెనుక హెడ్ రెస్ట్లు లాంటి ఎంపికలను మిస్ చేస్తుంది.  
  •  ఫిట్, ఫినిష్ మరియు నిర్మాణ నాణ్యత వెర్నా వలే దీనిలో బాగుండదు.  

భిన్నంగా నిలిచే లక్షణాలు 

వెర్నా

  •  వెంటిలేటెడ్ ముందు సీట్లు
  •  స్మార్ట్-ట్రంక్
  •  ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేలతో టచ్‌స్క్రీన్
  •  ప్రొజెక్టర్ ఫాగ్ లైట్లు

సిటీ

  •  పూర్తి LED హెడ్ల్యాంప్లు
  •  Wi-Fi మరియు HDMI తో టచ్‌స్క్రీన్
  •  టెలిస్కోపిక్ స్టీరింగ్ సర్దుబాటు

బాహ్య భాగాలు

Hyundai Verna vs Honda City: Comparison Review

ఈ రెండు కార్లు కూడా డిజైన్ పరంగా ఇంచుమించు ఒకేలా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇవి ఖచ్చితంగా ఆకర్షిస్తాయి, కానీ ఎవరైనా ప్రక్క నుండి వెళుతున్నప్పుడు ఆగిపోయి మరీ అబ్బా ఈ కారు డిజైన్ అద్భుతం అని అనుకొనేంత అయితే ఉండదు. సిటీ మరియు వెర్నా కూడా వారి పాత తోబుట్టువులు అయిన అకార్డ్ మరియు ఎలన్ట్రా నుండి స్టయిలింగ్ ప్రేరణ అనేది తీసుకుంటుంది. ఎలా చెబుతున్నప్పటికీ వెర్నా అనేది కొత్త కారు అయినప్పటికీ సిటీ ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది.

ఈ ఫుల్ LED హెడ్ల్యాంప్ లు మరియు ఫ్లయింగ్ H క్రోమ్ గ్రిల్ మనకి అకార్డ్ హైబ్రిడ్ యొక్క ముఖాన్ని తలపిస్తాయి, ఇంకా చెప్పాలి అంటే ఈ డే టైం రన్నింగ్ LED లు కూడా వెర్నా లో మరింత క్లాస్ గా అమర్చబడి ఉన్నాయి అని చెప్పవచ్చు. ఈ 16 అంగుళాల వీల్ డిజైన్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ శబ్ధాన్ని కలిగి ఉంటాయని అనుకుంటాము కానీ ఈ వీల్స్ అనేవి ప్రస్తుత సిటీ కి మరియు దాని మునుపటి మోడల్ కి ప్రధాన తేడాగా ఉంటాయి. ఈ పెట్రోల్ మాన్యువల్ కనుక, ఇది VX వేరియంట్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది, కాబట్టి మీరు స్ప్లిట్ LED టైల్ లైట్లను పొందలేరు. కానీ బ్లాక్ కట్ బంపర్ మరియు షార్క్ ఫిన్ రేడియో యాంటెన్నా దీనికి కొన్ని స్పోర్ట్ టచ్స్ జోడిస్తుంది.  

పరిమాణాల పరంగా రెండు ప్రత్యర్థులు పొడవు మరియు వీల్ బేస్ లో ఒకే విధంగా ఉంటాయి కానీ  వెర్నా యొక్క రూపకల్పన, మరింత ఫ్లుడిక్ గా ఉంటుంది అని చెప్పవచ్చు.

డైమెన్షన్ చార్ట్

మోడల్

హోండా సిటీ

హ్యుందాయ్ వెర్నా

LxWxH

4,440mm x 1,695mm x 1,495mm

4,440mm x 1,729mm x 1,475mm

వీల్బేస్

2,600mm

2,600mm

గ్రౌండ్ క్లియరెన్స్

165mm

165mm

Hyundai Verna vs Honda City: Comparison Review

వెర్నా చూడడానికి బాగా సమపాళ్ళల్లో ఉంటుంది, సిటీ కంటే వెడల్పుగా ఉండి మరియు సిటీ కన్నా ఎత్తులో తక్కువగా ఉంటుంది, సిటీ కారు చూడడానికి పెద్ద కారుగా కనిపిస్తుంది. హ్యుందాయ్ వెర్నా అనేది చూడడానికి పెద్ద తేడాలు ఏమీ లేకపోయినా కూడా ముందు దాని కంటే కూడా భిన్నంగా కనిపిస్తుంది మరియు ముందు దాని కంటే కూడా అందంగా కనిపిస్తుంది. మీరు LED హెడ్లైట్లు పొందడం లేదు, కాని ప్రొజెక్టర్ బీంస్ అనేవి హెడ్ల్యాంప్స్ మరియు ఫాగ్ ల్యాంప్స్ లో ఉన్నాయి. సిటీ అనేది కార్నరింగ్ ఫంక్షన్ తో కూడా అందించబడుతుంది.  

ఈ 16-ఇంచ్ వీల్స్ అనేవి సిటీ అంత ఫంకీ గా ఉండవు, కానీ చూడడానికి చాలా బాగుంటాయి. వెనుకవైపు, LED టెయిల్ లాంప్ డిజైన్ అనేది ఎలంట్రా తో పోలి ఉన్నట్టు ఉంది అని మనం సులభంగా తికమక పడవచ్చు, కానీ ఈ కోణంలో వెర్నా అనేది చాలా బాగుంటుంది.

ఫిట్ మరియు ఫినిషింగ్ అనేది వెర్నా లో చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనిలో మంచి సాలిడ్ బాడీ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. మనం డోర్ ని ఓపెన్ చేసినా లేదా మూసి వేసినా దాని యూరోపియన్ ప్రత్యర్థులకు చాలా పోలి ఉన్నట్టుగా అనిపిస్తుంది.

లోపల భాగాలు  

Hyundai Verna vs Honda City: Comparison Review

బాహ్య భాగాలు లానే లోపల భాగాలలో కూడా సిటీ నే చాలా అద్భుతంగా ఉండే కారు అని చెప్పవచ్చు. లేత గోధుమరంగు-నలుపు-సిల్వర్ కలయిక ఏదైతే ఉందో దీనిని తియ్యగా తీసేయడం జరిగింది మరియు దీని యొక్క డాష్‌బోర్డ్ డిజైన్ కూడా వెర్నా లో ఉన్నట్టుగా ఉండకుండా చూడడానికి కొంచెం బిజీ బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఫ్రేం లెస్ రేర్ వ్యూ మిర్రర్స్ వంటి సాధారణ మెరుగులు సందర్భోచిత భావనను మెరుగుపరుస్తాయి. విరుద్ధంగా, వెర్నా యొక్క డాష్బోర్డ్ లేఅవుట్ సురక్షితంగా అనిపిస్తుంది. చాలా బాగా తెలిసినట్టు దాదాపుగా చాలా సురక్షితంగా ఉంటుంది. ఏక్సెంట్ లో గనుక కూర్చున్నట్లయితే మరియు దీనిలో కూర్చొని చూస్తే పెద్ద భిన్నంగా ఏమీ అనిపించదు.

Hyundai Verna vs Honda City: Comparison Review

హ్యుందాయి కార్లు ఎక్కువగా వాడిన వారు ఈ వెర్నా కారు లే అవుట్ కి అస్సలు తికమక పడరు అని చెప్పాలి. ఎందుకంటే దీనిలో అన్ని కంట్రోల్స్ మీరు ఎక్కడైతే అలవాటు పడ్డారో అలానే ఉంటాయి, మీరు వేరే ఏ బ్రాండ్ వాడుతున్నాకూడా దీనికి అలవాటు పడడం అనేది చాలా సులభం. సిటీ యొక్క క్యాబిన్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది, మీరు దాని మీద వెళుతున్నప్పుడు కొంచెం దాని మీద దృష్టి అనేది పెట్టాలి. ఫిట్ మరియు నాణ్యత విషయంలో వెర్నా ఉత్తమంగా ఉంటుంది మరియు ఉపయోగించిన ప్లాస్టిక్లు మరింత బలంగా మరియు స్థిరమైనవిగా ఉంటాయి.  

ఇక్కడ ఒక మంచి అంశం ఏదైనా ఉంది అంటే మీరు ఒక టేప్ ని తీసుకొని కొలిచి చూస్తే గనుక రెండిటికీ 2600 వీల్బేస్ ఉన్నప్పటికీ ఇక్కడ మరింత విశాలమైనదిగా సిటీ అనిపిస్తుంది అని చెప్పవచ్చు.

ఇంటీరియర్ కొలత టేబుల్

కొలతలు

హోండా సిటీ

హ్యుందాయ్ వెర్నా

వెనుక సీట్ షోల్డర్ రూమ్

1325mm

1315mm

వెనుక సీటు హెడ్ రూమ్

895mm

875mm

వెనుక మోకాలి గది (మిన్-మాక్స్)

790-1000mm

600-840mm

వెనుక సీట్ బేస్ (పొడవు x వెడల్పు)

480mm x 1300mm

490mm x 1260mm

ఫ్రంట్ లెగ్ రూమ్ (మిన్ x మాక్స్)

980-1200mm

1030-1270mm

ఫ్రంట్ హెడ్ రూం (మిన్-మాక్స్)

865-960mm

880-960mm

బూట్ స్పేస్

510-లీటర్

480-లీటర్

6.5 అడుగుల పొడవైన ఇద్దరు వ్యక్తులు చాలా సౌకర్యవంతంగా ఒకరు వెనకాతల ఒకరు కూర్చోవచ్చు, కాబట్టి 6 అడుగుల వ్యక్తులకి ఎటువంటి సమస్య దీనిలో ఉండదు. మీరు సిటీ లో టెలీస్కోపిక్ స్టీరింగ్ సర్దుబాటు పొందడం వలన మీరు సిటీ లో పరిపూర్ణ డ్రైవింగ్ స్థానం సులభంగా సెట్ చేసుకోవచ్చు. వెర్నా యొక్క ముందు సీటు ఆరోగ్యకరమైన ప్రయాణ శ్రేణిని కలిగి ఉంటుంది మరియు పర్యవసానంగా, ముందు లెగ్ రూం మీరు నగరంలో పొందుతున్న దాని కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ ట్రావెల్ రూం అనేది అంత బాగుండదు.

Hyundai Verna

అయితే వెనకాతల భాగం నుండి ఈ కారుని చూస్తే వెర్నా ఈ సెగ్మెంట్ లో అంత పెద్ద కారు అని ఎవరికీ అనిపించదు. ఒక 6 అడుగుల పొడవైన డ్రైవర్ కి, కావలసిన స్థలం మాత్రమే ఉంటుంది, అంటే వాళ్ళు కొంచెం ఇరుకుగా కూర్చోవాల్సి ఉంటుంది. అదే సగటు పరిమాణం గల ప్రయాణీకులకు వెర్నా లో అంత సమస్యని అయితే ఎదుర్కోరు, కానీ పొడవైన కొనుగోలుదారులు ఖచ్చితంగా సిటీ వైపు మొగ్గు చూపుతారని చెప్పవచ్చు. దీనికి ఇంకొక కారణం ఏమిటంటే హోండా సిటీ యొక్క రూఫ్ అనేది కొంచెం ఎత్తుగా ఉండడం వలన మంచి అత్యుత్తమ హెడ్ రూమ్ దీనిలో ఉంటుంది. హోండా గనుక మనకి వెనకాతల కూర్చొనే వారికి అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్ ని ప్రామాణికంగా అందించినట్లయితే అది టాప్ వేరియంట్ లో మాత్రమే ఉంది కాబట్టి ప్రామాణికంగా అందించి ఉంటే గనుక ఇంకా బాగుండేది అని మా భావన.

హోండాకు మరో అద్భుతంగా ఉన్న లక్షణం ఏమిటంటే దాని సీట్లు అని చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా బారీ శరీరం ఉన్న వారికి బాగా మద్దతుని ఇస్తాయి మరియు ముందు భాగంలో తొడ క్రింద మద్దతు మరియు వెనకాతల భాగంలో కూడా సపోర్ట్ ని పొందుతాయి. ఈ రెండు కారులకి కూడా సరైన కుషనింగ్ ఉంటుంది, ఇది మరీ గట్టిగా ఉండదు, అలా అని మరీ మెత్తగా ఉండదు. లేట్హేర్టేట్ అప్హోల్స్టరీ మెటీరియల్ యొక్క ఎంపిక చాలా బాగుంటుంది, కానీ లేత గోధుమ రంగు యొక్క ప్రకాశవంతమైన షేడ్ సిటీ లో ఇంకా బాగుంటుంది.

Hyundai Verna

ప్రాక్టికల్ గా చూసుకుంటే లోపల క్యాబిన్ రెండిటిలో కూడా అంత నిరాస పరచదు. రెండిటికీ మంచి ఆర్మ్రెస్ట్ లు ఉన్నాయి, దాని క్రింద మంచి స్టొరేజ్ స్పేస్ కూడా ఉంది, అలానే రెండూ కూడా డోర్ బిన్స్ దగ్గర మంచి స్టొరేజ్ స్పేస్ ని కలిగి ఉన్నాయి. నిక్ నాక్స్ కోసం వెర్నా మంచి పని తీరుని అందిస్తుంది, గేర్ లివర్ ముందు ఏరియా కూడా మీ సెల్ ఫోన్స్ మరియు వాలెట్స్ పెట్టుకోడానికి చాలా బాగుంటుంది. అయితే కప్ హోల్డర్స్ హ్యాండ్‌బ్రేకుల ప్రక్కనే ఉన్నాయి కాబట్టి అవి కూడా ఉపయోగించుకోవచ్చు. సిటీ లో కప్స్ గేర్ లివర్ ముందు అందించడం జరిగింది, కాబట్టి మీరు దీనిలో ఫోన్స్ మరియు వాలెట్స్ పెట్టుకోడానికి ప్రత్యేకమైన స్థలాన్ని కలిగి ఉండరు, మీ వాలెట్ ని హ్యాండ్‌ బ్రేక్ క్రింద పెట్టుకోవచ్చు.

బూట్ స్పేస్ పరంగా రెండూ కూడా చాలా భిన్నంగా అయితే ఏమీ లేవు, కానీ సిటీ మనకి ఆకర్షణీయమైన 510 లీటర్ల బూట్ స్పేస్ ని అందించగా వెర్నా మనకి 480 లీటర్లు అందిస్తుంది. మీరు దీనిలో స్పేస్ గురించి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే రెండు బూట్ స్పేస్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. కార్నర్స్ కూడా చాలా విశాలంగా ఉండడం వలన మరియు లోడింగ్ లిప్స్ కూడా అంత ఎత్తుగా ఉండవు కాబట్టి సులభంగా లగేజ్ ని లోడ్ చేసుకోవచ్చు.

టెక్నాలజీ

Hyundai Verna

ఈ అంశంలో వెర్నా తనకి తానుగా భిన్నంగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. ఈ రెండూ కూడా రేర్ A.C వెంట్స్,  ఆటో A.C, ఎలక్ట్రికల్ సర్దుబాటు మరియు ఫోల్డబుల్ మిర్రర్స్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, కూలెడ్ గ్లేవ్ బాక్స్లు మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అంశాలను కలిగి ఉంటాయి. అవును, ఇవి సన్‌రూఫ్ లను కూడా కలిగి ఉన్నాయి.

అవి 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్స్ ని కూడా పొందుతున్నాయి, కానీ ఇక్కడతో ఈ ఒకేలా ఉండే లక్షణాలు ఆగిపోతాయని చెప్పవచ్చు. హ్యుందాయ్ వెర్నా యొక్క స్క్రీన్ సిటీ కంటే ఎక్కువ ఫ్లుడిక్ గా మరియు ప్రతిస్పందించే విధంగా ఉంటుంది. అలాగే ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్లతో వస్తుంది, అయితే సిటీ మిర్రర్లింక్ ని మాత్రమే అందిస్తుంది.

 

Honda City

సిటీ యొక్క హెడ్ యూనిట్ Wi-Fi మరియు HDMi  ఇన్పుట్ మరియు ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం తో  ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. కానీ అది స్పర్శ కి ప్రతిస్పందన సమస్య మాత్రమే కాకుండా, బ్లూటూత్ ద్వారా సంగీతాన్ని ప్రసారం చేసేటప్పుడు ట్రాక్లను దాటవేయడం వంటి స్టీరింగ్ నియంత్రణ సంబంధిత విధులలో కూడా కొన్ని ఇబ్బందులని కలిగి ఉంటుంది. అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే లోపల ఒక ఏనుగు ఉన్నట్టు ఉంటుంది. ఈ కారు అనేది మనకి హోండా కార్ ఇండియా చే అంతర్గతంగా అభివృద్ధి చేయబడినప్పటికీ, సెటప్ అనేది ఆఫ్టర్ మార్కెట్ యాడ్-ఆన్ లాగా కనిపిస్తుంది మరియు వెర్నా యొక్క యూనిట్ వలె డాష్ బోర్డ్ దీనిలో కలిసినట్టుగా ఉండదు.  

హోండా అనేది ఇక్కడ ఆకర్షణీయమైన లక్షణాలను కలిగి ఉంది. అవి ఏమిటంటే  8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ (vs  వెర్నా యొక్క 6 స్పీకర్ సెటప్) అందించడం ద్వారా వారి మ్యూజిక్ బిగ్గరగా వినడం ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. కానీ వెర్నా లో మనకి ఒక మంచి అంశం ఏమిటంటే కూలెడ్ ఫ్రంట్ సీట్లు, ఇలాంటి వాతావరణంలో ఈ ఆప్షన్ అనేది ఒక వరం అని చెప్పవచ్చు. ఇంకా దీనిలో స్మార్ట్ ట్రంక్ ఉంటుంది దీనివలన మనకి లగేజ్ లోడింగ్ అనేది సులభం అని చెప్పవచ్చు.

పనితీరు

Hyundai Verna vs Honda City: Comparison Review

పేపర్ అవుట్పుట్ గణాంకాలు అనేవి అంత వేర్వేరుగా ఏమీ ఉండవు, ఇంచుమించు ఒకేలా ఉంటాయి కానీ రెండూ కూడా భిన్నమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టేవారికి హ్యుందాయి వెర్నా యొక్క శుద్ధీకరణ స్థాయిలు మరియు శబ్దం నిర్వహణ సులభంగా ఈ తరగతి లోనే ఉత్తమంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. కొంచెం టైర్ నాయిస్ ఉన్నా కూడా క్యాబిన్ లోనికి అంతగా తెలియదు మరియు ఇంజన్ కూడా స్థిరంగా ఉన్నప్పుడు అంత శబ్ధం ఏమీ రాదు. మీకు అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది అది రన్నింగ్ లో ఉందా లేదా అని. ఇది పక్కన పెట్టి సిటీ యొక్క i-VTEC ఇంజిన్ ఇప్పటికీ బాగా శుద్ధి చేయబడి ఉంది, అయితే ఇంజిన్ మరియు పరిసర శబ్ధాలు అనేవి కొంచెం లోపలకి వినిపిస్తాయని చెప్పవచ్చు. వెర్నా దీని యొక్క ఆట ముందుకు తీసుకెళుతుంది.

పట్టణ డ్రైవింగ్ కూడా వెర్నాలో చాలా సున్నితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ మోటార్ అనేది తక్కువ ఆక్సిలరేషన్ లో కూడా మంచి టార్క్ ని అందిస్తూ, మీరు 30Kmph లో కూడా  6 వ గేర్ ని ఏ ఇబ్బంది లేకుండా సులభంగా పుల్ చేయవచ్చు. దీనికి విరుద్ధంగా సిటీ పెట్రోల్ ఇంజన్ అధిక గేర్-తక్కువ వేగం కలయికలను బాగా నిర్వహించే యంత్రం అయితే కాదు.   సిటీ యొక్క గేర్‌బాక్స్ నగరంలో ఇంకా కొంచెం బాగా మెరుగ్గా ఉండాలి అనిపిస్తుంది.

Hyundai Verna vs Honda City: Comparison Review

గేర్ మార్పులకు ఎక్కువ అవసరం ఉందని మా సామర్ధ్య పరీక్షలో చూపించింది, సిటీ కారు 13.87Kmpl మైలేజ్ అందిస్తుంది, దీనితో పోలిస్తే వెర్నా 14.82Kmpl మైలేజ్ అందిస్తుంది. అదనంగా, వెర్నా యొక్క త్రోటిల్ ప్రతిస్పందన చాలా ఊహాజనితంగా ఉంటుంది, మీరు ఎంత ఎక్కువ ఆక్సిలరేషన్ లో ఉన్నా కూడా త్రోటిల్ ప్రతిస్పందన దీనిలో బాగుంటుంది. సిటీ కారు ఈ అంశంలో అంత విరుద్ధంగా ఏమీ ఉండదు, కానీ తక్కువ వేగంలో, త్రోటిల్ మరింత స్నాచీ గా అనిపిస్తుంది. కానీ ఇది పెద్ద డీల్ బ్రేకర్ అయితే ఏమీ కాదు, కానీ వెర్నా లో ఇది ఇంకా బాగా ట్యూన్ చేయబడింది.

హైవేలో, అంతర్గత-నగర పర్యటనల సమయంలో, నాణ్యమైన తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. రెండు కార్లు గడియారం చుట్టూ మూడు అంకెల వేగాలను నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉన్నాయి, కానీ వెర్నా ఇంజిన్ ప్రశాంతముగా భావించబడుతోంది. వేగంగా వెళ్ళేటప్పుడు  సిటీ ఇంజిన్ కొంచెం శబ్ధాన్ని కలిగి ఉంటుంది మరియు  అధిక వేగం దీనిలో అధిగమించటం చాలా కష్టం అవుతుంది.

కానీ సిటీ కారు యొక్క ఇంజన్ కూడా మంచి పనితీరు ప్రయోజనాన్ని ఇస్తుంది. 0-100Kmph ని వెర్నా 11.3 సెకన్లలో చేరుకోగా సిటీ కారు 0-100 Kmph ని 9.64 సెకన్లలో చేరుకుంటుంది. ఈ విషయంలో సిటీ వేగవంతమైన కారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా, వెర్నాలో మెరుగైన టార్క్ డెలివరీ ఉండగా, అధిక గేర్లలో పనితీరు కొనసాగడానికి సిటీ లో గేర్ త్వరణాన్ని మెరుగ్గా అందిస్తుంది. త్రోటిల్ పిన్ ఇది వెర్నా కంటే 30-80 Kmph (మూడవ గేర్) ని ఒక సెకెండ్ వేగంగా నిర్వహిస్తుంది.  

పనితీరు టేబుల్

మోడల్

హోండా సిటీ

హ్యుందాయ్ వెర్నా

0-100

9.64 సెకెన్స్

11.31 సెకెన్స్

క్వార్టర్ మైల్

16.77 సెకెన్స్ @ 130.31kmph

17.65 సెకెన్స్ @ 126.46kmph

30-80 kmph

9.69 సెకెన్స్

10.3 సెకెన్స్

40-100 kmph

15.28 సెకెన్స్

16.92 సెకెన్స్

టాప్ స్పీడ్

189kmph

NA

హైవే సామర్థ్యం పరంగా, రెండు కార్లు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి, మరింత శక్తివంతమైన వెర్నా కారు 19.13Kmpl మైలేజ్ ని అందించగా, సిటీ కారు 19.21 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.   

ఇంధన సామర్ధ్యం టేబుల్  

మోడల్

హోండా సిటీ

హ్యుందాయ్ వెర్నా

సిటీ

13.86kmpl

14.82kmpl

హైవే

19.21kmpl

19.12kmpl

 మొత్తంమీద, వెర్నా అనేది తేలికనైది, మరింత విశ్రాంతి కలది మరియు రెండిటిలో వెర్నా సున్నితమైన డ్రైవ్ ని కలిగి ఉంది, అయితే సిటీ మరింత ఉత్సాహం అందిస్తుంది.  

రైడ్ మరియు నిర్వహణ

 Hyundai Verna vs Honda City: Comparison Review

మొత్తంగా చూసుకుంటే వెర్నా అనేది ఈ విభాగంలో పరిపక్వం కలిగినదిగా ఉంది. పాత కారు స్పీడ్ పెరుగుతున్న కొలదీ కొంచెం ఇబ్బందికరమైన రైడ్ ని కలిగి ఉంటుంది మరియు సస్పెన్షన్ కూడా బౌన్సీ గా ఉంటుందని చెప్పాలి. అయితే ఇప్పుడు సవరించిన సస్పెన్షన్ కేవలం మరింత స్థిరమైన రైడ్ ని అందించడం మాత్రమే కాదు చాలా సౌకర్యంగా కూడా ఉంటుంది. చెడు రహదారులు మరియు గతకలని కూడా సులభంగా దాటేస్తుంది. అలాగే ఒక SUV లో వెళ్ళినట్టు ప్యాసింజర్లను అటూ ఇటూ విసిరి వేయకుండా సౌకర్యంగానే ఉంచుతుంది. సిటీ లో ఉన్న అదే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ తో ఉన్నప్పటికీ ఇది పూర్తి ప్రయాణీకులతో లోడ్ చేయబడి ఉన్నా మరియు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా కొంచెం జాగ్రత్తగా దాటాలి.

సిటీ యొక్క రైడ్ అనేది స్పష్టంగా స్టిఫ్ గా ఉంటుందని తెలుస్తుంది. ఇది అధిక వేగంతో చాలా ఫ్లాట్ గా వెళుతుంది, కానీ చిన్న గడ్డలు మరియు విస్తరణ జాయింట్ లు ఉన్నప్పుడు అవి చాలా సులువుగా క్యాబిన్ లోనికి తెలుస్తాయి. ఈ స్టిఫ్ సెటప్ అనేది ఔత్సాహికులకు బాగా నచ్చుతుంది, ముఖ్యంగా ఇది సిటీ లో బాగా పనితీరుని అందిస్తుంది. మీ రోజూ ప్రయాణం అనేది మృధువుగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ హోండా యొక్క స్టీరింగ్ అనేది కొంచెం ఎక్కువ కమ్యూనికేటివ్ మరియు ప్రతిస్పందిస్తుంది, కనుక కార్నర్స్ లో తిరగడానికి చాలా బాగుంటుంది.

బ్రేకింగ్ టేబుల్

మోడల్

హోండా సిటీ

హ్యుందాయి వెర్నా

100-0kmph

3.26 సెకెన్స్/ 43.11m

3.29 సెకెన్స్/ 41.67m

80-0 kmph

2.61 సెకెన్స్/ 26.97m

2.67 సెకెన్స్/ 26.26m

రెండు కార్లు కూడా చాలా డీసెంట్ బ్రేకుల సమితిని కలిగి ఉంటాయి. ఇది 100 నుండి 0 కి వచ్చే క్రమంలో సిటీ 43.11 మీటర్లలో కవర్ చేయగా వెర్నా కారు 44.68 మీటర్లలో పూర్తి చేస్తుంది.

భద్రత

రెండు కార్లు కూడా చాలా డీసెంట్ బ్రేకుల సమితిని కలిగి ఉంటాయి. ఇది 100 నుండి 0 కి వచ్చే క్రమంలో సిటీ 43.11 మీటర్లలో కవర్ చేయగా వెర్నా కారు 44.68 మీటర్లలో యాంటీ-లాక్ బ్రేక్లు మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్లు అన్ని వేరియంట్లలో ప్రమాణంగా అందించబడతాయి , అలాగే ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు కూడా ఉంటాయి. అలాగే రెండూ కూడా 6 ఎయిర్బాగ్లను ఎంపిక చేసుకుంటాయి, కానీ హోండా సిటీ పెట్రోల్ మాన్యువల్ లో అది లేదు, కేవలం టాప్-ఎండ్ ZX వేరియంట్ లో మాత్రమే ఉంది. సిటీ కారు బహుళ-కోణ యాంగిల్ వెనుక కెమెరా కలిగి ఉంటుంది, కానీ వెర్నా వలె దీనిలో డైనమిక్ మార్గదర్శకాలు లేదా పార్కింగ్ సెన్సార్లు ఉండవు.  

తీర్పు

https://www.cardekho.com/cars/Hyundai

ఈ రెండు కార్లు కూడా ఇన్ని విభిన్న అంశాలను కలిగి ఉండడం వలన ఈ రెండు కార్లలో ఏది స్పష్టమైన విజేత అని చెప్పలేము. కానీ ఇక్కడ విజేత ఖచ్చితంగా ఉంది. హ్యుందాయి వెర్నా కి సిటీ లో ఉన్న ఆ 'X-ఫాక్టర్’  అనేది లేదు. ఎందుకంటే సిటీ కొంచెం మంచి డిజైన్ మూలకాలు మరియు మరింత ఉత్తేజకరమైన డ్రైవ్ ని అందిస్తుంది. ఇది క్యాబిన్ స్థలానికి వచ్చినప్పుడు కూడా ఇది హోండాతో సరిపోల్చలేము. మీరు గనుక ఒక పెద్ద ఫ్యామిలీ కి సరిపడా కారు కావలి లేదా మీరు ఒక డ్రైవర్ ని పెట్టుకొని కారు నడపాలి అనుకున్నా కూడా మీరు సిటీ ని తీసుకోండి.

కానీ పోల్చి చూస్తే కొంచెం తక్కువ స్థలం ఉన్న క్యాబిన్ లో గనుక కూర్చోవాలనుకుంటే దీనిలో వెర్నా గెలుస్తుంది. ఇది మెరుగైన మరియు మరింత స్థిరమైన మొత్తం నాణ్యతను అందిస్తుంది, ఇది మెరుగైన లక్షణ జాబితాని కలిగి ఉంటుంది, మరింత పరిణతి చెందిన డ్రైవ్, రైడ్ మరియు నిర్వహణ పద్ధతులను కూడా కలిగి ఉంటుంది మరియు ఇది చాలా సరసమైనదిగా ఉండటంతో ఇది అన్నింటినీ చేస్తుంది. ఖచ్చితంగా మీ డబ్బుకి మీరు న్యాయం చేసుకోవాలని అనుకుంటే వెర్నా ని కూడా తీసుకోవచ్చు.

తాజా సెడాన్ కార్లు

రాబోయే కార్లు

తాజా సెడాన్ కార్లు

×
We need your సిటీ to customize your experience