• English
  • Login / Register

2017 హ్యుందాయ్ వెర్నా: ఫస్ట్ డ్రైవ్ సమీక్ష

Published On మే 24, 2019 By cardekho for హ్యుందాయ్ వెర్నా 2017-2020

2017 Hyundai Verna: First Drive Review

మేము హుండాయ్ యొక్క కొత్త తరం వెర్నా ని డ్రైవ్ చేశాము. ఈ డ్రైవ్ చెన్నై శివార్లలోని హ్యుందాయ్ యొక్క పరీక్షా ట్రాక్ వద్ద చక్కగా జరిగింది, ఈ దక్షిణ కొరియా కారు తయారీదారు తమ యొక్క ప్రత్యర్ధులు అయిన హోండా సిటీ మరియు మారుతి సుజుకి యొక్క సియాజ్ కి పోటీగా విభాగానికి ఏమిటి తెస్తుంది అనేది చెప్పకనే చెబుతుంది. కార్యక్రమంలో ఎటువంటి కెమెరాలు అనుమతించబడనందువల్ల మేము కారును లోతుగా చూపించలేము. అయితే, ఈ హ్యుందాయ్ వెర్నా చూడడానికి ఎలా ఉంది అనేది మేము మీకు వర్ణించి చెప్పగలము.

హ్యుండాయ్ యొక్క కొత్త వెర్నా 2016 నుండి ప్రజల దృష్టిలో ఉంది. ఎలన్ట్రా వంటి తక్కువ మరియు స్పోర్టీ డిజైన్ ని కలిగి ఉన్న ఈ కారు  చైనాలో మొదటిసారి ప్రదర్శించబడింది, కానీ మన భారతదేశం లో లభించే వెర్షన్ రష్యా-స్పెక్ సోలారిస్ ఆధారంగా ఉంది, వెర్నాను అక్కడ అలా పిలుస్తారు. డిజైన్ పరంగా వ్యత్యాసాలు చిన్నవిగా ఉంటాయి - ఉదాహరణకు, భారతదేశం కోసం హెడ్ల్యాంప్ డిజైన్ తక్కువ అంచులో ఒక స్టెప్ లా అయితే లేదు మరియు టర్న్ సిగ్నల్ స్థానం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇంకా దిగువకి వస్తే, ఆ ఫాగ్ ల్యాంప్ కూడా చైనా-స్పెక్ కారులో వంటి విస్తృత ఎయిర్డామ్ లోకి వెళిపోయి కలిసిపోయినట్టుగా ఉండదు. వేర్నా డే టైం LED లు మరియు ప్రొజెక్టర్ ఫాగ్ లాంప్స్ తో ఉండే బై-జినాన్ హెడ్ల్యాంప్స్ కలిగి ఉంది.

2017 Hyundai Verna: First Drive Review

ప్రక్క నుండి గనుక చూసినట్లయితే, హ్యుందాయ్ వెర్నా విండో లైన్ కింద నడుస్తున్న ఒక అద్భుతమైన క్రీజ్ ని కలిగి ఉంది. ఫ్లూయిడ్ స్కల్ప్చర్  2.0 ఒక డైనమిక్ డిజైన్ లా దీనిని చేస్తుంది మరియు దీనికి ఒక మరింత పరిపక్వం అందిస్తుంది. ఈ యాంగిల్ నుండి వెర్నా దాని పెద్ద తోబుట్టువు, ఎలన్త్రా వలే కనిపిస్తుంది. మేము నడిపిన వెర్నా195/55 R16 లతో వచ్చింది, ఇది అవుట్గోయింగ్ కారులో అదే పరిమాణం కలిగి ఉంటుంది. ఈ టైర్లు డైమండ్-కట్ అలాయ్ వీల్స్ తో వస్తాయి. తక్కువ స్పెసిఫిక్ వేరియంట్లలో 185/65 R15 రబ్బరును కలిగి ఉంటాయి.

ఇప్పుడు దాని మూడో తరానికి చెందిన వెర్నా, అన్ని కొత్త K2 ప్లాట్ఫారమ్ మీద పెద్దదిగా తయారైంది మరియు ఇది 50% అధిక-బలం స్టీల్ తో పొందించబడింది. స్టీల్ మరియు డిజైన్ క్రాష్ రక్షణ మెరుగుపరచడానికి ఉపయోగించబదుతుంది. ఈ కొత్త ప్లాట్‌ఫార్మ్ పాదముద్ర మరియు అంచనాలను కూడా విస్తరించింది. హ్యుందాయి మనతో స్పెసిఫికేషన్స్ ఏమీ పంచుకోలదు, కానీ మేము ఏమిటి భావిస్తున్నాము అంటే, కొత్త వెర్నా పొడవులో 4,405mm (మునుపటి మోడల్ కంటే 30mm పొడవైన) ఉంటూ మరియు వెడల్పు లో 1,729mm (మునుపటి మోడల్ కంటే 29mm వెడల్పు), మరియు దాని వీల్ బేస్ లో ఇప్పుడు 2,600mm (మునుపటి మోడల్ మీద 30mm ఎక్కువ) ఉంటుందని ఊహిస్తున్నాము. కనుక ఇది పొడవైనది మరియు విస్తృతమైనది, కానీ అదే సమయంలో సొగసైన రూపాన్ని ఇవ్వటానికి రూఫ్ లైన్ 1,469 మిమీ (మునుపటి మోడల్ కంటే 6mm తక్కువ) వద్ద తక్కువగా ఉంచబడింది. పోల్చితే హోండా సిటీ 4440mm పొడవు, 1695mm వెడల్పు, 1495mm ఎత్తు, మరియు 2600mm ఒకేలా ఉండే వీల్బేస్ ని కలిగి ఉంటుంది.

2017 Hyundai Verna: First Drive Review

వెనుక నుండి చూస్తే ఆ రూఫ్ అనేది కొంచెం స్మూతు గా బూట్ లోనికి జారుకున్నట్టు ఉంటుంది. ముందు వెర్నాలో లాగా వెనకతాల ఉండే ప్రత్యక్షత దీనిలో తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక్కడ వెర్నా మనకి విలక్షణమైన టెయిల్ లాంప్ డిజైన్ ని కలిగి ఉంది, వాటిలో మూడు ల్యాంప్ క్లస్టర్స్ ఉంటాయి. ఈ సన్నగా ఉండే బంపర్ అనేది దిగువన మరింత రూపకల్పన అంశాలు ఇవ్వడం ద్వారా కొంచెం సన్నగా సొగసైనదిగా ఉండేలా మనకి కనిపిస్తుంది.  

లోపలకి రండి

మీరు లోపలికి అడుగు పెట్టి చూస్తే గనుక ఈ డిజైన్ పాత కారులో కంటే బాగా పరిపక్వం చెందినట్టు కనిపిస్తుంది. ప్లాస్టిక్స్ మరియు మెటీరియల్ యొక్క నాణ్యత మేము హుండైస్ నుండి ఎదురుచూసే అధిక బెంచ్మార్క్ ని కొనసాగించేలా ఉన్నాయి.  అయితే, డాష్ రూపకల్పన అనేది అన్ని కొత్త కార్ల నుండి మేము ఊహించినట్లుగా అద్భుతమైనది లేదా ఆధునికమైనదిగా లేదు. పంక్తులు మరియు స్విచ్లు బలంగా మరియు సరళమైనవి మరియు చాలా సుపరిచితమైనవిగా ఉంటాయి.

ఏడు-అంగుళాల టచ్‌స్క్రీన్ వ్యవస్థ పైన ఉన్న పైభాగంలో, పెద్ద ఎయిర్-కాన్ వెంట్స్ మధ్య ఉంటుంది, వీటితో సెంటర్ కన్సోల్ మూడు హారిజాంటల్ విభాగాలుగా విభజించబడింది. సిస్టమ్ ఊహించిన విధంగా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని అందిస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్స్ కూడా ఆన్-బోర్డు నావిగేషన్ ని కలిగి ఉంటాయి. దాని క్రింద మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నియంత్రణలు ఉంటాయి. ఎయిర్ కాన్ వ్యవస్థను ఎకో కోటింగ్ టెక్  ని కలిగి ఉంటుంది, దీనివలన ఎయిర్ లో ఏదైనా వాసన ఉన్నా కూడా అది తొలగించేస్తుంది. వెర్నా ఈ విభాగంలో కూలెడ్ ఫ్రంట్ సీట్లు అందించే ఏకైక కారు అని చెప్పవచ్చు మరియు బటన్స్ కన్సోల్ యొక్క క్రింద భాగంలో ఉంటాయి.

ఎగువ భాగంలో ఉన్న సీట్లు సున్నితమైన లెథర్ తో చుట్టబడతాయి. ఈ సీట్లు బాగా మెత్తగా మరియు విస్తృతమైనవిగా మరియు పెద్ద కుటుంబ సభ్యులకు మంచి సౌలభ్యాన్ని అందిస్తాయి. దీనిలో వెనుక బెంచ్ కొంచెం నిరుత్సాహపరుస్తుంది, లెగ్రూం కొద్దిగా టైట్ గా ఉంటుంది మరియు ఆరడుగుల పొడవు ఉన్న వ్యక్తులకు రూఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ముగ్గురు కూర్చోడానికి కూడా కొంచెం ఇబ్బందికరమని చెప్పవచ్చు. ఆశ్చర్యకరంగా మొత్తం పరిమాణాలలో పెరుగుదల వెనుక భాగంలో చాలా మంచి అనుభవాన్ని అయితే అనువదించలేదు.  వెనుక సీటు యజమానులు ఎయిర్ కాన్ వెంట్స్ ని పొందుతున్నారు మరియు కన్సోల్ లో USB ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది.

లక్షణాలు పరంగా వెర్నా చాలా బాగా సిద్ధం చేయబడింది! ఇది ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ సన్‌రూఫ్, హ్యాండ్స్ ఫ్రీ బూట్ ఓపెనింగ్ ఫంక్షనాలిటీ ని కలిగి ఉంటుంది, దీని వలన  మీ కాలి కింద కదల్చడం ద్వారా బూట్ ఓపెన్ అవుతుంది, వెనుక విండ్ స్క్రీన్ కోసం కర్టెయిన్, రివర్సింగ్ కెమేరా మరియు వెనుక పార్కింగ్ సెన్సార్స్ కలిగి ఉంటుంది. డ్రైవర్ కోసం మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కలిగి ఉంటుంది, ఇది డిస్టెన్స్- టు ఎంప్టీ లక్షణాన్ని కలిగి ఉంటుంది.  ఈ వెర్నా  6 ఎయిర్ బాగ్స్ ను అందిస్తోంది, మరియు ఏ వేరియంట్ లో వస్తాయని ఖచ్చితమైన వివరాలు మనకు లేవు, ABS మరియు డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్ అన్ని వేరియంట్స్ లో ఉంటుందని మేము అనుకుంటున్నాము.

వెళుతుండగా

వెర్నా గత తరానికి చెందిన పెద్ద ఇంజన్లను మాత్రమే కలిగి ఉంది. దాని అర్ధం అస్తమాను మారే వాల్వ్ టైమింగ్ తో కలిగి ఉండే 1.6 లీటర్ పెట్రోల్ మరియు వేరియబుల్ జ్యామెట్రీ టర్బో డీజిల్ లో మనకి ఎంచుకోడానికి రెండు ఆప్షన్స్ తో ఉన్నాయి. రెండు ఇంజన్లు ముందు లా అదే పవర్ ని అందిస్తుంది, పెట్రోల్ కి 123Ps శక్తిని మరియు డీజిల్ కి 128Ps శక్తిని అందిస్తుంది. ఖచ్చితమైన టార్క్ రూపాలు ఇంకా తెలియకపోయినా, హ్యుందాయి మనకి డీజిల్ కి 1250 Rpm వద్ద 245Nm టార్క్ ని అందించగా పాత వెర్నా అయితే 176Nm అందించేది. అలాగే పెట్రోల్ అయితే మనకి 1500Rpm వద్ద 130Nm టార్క్ ని అందించగా, పాత వెర్నా 122Nm టార్క్ ని అందిస్తుంది. ఈ ఇంజన్లను ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్సులతో అందించబడుతున్నాయి. ఇంధన సామర్ధ్యం మరియు పనితీరుపై ఆటో గేర్బాక్స్ పాత నాలుగు-స్పీడ్ యూనిట్ కి బదులుగా 6 స్పీడ్ గేర్బాక్స్ కి అప్గ్రేడ్ చేయబడింది.

2017 Hyundai Verna: First Drive Review

రష్యా స్పెక్ హ్యుందాయ్ సోలారిస్

మా క్లుప్తంగా ఉండే పరీక్షలో డీజిల్ ఇంజిన్ మాత్రమే అందుబాటులో ఉంది, కానీ రెండు గేర్బాక్స్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇంజన్ కొంచెం క్లాటర్ తో మొదలయ్యి అప్పుడప్పుడు మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది. మొత్తంగా, ఇంజిన్ మృదువైనది మరియు నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ ఇంజన్ కూడా డ్రైవ్ చేయడానికి తక్కువ స్పీడ్ లో చాలా సులభగాం ఉంటుంది మరియు కావలసినంత టార్క్ కూడా ఉంది. 30Kmph స్పీడ్ లో కూడా 3 వ గేర్ లో మీరు సౌకర్యవంతంగా వెళిపోవచ్చు. ఆక్సిలరేటర్ పెడల్ మీద నొక్కండి వెర్నా మీరు అనుకొనే ప్లేస్ కి సులభంగా తీసుకెళిపోతుంది. 1700Rpm వద్ద ఒక చిన్న పెరుగుదల మినహాయిస్తే పవర్ లో అంత పెద్ద తేడా ఏమీ లేదు. దీనివలన డీజిల్ తో సిటీ లో తిరగడానికి బాగుంటుంది. మాన్యువల్ క్లచ్ చాలా తేలికగా ఉంటూ కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ని కలిగి ఉంటుంది అని చెప్పవచ్చు, ఈ గేర్ షిఫ్ట్స్ అనేవి 6-స్పీడ్ గేర్ బాక్స్ లో చాలా ఆనందదాయకంగా ఉంటాయి, ఇది గేర్లను మార్చడానికి ఎడమ చేతి  చిన్నగా కదిలిస్తే చాలు మరియు వేగవంతమైన కదలిక అవసరం.

ఆటో గేర్బాక్స్ గేర్లను పైకి క్రిందికి మార్చడానికి సహేతుకంగా త్వరితంగా చేస్తుంది. ఇది మాన్యువల్ మోడ్ ని కలిగి ఉన్నప్పటికీ, దానంతట అదే పంపించుకోడానికి చాలా బాగుంటుందని మేము భావిస్తునాము. అది మాన్యువల్ మోడ్ లో పెట్టి కూడా డ్రైవ్ చేయచ్చు కానీ ఆటో మోడ్ లో ఉంటేనే అంది మంచి పనితీరుని అందిస్తుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మాన్యువల్ మోడ్ లో ఉంటే ఆ లివర్ ని ముందుకి వెనక్కి కదల్చడం మీకు అంత ఆనందదాయకంగా అనిపించదు.

ఇందులో ఇంకొక పెద్ద ఆసక్తికరమైన అంశం ఏమిటి అంటే ఏకాగ్రత. మేము ఈ వెర్నా బాగా టర్నింగ్స్ లో వాటిలో తిప్పినప్పటికీ అది పెద్దగా రోల్ అదీ చూపించలేదు, అది కొంచెం రోల్ అయితే అయ్యింది కానీ అంత పెద్దగా అయితే లేదు కంట్రోల్ లోనే ఉంది అని చెప్పాలి. గ్రిప్ కూడా చాలా బాగుంది మరియు అది చాలా సులువుగా నెమ్మదిగా దిశ మార్పుల ద్వారా ప్రశాంతతలో కొనసాగింది. ఇంతకుముందు, విద్యుత్ స్టీరింగ్ ముందు హ్యుందాయ్ వంటిది కాదు, ఇది చాలా తేలికగా, స్థిరమైనదిగా మరియు వాస్తవానికి మీరు ముందు చక్రాల వద్ద ఏం జరిగిందో తెలుసుకొనే విధంగా ఉంది. ఇది నిజంగా మెచ్చుకోదగిన విషయం మేము రైడ్ నాణ్యతను పరీక్షించలేకపోతున్నాము, కొత్త వెర్నా చెడు రహదారులలో కూడా మంచి పనితీరుని అందించేందుకు ప్రయత్నిస్తుంది మరియు దాని అధిక వేగ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.  దీని గురించి సరైన వివరణ మనం దీనిని పబ్లిక్ రోడ్లపై పరీక్షించినప్పుడే ఇవ్వగలం.

2017 Hyundai Verna: First Drive Review

వేరియంట్స్

పెట్రోల్: E, EX, EX Auto, SX, SX (O), SX (O) ఆటో

డీజిల్: E, EX, EX Auto, SX, SX+ఆటో, SX (O)

మేము నడిపిన డీజిల్ ఆటోమెటిక్ కారు లెథర్ సీట్లు మరియు విద్యుత్ సన్రూఫ్ తో వచ్చింది. అలాగే మంకి ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ మరియు కూలెడ్ ఫ్రంట్ సీట్లు అనేవి దీనిలో లేవు. ఇది మేము SX + వేరియంట్ గురించి అని భావిస్తున్నాము.

ఫర్స్ట్ టేక్

ఈ కొత్త వెర్నా అనేది మంచి సరైన పోటీ ధర వద్ద ప్రవేశపెట్టబడింది మరియు ఇది దాని పెట్రోల్ గ్రేడ్ లో మారుతి సియాజ్ కంటే మరింత ఖరీదైనప్పటికీ, డీజిల్ వేరియంట్స్ ఇంచుమించు అలానే ఉన్నాయి. మరోవైపు, హ్యుండాయ్ విజయవంతంగా హోండా సిటీ ధరలను తగ్గించింది, అయితే దాని ప్రాధమిక ప్రత్యర్థుల కంటే మరింత సమగ్రమైన సాంకేతిక ప్యాకేజీని మరియు శక్తివంతమైన ఇంజిన్లను అందిస్తుంది.

"వెలుపల భిన్నంగా కనిపించకపోయినా, అనుభవం కొత్తది మరియు ఉత్తేజకరమైనది”

ఇటీవలే నవీకరణ చెందిన హోండా సిటీ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన ఉత్పత్తిగా ఉంది మరియు ఈ సెగ్మెంట్ లో సియాజ్ ఎల్లప్పుడూ సరైన ఎంపిక అని చెప్పవచ్చు. అయితే, అన్ని కొత్త హ్యుందాయ్ వెర్నా చాలా మంచి ధరను కలిగి ఉంది మరియు బయట నుండి కూడా అంత భిన్నంగా లేనప్పటికీ ఈ అనుభవం కొత్తగా మరియు చాలా ఉత్తేజకరమైనదిగా ఉంది. K2 ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఎలంట్రా తో పంచుకుంటుందో అది మెరుగైన కంపోజర్ ని ఇచ్చినట్టు కనిపిస్తుంది, ఇది శక్తివంతమైన ఇంజిన్లతో కలిసి మెరుగైన డ్రైవర్ కారుగా తయారు చేస్తుంది.

కొత్త వెర్నాలో ఉండే లోపం ఏంటిటంటే కేవలం క్యాబిన్ స్థలం, అది కూడా ముఖ్యంగా వెనకాతల భాగంలో ఈ విషయంలో దాని ప్రత్యక్ష ప్రత్యర్థులకు అసలు ఇది సరిపోదు అని చెప్పాలి. కానీ దీని యొక్క ధర మరియు విభాగంలోనే మంచి ప్యాకేజ్ మంచి నాణ్యత కలిగిన అంతర్భాగాలు మరియు మంచి డ్రైవింగ్ అనుభవంతో కొత్త వెర్నా అనేది మధ్యతరహా సెడాన్ కోసం చూస్తున్నవారికి ఉత్సాహకరమైన ప్యాకేజీగా ఉంటుంది.


 

తాజా సెడాన్ కార్లు

రాబోయే కార్లు

తాజా సెడాన్ కార్లు

×
We need your సిటీ to customize your experience