హ్యుందాయ్ వెర్నా: ఫస్ట్ డ్రైవ్ సమీక్ష

Published On మే 24, 2019 By alan richard for హ్యుందాయ్ వెర్నా 2017-2020

హోండా సిటీ కి మరియు మారుతి సియాజ్ కి సరికొత్త పోటీదారుడు అయిన హ్యుందాయి యొక్క కారు చివరకి మన దగ్గరకి వచ్చింది. చూడడానికి బాగుంటుంది, కానీ ఈ తరువాత తరం వెర్నా ఆ విభాగంలోనే ఫేవరెట్ గా నిలుస్తుందా?  

2017 Hyundai Verna

80 శాతం సమీప మార్కెట్ వాటాతో మారుతి సియాజ్, హోండా సిటీ కార్లు C-సెగ్మెంట్ లో మిడ్ సైజ్ సెడాన్ విభాగంలో ఓడించాల్సిన కార్లు. కొత్త హ్యుందాయ్ వెర్నా ఇప్పుడు పొడవుగా ఉంది, విస్తృతమైనది మరియు ఇది ముందు కంటే మరింత అధునాతన రూపాన్ని ధరిస్తుంది. ఈ కధ లోపల చాలా భిన్నంగా లేదు. ముఖ్యంగా, ఇది పూర్తిగా కొత్తగా ముఖ్యంగా, దీనికి సరికొత్త డిజైన్ నిర్మాణం అనేది ఉంది మరియు అన్నిటికంటే అతి పెద్ద సమస్య అయిన లూజ్ డైనమిక్స్ ని పరిష్కరించే ఒక సమాధానంగా ఈ కారుని అందిస్తుందని చెప్పవచ్చు. మేము కొచ్చికి వెళ్ళాము, వెర్నా యొక్క ఐదో తరం కారుని కనుక్కుందామని, అది ఈ విభాగాన్ని శాసించే సత్తా ఉందో లేదో తెలుసుకోవడానికి.

2017 Hyundai Verna

బయట భాగాలు

2017 Hyundai Verna

నాకు హుండాయ్ యొక్క ఫ్ల్యుడిక్ రూపకల్పన చేసిన కార్లు అనేవి అభివృద్ధికి పెద్ద స్కోప్ అనేది కలిగి లేదు. ఇది చెబుతున్నప్పటికీ డిజైన్ అనేది మంచి ఆకర్షణీయమైన ప్యాకేజీతో మంచి లుక్స్ తో ఫ్రెష్ గా ఉండే విధంగా దీనిని ఎల్లప్పుడూ మారుస్తూ వచ్చారు. ఈ ముఖం పబ్లిక్ కంటికి కొత్తది అయితే కాదు మరియు ఈ డిజైన్ మొదటిసారిగా చైనాలో వెల్లడి అయినప్పుడు వెలుగుని చూసింది. వాస్తవానికి ఇది సోలారిస్ బ్యాడ్జ్ కింద రష్యాలో ఇప్పటికే అమ్మకానికి ఉంది. భారతదేశం విషయానికి వస్తే వెర్నా కి  డే టైం రన్నింగ్ LED లతో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్  మరియు ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్ తో ఆ కొత్త పెద్ద ఫ్రంట్ గ్రిల్ వద్ద కలిగి ఉంటుంది.

2017 Hyundai Verna

ఈ షోల్డర్ యాక్సెంట్ అనేది విండో యొక్క క్రింద నుండి వెళుతుంటే అది మనకి  హ్యుందాయై ఎలంట్రా ని గుర్తుకు చేస్తుంది మరియు వెర్నా మరియు ఎలంట్రా రెండు కార్లు కూడా  K2 వేదిక మీద నడుస్తాయి. దీని అర్ధం ఏమిటంటే ఇది చూడడానికి కొంచెం పరిపక్వత చెందినట్టుగా ఉంటూ దాని పాత మోడల్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీని పొడవు 4440mm కు పెరిగింది, ఇది 65 మిమీ ముందు దాని కంటే ఎక్కువ. వెడల్పు 1729mm కలిగి ఉంటూ ముందు దాని కంటే 29mm పెరిగింది మరియు వీల్ బేస్ 2600mm వద్ద ఉంటూ ముందు దాని కంటే 30mm పెరిగింది. కానీ, పైకప్పు యొక్క పదునైన రేక్ ఉన్నప్పటికీ, ఎత్తు 1475mm వద్ద ఒకేలా ఉంటుంది.  

2017 Hyundai Verna

ఈ రూఫ్  శాంతముగా కారు వెనుక భాగంలోకి పడిపోతుంది మరియు క్రింద నుండి గనుక చూసినట్లయితే అది దాదాపు నాచ్‌బ్యాక్ లా ఉంటుంది. టెయిల్ లైట్స్ అనేవి ఎలన్ట్రాతో సమానంగా ఉంటాయి, అవి కూడా మూడు-యూనిట్ రూపకల్పనలో ఉన్నాయి, అయితే ఎలన్ట్రా వృత్తాకార LED మూలకాలు, వెర్నా స్పోర్ట్స్ సెమీ-వృత్తాకార యూనిట్లు గా ఉంటాయి. ఈ కొత్త బంపర్ అనేది కొంచెం పరిపక్వంగా ఉంటూ కొత్త లుక్ ని మరియు మంచి అగ్గిని మనకి రాజేస్తుందని చెప్పవచ్చు.

2017 Hyundai Verna

లోపల భాగాలు

2017 Hyundai Verna

వెర్నా యొక్క అంతర్గత భాగాలు ఎల్లప్పుడూ దాని బలమైన పాయింట్లు అని చెప్పవచ్చు మరియు కొత్త కారు మెటీరియల్స్ మరియు ప్లాస్టిక్స్ లో అదే స్థాయిలో నాణ్యత కలిగి ఉంది. ఈ డిజైన్ అయితే ఇతర కొత్త హ్యుందాయ్స్ లో ఏమైతే చూస్తామో దీనిలో కూడా అలానే ఉంటుంది, కాబట్టి అది ఏ వింత లేదు మరియు ఒక కొత్త కారు అన్న ప్రత్యేకత అయితే ఏమీ లేదు. పాత వెర్నాతో పోల్చి చూస్తే గనుక ఈ డిజైన్ కొంచెం అంత అద్భుతంగా అనిపించదు మరియు ఆడంబరమైనదిగా అనిపిస్తుంది. అంతేకాకుండా డాష్ మరియు స్టీరింగ్ వీల్స్ మీద ఉన్న అన్ని స్విచ్లు మంచి అనుభూతిని ఇచ్చి అందంగా నిర్మితమైనట్టు ఉంటాయి.

2017 Hyundai Verna

సెంట్రల్ కన్సోల్ పెద్ద 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే ని కలిగి ఉంది, ఇది ప్రత్యేకంగా వేర్వేరు ఫంక్షన్ల కొరకు బటన్స్ తో పెయిర్ చేయబడి ఉంటుంది. ఉదాహరణకు ఇది మారుతి సియాజ్ లాంటి అన్ని టచ్-ఆధారిత సిస్టమ్ కంటే మంచి అనుభూతి అహ్లాదకరంగా ఉంటుంది.

ఈ ముందర సీట్ల విషయానికి వస్తే మంచి లంబర్ సపోర్ట్ తో మెత్తటి కుషనింగ్ కలిగి ఉంటుంది మరియు మంచి సపోర్ట్ ని అందిస్తుంది. ఈ సీట్లు కూడా కొంచెం పెద్దవిగా ఉండి ఉంటే తొడ క్రింద భాగంలో మంచి మద్దతు ని అందించి ఉండేది మరియు బాగుండేది. నిస్సందేహంగా ఇది మద్దతు ని అందిస్తుంది కానీ మేము ఇంకా మంచి ఎక్కువ మద్దతు ని కోరుకుంటున్నాము. ఈ ముందర సీట్లలోకి వస్తే ఇక్కడ లెగ్‌రూం కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ కారులో నా కొలీగ్ తుషార్ వంటి ఆరడుగుల పొడవు వ్యక్తులు కూడా సులభంగా సౌకర్యంగా కూర్చోవచ్చు. దురదృష్టవశాత్తు, అతను మాతో డ్రైవ్ లో లేడు, కానీ మేము త్వరలోనే కారును పరీక్షించేటప్పుడు ఈ అంశాన్ని ఖచ్చితంగా పరీక్షించి చూస్తాము.

