ఆడ్ ఈవెన్ పాలసీ గురించి మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు
డిసెంబర్ 29, 2015 03:32 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 24 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
న్యూ డిల్లీ:
ఢిల్లీ ప్రభుత్వం "ఆడ్ ఈవెన్ పాలసీ" అమలు కోసం బ్లూప్రింట్ చేసింది. ఈ వినూత్న స్పందన ఫార్ములా 15 రోజులకి గానూ రికార్డ్ చేయబడుతుంది. దీనిలో వివరాలు అదే విధంగా ఉంటాయి కానీ అవసరాన్ని బట్టి నియమావళి ఏ విధంగా ఉంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో అయితే (బేస్ సంఖ్య నమోదు గల కార్లు సోమవారం, బుధవారం మరియు శుక్రవారం నడుస్తాయి మరియు సరి సంఖ్య గల కార్లు మంగళవారం, గురువారం మరియు శనివారం నడుస్తాయి) అని భావించడం జరిగింది. బ్లూప్రింట్ కొద్దిగా విడుదల అయ్యి క్రైటీరియా మార్చబడింది. ఇప్పుడు బేసి సంఖ్యల గల కార్లు బేసి తేదీలలో అమలు చేయబడతాయి మరియు సరి సంఖ్య గల కార్లు సరి సంఖ్య గల తేధీలలోనే అమలు చేయబడతాయి. ఆదివారం ఈ నియమానికి మినహాయింపు.
డిసెంబర్ 24, 2015న AAP డిల్లీ ప్రభుత్వంచే వెల్లడి చేయబడిన బ్లూప్రింట్ మా పాఠకుల కోసం ఒక విశ్లేషణ చేయబడ్డాయి.
1.పథకం యొక్క వ్యవధి - జనవరి 1 - జనవరి 15, 2016
ఫార్ములా జనవరి 1, 2016 నుండి ఉంటుంది. మొదటి ప్రకటన మీద దౌర్జన్యం గమనించిన తర్వాత, ప్రభుత్వం పర్యావరణం గురించి జాగ్రత్త కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది మరియు సాధారణ ప్రజల సౌలభ్యం కొరకు ఈ విధానం 15 రోజుల ట్రయల్ కాలానికి తగ్గించబడ్డాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ " ఈ వ్యవధి కొరకు ప్రతిస్పందన నోట్ చేయబడింది మరియు వాటిని ఆధారంగా, మరింత సిఫార్సులు చేయబడుతుంది. మేము 15 రోజుల చివరిలో అంచనా చేస్తాను. ప్రజలు ఈ ప్రణాళిక అంగీకరిస్తే, మేము ఒక శాశ్వత పరిష్కారం గురించి ఆలోచిస్తాము. ఇతర దేశాలు కూడా అధిక కాలుష్య స్థాయిలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు." అని తెలిపారు.
2. బేసి సంఖ్య గల కార్లు బేసి రోజుల్లో మరియు వైస్ వెర్సా
మునుపటి ఊహల నుండి బయటకి వస్తే బేస్ సంఖ్యల గల కార్లు సోమవారం,బుధవారం మరియు శుక్రవారం రోజులు కాకుండా బేస్ రోజుల్లో నడుస్తాయి. అదేవిధంగా సరి సంఖ్య గల కార్లు మంగళవారం, గురువారం మరియు శనివారం రోజుల్లో కాకుండా సరి రోజుల్లోనే నడుస్తాయి.
3. పరిమితి సమయం - ఉ. 8 గంటల నుండి సా. 8 గంటల వరకు
ధానం కింద ప్రతిదీ 8 గంటల నుండి 8 గంటల వరకు చెల్లుతుంది. ఈ దశ రాత్రి ప్రయాణించే వారి భద్రత గురించి ఆలోచించి తీసుకోవడం జరిగింది మరియు ఆ సమయంలో ప్రజా రవాణా లేకపొతే దానిని భర్తీ చేసేందుకు ఈ నియమం పనిచేస్తుంది.
4. మహిళలు (ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు) మినహాయింపు
ఒంటరిగా ప్రయాణించే మహిళ లేదా పిల్లలతో ( 12 సంవత్సరాల కంటే తక్కువ) ఉన్న మహిళ ఈ పరిమితులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు ఈ పరిధిలోనికి రారు.
5. ఆదివారం మినహాయింపు
ఈ పథకం (సోమవారం నుండి శనివారం వరకు) పని రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది. దీని అర్ధం మీరు మీ సెలవుని హాయిగా ఆనందించవచ్చు.
