చిత్రాల ద్వారా పోల్చబడిన Volkswagen Taigun ట్రైల్ ఎడిషన్ vs Hyundai Creta అడ్వెంచర్ ఎడిషన్
వోక్స్వాగన్ టైగన్ కోసం rohit ద్వారా నవంబర్ 06, 2023 11:32 am ప్రచురించబడింది
- 132 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రెండు స్పెషల్ ఎడిషన్ SUVలు వాటి ఆధారిత వేరియంట్ల కంటే మెరుగైన కాస్మటిక్ మరియు విజువల్ నవీకరణలు పొందడమే కాకుండా, బహుళ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తాయి.
వోక్స్వాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ ఇటీవల కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ లో పలు కాస్మెటిక్ మార్పులు చేశారు. ఇది 2023 ఆగస్టులో విడుదల అయిన హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్తో పోటీపడుతుంది. ఈ రెండు SUV కార్ల స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో అనేక కాస్మెటిక్, విజువల్ నవీకరణలు చేశారు. ఇప్పుడు ఈ రెండు కార్ల చిత్రాలను పోల్చి వాటి మధ్య వ్యత్యాసాలేమితో తెలుసుకుందాం:
గమనిక: చిత్రాలలో కనిపించే టైగూన్ ట్రైల్ ఎడిషన్ మరియు క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ కాండీ వైట్ మరియు రేంజర్ ఖాకీతో పెయింట్ చేయబడ్డాయి. ఈ రెండు కార్లు మరెన్నో కలర్ ఎంపికలతో అందుబాటులో ఉన్నాయి.
ఫ్రంట్ లుక్
వోక్స్వాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ లో ‘GT’ బ్యాడ్జ్ బ్లాక్ గ్రిల్ తో లభించగా, పై మరియు కింది భాగంలో క్రోమ్ స్ట్రిప్స్ లభిస్తాయి. అయితే, హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ లో ఈ బ్లాక్ ఫినిషింగ్ గ్రిల్ పైనే కాకుండా, స్కిడ్ ప్లేట్ మరియు హ్యుందాయ్ లోగోపై కూడా బ్లాక్ ఫినిషింగ్ ఉంటుంది.
సైడ్ లుక్
సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే, టైగూన్ లిమిటెడ్ ఎడిషన్ లో 16-అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్ లో ‘GT’ బ్యాడ్జింగ్, వెనుక డోర్ మరియు ఫెండర్ పై డెకాల్స్ మాత్రమే గుర్తించదగిన మార్పులు. క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ సైడ్ ప్రొఫైల్ లో రెడ్ బ్రేక్ కాలిపర్స్, బ్లాక్ ORVM హౌసింగ్, బాడీ సైడ్ మోల్డింగ్, రూఫ్ రైల్స్, ఫ్రంట్ ఫెండర్ లో 'అడ్వెంచర్' బ్యాడ్జింగ్ వంటి బ్లాక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ అందించబడ్డాయి.
-
కొత్త కారు ఆఫర్లు మరియు డిస్కౌంట్లను ఇక్కడ తనిఖీ చేయండి.
రేర్ లుక్
క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ వెనుక భాగంతో పోలిస్తే, టైగూన్ యొక్క లిమిటెడ్ ఎడిషన్ మోడల్ లో ఉన్న ఏకైక వ్యత్యాసం 'ట్రైల్ ఎడిషన్ బ్యాడ్జింగ్'. ఇప్పటికీ వెనుక భాగంలో 'GT' బ్యాడ్జింగ్ క్రోమ్ కలర్లోనే ఉండనుంది. మరోవైపు, హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ వెనుక స్కిడ్ ప్లేట్ మరియు 'క్రెటా' బ్రాండింగ్ బ్లాక్ కలర్ లో లభిస్తుంది.
ఇది కూడా చదవండి: ఇప్పుడే బుక్ చేసుకుని దీపావళి నాటికి ఈ 5 SUVలను ఇంటికి తీసుకువెళ్ళండి!
ఇంటీరియర్ డిజైన్
టైగూన్ ట్రైల్ ఎడిషన్ లో రెడ్ పైపింగ్ మరియు సీట్లపై 'ట్రయల్' బ్రాండింగ్ తో కూడిన వేరియంట్-స్పెసిఫిక్ బ్లాక్ అప్ హోల్ స్టరీ లభిస్తుంది. వోక్స్వాగన్ టైగూన్ ట్రయల్ ఎడిషన్ లో స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్ కూడా ఉన్నాయి. అదే సమయంలో, క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ బ్లాక్ క్యాబిన్ థీమ్ తో సేజ్ గ్రీన్ ఇన్సర్ట్స్ మరియు కొత్త బ్లాక్ మరియు గ్రీన్ సీట్ అప్ హోల్ స్టరీని ఉన్నాయి. వీటితో పాటు క్యాబిన్ లోపల 3D ఫ్లోర్ మ్యాట్స్, మెటల్ పెడల్స్ కూడా అందించారు.
ఈ రెండు కాంపాక్ట్ SUVల లిమిటెడ్, స్పెషల్ ఎడిషన్ మోడళ్లలో కొత్త డ్యూయల్ కెమెరా డాష్ క్యామ్ (వోక్స్వాగన్ టైగూన్ లో ఇన్ బిల్ట్ LCD డిస్ ప్లేతో) అదనపు ఫీచర్ గా అందించబడింది. ఇది కాకుండా, మిగతా అన్నీ ఫీచర్లు వాటి వేరియంట్లను పోలి ఉన్నాయి: ట్రైల్ ఎడిషన్, టైగూన్ GTను పోలి ఉంది; అడ్వెంచర్ ఎడిషన్ క్రెటా SX మరియు SX(O)ను పోలి ఉంది.
ఇది కూడా చదవండి: కొత్త గూగుల్ మ్యాప్స్ నవీకరణ మీ ప్రయాణాలను మరింత మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడుతుంది
పవర్ ట్రైన్ & ధరలు
వోక్స్వాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ కేవలం ఒక పవర్ ట్రెయిన్ తో మాత్రమే లభిస్తుంది - 150PS, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో జతచేయబడుతుంది. క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ 115PS, 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది, ఇది మాన్యువల్ మరియు CVT ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంపికతో జతచేయబడి ఉంటుంది.
ఈ రెండు స్పెషల్ ఎడిషన్ మోడళ్ల ధరలపై ఓ లుక్కేయండి.
వోక్స్వాగన్ టైగూన్ ట్రైల్ ఎడిషన్ |
హ్యుందాయ్ క్రెటా అడ్వెంచర్ ఎడిషన్ |
GT ట్రయల్ - రూ.16.30 లక్షలు |
SX MT - రూ.15.17 లక్షలు |
|
SX(O) CVT - రూ.17.89 లక్షలు |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
మరింత చదవండి: టైగూన్ ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful