• హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఫ్రంట్ left side image
1/1
  • Hyundai Grand i10
    + 101చిత్రాలు
  • Hyundai Grand i10
  • Hyundai Grand i10
    + 5రంగులు
  • Hyundai Grand i10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

కారు మార్చండి
Rs.4.98 - 7.59 లక్షలు*
This కార్ల మోడల్ has discontinued

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క కిలకమైన నిర్ధేశాలు

ఇంజిన్1186 సిసి - 1197 సిసి
పవర్65.39 - 81.86 బి హెచ్ పి
torque190.24 Nm - 113.75 Nm
ట్రాన్స్ మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
మైలేజీ17 నుండి 24 kmpl
ఫ్యూయల్పెట్రోల్ / సిఎన్జి / డీజిల్
रियर एसी वेंट
మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్
పార్కింగ్ సెన్సార్లు
వెనుక కెమెరా
ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • key నిర్ధేశాలు
  • top లక్షణాలు

గ్రాండ్ ఐ10 ప్రత్యామ్నాయాల ధరను అన్వేషించండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ధర జాబితా (వైవిధ్యాలు)

గ్రాండ్ ఐ10 1.2 kappa ఎరా(Base Model)1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 17 kmplDISCONTINUEDRs.4.98 లక్షలు* 
గ్రాండ్ ఐ10 ప్రైమ్ టి ప్లస్ సిఎన్‌జి(Base Model)1197 సిసి, మాన్యువల్, సిఎన్జి, 18.9 Km/KgDISCONTINUEDRs.5.46 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa మాగ్నా bsiv1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.5.79 లక్షలు* 
గ్రాండ్ ఐ10 మాగ్నా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.5.92 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa స్పోర్ట్జ్ option1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.5.96 లక్షలు* 
గ్రాండ్ ఐ10 స్పోర్ట్జ్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6 లక్షలు* 
గ్రాండ్ ఐ10 మాగ్నా పెట్రోల్ bsiv1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6.01 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa స్పోర్ట్జ్ bsiv1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6.14 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 సిఆర్డిఐ ఎరా(Base Model)1186 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmplDISCONTINUEDRs.6.14 లక్షలు* 
గ్రాండ్ ఐ10 స్పోర్ట్జ్ పెట్రోల్ bsiv1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6.36 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa స్పోర్ట్జ్ డ్యూయల్ టోన్1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6.41 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa మాగ్నా సిఎన్జి bsiv1197 సిసి, మాన్యువల్, సిఎన్జి, 18.9 Km/KgDISCONTINUEDRs.6.46 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa మాగ్నా ఎటి1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6.52 లక్షలు* 
గ్రాండ్ ఐ10 మాగ్నా సిఎన్జి(Top Model)1197 సిసి, మాన్యువల్, సిఎన్జి, 18.9 Km/KgDISCONTINUEDRs.6.53 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa ఆస్టా1197 సిసి, మాన్యువల్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.6.62 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 సిఆర్డిఐ మాగ్నా1186 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmplDISCONTINUEDRs.6.70 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 kappa స్పోర్ట్జ్ ఎటి(Top Model)1197 సిసి, ఆటోమేటిక్, పెట్రోల్, 18.9 kmplDISCONTINUEDRs.7.06 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 సిఆర్డిఐ స్పోర్ట్జ్ option1186 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmplDISCONTINUEDRs.7.08 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 సిఆర్డిఐ స్పోర్ట్జ్1186 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmplDISCONTINUEDRs.7.14 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 సిఆర్డిఐ స్పోర్ట్జ్ డ్యూయల్ టోన్1186 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmplDISCONTINUEDRs.7.39 లక్షలు* 
గ్రాండ్ ఐ10 1.2 సిఆర్డిఐ ఆస్టా(Top Model)1186 సిసి, మాన్యువల్, డీజిల్, 24 kmplDISCONTINUEDRs.7.59 లక్షలు* 
వేరియంట్లు అన్నింటిని చూపండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 సమీక్ష