6. ఫైన్ - రూపాయలు. 2,000
ఎవరైతే ఈ నియామకం అధిగమిస్తారో వారికి ఢిల్లీ పోలీసులతో రూ. 2,000 భారీ జరిమానా విధించడం జరుగుతుంది.
7. ఇతర స్టేట్స్ వాహనాలకు చెల్లుతుంది
ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయబడిన కార్లు ఈ విధానం యొక్క పరిధిలోనికి వస్తాయి. ఉత్తర ప్రదేశ్ (నోయిడా) మరియు హర్యానా (గుర్గావ్) రాష్ట్రాల నుంచి ఢిల్లీ లో ప్రధాన ట్రాఫిక్ కి ఇది ముఖ్య కారణం.
8.పరిగణలోనికి రాని VIP
ఈ నియమ పరిధిలోనికి రాని VIP ల యొక్క పెద్ద జాబితాని ఈ బ్లూప్రింట్ మీ ముందు ఉంచింది.
- అధ్యక్షుడు మరియు భారతదేశం యొక్క వైస్-ప్రెసిడెంట్
- భారతదేశం యొక్క ప్రధాన మంత్రి
- భారతదేశం యొక్క ప్రధాన న్యాయమూర్తి
- లోక్ సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్
- రాజ్యసభ చైర్మన్ (ఉప-రాష్ట్రపతి) మరియు డిప్యూటీ చైర్మన్
- కేంద్ర మంత్రులు మరియు లోక్‌సభ ప్రతిపక్ష నేతలు మరియు రాజ్యసభ నేతలు
- రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఢిల్లీ తప్ప
- గవర్నర్ ఆఫ్ స్టేట్స్ మరియు , లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్
- సుప్రీం కోర్టు, హైకోర్టు మరియు లోకాయుక్త న్యాయమూర్తులు
ఇదిలా ఉంటే ఢిల్లీ ముఖ్యమంత్రి, అరవింద్ కేజ్రీవాల్ (పథకం వాస్తుశిల్పి), అతనంతట అంతనే ఈ జాబితా నుండి తప్పుకున్నారు.
9.వాహనాలు మినహాయింపు
ఈ నియమాలు వర్తింపబడని వారి యొక్క వేరొక జాబితా మీ ముందు ఉంచడం జరిగింది.
- పారామిలిటరీ దళాలు మరియు రక్షణ మంత్రిత్వ వాహనాలు
- స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాహనాలు
- ప్రభుత్వ దౌత్య అధికారుల వాహనాలు
- ద్విచక్రవాహనాలు
- సిఎన్జి కార్లు
- అత్యవసర వాహనాలు
- వికలాంగ వ్యక్తులతో నడపబడుతున్న వాహనాలు
- ప్రభుత్వ కార్యాలకు సంభందించిన దౌత్యాధికారుల వాహనాలు
- విద్యుత్ మరియు హైబ్రిడ్ కార్లు
ఒకవేళ వాహనం ఆంబులెన్స్ కాకపొతే ఢిల్లీ పోలీస్ ప్రజల యొక్క అత్యవసర సందర్భాలను విశ్వసిస్తుంది. హైబ్రిడ్ మరియు విద్యుత్ వాహనాలు మినహాయింపు మహీంద్రా రేవా వంటి సంస్థలకు ఒక శుభవార్త అవుతుంది.
ఢిల్లీ ప్రభుత్వం ఈ ప్రణాళిక విజయవంతం కావడానికి పౌరులపైన వారి భాద్యతను ఉంచింది. మిస్టర్ కేజ్రీవాల్ కూడా ప్రజల కోసం మరింత ఆచరణాత్మక పరిష్కారం కోసం కార్ పూలింగ్ చాలా అవసరం అని చెప్పారు.
డిల్లీ లో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకుగానూ ఈ నియమాలు రావడం జరిగింది. సుప్రీం కోర్టు ఇటీవల మూడు నెలల కాలంలో ఢిల్లీ ప్రాంతంలో (ఇంజిన్ 2,000 సిసి సామర్థ్యం లేదా అంతకంటే ఎక్కువ ) ఉన్న డీజిల్ కార్ల అమ్మకాలు నిషేధం చేయబడ్డాయి. భారత తయరీదారి మహీంద్రా&మహీంద్రా కి చెందిన స్కార్పియో, XUV500 మరియు జైలో వంటి చాలా కార్లు ఈ ప్రభావితం పాలయ్యాయి. మార్చి 2016 చివరినాటికి అన్ని వానులు CNG గా మారాలని ఆదేశాలు కూడా వచ్చాయి.