2017 Hyundai Verna

ఇది సెగ్మెంట్ లో ఎయిర్-కూలెడ్ సీట్లను కలిగి ఉన్న మొట్టమొదటి కారు, మరియు కొచ్చిలోని వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో ఇది దేవుడు పంపినట్టుగా ఉంది అని చెప్పాలి. ఆశ్చర్యకరంగా, కొలతలు పెరుగుదల అనేది వెనుక సీటు లో అయితే అంత బాగా అనిపించడం లేదు. పెద్ద వారికి కావలసినంత లెగ్‌రూం ఉంటుంది మరియు మరో ముగ్గురిని సులభంగా కూర్చో పెట్టవచ్చు. ఇది సియాజ్ లేదా సిటీ లా ఉదారంగా ఎక్కడా కూడా అనిపించదు. ఇక్కడ మనకి నచ్చిన విషయం ఏమిటంటే వెనుక A.C వెంట్లు మరియు ఒక USB ఛార్జర్ ఉండడం ఇది తక్కువ రకం E వేరియంట్ లో తప్ప అన్నిటిలో ఉంటుంది ఇది మనకి బాగా నచ్చుతుంది.

2017 Hyundai Verna

టెక్నాలజీ, లక్షణాలు మరియు భద్రత

టాప్ ఎండ్ వేరియంట్ మేము నడిపి చూసాము, దీనిలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ వంటి కనెక్టివిటీ ఫంక్షన్లకి నావిగేషన్ నుండి అన్నీ ఉన్నాయి. ఇది ఇప్పుడు సెగ్మెంట్ లో ఉన్నధోరణులను కొనసాగించడంలో ఒక విద్యుత్ సన్రూఫ్ ని పొందుతుంది మరియు హ్యాండ్స్-ఫ్రీ బూట్ బూట్ లిడ్ తో వస్తుంది, దీనికోసం మీ జేబులో కీతో మూడు సెకన్లపాటు బూట్ దగ్గర నుండి మూడు అడుగుల దూరంలో ఉన్నట్లయితే అది ఓపెన్ అయిపోతుంది. ఈ లక్షణం అనేది ఒకే వ్యక్తి గనుక షాపింగ్ కి వెళ్ళి బోలెడు అంత సామనుతో రెండు చేతులు ఖాళీగా లేకుండా ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది, అయితే అన్ని-LED హెడ్ల్యాంప్లు మరియు రెయిన్-సెన్సింగ్ వైపర్లను మిస్ అవుతుంది, అవి హోండా సిటీలో అందుబాటులో ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్ 6 ఎయిర్బాగ్లను పొందడం కొనసాగుతూ ఉండగా డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ మరియు ABS పరిధి అంతటా ప్రామాణికంగా అందించబడుతుంది.

2017 Hyundai Verna

దీనిలో ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం హ్యుందాయ్ ఆటో లింక్ అని పిలిచే ఒక యాప్, ఇది టాప్ ఎండ్ SX (O) వేరియంట్లలో ప్రామాణికమైనది. ఈ యాప్ హ్యుందాయి యొక్క R & D కేంద్రంలో హైదరాబాద్ లో అభివృద్ధి చేయబడింది. ఈ యాప్ ద్వారా మీ కారు కి మరియు మీ స్మార్ట్ కి జత కలిపి మీకు ఆ వాహన సమాచారం అంతా అందిస్తుంది, ఉదాహరణకి ఇంజిన్ స్పీడ్, ఇంజిన్ లోడ్ మరియు బ్రేకింగ్ అలవాట్లు, మీ ఇంటి నుండి అలాగే మీ సేవ యొక్క బుకింగ్ లేదా మీ డ్రైవింగ్ చరిత్రపై తనిఖీ చేయడం లేదా మీ చివరి పార్కింగ్ స్థలాన్ని నిల్వ చేయటం వంటి ఇతర సమాచారాన్ని పొందవచ్చు.  

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్

వెర్నా ఇప్పుడు పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్స్ తో లభిస్తుంది మరియు ఈ రెండూ కూడా మరింత శక్తివంతమైన 1.6 లీటర్ ఇంజన్లు ని కలిగి ఉన్నాయి. VVT పెట్రోల్ 123Ps శక్తిని మరియు 151Nm టార్క్ ని అందిస్తుంది, అయితే  CRDi డీజిల్ 128 Ps శక్తిని మరియు 260Nm టార్క్ ని అందిస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు రెండు ఇంజిన్లతో లభిస్తుంది మరియు మంచి డ్రైవబిలిటీ ని  మరియు సామర్ధ్యం అందించడం కోసం ఈ రెండూ కూడా 6-స్పీడ్ యూనిట్లు క్రింద అందించబడుతున్నాయి.

డీజిల్

Hyundai Verna: First Drive Review

1.6 CRDi ఇంజిన్ అవుట్గోయింగ్ మోడల్ లాగా చాలా శక్తివంతమైనది, కానీ ఇప్పుడు తక్కువ Rpm వద్ద ఎక్కువ టార్క్ ని అందిస్తుంది. అంటే దాని అర్ధం తక్కువ నగరపు స్పీడ్ లలో కూడా అంటే సుమారుగా 30Kmph ఉన్నప్పటికీ అంటే 3 వ గేర్ ట్రాన్స్మిషన్ ఉన్నా కూడా మీరు గ్యాస్ పెడల్ ను నొక్కినప్పుడు అది సులభంగా మిమ్మల్ని తీసుకెళిపోతుంది. ఆక్సిలరేషన్ లో కూడా కొంచెం పెరుగుతూ టర్బో స్పీడ్ అనేది సుమారు 1700-1800Rpm వద్ద మనకి అందిస్తుంది. ఇంకొక ప్రశంసనీయమైన అంశం ఏమిటంటే ఇంజన్ ఎక్కడ కూడా అలసట చూపించదు.

Hyundai Verna: First Drive Review

ఇది ఏమీ కదలకుండా ఉన్నప్పుడు కొంచెం శబ్ధం అయితే వస్తుంది, కానీ 1100-1800 Rpm మధ్యస్థ త్రోటిల్ ఇన్పుట్లలో ఉన్నప్ప్పుడు క్యాబిన్ లోపల శబ్ధాన్ని కలిగి ఉంటుంది. అన్ని ఆక్సిలరేషన్ రేంజ్ లలో ఇంజన్ అనేది అంత శబ్ధాన్ని అయితే కలిగి ఉండదు మరియు అది అంత పట్టించుకోవలసిన అవసరం లేదు అని చెప్పాలి. హ్యుందాయి ఏమి చెబుతుందంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో 24.75Kmpl మైలేజ్ ని మరియు ఆటోమెటిక్ లో 21.02Kmpl మైలేజ్ ని అందిస్తుంది. మునుపటి తరం వెర్నా మాన్యువల్ కోసం 23.9Kmpl మైలేజ్ ని మరియు ఆటో కోసం 19.08Kmpl మైలేజ్ ని అందిస్తుంది.

పెట్రోల్

Hyundai Verna: First Drive Review

123Ps పెట్రోల్ నిస్సందేహంగా రెండిటిలోనీ శబ్ధాన్ని కలిగి ఉండని ఇంజన్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇది మనకి మంచి డ్రైవబిలిటీ కోసం తయారుచేయడం జరిగింది. ప్రశాంతంగా మరియు మీ మూడ్ కూడా ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మీకు మంచి డ్రైవ్ ని అందిస్తూ 130.5Nm వరకూ మీకు టార్క్ ని అందిస్తుంది మరియు అతి తక్కువ 1500Rpm లో కూడా 151Nm టార్క్ ని అందిస్తూ మృదువైన పురోగతిని అందిస్తుంది. వాస్తవానికి, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది చాలా నెమ్మది అంటే  ఆరవ గేర్ లో 25 కిలోమీటర్ల స్పీడ్ లో కూడా (చాలా నెమ్మదిగా) ఎటువంటి పిర్యాదు లేకుండా వెళ్ళడం జరిగింది.   

Hyundai Verna: First Drive Review

మీరు వేగవంతమైన పురోగతిని చేయవలసి వస్తే, ఉదాహరణకు, వారు బఫేను మూసివేసే ముందు మీరు హోటల్ కి చేరుకోవాలి అంటే స్పీడ్ గా వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ ఇంజిన్ అనేది 3500-5000Rpm లో వెళ్ళినా కూడా అంతగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. హ్యుందాయి మాన్యువల్ కి 17.7Kmpl మైలేజ్ ని అందించగా ఆటోమెటిక్ పెట్రోల్ కొరకు 15.92Kmpl మైలేజ్ ని అందిస్తుంది. ఇది వెర్నా 4S అందించే దాని కంటే చాలా ఎక్కువ. వెర్నా 4S మాన్యువల్ కొరకు 17.01Kmpl మైలేజ్ ని మరియు మునుపటి 4-స్పీడ్ ఆటో కోసం 15.74Kmpl మైలేజ్ ని అందించేది.

ఆటోమెటిక్ గేర్‌బాక్స్

Hyundai Verna: First Drive Review

మాకు డీజిల్ మాన్యువల్ నడపడానికి అవకాశం రాలేదు, కానీ ఈ 6-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ని డ్రైవ్ చేసే అవకాశం మాత్రం మాకు వచ్చింది, అది మాకు ఒక మంచి అనుభూతిని అందించింది. ఈ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్లను 'స్లుష్ బాక్సుస్' అని పిలుస్తున్నారు, ఎందుకంటే అవి నెమ్మదిగా ప్రతిస్పందించడం మరియు త్రోటిల్ పెడల్ వద్ద డిస్కనెక్ట్ అయిన భావన కలగడం వలన దీనికి ఆ పేరు వచ్చింది. కానీ నేను నిజంగా ఈ హ్యుందాయ్ పునరుక్తి మాకు బాగా నచ్చింది. ఇది ప్రతిస్పందిస్తుంది మరియు త్వరగా ఉంటుంది మరియు పట్టణం చుట్టూ తిరిగినప్పుడు కూడా మనం తక్కువ ఇంపుట్స్ అందించినా కుడా మనం ఇచ్చే ఇంపుట్స్ కి ప్రతిస్పందిస్తూ మనకి బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పవచ్చు.

Hyundai Verna: First Drive Review

మీరు స్పీడ్ అనేది పెంచుతున్నప్పుడు మాత్రమే మీ సూచనలను అది ఫాలో అవ్వడం లేదు అనే అనుభూతి కలుగుతుంది మరియు ట్రాన్స్మిషన్ అనేది ఇంజిన్ ఆక్సిలరేషన్స్ కి అనుగుణంగా ఉండడానికి ఇబ్బంది పడుతూ ఉంటుందని మాకు అనిపించింది. ఈ ట్రాన్స్మిషన్ ని మీరు మాన్యువల్ మోడ్ లో పెట్టుకొని మీకు డ్రైవ్ చేయాలి అనిపించినప్పుడు ఆనందంగా డ్రైవ్ చేయవచ్చు. ఒక ఎంపిక చేసుకున్న గేర్ మీద హోల్డ్ చేసుకుంటుంది కానీ దానిని ఆటో మోడ్ లో ఉంచితే మంచిది అని మా సలహా, ఎందుకంటే మొత్తం డీజిల్ ఇంజన్ నుండి వచ్చే టార్క్ అంతా కూడా ఆటోమోడ్ లోనే బాగుంటుందని చెప్పవచ్చు. ఇంకా అది ఆటోమెటిక్ కావడం వలన గేర్ లు టార్క్ బట్టి అదే మార్చుకుంటూ వెళుతుంది మరియు వాటికే ఈ మోడ్ ఖ్యాతి చెందింది. 21Kmpl (డీజిల్) పేర్కొనబడిన మైలేజ్ నిజమే మాకు అంతే ఇచ్చింది.

హ్యాండ్లింగ్ మరియు రైడ్ నాణ్యత

పాత వెర్నాలో ఒక తీవ్రమైన కొరత ఏదైనా ఉందీ అంటే అది అధిక వేగాలలో అంత నమ్మకంగా ఉండదు, ఇప్పుడు కొత్త K2 ప్లాట్‌ఫార్మ్ వలన మరియు ముందు మరియు వెనుక సస్పెన్షన్ సెటప్ రెండూ కూడా మార్పులు చేయబడడం వలన, హ్యుందాయ్ పూర్తిగా డ్రైవింగ్ అనుభవం మార్చేసింది. ఈ స్టీరింగ్ అనేది పట్టణం లో చాలా తేలికగా ఉంటూ టైట్ గా ఉన్న ట్రాఫిక్ వీధుల్లో కూడా బాగా మద్దతు ఇచ్చింది మరియు హైవే మీద వేగం పెరుగుతున్నప్పుడు కూడా ఆ బరువు అనేది సమానంగా పంచబడుతూ మనకి మంచి రైడ్ అనేది అందిస్తుంది. ఈ స్టీరింగ్ కూడా మనకి ప్రత్యక్షంగా కనెక్ట్ అవ్వడం వలన మనం ఏదైతే స్టీరింగ్ ద్వారా పంపిస్తున్నామో అది ఫ్రంట్ వీల్స్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఫ్రంట్ వీల్స్ దీనికి అనుగుణంగా వెళతాయి అని చెప్పవచ్చు మరియు ఫ్రంట్ వీల్స్ దగ్గర ఏమిటి జరుగుతుందో కూడా మీకు తెలుస్తుంది.

Hyundai Verna: First Drive Review

ఇది కార్నర్స్ లో కూడా చాలా బాగా ప్రవర్తిస్తుంది అని చెప్పాలి. ఈ కారు యొక్క చాసిస్ ఫ్లాట్ గా ఉంటుంది మరియు అయితే కొంత రోల్ ఉన్నప్పటికీ అది మనకి అంత ఇబ్బంది అయితే పెట్టదు మరియు సులభంగా కంట్రోల్ కూడా చేయవచ్చు. బ్రేక్ పెడల్ కూడా కొంచెం గట్టిగా ఉంటుంది మరియు ఇది అంత సరళంగా ఉండనప్పటికీ మరియు తగినంత బ్రేకింగ్ శక్తిని కలిగి ఉంది, ఇది కొద్దిగా తేలికైన చర్యగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.   

Hyundai Verna: First Drive Review

రైడ్ నాణ్యత ఇప్పటికీ ప్రగతి చెందడంతో సౌకర్యం అనేది రాజీపడకుండా ఉంది. ఇది కూడా కొంచెం గట్టిగా ఉంటూ రోడ్ లో గడ్డలు మరియు లోపాలు గ్రహించి నిర్వహిస్తుంది. ఇది హుందాయ్ సస్పెన్షన్ పై చాలా పనిని చేస్తోంది అందువలన ఈ అనుభూతి మనకి కలిగింది. ఇది ముందు చక్రాలు పదునైన బంప్స్ పైకి వెళుతున్నప్పుడు వెనుకకు మరియు ముందుకు కదులుతూ ఉండడం వలన హారిజాంటల్ స్థానభ్రంశంను పరిమితం చేయడానికి ముందు మక్ పర్షన్ కనెక్షన్ యొక్క సెటప్ ని మార్చింది, వెనుక భాగంలో రైడ్ ని మరింత మెరుగుపరచడానికి అవరోధాల కోణాన్ని మరింత నిలువుగా మార్చడం జరిగింది. ఇది బాగా మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు.  

తీర్పు

మారుతి సియాజ్ డీజిల్ ధరలను సరిగ్గా సరిపోయేటట్లు మరియు హోండా సిటీ కంటే తక్కువగా ఉంటూ రూ .7,99 - రూ .12.39 లక్షల ధర వద్ద హ్యుందాయ్ సంస్థ వెర్నా కి పోటీతత్వపు ధరని కలిగి ఉంది, దీని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా జనాలని తమ వైపు తిప్పుకుంటాయి, ఉదాహరణకు  విద్యుత్ సన్రూఫ్ ని కొత్త సెగ్మెంట్ లో మొదట లక్షణాలు అయిన హ్యాండ్స్-ఫ్రీ బూట్ లిడ్ మరియు ఎయిర్ కూలెడ్ ముందు సీట్లు వంటివి. ఈ క్రొత్త అవతార్ హ్యుందాయ్ వెర్నా యొక్క డిజైన్ కి రిఫ్రెష్ మెచ్యూరిటీని తెచ్చింది.

Hyundai Verna: First Drive Review

కొత్త డైనమిక్స్ ఇప్పుడు మంచి నిర్వహణ మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప బాలెన్స్ ని అందిస్తూ మరియు పాత కారులో ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ సరి చేసుకుంటూ మనకి ఒక మంచి ప్రొడక్ట్ ని అందించిందని చెప్పవచ్చు. మూడు సంవత్సరాల / అపరిమిత కిలోమీటరు వారంటీ ఏదైతే ఇచ్చిందో అది చాలా తెలివైన కొనుగోలు అని చెప్పవచ్చు. దీనిలో ఒక ముఖ్యమైన లోపం ఏదైనా ఉంది అంటే వెనకాతల అంత స్థలం లేకపోవడం, ఎక్కువగా వెనకాతల కూర్చొనే వారు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇది అంతగా నచ్చకపోవచ్చు. అయినప్పటికీ, 5 వ తరం వెర్నా ఖచ్చితంగా మంచి బాలెన్స్ ని ఇస్తూ మిడ్ సైజ్ సెడాన్ కారు కొనుగోలుదారులకు హుండాయ్ షోరూం కి వెళ్ళేలా చేస్తుంది అని చెప్పవచ్చు.

తాజా సెడాన్ కార్లు

రాబోయే కార్లు

తాజా సెడాన్ కార్లు

×
We need your సిటీ to customize your experience