• English
  • Login / Register

భారతదేశం యొక్క మొదటి డీజిల్ ద్వంద్వ-క్లచ్ ఆటోమేటిక్ తో వోక్స్వాగన్ కాంపాక్ట్ సెడాన్

నవంబర్ 27, 2015 01:40 pm raunak ద్వారా ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

వోక్స్వాగన్ ఇండియా సమూహం, వెంటో / రాపిడ్ డీజిల్ డిఎస్జి తో ఇటీవల విజయాన్ని మరియు విచారణ తో అదృష్టాన్ని సాదించారు. సానుకూల స్పందన గురించి మాట్లాడటానికి వస్తే, భారతదేశం నుంచి రానున్న కాంపాక్ట్ సెడాన్ డీజిల్ వేరియంట్లలోకి 7- స్పీడ్ డిఎస్ జి డ్యూయల్ క్లచ్ ఆటో గేర్ బాక్స్ ను ప్రవేశపెట్టడం అనేది ఆశ్చర్యపడవలసిన విషయం ఏమి కాదు! ఈ వాహనం, అధికారికంగా ఫిబ్రవరి 2016 భారత ఆటో ఎక్స్పోలో వెల్లడి అవుతుంది.

ఈ వోక్స్వాగన్ కాంపాక్ట్ సెడాన్ యొక్క ఇంజన్ల గురించి మాట్లాడటానికి వస్తే, పోలో వాహనం లో ఉండే 1.2 లీటర్ ఎం పి ఐ 3- సిలండర్ పెట్రోల్ మరియు 1.5 లీటర్ టి డి ఐ డీజిల్ రెండు ఇంజన్లతో వచ్చే అవకాశాలున్నాయి. ఇదే ఇంజన్ ను వెంటో వాహనం కూడా తీసుకొంది మరియు ఈ ఇంజన్ అత్యధికంగా 105 పి ఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. అదే పోలో మరియు పోలో క్రాస్ వాహానాలలో ఇదే ఇంజన్, 90 పి ఎస్ పవర్ ను విడుదల చేస్తుంది. ఇప్పుడు వోక్స్వాగన్ వెంటో వాహనం లో ఉండే 90 పిఎస్ పవర్ ను విడుదల చేసే 1.5 లీటర్ టి డి ఐ డీజిల్ ఇంజన్, వోక్స్వాగన్ యొక్క రాబోయే కాంపాక్ట్ సెడాన్ లో కూడా ఉండబోతుంది. ఇది ఇలా జరిగితే, పోలో లో కూడా ఈ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ డీజిల్ ఇంజన్ ను ప్రవేశపెట్టినట్లైతే, ఈ హాచ్బాక్ విభాగంలో ఇదే మొదటి వాహనం అవుతుంది. దేశంలో ఈ డీజిల్ ఆటోమేటిక్ కు పెరుగుతున్న డిమాండ్ ను చూసినట్లైతే, ఈ వాహనాలకు నవీకరణ తప్పనిసరి అని చెప్పవచ్చు.  

పోటీ వాహనాల గురించి మాట్లాడటానికి వస్తే, ఇటీవల విడుదల అయిన ఫోర్డ్ ఫిగో అస్పైర్ వాహనానికి కూడా డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ అందించబడుతుంది. అయితే, ఈ వాహనంలో 1.5 లీటర్ టి విసిటి పెట్రోల్ ఇంజన్ మాత్రమే అందించబడుతుంది. ప్రస్తుతం, ఈ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో ఈ డీజిల్ ఆటోమేటిక్ ఇంజన్ తో ఉన్నది టాటా జెస్ట్ ఎఫ్ ట్రోనిక్ వాహనం మాత్రమే. అది అలా ఉంటే ఈ వాహనం, ఏఎం టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) తో కూడా అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ తో మరియు ట్రాన్స్మిషన్ తో ఈ వోక్స్వాగన్ కాంపాక్ట్ సెడాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఆశిద్దాం.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience