వోక్స్వ్యాగన్ రాబోయే కాంపాక్ట్ సెడాన్ రూ .5 లక్షలకు పైగా ధర వుంటుంది; వచ్చే సంవత్సరం ప్రారంభించబడుతుంది.
జూన్ 01, 2015 04:40 pm sourabh ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: వోక్స్వ్యాగన్ కి చెందిన ఒక ఉన్నతాధికారి రూ .5 లక్షలకు పైగా ధర కలిగిన ఒక కాంపాక్ట్ సెడాన్ ని కంపెనీ పరిచయం చేయబోతున్నదని తెలిపారు. జర్మన్ వాహన తయారీ సంస్థ చే ప్రారంభించబడిన ఈ కొత్త వాహనం మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఎక్సెంట్ మరియు టాటా జెస్ట్ వంటి వాటితో పోటీ పడుతుంది. ఈ కారు వచ్చే సంవత్సరం ప్రారంభించబడుతుందని భావిస్తున్నాము.
వచ్చే సంవత్సరం ప్రారంభించబడుతున్న 'భారతదేశం-నిర్దిష్ట' సెడాన్ గురించి వోక్స్వ్యాగన్ మేనేజింగ్ డైరెక్టర్ థియరీ లెస్పెయాక్ ఈ విధంగా అన్నారు. "ఈ కాంపాక్ట్ సెడాన్ భారత పరిస్థితులకు అనుకూలంగా ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం అందుబాటులోకి వస్తుంది. "మిస్టర్ లెస్పెయాక్ దీని ధర రూ .5 లక్షల కంటే తక్కువ ఉండదని తెలిపారు.
ఈ సంస్థకి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ థియరీ లెస్పెయాక్ కోయంబత్తూర్ లో ఒక కొత్త డీలర్ ప్రారంభించడంతో పాటూ అతను భారతదేశంలో కూడా 3,00,000 కార్లు పంపిణీ చేశారు. కంపెనీ మరో 24 నెలల్లో అనేక ప్రారంభాల కోసం చూస్తుందని వోక్స్వ్యాగన్ భారత మార్కెట్లో వాటి పెరుగుదల వేగాన్ని కొనసాగించడం గురించి ఆశావహంగా ఉందని పేర్కొన్నారు. మేము భారతదేశంలో మరిన్ని వాహనాలు బీటిల్ తో పాటూ వచ్చే సంవత్సరంలో తీసుకురావాలని భావిస్తున్నామని తెలిపారు.
దీని ముందరి వచ్చిన పరిచయాలన్నీ చాలా ముఖ్యమైనవి. ఈ కాంపాక్ట్ సెడాన్ మునుపెన్నడూ రాని విధంగా ఉంటుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ భారత మార్కెట్ కోసం ప్రత్యేఖంగా అభివృద్ధి చేయబడినది. ఇది వేరే ఎక్కడా అందుబాటులో లేదు. ఈ కొత్త కాంపాక్ట్ సెడాన్ వేగంగా పెరుగుతున్న మరియు చాలా పోటీ విభాగంలో ఒకటిగా ప్రవేశించవచ్చు.
ఈ ఉప కాంపాక్ట్ సెడాన్ మాత్రమే కాకుండా దీని మిగతా మూడు, అనగా కొత్త పశత్ మరియు గొప్ప మోడల్ అయినటువంటి బీటిల్ ఇంకొకటి అతి పెద్ద SUV సెడాన్ టిగాన్ ఇవన్నీ కూడా CKD మార్గంలో రాబోతున్నవి.