• English
  • Login / Register

మెర్సిడెస్ SUV కూపే జనవరి 2016 లో ప్రారంభం కానున్నది; మహీంద్రా KUV100 యొక్క టీజర్ విడుదల; టయోటా ప్రపంచంలో అతిపెద్ద వాహనసంస్థగా ఉద్భవించింది

జనవరి 04, 2016 05:35 pm sumit ద్వారా ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ వారం వార్తలు జనవరి 2016 లో విడుదల మెర్సిడెస్ SUV కూపే ప్రారంభంతో మొదలయ్యాయి. మహీంద్రా వారు KUV100 యొక్క వెనుక ప్రొఫైల్ వివరాలు తెలుపుతూ టీజర్ ని విడుదల చేసారు. మేము దాని లక్షణాల యొక్క నిర్దేశాలను కూడా యాక్సిస్ చేసాము. జపనీస్ కారు తయారీసంస్థ టొయోటా ప్రపంచంలోనే అతిపెద్ద వాహనతయారీదారిగా ఉద్భవించిందని వార్త కూడా వచ్చింది. ఇది కాక ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1, 2016 నుండి డిల్లీ లో ఆడ్-ఈవెన్ పాలసీ ని అమలు చేస్తానని వార్త కూడా వచ్చింది. అలానే ఈ వారం ఒక SMS పెట్టడం ద్వారా ఉపయోగించిన కార్ల యొక్క వివరాలు సులభంగా తెలుసుకొనేందుకు అవకాశం కల్పించడం ద్వారా ఇది సెకెండ్ హ్యాండ్ కొనుగోలుదారులకు ఈ వారం శుభ వారం అని చెప్పవచ్చు.

మెర్సిడెస్ బెంజ్- GLE Coupe భారతదేశం లో జనవరి 12 న ప్రారంభించబోతోంది

Mercedes-Benz GLE Coupe

మెర్సిడెస్, భారతదేశం కోసం దాని ఉత్పత్తిని ఇంకా పూర్తి చెయ్యలేదు. 2015 భారతదేశం లో విజయవంతంగా దాని 15 లాంచీలు ముగిశాయి తర్వాత, మెర్సిడెస్ బెంజ్ త్వరలోనే GLE Coupe కార్లని భారతదేశం లో జర్మన్ వాహన తయారీదారుల కుటుంబం లో , చేర్చబోతోంది. 2015 సంవత్సరము లో రికార్డ్ స్థాయిలో జరిగిన అమ్మకాల గురించి , జనవరి 12, 2016 న ప్రారంభించబోయే SUV కూపే గురించి , త్వరలోనే దీని తయారీ దారులు వెల్లడించనున్నారు. GLE దాని పేరుని ML- క్లాస్ గా మార్చుకొని , 6/specifications"BMW X6 SUV Coupe కి పోటీగా ఉంటుంది. ఈ కారు అమెరికాలో టుస్కాలూసాకు ఫ్యాక్టరీ నుండి CBUమార్గంలో దిగుమతి చేయబడి, భారతదేశం లోకి రాబోతోంది.

ఇంకా చదవండి 

మహీంద్రాKUV1OO ; ఎలా దీని ధర నిర్ణయించబడుతోంది ?

మహీంద్రా అండ్ మహీంద్రా దేశంలోని మైక్రో SUVs సెగ్మెంట్లో పట్టు సాధించడానికి సిద్ధంగా ఉంది . అయితే ఇప్పటిదాకా దీనికి నేరుగా పోటీదారులు లేరు. కానీ బి -సెగ్మెంట్ యొక్క విభాగంలో ఉంటాయని భావిస్తున్నారు. ఆ వాహనాలు ఏంటంటే ఉదాహరణకి , ఫోర్డ్ ఫిగో, మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10,..etc ..పోటీదారుల గురించి మాట్లాడితే ఫిబ్రవరి 2016 లో ఇండియా నుండి, తొలిసారిగా ఇగ్నిస్ ఆటో ఎక్స్పోలో పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఎప్పుడయితే KUV1OO ప్రారంభం అవుతుందో సాంకేతికపరంగా, ఇగ్నిస్ వాహనంతో పోటా పోటీగా తలపడనుంది. ప్రస్తుతానికి, KUV1OO వాహనం యొక్క ధరని, B-సెగ్మెంట్ వాహనాలకి పోటీగా పొందుపరిచారు.

ఇంకా చదవండి

కేంద్ర బడ్జెట్ 2016 - ఆటో పరిశ్రమ కోసం ఏం జరుగుతుంది?

దాదాపు 24 మిలియన్ వాహనాలు మన దేశంలో ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతుంటాయి. భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ఆటోమోటివ్ మిషన్ ప్రణాళిక 2016-2026 కింద 18.9 ట్రిలియన్ రూపాయలు ($ 285 బిలియన్) స్థూల విలువ లక్ష్యంతో ఉంది. యూనియన్ ప్రభుత్వ ప్రచారం 'మేక్ ఇన్ ఇండియా' కూడా చాలా మంది తయారీదారులు భారత నేలని వారి తయారీ కేంద్రంగా అంగీకరించేందుకు కారణమైంది. ఇటువంటి భారీస్థాయి ఉత్పత్తి సంఖ్యలతో, రాబోయే కేంద్ర బడ్జెట్ ఆటో రంగం కొరకు చాలా కీలకమైనది అవుతుంది.

ఇంకా చదవండి

టొయోటా ప్రపంచంలో అతిపెద్ద వాహన తయారీదారిగా నిలచింది

టొయోటా మోటార్ కార్పొరేషన్ గత నెల ప్రపంచవ్యాప్త కార్ల అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉంది మరియు వరుసగా ఐదో నెలలో వోక్స్వాగన్ AG ల అమ్మకాలను అధిగమించింది. జపనీస్ కార్ ఉత్పత్తిదారుడు దాదాపు 2,00,000 యూనిట్లు ముందు ఉండి డీజిల్ గేట్ ద్వారా ప్రభావితం అయిన జర్మన్ ప్రత్యర్థిని తలదన్నింది మరియు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన కారు ఉత్పత్తిదారిగా ఉండేందుకు సరైన దారిలో పయనిస్తుంది.

ఇంకా చదవండి

కొత్త మహీంద్రా KUV100 ట్రైలర్ వెనుక ప్రొఫైల్ ని విడుదల చేసింది

KUV100

నూతన సంవత్సరంలోనికి అడుగుపెడితే 2016 లో ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రారంభాలలో KUV100 ఒకటి. కారు బహిర్గతం అయిన తరువాత మహీంద్రా వాహనం వెనుక ప్రొఫైల్ మరియు అంతర్భాగాల గురించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, అంతర్భాగాలు అంతకు మునుపు బహిర్గతం అయ్యాయి మరియు వెనుక ప్రొఫైలు ఇప్పటికీ రహస్యంగా ఉండిపోయింది. ఈ క్రిస్మస్ న మహీంద్రా శాంటా వలే నటించి అనుకోకుండా KUV100 యొక్క వెనుక భాగం కలిగియున్న బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ నటించిన వారి తాజా ట్రైలర్ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ కూడా ముందు మరియు ప్రక్క ప్రొఫైల్ యొక్క వివరాలను అందించింది. అయితే, మహీంద్రా కారు యొక్క వెనుక భాగం యొక్క చిత్రాలను అస్పష్టంగా విడుదల చేసింది, మేము వాటిని సంపాదించాము, కనుక మీరు మరి కొంచం ఎక్కువ చూడవచ్చు.

ఇంకా చదవండి

రెనాల్ట్ సంస్థ 2016 ఆటో ఎక్స్పోలో క్విడ్ యొక్క ఆంట్ మరియు 1-లీటర్ వెర్షన్ ను ప్రదర్శించనున్నది

రెనాల్ట్ సంస్థ అందించిన నివేధిక ప్రకారం ప్రముఖ క్విడ్ వాహనం యొక్క క్లచ్ లేని ఆంట్ మరియు 1000cc వెర్షన్లను ఫిబ్రవరి 2016 లో రాబోయే ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్నదని తెలిసింది. ఫ్రెంచ్ తయారీసంస్థ క్విడ్ ని సెప్టెంబర్ 24, 2015 న ప్రారంభించింది మరియు దీని బుకింగ్స్ అక్టోబర్ మధ్యలో మొదలయ్యాయి. ఈ వాహనం 90% వరకూ భాతదేశంలో తయారుచేయబడినందున దీని ధర రూపాయలు.2.56 - 3.53 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). ఈ సంస్థ ఆగష్టు 2015 చుట్టూ నుండి వాహనం కోసం దాదాపు 80,000 బుకింగ్స్ పొందింది. ఇప్పుడు, రాబోయే ఆటోమేటిక్ మరియు మరింత శక్తివంతమైన 1 లీటర్ వెర్షన్లు ఈ సంఖ్యలను మరింత ఎత్తుకి తీసుకెళ్తాయని భావిస్తున్నారు.

ఇంకా చదవండి 

ఒక SMS ద్వారా ఉపయోగించిన కారు యొక్క పూర్తి వివరాలను తనిఖీ చేయవచ్చు

Want to Check Authenticity of a Used Car? Just send an SMS!

సెకెండ్ హ్యాండ్ కారు ని ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వారికి ఒక శుభవార్త. ఉపయోగించిన కారు తనిఖీ చేయడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకుగానూ ఇప్పుడు రవాణా మంత్రిత్వ శాఖ ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖకు జారీ చేసిన హెల్ప్లైన్ 7738299899 నంబర్ కి ఒక మెసేజ్ అందించడం ద్వారా కారు యొక్క పూర్తి చరిత్ర తనిఖీ చేయవచ్చు. ప్రభుత్వం ఇటీవల భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఒక "FAME ఇండియా ఎకో డ్రైవ్" నిర్వహించారు. ఇది విద్యుత్ వాహనాలు ప్రోత్సహించేందుకు మరియు శక్తి పరిరక్షణ అవసరాన్ని కూడా హైలేట్ చేసేందుకు లక్ష్యంతో ఉంది.

ఇంకా చదవండి 

ఆడ్ ఈవెన్ పాలసీ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

Everything About Odd-Even Policy

ఢిల్లీ ప్రభుత్వం "ఆడ్ ఈవెన్ పాలసీ" అమలు కోసం బ్లూప్రింట్ చేసింది. ఈ వినూత్న స్పందన ఫార్ములా 15 రోజులకి గానూ రికార్డ్ చేయబడుతుంది. దీనిలో వివరాలు అదే విధంగా ఉంటాయి కానీ అవసరాన్ని బట్టి నియమావళి ఏ విధంగా ఉంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో అయితే (బేస్ సంఖ్య నమోదు గల కార్లు సోమవారం, బుధవారం మరియు శుక్రవారం నడుస్తాయి మరియు సరి సంఖ్య గల కార్లు మంగళవారం, గురువారం మరియు శనివారం నడుస్తాయి) అని భావించడం జరిగింది. బ్లూప్రింట్ కొద్దిగా విడుదల అయ్యి క్రైటీరియా మార్చబడింది. ఇప్పుడు బేసి సంఖ్యల గల కార్లు బేసి తేదీలలో అమలు చేయబడతాయి మరియు సరి సంఖ్య గల కార్లు సరి సంఖ్య గల తేధీలలోనే అమలు చేయబడతాయి. ఆదివారం ఈ నియమానికి మినహాయింపు.

ఇంకా చదవండి 

జీప్ ఇండియా లైవ్ గ్రాండ్ చెరోకీ మరియు వ్రాంగ్లర్ ల ని అందిస్తోంది

భారత ఆటోమోటివ్ రంగం ఇష్టపడేవారి కోసం జీప్ బ్రాండ్ ని ప్రారంభించడానికి ముందే జీప్ బ్రాండ్ ప్రీ లాంచ్ వెబ్ సైట్ ని ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ఫియట్-క్రిస్లర్ (FCA - ఫియట్-క్రిస్లర్ ఆటోమొబైల్స్) తో పాటే కలిసి అధికారికంగా ఫిబ్రవరి 2016 ఆటో ఎక్స్పోలో ప్రారంభించబడుతుంది. ఇప్పటిదాకా FCA భారతదేశం లో ఫియట్, అబార్త్, మసెరటి, ఫెరారీ బ్రాండ్లు అందిస్తోంది. జీప్ బ్రాండ్ తదుపరి సంవత్సరం ప్రారంభ జాబితాకు చేర్చబడుతుంది.

ఇంకా చదవండి 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience