వోక్స్వాగెన్ యొక్క రాబోయే క ాంపాక్ట్ సెడాన్ వర్సెస్ దాని ప్రత్యర్థులు: ఛాలెంజింగ్ టాస్క్!
జూలై 01, 2015 04:19 pm akshit ద్వారా సవరించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డిల్లీ: గత వారం భారతదేశంలో నవీకరించబడిన వెంటో ని విడుదల చేస్తూ , వోక్స్వ్యాగన్ సంస్థ వచ్చే రెండు సంవత్సరాలలో ఇంకో నాలుగు మరిన్ని మోడళ్ళని విడుదల చేసే అవకాశాలున్నాయని వాటిలో ముందుగా సబ్-4 మీటర్ కాంపాక్ట్ సెడాన్ ని 2016 లో విడుదల చేసే అవకాశాలున్నాయని తెలిపారు.
ఈ రాబోయే కారు, మారుతి సుజుకి డిజైర్ తో భారీ ఆధిక్యతతో పోటీ పడబోయే కారు. ఇది జర్మన్ వాహన తయరీదారుడి తొలి ప్రయత్నమని చెప్పవచ్చు. హోండా అమేజ్, టాటా జెస్ట్, మరియు హ్యుందాయ్ ఎక్సెంట్ వంటి కార్లు వాటి అదృష్టాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, ఏ ఒక్కటి కూడా మారుతీ డిజైర్ లా ప్రారంభం దగ్గర నుండి విజయం పొందలేదు.
March’15 | April’15 | May’15 | |
Swift DZire | 17971 | 18316 | 19663 |
Xcent | 4500 | 4666 | 4871 |
Amaze | 8128 | 2862 | 3699 |
Zest | 2653 | 1989 | 1866 |
హోండా అమేజ్ 8,000 యూనిట్లు కంటే ఎక్కువ కార్లని గత మార్చ్ నెలలో అమ్మకాలు చేయగా, ఒక్కసారిగా అమ్మకాలు తగ్గిపోయి మే నెల వచ్చేటప్పటికీ 3,000 యూనిట్లు దగ్గరగా అమ్మగలిగింది. అదే సమయంలో టాటా జెస్ట్ అమ్మకాలు కొంచం తగ్గి 2,000 నుండి 2,500 యూనిట్లు మాత్రమే అమ్మగలిగింది. మారుతి సుజుకి గత త్రైమాసిక కాలంలో నెలలో దాదాపు 18,000 యూనిట్లు అమ్మగలిగితే హ్యుందాయ్ ఎక్సెంట్ అదే కాలంలో 4,500 యూనిట్లు అనగా ఇది డిజైర్ యొక్క మొత్తం అమ్మకాలలో 25 శాతం మాత్రమే అమ్మగలిగింది.
ఈ గణాంకాలు స్పష్టంగా మారుతీ సుజుకి డిజైర్ తో పొటీ పడడం అంత సులభమేమీ కాదని సూచిస్తున్నాయి. గుర్తు పెట్టుకోవలసిన విషయమేమిటంటే వోక్స్వ్యాగన్ ఉత్పత్తి పరంగా, అమ్మకాల పరంగా డిజైర్ తో చాలా గట్టిగా పోటీ పడాల్సి ఉంటుంది. అయితే, స్థానికీకరణ వలన కుడా ఈ రంగంలో విజయం సాధించవచ్చు. ఎవరికి తెలుసు ఈ రాబోయే కారు జర్మన్ వాహన తయారీదారుని యొక్క అదృష్టాన్ని తిరిగి రాస్తుందేమో చూద్దాం.