హ్యుందాయి గ్రాండ్ i10 సెప్టెంబర్ 2013 లో ప్రారంభించబడినపుడు దాని విభాగంలోనే అత్యంత ఆకర్షణీయమైన కారు. ఇది చాలా అద్భుతమైన ధరను కలిగి ఉండేది,అలానే కారు లోపల స్మార్ట్ గా, క్లాసీ ఇంటీరియర్స్, ఆ విభాగంలోనే అద్భుతమైన లక్షణాలను కలిగి ఉండేది మరియు అమ్మకాల తరువాత కూడా నమ్మకమైన నెట్వర్క్ ని కలిగి ఉండేది. అయితే,గ్రాండ్ i10 పెట్రోల్ మరియు డీజల్ రెండిటిలోను ఉండేది. అయితే డీజల్ మోటార్ ఆ విభాగంలో అంత శక్తివంతమైనది కాదు, ఇది ఒక్కటే లోపం తప్ప మిగిలినదంతా అద్భుతమైనది. గ్రాండ్ i10 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ఒరిజినల్ మోడల్ ప్రారంభించబడిన కేవలం మూడు సంవత్సరాలకే ప్రారంభించబడినది. అది ప్రతీ విషయంలోని చాలా బెటర్ గా ఉంది మరియు మెరుగైన పోటీతత్వాన్ని తీసుకుంది. కానీ,ఈ కొత్త గ్రాండ్ i10 ముందు దాని కంటే చాలా బెటెర్ గా ఉందా మరియు దాని పోటీదారి అయిన మారుతి సుజుకి ఇగ్నిస్ తో ఎలా పోటీ పడింది??  

బాహ్య

హ్యుందాయి i10 పాత వెర్షన్ లుక్స్ పరంగా అంత అద్భుతంగా ఏమీ ఉండేది కాదు. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ తో గ్రాండ్ i10 కంపెనీ యొక్క కొత్త డిజైన్ ఫిలాసఫీకి కట్టుబడి ఉంది అని చెప్పాలి.

కారు యొక్క ముందరభాగం లో పెద్ద మార్పులు ఏమిటంటే, కాస్కేడింగ్ గ్రిల్ డిజైన్, నవీకరించిన అప్పర్ గ్రిల్ మరియు చుట్టూ కొత్త ఫాగ్ ల్యాంప్స్ తో తిరిగి డిజైన్ చేయబడిన బంపర్ మరియు అన్ని కొత్త LED DRLs. కారు ప్రక్క భాగం చూస్తే, తిరిగి డిజైన్ చేయబడిన 14-ఇంచ్ అలాయి వీల్స్ తప్ప మాట్లాడుకోడానికి పెద్దగా ఏమీ లేదు. కారు వెనక భాగం చూస్తే,సర్క్యులర్ రెఫ్లెక్టర్ తో పెద్ద బ్లాక్ ఇన్సెర్ట్స్ కలిగిన పెద్ద బంపర్ ఉన్నాయి.

కొత్త బంపర్ ని చూస్తుంటే ముందు ఫేస్లిఫ్ట్ మోడలే బాగుంది, దానిని తిరిగి డిజైన్ చేయడం అనవసరం అనే భావన కలిగిస్తుంది. 

అంతర్గత

క్యాబిన్ లోపలికి అడుగుపెడితే, ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. దీని సీటు కవర్స్,డాష్బోర్డ్ మీద ప్లాస్టిక్ ట్రిం,బటన్స్ మరియు టచ్‌స్క్రీన్ ఆపరేషన్ ప్రతీది కూడా మంచి అనుభూతిని కలిగిస్తాయి. హ్యుందాయి సంస్థ కారు లోపల డిజైన్ ని ఏమీ మార్చలేదు. మీరు అవే డ్యుయల్ టోన్ థీం,డాష్బోర్డ్ మీద నాలుగు పెద్ద సర్క్యులర్ ఏ.సి వెంట్స్,డీప్ సెట్ ఇన్స్టృమెంటల్ క్లస్టర్,పెద్ద మల్టీ ఫంక్షన్ బటన్స్ తో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు హై మౌంటెడ్ గేర్ షిఫ్ట్ లెవెర్ వంటి లక్షణాలను కలిగి ఉన్నారు. సెంటర్ కన్సోల్ కూడా అదే విధంగా ఉంది,కానీ పెద్ద 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేయ్ మరియు ఫుల్లీ ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ కన్సోల్ వంటి ఈ రెండు లక్షణాలను అధనంగా పొందుతుంది.

అయితే దీని స్క్రీన్ అంతా కుడా బాగా అమర్చబడినది, దీని చుట్టూ ఉన్న బటన్స్ అన్నీ కూడా కొంచెం అంతా కూడా గాబరాగా చేసినట్టు అనిపిస్తుంది మరియు ముందు ఉన్న నాన్-టచ్ ఇంఫోటైన్మెంట్ సిస్టం యొక్క బటన్స్ లా అనిపించడం లేదు. దీనిలో క్లైమేట్ కంట్రోల్ కన్సోల్ ఒక కొత్త ఎడిషన్ మరియు కారు దాని పోటీదారులతో పోటీ పడేందుకు దోహదపడుతుంది. 

దీని ముందర సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీని కుషనింగ్ మరీ గట్టిగా ఉండదు, అలా అని మరీ మెత్తగా కూడా ఉండదు.  నిజం చెప్పాలంటే,దీని సీట్లు కూర్చొనేవారికి మంచి అనుభూతిని కలిగించే విధంగా తీర్చిదిద్దబడ్డాయి. దీనిలో డ్రైవర్ సీటు కి హైటు అడ్జస్టబుల్ ఆప్షన్ కూడా అందించబడుతుంది. దీనిలో ఉండే ఒకేఒక్క సమస్య ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్ లు, ఈ ఒక్కటి తప్ప మిగిలిన ఇంటీరియర్స్ అంతా కూడా ప్రీమియం లుక్ ని కలిగి ఉంటాయి మరియు పొడవు వారికి అయినా పొట్టి వారికినా సదుపాయంగానే ఉంటాయి.    

ఈ కారులో వెనుక కూర్చొనే వ్యక్తులు ముగ్గురు కూర్చొనేందుకు సరిపడా క్యాబిన్ ప్లేస్ మరియు మధ్యలో కూర్చున్న వ్యక్తికి ఏ.సి వెంట్ ఉన్నా కూడా ఈ గ్రాండ్ i10 ఇద్దరు ప్యాసింజర్లకు మాత్రమే బాగుంటుందని  సులభంగా కనిపెడతారని చెప్పాలి. దీనికి కారణం మిగతా ఇద్దరు ప్యాసింజర్లకు తప్ప మధ్యలో కూర్చున్న వ్యక్తికి హెడ్‌రెస్ట్ మరియు లాప్ బెల్ట్ ఉండకపోవడం, ఇది  అంత సేఫ్ కాదు. అయితే ముందర సీట్లలో లెగ్‌రూం మరియు నీ(మోకాలు) రూం అంత దీనికి ఉండాల్సినంత  కాకపోయినా సరిపడా ఉంది. పొడవైన వారికి కూడా సరిపడా హెడ్‌రూం అందించబడుతుంది. దీనిలో వెనుక బెంచ్ ఫోల్డ్ చేసుకోవచ్చు, కాని స్పిల్ట్ ఫోల్డింగ్ అవ్వదు, దీనివలన కొచెం అసౌకర్యంగా అనిపిస్తుంది. దీనిలో లగెజ్ పెట్టుకొనే స్థలం 256-లీటర్ ఉంటుంది మరియు ముందు దానితో పోలిస్తే లగేజ్ ప్లేస్ ఏమీ మారలేదు. ఈ లగేజ్ ప్లేస్ ఇగ్నీస్ కంటే 5 లీటర్స్ ఎక్కువ ఉంది మరియు ఈ విభాగంలోనే పెద్దది. 

గ్రాండ్ i10 ఇప్పుడు సాధారణమైనటువంటి LED DRLs ని కలిగి ఉంది. ఇవి ఫ్రంట్ బంపర్ కింద ఫాగ్‌ల్యాంప్స్ తో పాటూ అందించబడుతుంది. ఇవి చాలా వెలుగువంతంగా ఉండి వాటి పని చక్కగా చేస్తున్నాయి. DRLs యొక్క ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కారు పార్కింగ్ లో ఉన్నపుడు, కారు ఆన్ లో ఉన్నా కూడా ఇవి వెలగకుండా ఆగిపోతాయి. దీనివలన వేరే వాహనదారులకు ఉపయోగం అని చెప్పవచ్చు. 

లోపల భాగాలలో పెద్ద మార్పు ఏమిటంటే,కొత్త 7.o ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం. ఇది మిర్రర్ లింక్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ కి కనెక్ట్ చేసుకోవచ్చు మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే కంపాటిబిలిటీ ని అధనపు సౌకర్యంగా కలిగి ఉంది.ఈ గ్రాండ్ i10 గైడెడ్ డిస్ప్లే తో రేర్ పార్కింగ్ కెమేరా ని కొత్త ఇంఫోటైన్మెంట్ స్క్రీన్ మీద కలిగి ఉంది. 

ఈ హ్యుందాయి గ్రాండ్ i10 స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ని సులభంగా కలిగి ఉన్న మొదటి కారు అని చెప్పవచ్చు. ఇది అతి త్వరగా స్పందించే టచ్‌స్క్రీన్ తో కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఇంఫోటైన్మెంట్ సిస్టం స్టీరింగ్ మీద ఉన్న కంట్రోల్స్ కి కుడా బాగా స్పందిస్తుంది. కొత్త గ్రాండ్ i10  ఇంఫోటైన్మెంట్ సిస్టం కి వాయిస్ కమాండ్ కూడా కలిగి ఉంది. ఈ సదుపాయాన్ని స్మార్ట్‌ఫోన్ తో సులభంగా ఉపయోగించుకోవచ్చు. 

భద్రత

హ్యుందాయి గ్రాండ్ i10 ఈ రేంజ్ లో డ్రైవర్ వైపు ఎయిర్‌బ్యాగ్ ని ప్రామాణికంగా కలిగి ఉంటుంది. మేము టెస్ట్ చేసిన ఆస్తా వేరియంట్ లో డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్,ABS,ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్,రేర్ డీఫాగర్ మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు మరియు కెమేరా వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. 

హ్యుందాయి గ్రాండ్ i10 ఈ ధరకి ఫోర్డ్ ఫిగో లో ఉన్నటువంటి అన్ని భద్రతా లక్షణాలను కలిగి ఉండదు. ఫిగో లో 6 ఎయిర్‌బ్యాగ్స్,ABS మరియు EBS వంటి లక్షణాలు ఉన్నాయి. భద్రతా పరంగా ఫిగో ఈ కారుని చిత్తు చేసింది.  

ప్రదర్శన

హ్యుందాయి గ్రాండ్ i10 1.2 లీటర్ 4-సిలెండర్ నేచురల్లీ  ఆస్పిరేటెడ్ మోటార్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో లేదా 4 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది.  మేము టెస్ట్ చేసిన కారు కొత్త 1.2 లీటర్,3-సిలెండర్ టర్బోచార్జెడ్ డీజిల్ మోటార్ మరియు ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందించబడుతుంది. ఇంజిన్ ఆగిపోయినపుడు మాత్రం కొంచెం క్యాబిన్ ఊగినట్టుగా అనిపిస్తుంది. 

పెట్రోల్:

దీని 1.2 లీటర్ యూనిట్ ఈ విభాగంలో చాలా మంచి ఇంజన్. స్థిరంగా ఉన్నా లేదా కదులుతూ ఉన్న కూడా ఇంజన్ శబ్ధం లేకుండా ఉండి హాయిగా అనిపిస్తుంది. అయితే ఇది టాప్ రివ్ రేంజ్ లో ఉన్నప్పుడు మాత్రమే. తక్కువ స్పీడ్ లోకి వెళితే ఇది మారుతీ సెలేరియో అంత స్ట్రాంగ్ కాదు. దీని మిడ్ వేరియంట్  అసలైన పనితత్వం చూపిస్తూ మంచి టార్క్ ని అందిస్తుంది. 

హైవే దారులలో ఈ ఇంజిన్ 120kmph ఇస్తుంది. అది దాటితే మటుకు ఇంజన్ కొంచెం కష్టం అవుతుందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రేంజ్ దాటితే మాత్రం కొంచెం శబ్ధం వస్తూ ఇబ్బందిగా ఉంటుంది.    

ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో కానీ లేదా 4 స్పీడ్ ఆటోమెటిక్ తో కానీ అందించబడుతుంది. మేము అయితే మాత్రం మాన్యువల్ ని ఎన్నుకుంటాము, దీని క్లచ్ చాలా లైట్ గా ఉంటుంది మరియు గేర్ లు కూడా బాగా వేయవచ్చు.  ఆటోమెటిక్ అయితే గేర్ లు వేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి వారు అయినా సులభంగా నడపవచ్చు మరియు ట్రాఫిక్ లో మరింత సులభంగా నడపవచ్చు. పోల్చి చూసుకుంటే, ఆటోమెటిక్ అయితే కొంచెం డబ్బులు ఎక్కువ పడతాయి. మీరు ఏది తీసుకుంటారు అనేది మీ ఇష్టం.     

డీజిల్

దీని యొక్క డీజల్ మోటార్ నవీకరించ పాత కారు యొక్క 1.1 లీటర్ మోటార్. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ని పెంచడం వలన 71Ps నుండి 75ps వరకూ అద్భుతమైన పవర్ ని అందిస్తుంది మరియు 160Nm నుండి 190Nm వరకూ అద్భుతమైన టార్క్ ని అందిస్తుంది. దీనివలన ఈ కారుని పట్టణ ప్రాంతాలలో సులభంగా నడపవచ్చు. కొత్త 1.2 లీటర్ 'U2 CRDi’ మోటార్ అతి తక్కువ 1750Rpm వద్ద 190Nm టార్క్ ని అందిస్తుంది. హైవే లో వెళ్ళినపుడు 4000rpm తరువాత అయితే పవర్  తగ్గిపోతుంది మరియు 110 నుండి 120Kmpl వద్ద దీని ప్రోగ్రెస్ తగ్గిపోతుంది. గ్రాండ్ i10 డీజిల్ 17.32 సెకెండ్స్ లో 0 నుండి 100kmph స్పీడ్ ని అందుకుంటుంది,ఇది ఒక మంచి పరిణామం.

5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ చాలా బాగుంటుంది. తక్షణమే కారు తీసినా కూడా సౌకర్యంగా ఉంటుంది. దీని పుల్ టైప్ రివర్స్ గేర్ లాక్ స్మూత్ గా ఉంటుంది మరియు మంచి అనుభూతిని అందిస్తుంది. 

గ్రాండ్ i10 యొక్క కొత్త డీజిల్ మోటార్ చాలా సమర్ధవంతంగా ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో 19.23kmpl మరియు హైవే లో 22.19kmpl  ఇస్తుందని అని మా పరీక్షలలో నిర్ధారించబడింది.   

రైడ్ మరియు హ్యాండిలింగ్

ఈ హ్యుందాయి గ్రాండ్ i10 యొక్క సస్పెన్షన్ ఎక్కువగా పట్టణ ప్రాంతాలలో తీసేవిధంగా తయారుచేయబడినది. ఇది మరీ హార్డ్ గా ఉండదు,అలా అని మరీ సాఫ్ట్ గా కాకుండా కరెక్ట్ గా ఉంటుంది. ఈ సస్పెన్షన్ ఎప్పుడు కూడా శబ్ధం లేకుండా ఉండే విధంగానే పనిచేస్తుంది, ఏదైనా రోడ్డు మీద పెద్ద బంపర్ తగిలితే తప్ప శబ్ధం రాదు. ఈ ఫెల్క్‌సిబుల్ నెస్ మరియు గట్టిదనం రెండిటి కలయికతో దీనిలో ప్రయాణం ఎప్పుడు కూడా అసౌకర్యంగా అనిపించదు. అలానే దీని ఇంజన్ ఇచ్చే తక్కువ శబ్ధం మరియు వైబ్రేషన్స్ వలన గ్రాండ్ i10 క్యాబిన్ లో ఉండేవారికి మంచి అనుభూతి కలుగుతుంది. 

దీని యొక్క స్టీరింగ్ చాలా తేలికగా ఉండడం వలన కారు ని పట్టణ ప్రాంతాలలో తీయడానికి సౌకర్యంగా ఉంటుంది. హైవే మీద వెళ్తున్నపుడు మాత్రం దీని యొక్క తేలికైన స్టీరింగ్ కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ సస్పెన్షన్ సిష్టం మరియు బ్రేకులు(ABS)బాగానే పనిచేస్తాయి.  

వేరియంట్లు

హ్యుందాయి గ్రాండ్ i10 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మొత్తం 6 వేరియంట్స్ తో అందించబడుతుంది. అయితే,గ్రాండ్ i10 1.2 లీటర్ డీజిల్ మోటార్ 4 వేరియంట్లతో అందించబడుతుంది. 

దీనిలో బేస్ వేరియంట్ అయిన ఎరా(ERA)లో ఫ్రంట్ పవర్ విండోస్,మాన్యువల్ ఎయిర్‌కండిషనింగ్,డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మరియు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ వంటి లక్షణాలు ఉన్నాయి. మాగ్నా వేరియంట్ పైన చెప్పుకున్న లక్షణాలను కలిగి ఉంది మరియు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్,కీ లెస్ ఎంట్రీ,ఫుల్ వీల్ కవర్స్ మరియు రేర్ A.C వెంట్స్ కూడా ఉన్నాయి. స్పోర్ట్స్ వేరియంట్ కూడా పైన లక్షణాలన్నిటినీ కలిగి ఉంది మరియు రేర్ పార్కింగ్ సెన్సార్లు,రేర్ డీఫాగర్,కూలెడ్ గ్లోవ్ బాక్స్ మరియు 5.O ఇంచ్ టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం వంటి లక్షణాలను కలిగి ఉంది. దీనిలో స్పోర్ట్స్(O) వేరియంట్ అధనంగా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో ఉన్నటువంటి 7-O ఇంచ్ ఇంఫొటైన్మెంట్ సిష్టం ని కలిగి ఉంది మరియు LED DRLs మరియు 14 ఇంచ్ అలాయి వీల్స్ ని కలిగి ఉంది. దీనిలో టాప్ వేరియంట్ అయిన ఆస్తా వేరియంట్ ABS,పుష్ బటన్ స్టార్ట్/స్టాప్,ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు రేర్ స్పాయిలర్ ని కలిగి ఉంది.  

ఈ కారు లో స్పోర్ట్స్(O) మరియు దాని మీద వేరియంట్స్ కి వెళ్ళడం మంచింది. ఎందుకంటే దీనిలో తక్కువ వేరియంట్స్ వాటితో పోల్చి చూస్తే పాతబడి పోయినట్టుగా ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఎరా మరియు మాగ్నా వేరియంట్స్ మల్టీమీడియా సిష్టం తో అందించబడడం లేదు. దీనిలో ABS ఆస్తా వేరియంట్ కి మాత్రమే పరిమితమయ్యి ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

  • క్యాబిన్ అద్భుతంగా ఉంటుంది మరియు మొత్తంగా క్వాలిటీ చాలా బాగుంటుంది.
  • ప్రయాణికులకి విశాలంగా మరియు లగేజ్ పెట్టుకొనేందుకు మంచి స్పేస్ ఉంటుంది.
  • దీనిలో కొత్త స్మార్ట్‌ఫోన్ కంపేటబుల్ ఇంఫోటైన్మెంట్ సిష్టం అద్భుతంగా పనిచేస్తుంది.
  • దీని యొక్క డీజిల్ ఇంజన్ మంచి టార్క్ ని అందిస్తుంది, దీనివలన సిటీ అంతా సులభంగా ప్రయాణించవచ్చు.

మనకు నచ్చని విషయాలు

  • ఆడియో వ్యవస్థ బేస్ వేరియంట్ లో ప్రామిణకంగా లేదు.
  • ముందర సీట్లుకి ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్ లు ఉండి వాడుకని తగ్గిస్తున్నాయి

ఏఆర్ఏఐ మైలేజీ24 kmpl
సిటీ మైలేజీ19.1 kmpl
ఇంధన రకండీజిల్
ఇంజిన్ స్థానభ్రంశం1186 సిసి
no. of cylinders3
గరిష్ట శక్తి73.97bhp@4000rpm
గరిష్ట టార్క్190.24nm@1750-2250rpm
సీటింగ్ సామర్థ్యం5
ట్రాన్స్ మిషన్ typeమాన్యువల్
ఇంధన ట్యాంక్ సామర్థ్యం43 litres
శరీర తత్వంహాచ్బ్యాక్
గ్రౌండ్ క్లియరెన్స్ అన్లాడెన్165 (ఎంఎం)

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 Car News & Updates

  • తాజా వార్తలు
  • Must Read Articles

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వినియోగదారు సమీక్షలు

4.5/5
ఆధారంగా914 వినియోగదారు సమీక్షలు
  • అన్ని (914)
  • Looks (179)
  • Comfort (301)
  • Mileage (263)
  • Engine (151)
  • Interior (118)
  • Space (121)
  • Price (101)
  • More ...
  • తాజా
  • ఉపయోగం
  • VERIFIED
  • CRITICAL
  • FacingPickup Problem Ground Clearness.

    Good but not better performance. Facing pickup problem. 

    ద్వారా arun kumar kurre
    On: Sep 13, 2021 | 85 Views
  • Best Ever Car

    The car is great. I have traveled a lot the miles are great. Looks great, great performance. This is...ఇంకా చదవండి

    ద్వారా adit asish padhy
    On: Sep 07, 2021 | 3099 Views
  • Excellent Car

    Nice car in hatchback from Hyundai India. Good average, great performance, and looks

    ద్వారా ramkumar
    On: Aug 13, 2021 | 82 Views
  • Good Car With Lesser Mileage

    Mileage worst, Safety bad, engine pickup not up to the mark, front grill too delicate, high service ...ఇంకా చదవండి

    ద్వారా anand srinivas
    On: Aug 02, 2021 | 792 Views
  • Good Performance

    Very good, Comfortable riding, good Power. Sporty looking. AC is a very good fast cooling performanc...ఇంకా చదవండి

    ద్వారా rita biswas
    On: Jul 28, 2021 | 106 Views
  • అన్ని గ్రాండ్ ఐ10 సమీక్షలు చూడండి

గ్రాండ్ ఐ10 తాజా నవీకరణ

2019 గ్రాండ్ i10 ఫేస్లిఫ్ట్: హ్యుందాయి గ్రాండ్ i10 ఫేస్లిఫ్ట్ వెర్షన్ మరళా టెస్ట్ చేస్తుండగా పట్టుపడింది. ఇది 2019 లో ప్రారంభించబడుతుందని అంచనా. ఈ మధ్యలో హ్యుందాయి సంస్థ గ్రాండ్ i10 యొక్క మాగ్నా మరియు స్పోర్ట్స్ వేరియంట్స్ యొక్క లక్షణాలను మెరుగుపరిచింది.  

హ్యందాయి గ్రాండ్ i10 ధరలు మరియు వేరియంట్లుహ్యుందాయి గ్రాండ్ i10 యొక్క ధరలు రూ.4.91 లక్షల దగ్గర మొదలయ్యి రూ.7.51 లక్షలు(ఎక్స్-షోరూం డిల్లీ) వరకూ ఉన్నాయి. ఈ గ్రాండ్ i10 పెట్రోల్ లో ఎరా(ERA),మాగ్నా స్పోర్ట్స్,స్పోర్ట్స్ డ్యుయల్ టోన్ మరియు ఆస్తా అను ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అలానే,గ్రాండ్ i10 డీజల్ లో ఎరా,మాగ్నా,స్పోర్ట్స్ మరియు ఆస్తా అను నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది. 

గ్రాండ్ i10 ఇంజన్ మరియు మైలేజ్: గ్రాండ్ i10 1.2 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో అందించబడుతుంది. పెట్రోల్ ఇంజిన్ 83Ps పవర్ మరియు 114Nm టార్క్ ని అందించగా,డీజిల్ ఇంజన్ 75Ps పవర్ మరియు 190Nm టార్క్ ని అందిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉండగా,పెట్రోల్ ఇంజన్ 4- స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్ తో కూడా అందుబాటులో ఉంది. ఈ గ్రాండ్ i10 పెట్రోల్ మాన్యువల్ లో 18.9Kmpl మరియు డీజల్ మాన్యువల్ లో 24kmpl అందిస్తుంది.  

హ్యుందాయి గ్రాండ్ i10 లక్షణాలు: గ్రాండ్ i10 లో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో కూడినటువంటి 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం,రేర్ A.C వెంట్స్ తో ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్,ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ మరియు అడ్జస్టబుల్ ORVMs,పుష్-బటన్ స్టార్ట్,సెన్సార్లతో రేర్ పార్కింగ్ కెమేరా,టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్ వంటి లక్షణాలు ఉన్నాయి. ఈ గ్రాండ్ i10 డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు EBD తో ABS ని ఈ రేంజ్ లో ప్రాధమికంగా కలిగి ఉంటుంది.   

హ్యుందాయి గ్రాండ్ i10 పోటీదారులు: ఈ హ్యుందాయి గ్రాండ్ i10 మారుతి సుజుకి ఇగ్నిస్,మారుతి సుజుకి స్విఫ్ట్,నిస్సన్ మైక్రా,హోండా బ్రియో,టాటా టియాగో,ఫోర్డ్ ఫిగో మరియు మహీంద్ర KUV100 NXT తో పోటీపడుతుంది. 

ఇంకా చదవండి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 వీడియోలు

  • Hyundai Grand i10 Hits & Misses | CarDekho.com
    4:08
    Hyundai Grand i10 Hits & Misses | CarDekho.com
    6 years ago | 13.3K Views
  • 2018 Maruti Suzuki Swift vs Hyundai Grand i10 (Diesel) Comparison Review | Best Small Car Is...
    8:01
    2018 Maruti Suzuki Swift vs Hyundai Grand i10 (Diesel) Comparison Review | Best Small Car Is...
    5 years ago | 4.6K Views
  • Maruti Ignis vs Hyundai Grand i10 | Comparison Review | ZigWheels
    10:15
    Maruti Ignis vs Hyundai Grand i10 | Comparison Review | ZigWheels
    6 years ago | 13.2K Views

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 చిత్రాలు

  • Hyundai Grand i10 Front Left Side Image
  • Hyundai Grand i10 Side View (Left)  Image
  • Hyundai Grand i10 Rear Left View Image
  • Hyundai Grand i10 Grille Image
  • Hyundai Grand i10 Front Fog Lamp Image
  • Hyundai Grand i10 Headlight Image
  • Hyundai Grand i10 Taillight Image
  • Hyundai Grand i10 Side Mirror (Body) Image
space Image

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 మైలేజ్

క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 dieselఐఎస్ 24 kmpl . హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 petrolvariant has ఏ మైలేజీ of 18.9 kmpl . హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 cngvariant has ఏ మైలేజీ of 18.9 Km/Kg.தானியங்கி వేరియంట్ల కోసం క్లెయిమ్ చేసిన ARAI మైలేజ్: హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 petrolఐఎస్ 18.9 kmpl.

ఇంకా చదవండి
ఇంధన రకంట్రాన్స్ మిషన్ఏఆర్ఏఐ మైలేజీ
డీజిల్మాన్యువల్24 kmpl
పెట్రోల్మాన్యువల్18.9 kmpl
పెట్రోల్ఆటోమేటిక్18.9 kmpl
సిఎన్జిమాన్యువల్18.9 Km/Kg
Found what యు were looking for?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 Road Test

Ask QuestionAre you Confused?

Ask anything & get answer లో {0}

ప్రశ్నలు & సమాధానాలు

  • తాజా ప్రశ్నలు

Is Hyundai Grand i10 available?

Thimmegowda asked on 18 Apr 2023

For the availability, we would suggest you to please connect with the nearest au...

ఇంకా చదవండి
By CarDekho Experts on 18 Apr 2023

Is Grand i10 Nios Sportz 1.2 Auto CVT or AMT?

Noor asked on 9 Oct 2021

Hyundai Grand i10 Nios AMT Sportz is powered by a 1197 cc engine which is availa...

ఇంకా చదవండి
By CarDekho Experts on 9 Oct 2021

Is there any Anti theft features in grand i10 magna?

Krishanu asked on 29 May 2021

Hyundai Grand i10 Nios Magna doesn't feature Anti-Theft Alarm or Anti-Theft ...

ఇంకా చదవండి
By CarDekho Experts on 29 May 2021

What is the coast of creta 2018 smart key for keyless entry.

Vishal asked on 21 May 2021

For that, we'd suggest you please visit the nearest authorized service cente...

ఇంకా చదవండి
By CarDekho Experts on 21 May 2021

Grand i10 Magna or Sportz, which one is the top model?

Kaushik asked on 22 Mar 2021

Hyundai offers the Grand i10 BS6 in only two petrol-MT variants: Magna and Sport...

ఇంకా చదవండి
By CarDekho Experts on 22 Mar 2021

ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
వీక్షించండి మార్చి offer
వీక్షించండి మార్చి offer
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర
×
We need your సిటీ to customize your experience