Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

యామీ గౌతమ్ కార్‌ల కలెక్షన్‌లో చేరిన ؚBMW X7

బిఎండబ్ల్యూ ఎక్స్7 కోసం rohit ద్వారా జూన్ 27, 2023 03:34 pm ప్రచురించబడింది

BMW X7, BMW అందించే అత్యంత విలాసవంతమైన SUV, ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో మిడ్ؚలైఫ్ రీఫ్రెష్ؚను పొందింది

తన విలాసవంతమైన మరియు సౌకర్యవంతమైన కారు కలెక్షన్ؚను విస్తరిస్తూ, బాలీవుడ్ తార యామీ గౌతమ్, నవీకరించిన BMW X7ను కూడా తన కలెక్షన్ؚకు జోడించింది. ఇది టాంజానైట్ బ్లూ మెటాలిక్ రంగులో ఉంది అయితే ఖచ్చితమైన పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ؚను నిర్ధారించలేము. యామి ఇప్పటికే ఆడి Q7 SUV, ఆడి A4 వంటి కార్‌లను కలిగి ఉంది.

BMW SUV గురించి మరిన్ని వివరాలు

మొదటి-జనరేషన్ X7ను BMW భారతదేశంలో 2019లో విడుదల చేసింది, తరువాత 2023లో నవీకరించిన వర్షన్ؚను విడుదల చేసింది. ప్రస్తుతం X7ను “M స్పోర్ట్” సింగిల్ వేరియెంట్ؚగా మాత్రమే అందిస్తున్నారు (ప్రస్తుతం యామీ కొనుగోలు చేసిన వాహనం). దీని పెట్రోల్ వేరియెంట్ (xDrive40i M స్పోర్ట్) ధర రూ.1.22 కోట్లు ఉండగా, డీజిల్ వేరియెంట్ (xDrive40d M స్పోర్ట్) ధర రూ.1.25 కోట్లుగా ఉంది (రెండూ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు).

ఇది కూడా చదవండి: శిఖర్ ధావన్ సరికొత్త రైడ్ గురించి తెలుసుకోవలసిన 3 విషయాలు, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ

పవర్ؚట్రెయిన్ వివరాలు

ఇండియా-స్పెక్ BMW X7లో 3-లీటర్‌ల ట్విన్-టర్బో ఇన్‌లైన్ ఆరు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల సెట్ ఉంది. మొదటిది 381PS/530Nm విడుదల చేస్తుండగా, రెండవది 340PS మరియు 700Nm విడుదల చేస్తుంది. నాలుగు వీల్స్ అన్నిటికీ శక్తిని అందించే రెండు ఇంజన్‌లు 8-స్పీడ్‌ల ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడింది.

రెండు ఇంజన్‌లు 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ టెక్ؚను పొందినాయి, హార్డ్ యాక్సెలరేషన్ؚలో అవుట్ؚపుట్ؚ 12PS/200Nm వరకు పెరుగుతుంది. X7 0 నుండి 100 kmphకు కేవలం 5.9 సెకన్‌లలో చేరుతుందని BMW ప్రకటించింది. కొత్త X7లో కంఫర్ట్, ఎఫీషియెంట్, స్పోర్ట్ మరియు స్పోర్ట్ ప్లస్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్ؚలు ఉన్నాయి.

ఇందులో ఉన్న సాంకేతికత

BMW తన ఫ్లాగ్ؚషిప్ లగ్జరీ SUV X7లో డ్యూయల్ స్క్రీన్ؚలు (12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ మరియు 14.9-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ యూనిట్), పనోరమిక్ సన్ؚరూఫ్, 14-రంగుల ఆంబియెంట్ లైటింగ్ మరియు డిజిటల్ కీ వంటి అనేక ముఖ్యమైన ఫీచర్‌లను అందిస్తుంది.

దీని భద్రత కిట్ؚలో బహుళ ఎయిర్ బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), మరియు కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC) ఉన్నాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు డ్రైవర్ డ్రౌజీనెస్ డిటెక్షన్ؚతో సహా ఇది అడ్వాన్సెడ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్ؚతో (ADAS) వస్తుంది.

ఇది కూడా చదవండి: ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తరువాత భారతదేశంలో టెస్లా ప్రవేశాన్ని నిర్ధారించిన ఎలాన్ మాస్క్

ఇది దేనితో పోటీ పడుతుంది?

నవీకరించిన X7 ఆడి Q7, వోల్వో XC90 మరియు మెర్సిడెజ్-బెంజ్ GLS వంటి వాటితో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: BMW X7 ఆటోమ్యాటిక్

Share via
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
ఫేస్లిఫ్ట్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర