ఎక్స్ సి90 ఆర్ డిజైన్ ను విడుదల చేసిన వోల్వో
published on nov 30, 2015 03:41 pm by raunak కోసం వోల్వో ఎక్స్ 90
- 12 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వోల్వో నుండి త్వరగా అమ్ముడవుతున్న మరియు స్పోర్టీ లుక్ కలిగిన రెండవ తరం ఎక్స్ సి90- ఎక్స్ సి 90 ఆర్ డిజైన్ వెర్షన్ వెల్లడయ్యింది. ఈ ఆర్ డిజైన్ వెర్షన్, డి5 డీజిల్ మరియు టి6 పెట్రోల్ డ్రైవ్ ఈ ఇంజన్ లతో పాటు టి8 ట్విన్ ఇంజన్ పెట్రోల్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఇంజన్ లతో అందుబాటులో ఉంది. యూకె లో ఈ వాహనం యొక్క ధర గురించి మాట్లాడటానికి వస్తే, ఎక్స్ సి 90 ఆర్ డిజైన్ ధర £49,785 (సుమారు రూ 50 లక్షలు). ఈ వాహనం పై వచ్చిన పుకారు ఏమిటంటే, స్వీడిష్ తయారీదారుడు వోల్వో ఎక్స్ సి90 యొక్క పోల్ స్టార్ వెర్షన్ ను ఈ సంవత్సరం లోగా ప్రారంభించవచ్చునని భావిస్తున్నారు.
భారతదేశం సంబంధించి మాట్లాడటానికి వస్తే వోల్వో, రెండవతరం ఎక్స్ సి90 వెర్షన్ ను, ఈ సంవత్సరం మే నెలలో 64.9 లక్షల వద్ద ప్రవేశపెట్టింది. ఈ వాహనం, డీజిల్ ఇంజన్ ఎంపిక తో మాత్రమే అందుబాటులో ఉంది. అదే డి5 డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం యూకె లో ఆర్ డిజైన్ వెర్షన్ తో ఉంది. సంస్థ ప్రకారం, దేశంలో ఎక్స్ సి90 తో అధ్బుతమైన ప్రారంభాన్ని అందించింది. ప్రస్తుతం, ఆర్ డిజైన్ వి40 హాచ్బాక్ కు మాత్రమే అందించబడింది. కానీ వోల్వో, భారతదేశం లో ఎక్స్ సి90 ఆర్ డిజైన్ ను అందించే అవకాశం ఉంది. అంతేకాక వోల్వో, భారతదేశంలో పోల్ స్టార్ బ్రాండ్ ను వచ్చే సంవత్సరం తీసుకొని వచ్చే అవకాశం ఉంది.
ఎక్స్ సి90 ఆర్ డిజైన్ వెర్షన్ లో చూసిన మార్పులు గురించి మాట్లాడటానికి వస్తే, ముందుగా బాహ్య భాగంలో, 20 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను, సిల్వర్ ప్రభావం కలిగిన డోర్ మిర్రర్ లు, ముందు గ్రిల్ కు నిగనిగలాడే నలుపు మెష్ మరియు టింటెడ్ వెనుక విండోలు వంటి మార్పు చోటుచేసుకున్న అంశాలను గమనించవచ్చు. అదే అంతర్గత భాగం విషయానికి వస్తే, లెథర్ / నూబక్ స్పోర్ట్ సీట్లు, 12.3 అంగుళాల యాక్టివ్ టి ఎఫ్ టి డ్రైవర్ సమాచార వ్యవస్థ మరియు గేర్ షిఫ్ట్ పెడల్స్ ను కలిగిన పెర్ఫోరేటెడ్ ట్రిమ్మెడ్ స్టీరింగ్ వీల్ వంటి అంశాలు అందించబడ్డాయి. ఈ ఆర్ డిజైన్ ఎక్స్ సి 90 వెర్షన్ లో, మెమోరీ ఫంక్షన్ ను కలిగిన విద్యుత్తు ముందు సీట్లు, స్పోర్ట్స్ పెడల్స్, నలుపు హెడ్ లైనింగ్ మరియు ముందు తరం అంతర్గత లైటింగ్ వంటి ఫంక్షన్ లను అందించడం జరిగింది. వీటన్నింటితో పాటు ఈ వెర్షన్ కు, ఒక ప్రత్యేకమైన ఆర్ డిజైన్ లెథర్ క్లాడ్ రిమోట్ కీ కూడా అందించబడింది.
- Renew Volvo XC90 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Loan Against Car - Get upto ₹25 Lakhs in cash
0 out of 0 found this helpful